batukamma festival
-
నేటి నుంచి తెలంగాణలో బడులకు దసరా సెలవులు
హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థలకు నేటి (శుక్రవారం)నుంచి బతుకమ్మ, దసరా సెలవులు. అక్టోబర్ 13 నుంచి బతుకమ్మ, దసరా పం డుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఇటీవల విద్యాశాఖ వెల్లడించింది. 13 నుంచి 25 వరకు అంటే 13 రోజుల పాటు బడులకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని విద్యాశాఖ సూచించింది. ఇంటర్మీడియట్ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులు ఇవ్వాలని పేర్కొంది. Follow the Sakshi TV channel on WhatsApp: -
ముందస్తుగా బతుకమ్మ చీరల ఆర్డర్లు
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు ఈ యేడు ముందుగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు వచ్చాయి. తొలివిడతగా రూ.140.80 కోట్ల విలువైన 4.40 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లను సోమవారం టెస్కో అధికారులు సిరిసిల్ల నేతన్నలకు అందించారు. ఈమేరకు సిరిసిల్లలోని మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీలు(మ్యాక్స్), చిన్న తరహా యూనిట్ల(ఎస్ఎస్ఐ) యజమానులకు ఆర్డర్లు సిద్ధమయ్యాయి. ఈసారి బతుకమ్మ పండుగకు చీర, జాకెట్(పీస్)లను వేర్వేరుగా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. చీరకు బ్లాక్ రోటోవార్ప్తో డిజైన్ చేయగా.. జాకెట్‌ను మాత్రం వేరుగా డిజైన్ చేశారు. గతంలో మీటరు బతుకమ్మ చీరల బట్టకు రూ.33 ఇవ్వగా.. ఈ ఏడాది రూ.32 ఇవ్వాలని టెస్కో అధికారులు నిర్ణయించారు. బ్లాక్ రోటోవార్ప్తో 2020 నాటి డిజైన్‌ను ఈ ఏడాది మరోసారి అమలు చేయాలని భావిస్తున్నారు. ఫలితంగా ప్రతీ మీటరుకు ఒక్క రూపాయి ధర తగ్గించారు. చీరల్లో 240 రకాల డిజైన్లను రూపొందించి అందులోనే మార్పులు చేశారు. కాగా, బతుకమ్మ చీరల బట్ట ధరను ఒక్క రూపాయి తగ్గించడంపై నేతన్నల్లో నిరాశ నెలకొంది. గతేడాది మీటరు బట్టకు రూ.33 ఇవ్వగా.. ఈ ఏడాది రూ.32 నిర్ణయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్థిల్లాలని, ప్రతీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని అమ్మవారిని ముఖ్యమంత్రి ప్రార్థించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని కోరారు. బతుకమ్మ సందర్భంగా ట్విటర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత సందేశం కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, సురక్షితంగా, సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ‘బతుకమ్మ పండుగ స్పూర్తితో మనందరం ఉమ్మడిగా కరోనాను ఎదుర్కొందాం. ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడకూడదు. కరోనా కారణంగా ఈ ఏడాది, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం లేదు.’ అని ట్విటర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక సందేశం విడుదల చేశారు. మన తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక, ఆడబిడ్డల ఆనందాల హరివిల్లు బతుకమ్మ పండుగ సందర్భంగా.. ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు#MyBathukammaMyPride pic.twitter.com/FUdjZNecBt — Kavitha Kalvakuntla (@RaoKavitha) October 16, 2020 -
మహిళా లేఖనం
అందం, సంబరం, పువ్వులు, ప్రకృతి, పర్యావరణం, జలవనరులు ఇవన్నీ బతుకమ్మ పండుగలో భాగమని తెలుసు. అయితే ఈ మహిళా కళాకారులు వాటితో పాటు అసమానతలు, లింగ వివక్ష, ఆధ్యాత్మిక ఉత్తేజం.. ఇలా ఎన్నో అంశాలను బతుకమ్మ కోణం నుంచి స్పృశించారు. అందుకే పండుగ వెళ్లిపోయినా.. వారు గీసిన వర్ణాలన్నీ నేటికీ బతుకు ఉత్సవాన్ని ప్రతిఫలిస్తూనే ఉన్నాయి. – ఓ మధు, సాక్షి, సిటీ బ్యూరో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ‘తెలంగాణ జాగృతి’ ఆధ్వర్యంలో హైద్రాబాద్ నెహ్రూ గ్యాలరీలో మూడు రోజుల పాటు జరిగిన బతుకమ్మ ఆర్ట్ క్యాంప్‌లో 20–82 ఏళ్ల మధ్య వయసున్న యాభై మంది మహిళా