'బతుకమ్మ'కు స్పీకర్, నలుగురు సీఎంలకు ఆహ్వానం!
తెలంగాణ సంస్కృతి, చరిత్రని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను జాతీయ, అంతర్జాతీయ దృష్టిని
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, చరిత్రని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కవిత,ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ...బతుకమ్మ పండుగకు 10 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. తెలంగాణలో 10 జిల్లాలతోపాటు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వేదికగా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తోపాటు నలుగురు మహిళా సీఎంలను బతుకమ్మ పండుగకు ఆహ్వానిస్తామని ఎంపీ కవిత తెలిపారు.