ఆర్టిస్టులు ఒకే వేదిక మీద అక్కడికక్కడ చిత్రాలు గీశారు. తెలంగాణలో ఇంత పెద్దఎత్తున బతుకమ్మపై ‘ఆర్ట్‌క్యాంప్’ జరగడం ఇదే తొలిసారి. తెలంగాణ జాగృతి, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం సహకారాలతో జరిగిన ఈ ఆర్ట్ క్యాంపును ప్రముఖ చిత్రకారులు రమణారెడ్డి సమన్వయం చేయగా, అనిత క్యూరేటర్‌గా వ్యవహరించారు. విశేషం ఏమిటంటే.. ఈ క్యాంప్‌లో చిత్రకారిణుల కుంచె నుంచి రూపుదిద్దుకున్న బతుకమ్మ చిత్రాలు చూడముచ్చటగా ఉండటమే కాదు, ఆలోచనలకు పదును పెట్టేలా ఉన్నాయి. బతుకమ్మ ప్రకృతి పండుగ. చిన్నప్పుడు రకరకాల పువ్వులు తీసుకువచ్చి రంగులు అద్ది తొమ్మిది రోజుల బతుకమ్మను తయారు చేసే వాళ్లం. ప్రకృతితో ఈ విధమైన బంధాన్ని పిల్లలు మిస్ కాకూడదు. ఇలాంటి ఆర్ట్ క్యాంప్ వల్ల కళతోపాటు సంప్రదాయాన్ని గురించిన అవగాహన, పండుగ పట్ల అభిరుచి మరింత పెరుగుతాయని అంటారు పద్మారెడ్డి. ఆమెతోపాటు, ఆర్ట్క్యాంప్లో పాల్గొన్న మిగతా కళాకారిణులు తమ మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సమానత్వం కోసం నాటి భూస్వాముల ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న స్త్రీలను గుర్తు చేసుకుంటూ, మిగిలిన ఆడవాళ్లు పూలను పేర్చి ‘బతుకు అమ్మా..’ అంటూ తమ సానుభూతిని వ్యక్తం చెయ్యడంతో బతుకమ్మ ఉత్సవం మొదలయ్యిందన్న ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అని చెప్తున్నా స్త్రీలకు పరిస్థితులింకా దుర్భరంగానే ఉన్నాయి. అందుకే నా చిత్రంలో స్త్రీ, పురుష చిహ్నాలను తీసుకుని స్త్రీ చిహ్నాన్ని హైలైట్ చేశాను. అసమానత్వానికి గుర్తుగా స్త్రీ చిహ్నానికి పూర్తి ఎరుపు రంగుని వెయ్యలేదు. ఆ చిహ్నంలోనే బతుకమ్మను చూపించాను. ఇక చిత్రంలో ఆదిశక్తి ఆయుధాలు కూడా చూడవచ్చు. రాక్షసులను చంపలేమని దేవుళ్లే వెనక్కి తగ్గినప్పుడు, ఆదిశక్తి దుష్ట సంహారం చేసింది. – రజని, బిఎఫ్ఏ, థర్డ్ ఇయర్ గౌరమ్మ కోసం బతుకమ్మ స్త్రీల పండుగ. అందుకే లేస్, బట్టలు, పువ్వులతో ఈ పెయింటింగ్ వేశాను. దీంట్లో తొమ్మిది మంది స్త్రీల ముఖాలు, తొమ్మిది రోజుల బతుకమ్మను ప్రతిబింబిస్తాయి. మధ్యలో బతుకమ్మ సమయంలో పూజించే గౌరమ్మను పెట్టాను. – రూపారాణి ఉపాసన కోసం మనలో ఉన్న కుండలి శక్తిని ప్రతిబింబించేలా నా చిత్రంలో చక్రాలు వేశాను. శక్తికి ప్రతిరూపాలు మనుషులు. శక్తి ఉపాసన ద్వారా కుండలిని శక్తి మరింత జాగృతమవుతుంది. తొమ్మిది రోజులు బతుకమ్మ చేసే వారు కొత్త ఉత్సాహంతో ఉండటాన్ని గమనించవచ్చు. ఏడాదిలో ఒకసారైనా ఇలాంటి ఆరాధన చేస్తే ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవచ్చు. ఇదే ఈ చిత్రం ద్వారా చెప్పాను – సౌజన్య కష్టసుఖాల కోసం భావోద్వేగాలు ఏమీ ముఖంలో కనిపించని; సంతోషం, బాధను కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్న నేటి స్త్రీని పసుపు, కుంకుమ రంగులతో నా చిత్రంలో చూపించాను. – వేకువ, ఎంఎఫ్ఏ, స్టూడెంట్ కలవడం కోసం ఆంధ్రాకి దగ్గరగా ఉండే భద్రాచలం ప్రాంతం వాళ్లకి బతుకమ్మ అంటే ఏందో తెల్వదు. నేను ఇప్పటి వరకు ఆడలేదు కూడా. టీవీల్లోనే మొదటిసారి చూసిన. అందుకే నా పెయింటింగ్‌లో టీవీ పెట్టాను. అది పండుగో లేక సంతోషంగా ఆడుకునే ఆటో అప్పుడు నాకు తెలియదు. ఈ క్యాంప్‌లో ఇంతమంది సీనియర్ కళాకారిణిలతో కలిసి బతుకమ్మ చిత్రాలు వెయ్యటం హ్యాపీగా ఉండటమే కాదు, బతుకమ్మ ఆడినట్లే అనిపిస్తుంది. – సమ్మక్క, ఎంఎఫ్ఏ స్టూడెంట్ ఆసిడ్ బాధితుల కోసం నా బిఎఫ్ఏ 2010లో పూర్తయింది. పీడిత మహిళకు సంబంధించిన అంశాలపై ఆర్ట్ వర్క్ చేస్తుంటాను. ముఖ్యంగా ఆసిడ్ విక్టిమ్స్ మీద పనిచేస్తాను. ‘అందం ఆత్మకు సంబంధించింది’ అనే ఆలోచనతో చిత్రాలు రూపొందిస్తుంటాను. బాధితులైన స్త్రీలనే నేపథ్యంగా తీసుకున్నాను. వారిని అందరితో సమానంగా పండుగలో భాగం చెయ్యాలని, వివక్షలేని వాతావరణం వారికి కల్పించాలని నా చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశాను. – వినీల నీటి కోసం సిటీ మ్యాప్‌లో నీటి చారలను, నీటి ప్రాంతాలను, అందులో తేలుతున్న బతుకమ్మలను చిత్రంగా మలిచారు సీనియర్ ఆర్టిస్ట్ పద్మారెడ్డి. ‘‘నగరంలో మరింత నీరు ఉంటే, నీలిరంగు మరింతగా వాడే దాన్ని’’ అని నవ్వుతూ అంటారు సీనియర్ ఆర్టిస్ట్. – పద్మారెడ్డి -
అమ్మాయి ఇంటికొచ్చింది
భగవంతుణ్ణి పూలతో పూజించటం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆనవాయితీ. అయితే.. పూలనే గౌరీదేవిగా భావించి బతుకమ్మగా పూజించటం తెలంగాణ ప్రత్యేకత. మహిళల మధ్య, కుటుంబాల మధ్య ప్రేమానురాగాలను పెంచే పండుగ ఇది. బతుకమ్మ పండుగను పెత్రమావాస్య (భాద్రపద బహుళ అమావాస్య) నుండి తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఆశ్వయుజ శుక్ల అష్టమి అనగా, దుర్గాష్టమి నాడు స్త్రీలంతా కలిసి బతుకమ్మను దగ్గరలోని చెరువులోనో, కొలనులోనో ఓలలాడిస్తారు. నీటిలో వదులుతారు. చివరి రోజున నైవేద్యంగా తొమ్మిది రకాల సద్దులు చేస్తారు. పూర్వం చోళ దేశంలో ధర్మాంగుడు అనే రాజు వుండేవారు. అతని భార్య సత్యవతి. వారు సంతానం కోసం నూరు నోములు నోచి నూరు మందిని కన్నారు. వారు గొప్ప శూరులైనప్పటికీ శత్రువుల చేతిలో చనిపోతారు. ఆ బాధతో రాజు, రాణి రాజ్యం వదిలి, వనంలో నివసిస్తూ లక్ష్మీ దేవి గురించి తపస్సు చేస్తారు. వీరి తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ప్రత్యక్షమై, ఏ వరం కావాలో కోరుకోమంటుంది. అప్పుడు రాణి లక్ష్మీ దేవితో, ‘‘నువ్వే నాకు కూతురిలా నా కడుపున పుట్టాలి’’ అంటుంది. అందుకు లక్ష్మీదేవి సంతోషించి, ‘తథాస్తు’ అంది. ఆ సమయంలో మునులు, మహర్షులంతా వచ్చి లక్ష్మీ దేవి బతకడానికి వచ్చింది కనుక, ‘బతుకమ్మ’ అని పేరు పెడతారు. రాజు రాణి సంతోషంగా వారి రాజ్యానికి వెళ్లి రాజ్యపాలన చేస్తుంటారు. కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు చక్రాంగుడు అనే పేరుతో రాజు వేషంలో ఈ రాజు ఇంటికి వచ్చి, వారి పుత్రికైన లక్ష్మీ దేవిని వివాహం చేసుకుని ఇల్లరికం ఉంటాడు. బతుకమ్మ రూపంలో లక్ష్మీదేవి, విష్ణువు రూపంలోని చక్రాంగుడు పిల్లపాపలతో సిరిసంపదలతో సంతోషంగా ఉంటారు. అలా ఈ జగతిలో శాశ్వతంగా ఆ లక్ష్మీ దేవి బతుకమ్మగా ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు పుట్టింటికి వచ్చినట్టు వచ్చి, ప్రజల మధ్య ఉండి అందరికీ అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ప్రసాదించి చివరి రోజు అత్తవారింటికి వెళ్తున్నట్టుగా ఒక విశ్వాసంతో, భక్తితో ఆ పూల బతుకమ్మను నీటిలో సాగనంపి, మరుసటి సంవత్సరం మళ్లీ రావాలని గౌరీదేవి, లక్ష్మీ దేవి రూపంలో ఉన్న బతుకమ్మను మహిళలంతా వేడుకుంటారు. ఔషధ గుణాలున్న పూలను వాడటం వలన వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరాలను నివారించుకోవచ్చు. ఎన్నో అనారోగ్యాలను నివారించడంలో తంగేడు వంటి అడవిపూలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. తొమ్మిది నైవేద్యాలు ఈ తొమ్మిది రోజులూ ఆరోగ్యాన్ని ప్రసాదించే ధాన్యాలనే నైవేద్యాలలో ఉపయోగిస్తారు. రోజుకొక రకమైన పులిహోర, చివరి రోజైన సద్దుల బతుకమ్మ రోజు తొమ్మిది రకాల సద్దులు చేస్తారు. చింతపండు, నువ్వులు, కొబ్బరి, పల్లీలు, పెసరపొడి, ఆవ పొడి, దద్ధ్యోదనం, బెల్లం అన్నం, నిమ్మకాయ, మామిడికాయ ఇలా అందుబాటులో ఉన్నవాటితో చేస్తారు. సద్దుల బతుకమ్మను తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా నువ్వుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి, నెయ్యి కలిపిన సత్తు పిండి, తులసీ దళాలు మొదలైనవి తీసుకెళ్తారు. వర్షాకాలంలో శరీరానికి వేడి కలగాలని నువ్వులు, పల్లీలు మొదలైనవి బెల్లంతో కలిపి నివేదన చేస్తారు. బతుకమ్మ కు పాడే పాటలు జీవితంలోని అనేక కోణాలను తెలియచేసేవిగా ఉంటాయి. – లేళ్లపల్లి శ్రీదేవి, సాంస్కృతిక అధ్యయనవేత్త పూలు.. పాటలు బతుకమ్మ పండుగలో పూలకెంత ప్రాధాన్యముందో పాటలకీ అంతే ప్రాధాన్యం ఉంది. బతుకమ్మ పాటలన్నీ ఎప్పుడో పూర్వకాలంలో అజ్ఞాత మహిళలు ఆశువుగా అల్లినవే. సరళమైన భాషతో, రాగయుక్తమైన శైలిలో బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే అందమైన పాటలివి. వీటిలోని సాహిత్య విలువలు అమూల్యమైనవి. జానపద, పురాణేతిహాస, చారిత్రక ఘట్టాలతోపాటు సున్నితమైన మానవ సంబంధాలు ఈ పాటలలో ప్రధాన వస్తువులు. బతుకమ్మ పండుగ వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి అంతా పూల వనంలా కనువిందు చేస్తుంది. ప్రకృతిలో లభించే తంగేడు, గునుగు, కట్ల, గోరంట, గుమ్మడి, రుద్రాక్ష, మందార, గన్నేరు, సీత జడల పూలు వంటి అడవిపూలనే ఎంచుకొని బతుకమ్మను పేర్చుతారు. -
చీరలొచ్చాయ్!
నాగర్‌కర్నూల్ టౌన్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండగ బతుకమ్మ. పల్లెల్లో గొప్పతనం, ప్రకృతిలోని అనేక పూలతో మమేకమైన ఈ పండగను పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా నిర్వహిస్తారు. ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మను జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు పది రోజుల పాటు రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు జరగనున్న నేపథ్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి జిల్లాలోని 558 రేషన్ దుకాణాల్లో 2,67,873 లబ్ధిదారులకు గానూ దాదాపు లక్షకు పైగా చీరలు జిల్లాకు చేరుకున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో మిగిలిన చీరలు వస్తాయని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో ఇలా.. గతేడాది బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పౌరసరఫరాల శాఖ ద్వారా 18ఏళ్ల వయసు దాటిన వారందరి వివరాలను సేకరించింది. ఈ సారి కూడా జిల్లాలో రేషన్ దుకాణాల్లో ఉన్న లబ్ధిదారుల్లో 18ఏళ్లు నిండిన వారందరికీ చీరలు పంపిణీ చేయనుంది. అదేవిధంగా ఈసారి కొత్తగా రేషన్‌కార్డులు తీసుకున్న వారు, గత కార్డులలో ఉన్న వారికి 18ఏళ్లు నిండిన వారు కొత్తగా రావడంతో చీరల సంఖ్య మరింత పెరిగింది. పండగ సమయానికి ఎలాంటి హడావుడి లేకుండా పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లాకు చేరిన లక్ష చీరలు బతుకమ్మ సందర్భంగా పంపిణీ చేసే చీరలను నాగర్‌కర్నూల్‌లోని మార్కెటింగ్ శాఖ గోడౌన్తోపాటు అచ్చంపేటలో ఉన్న మార్కెటింగ్ శాఖ గోడౌన్లలో భద్రపరిచారు. ఇప్పటి వరకు జిల్లాలో లక్షకు పైగా చీరలు చేరాయి. అయితే మహిళలకు నచ్చిన విధంగా డిజైన్, రంగులు ఉండాలనే ఉద్దేశంతో అధికారులు ప్రస్తుతం వచ్చిన చీరలపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గతేడాది ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా ఈసారి చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలను నేయించారు. తొమ్మిది రకాల డిజైన్లలో చీరలు తయారు చేశారు. జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరలు, వాటి రంగులు, నాణ్య త, డిజైన్లను అధికారులు ఇప్పటికే పరిశీలించారు. పంపిణీపై రాని స్పష్టమైన ఆదేశాలు బతుకమ్మ చీరలు జిల్లాకు చేరుకున్నప్పటికీ వాటి పంపిణీపై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన తేదీని ప్రకటించకపోవడం, బతుకమ్మ పండగ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మాడల్ ఎలక్షన్ కోడ్‌ను అమల్లోకి తీసుకురావడంతో ప్రభుత్వ పథకాలపై అధికారులు పునరాలోచిస్తున్నారు. బతుకమ్మ చీరల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించి అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంకా రావాల్సి ఉంది జిల్లాలో 2లక్షలకు పైగా బతుకమ్మ చీరల ల బ్ధిదారులు ఉన్నారు. అందులో ఇప్పటివరకు లక్షకు పైగా చీరలు వచ్చాయి. ఇంకా రావాల్సిన లక్ష చీరలు ఈ రెండు, మూడు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంపిణీ తేదీపై ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. తేదీ ప్రకటించగానే గ్రామాల వారీగా లబ్ధిదారుల సంఖ్య చూసుకుని పంపిణీ చేస్తాం. – మోహన్‌బాబు, డీఎస్ఓ -
బతుకమ్మ చీరలు వస్తున్నాయ్!
రేషన్ దుకాణాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో చీరల పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ బడులు, కమ్యూనిటీ హాళ్లు వేదికలుగా అందజేస్తారు. రేషన్ కార్డులో పేరుండటంతోపాటు ఏదేని గుర్తింపు కార్డు (ఆధార్/ఓటర్) తీసుకెళ్తే చీరలు పంపిణీ చేస్తారు. ఎంపీడీఓలు, సెర్ప్ ఏపీఓల ఆధ్వర్యంలో పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. గతేడాది విస్తృతంగా ప్రచారం చేసినా నాణ్యత లేదనే కారణంతో చాలామంది మహిళలు చీరలు తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో సుమారు లక్షకుపైగా చీరలు మిగిలిపోవడంతో వెనక్కి వెళ్లాయి. ఈ ఏడాదైనా నాణ్యత ఉంటుందా.. లేదా అని మహిళలు చర్చించుకుంటున్నారు. అసాక్షి, రంగారెడ్డి జిల్లా: బతుకమ్మ చీరలు త్వరలో జిల్లాకు రానున్నాయి. బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ‘బతుకమ్మ చీరలు’ పంపిణీని గతేడాది ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సైతం మహిళలకు చీరలు అందజేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 18 ఏళ్ల వయసు నిండి ఆహార భద్రత కార్డులో పేరున్న ప్రతి మహిళకు ఒకటి చొప్పున చీరను పంపిణీ చేయనున్నారు. 557 గ్రామ పంచాయతీలు, జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు సర్కిళ్లు, మున్సిపాలిటీల్లో ఒకేసారి పంపిణీ చేపట్టే అవకాశం ఉంది. జిల్లా పరిధిలోని రేషన్ కార్డుల్లో పేరున్న 6.49 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలు త్వరలో అందనున్నాయి. ఈనెల 12 నుంచి 15 వరకు వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో జిల్లాకు స్టాక్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పంపిణీ చేసేంత వరకు వీటినా వ్యవసాయ మార్కెట్ కమిటీల గోదాముల్లో భద్రపరచనున్నారు. -
బతుకమ్మ చీరలొచ్చాయ్..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే పండగ బతుకమ్మ. పేద, ధనిక తారతమ్యం లేకుండా జరుపుకునే పండగ. ఆనందోత్సాహాల మధ్య పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని గత ఏడాది నిర్ణయించింది. ఈ మేరకు ముందస్తుగానే జిల్లాకు చీరలు చేరాయి. వీటిని సకాలంలో పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలోని 21 మండలాల్లో ఉన్న 18 ఏళ్లు పైబడిన యువతులతోపాటు మహిళలకు గత ఏడాది నుంచి చీరలు పంపిణీ చేస్తున్నారు. 669 రేషన్ దుకాణాల్లో గత ఏడాది 4,48,797 మంది లబ్ధిదారులకు చీరలను అందించగా.. ఈ ఏడాది సుమారు 10వేల వరకు లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 4.58 లక్షల మంది వరకు లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 669 రేషన్ దుకాణాల్లో 3,95,888 కార్డులున్నాయి. వీటిలో ఆహార భద్రత కార్డులు 3,69,305, అంత్యోదయ కార్డులు 26,581, అన్నపూర్ణ కార్డులు రెండు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండగను అధికంగా నిర్వహిస్తున్నా రు. ఈ పండగ మహిళలకు సంబంధించినది కావడంతో అందరికీ గుర్తుండిపోయేలా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. గతంలో ఇలా.. గత ఏడాది నుంచి దసరా పండగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పౌరసరఫరాల శాఖ ద్వారా 18 ఏళ్ల వయసు దాటిన వారందరి వివరాలు సేకరించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ.. జిల్లాలోని మహిళా లబ్ధిదారులకు అనుగుణంగా చీరలను పంపించి.. ఆయా గోడౌన్లలో సిద్ధం చేసింది. అనంతరం పండగకు ముందు చీరలను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఇలా.. గతేడాది సమాచారం ప్రభుత్వం వద్ద ఉండడంతో వాటికి అనుగుణంగా చీరలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. కొత్తగా రేషన్ కార్డులు కొద్ది మందికి రావడంతోపాటు 18 ఏళ్ల వయసు పైబడిన వారు కూడా ఈ ఏడాది ఉంటారనే అంచనాతో ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా వివరాలు సేకరిస్తూ.. మరో 10వేల చీరలను అధికంగా పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముందుగానే చీరలను సిద్ధం చేసి.. పండగ సమయానికి ఎటువంటి హడావుడి లేకుండా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో అధికారులున్నారు. జిల్లాకు చేరిన 96వేల చీరలు బతుకమ్మ పండగ సందర్భంగా పంపిణీ చేసే చీరలను వైరా, నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్ గోడౌన్లలో సిద్ధంగా ఉంచారు. ఇప్పటివరకు రెండు గోడౌన్లకు కలిపి 96వేల చీరలు వచ్చాయి. అయితే మహిళలకు నచ్చిన విధంగా డిజైన్, రంగులు ఉండాలనే ఉద్దేశంతో అధికారులు ప్రస్తుతం వచ్చిన చీరలపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరల రంగులు, వాటి నాణ్యత, డిజైన్లు రోజూ వాడు తున్న మాదిరిగా ఉన్నాయా..?. ఇంకా ఏమైనా మార్పులు చేయాలా...? తదితర అంశాలపై ప్ర భుత్వం అభిప్రాయ సేకరణ(మహిళల నుంచి ఫీడ్ బ్యాక్) తీసుకుంటోంది. గతంలో చీరల పంపిణీ లో పలు సంఘటనలు ఎదుర్కొన్న అనుభవంతో భవిష్యత్‌లో మహిళలకు నచ్చేలా, మెచ్చేలా చీర లు పంపిణీ చేసేందుకు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మహిళల నుంచి బతుకమ్మ చీరలపై అభిప్రాయాలు తీసుకున్నారు. చీరలు వస్తున్నాయి.. జిల్లాకు బతుకమ్మ పండగ సందర్భంగా చీరలు వస్తున్నాయి. ఇప్పటివరకు 96వేలు వచ్చాయి. త్వరలో మిగతావి వస్తాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపిణీ కార్యక్రమం చేపడతాం.– మదన్‌గోపాల్, కలెక్టరేట్ ఏఓ, ఖమ్మం -
సెప్టెంబర్‌లోగా బతుకమ్మ చీరలు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ చీరల ఉత్పత్తిని సెప్టెంబర్ చివరిలోగా పూర్తి చేయాలని పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మేరకు 90 లక్షల చీరలను బతుకమ్మ పండుగకు వారం ముందే సరఫరా చేయాలని సిరిసిల్ల మాస్టర్ వీవర్లు, మ్యాక్స్ ప్రతినిధులకు సూచించారు. చీరల ఉత్పత్తి వేగాన్ని, లూమ్ల సంఖ్య పెంచి డబుల్ షిఫ్టుల్లో పనిచేయాలని కోరారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై శనివారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. సిరిసిల్లలో ప్రస్తుతం పదివేల లూములపై చీరల నేత కొనసాగుతోందని అధికారులు మంత్రికి నివేదించారు. లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధించేందుకు కనీసం 20 వేల లూములపై చీరల ఉత్పత్తి జరపాల్సి ఉందని, ఈ మేరకు త్వరలో ఉత్పత్తి ప్రక్రియను రెట్టింపు చేస్తామని సిరిసిల్ల మ్యాక్స్ ప్రతినిధులు తెలిపారు. నేతన్నల ఆదాయం పెంచడమే లక్ష్యం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు చిరుకానుక ఇవ్వడంతోపాటు సిరిసిల్లలోని నేతన్నలకు, పవర్లూమ్ కార్మికులకు ఆదాయం, జీవన ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎంతో నమ్మకంతో సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్‌ను గడువులోగా పూర్తి చేయాలని కోరారు. చీరల ఉత్పత్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని టెక్స్టైల్ శాఖ కమిషనరేట్ అధికారులను ఆదేశించారు. వారంలో కనీసం 4 సార్లు సిరిసిల్లలో పర్యటించాలన్నారు. నేతన్నలకు బ్యాంకు, ముద్ర రుణాల మంజూరు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో త్వరలో బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిరిసిల్లలోని పవర్లూమ్ కార్మికులు తయారు చేస్తున్న బతుకమ్మ చీరల నాణ్యతను మంత్రి పరిశీలించారు. వచ్చేవారంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీని కలసి పవర్లూమ్ నవీకరణ పథకం అమలులోని సమస్యలు, సవాళ్లను వివరిస్తానని పేర్కొన్నారు. -
బతుకమ్మ విజయవంతానికి సహకారం
-
బతుకమ్మ విజయవంతానికి సహకారం
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బతుకమ్మ పండుగ విజయవంతానికి తమ సంస్థ సహకారం అందిస్తుందని, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ నెల 26న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే మహా బతుకమ్మ వేడుకను విజయవంతం చేసేందుకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు కృషి చేస్తారని చెప్పారు. మహా బతుకమ్మలో పాల్గొనేందుకు మహిళలు వేలాదిగా తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పూలపండుగ పరిమళాలను, విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేందుకు తెలంగాణకే పరిమితం అయిన బతుకమ్మ పండుగను ఖండాంతరాలకు వ్యాపింపచేయడంలో తెలంగాణ జాగృతి విశేష కృషి చేసిందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందని, తెలంగాణ జాగృతి కూడా ఈ సంబరాల్లో పాలుపంచుకుని విజయవంతం చేస్తోం దన్నారు. సాంస్కృతిక శాఖ ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో నిర్వహించే బతుకమ్మ సంబురాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ జాగృతి కార్యకర్తలు విజయవంతం చేస్తారని వివరించారు. -
లోకేష్ ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే మంచిది..
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌పై టీఆర్ఎస్ ఎంపీ కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆస్తుల వివరాల వెల్లడి విషయంలో తమకు ఎవరి సలహాలు అవసరం లేదని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడులా తాము అడ్డగోలుగా సంపాదించలేదని, తాము ఎవరికి లెక్కలు చూపించాలో వారికే లెక్కలు చూపిస్తామని కవిత వ్యాఖ్యానించారు. అన్నా హజారేలమని చెప్పుకొని ఆస్తులు ప్రకటించుకోవటం హాస్యాస్పదమన్నారు. మాసం తిని బొక్కలు మెడలో వేసుకుని వాళ్లం కాదని కవిత ఎద్దేవా చేశారు. ఆమె శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ది ప్రెస్‌లో మాట్లాడారు. కొత్త జిల్లాలపై లోకేష్ వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెడితే బాగుటుందని... ఏపీ పాలన గురించి తాము మాట్లాడితే బాగుండదని కవిత సూచించారు. మహిళలు మంత్రివర్గంలో ఉన్నా, లేకపోయినా వారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. గత రెండేళ్లుగా తెలంగాణ సంస్కృతికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చన్నారు. దేశ విదేశాల్లో బతుకమ్మకు విశేష ఆదరణ లభించిందన్నారు. అక్కడి ప్రభుత్వాలు కూడా బతుకమ్మ పండుగను గుర్తించాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కవులు, కళాకారులను గౌరవించుకోగలిగామన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు బహుభాషా కోవిదుడు అయినప్పటికీ...ఆయనకు సొంతగడ్డపై రావాల్సినంత కీర్తిప్రతిష్టలు రాలేదన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక కృషి చేశారని కవిత అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు ప్రజలన గందరగోళానికి గురి చేస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. రాజకీయాలను నీచస్థాయికి దిగజార్జిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. తమ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావు, తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నమని కవిత అన్నారు. -
లోకేష్ ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే మంచిది..
-
సాన్ ఆంటోనియోలో సద్దుల బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ సంబరాలు విదేశాల్లో కూడా ఉత్సాహంగా జరుగుతున్నాయి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గల సాన్ అంటోనియో నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాన్ ఆంటోనియో (టాగ్సా) నేతృత్వంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో ఆడబిడ్డలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో కోలాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలాడుతూ మహా గౌరీదేవిని బతుకమ్మగా పూజించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మను నీటి కొలను వరకు ఊరేంగిచి "పోయి రావమ్మా..." అంటూ నిమజ్జనం చేసి ఆ పై వెంట తెచ్చుకొన్న సద్దులు, నువ్వుల పొడి, పల్లీపొడి, కొబ్బరి పొళ్లను అందరితో పంచుకొని వీడుకోలు చెప్పారు. సాన్ ఆంటోనియోలో గత ఏడెనిమిదేళ్లుగా సంప్రదాయంగా జరుపుకొంటున్న ఈ బతుకమ్మ వేడుకలలో అతి పెద్ద సంఖ్యలో హాజరైన తెలంగాణ వాసులకు టాగ్సా కార్యవర్గ సభ్యులు, కార్యక్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరపు వేడుకలు మరపు రాని అనుభవమని వర్ణించారు. -
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు
-
నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు
-
ధూమ్ ధామ్‌గా..
హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు విద్యుత్ కాంతులతో ధగధగలాడిన ట్యాంక్‌బండ్ పరిసరాలు ఆకట్టుకున్న సంప్రదాయ కళారూపాలు వినూత్నంగా లేజర్ షో.. అబ్బురపరిచిన బాణసంచా 10 జిల్లాల శకటాల ప్రదర్శన.. ఎల్ఈడీ తెరలపై ప్రసారం భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు.. సమాచార శాఖ ‘తెలంగాణ’ పత్రిక ఆవిష్కరించిన సీఎం పచ్చని ఆకుల దొంతర మీద పసుపు ముద్దల్లాంటి తంగేడు పూల సొగసు.. వెన్నెల ఆరబోసినట్లు మెరిసే తెల్లని గునుగు పూల అందం.. ఆపై కట్లపూలు, బీరపూలు, చేమంతులు.. తీరొక్క పూల వరుసల సొబగు.. మీద సుతిమెత్తగా విచ్చుకున్న గుమ్మడి పువ్వు, దానిపై గౌరమ్మ... రంగు రంగుల పూల కలబోత ‘బతుకమ్మ’కు.. తెలంగాణ ఆడపడుచులు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’.. ‘ఒక్కేసి పువ్వేసి చందమామ..’ అంటూ పాటల మధ్య ఘనంగా వీడ్కోలు పలికారు. పెత్రమాస నాడు ఎంగిలిపూల బతుకమ్మగా మొదలైన సంబరాలు... ఎనిమిది రోజుల పాటు సాగి గురువారం సద్దుల బతుకమ్మతో ముగిశాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం తొలిసారిగా జరిగిన బతుకమ్మ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఓవైపు సంప్రదాయ కళారూపాలు, ఆటపాటలు.. మరోవైపు లేజర్ వెలుగ ు జిలుగులు.. ఆకాశంలో చిత్ర విచిత్ర అగ్ని పూల బాణాసంచా విన్యాసాలు.. మొత్తంగా రాజధాని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై జరిగిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన తొలి బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ పండుగను అధికారిక వేడుకగా ప్రకటించి ముందుగానే ప్రజల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసిన ప్రభుత్వం.. గురువారం జరిగిన సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించి యావత్ తెలంగాణ ప్రజలను పులకించిపోయేలా చేసింది. ఇంతకాలం ఊళ్లలో జరిగే వేడుకలకే పరిమితమైన ఈ సంప్రదాయ పుష్పోత్సవ వైభవాన్ని రాజధానిలోని హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఘనంగా నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరగబోతున్న తొలి అంతర్జాతీయ వేడుక ‘మెట్రో పొలిస్ వరల్డ్ కాంగ్రెస్ (ప్రపంచ మేయర్ల సదస్సు)’ను ఘనంగా నిర్వహించే సత్తా తనకు ఉందనేందుకు సంకేతంగా నిలిచేలా ఈ వేడుకను నిర్వహించి చూపటం విశేషం. పులకించిన భాగ్యనగరం.. ఇప్పటివరకు వినాయక నిమజ్జనోత్సవానికి వేదికైన చారిత్రక హుస్సేన్‌సాగర్.. గురువారం సద్దుల బతుకమ్మ వేడుకను చూసి మురిసిపోయింది. గవర్నర్ న రసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఆయన సతీమణి శోభ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రతిపక్షాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్‌లో ఉండేవారిలో చాలా మంది దసరా వేడుకలకు ఊళ్లకు వెళ్లే ఆనవాయితీ ఉండగా... ఈసారి మాత్రం ‘బతుకమ్మ’ వేడుకలను వీక్షించేందుకు వేల మంది ఊళ్ల నుంచి రాజధానికి తరలి వచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్ ఇసుకేస్తే రాలనంతగా జనసంద్రమైంది. భారీ సంఖ్యలో జనం వస్తారని అంచనా వేసిన అధికారులు ట్యాంక్‌బండ్‌పై చాలా చోట్ల భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఉదయం నుంచే కళకళ.. తెలంగాణలోని పది జిల్లాల నుంచి తరలివచ్చిన మహిళలు తొలుత ఎల్బీ స్టేడియానికి చేరుకుని సద్దుల బతుకమ్మలను పేర్చుకున్నారు. దాదాపు 35 టన్నుల పూలతో ఇక్కడ పదివేల బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం సంప్రదాయబద్ధంగా తొలుత గౌరీ పూజ నిర్వహించి, పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం మహిళలు బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా హుస్సేన్‌సాగర్ వైపు తరలారు. అంతకు ముందు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు కె.వి.ర మణాచారి, సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్లబండి కవితా ప్రసాద్ తదితరులు పూజలు నిర్వహించారు. అప్పటికే ట్యాంక్‌బండ్‌పై భారీ వేదికను ఏర్పాటు చేసిన.. అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఓవైపు బతుకమ్మ ఆటపాటలు... మరోవైపు వేదిక మీదుగా తెలంగాణ కళారూపాల విన్యాసాలు... సాయంత్రం ఐదుగంటల వరకే ఇటు ట్యాంక్‌బండ్ నుంచి నెక్లెస్‌రోడ్డు వరకు కిక్కిరిసిపోయేలా చేరుకున్న ప్రజలతో నిండిపోయింది. ఐదున్నర సమయంలో గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి దంపతులు వేదిక వద్దకు చేరుకున్నారు. గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ వేదిక దిగివచ్చి మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు. వీలైనంతసేపు బతుకమ్మ ఆడిన మహిళలు.. ఆ తర్వాత ట్యాంక్‌బండ్‌కు సికింద్రాబాద్ వైపు చివరన యూత్ హాస్టల్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద సాగర్‌లో నిమజ్జనం చేశారు. ఒక్కచోట చేరిన కళారూపాలు.. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యక్షగానం, కోలాటం, కొమ్ము కోయల నృత్యం, గంగిరెద్దుల విన్యాసాలు, ఒగ్గుకథ, బుర్ర కథ, చిడతలాట, పగటి వేషాలు, చిందు భాగవతం... ఒకటేమిటి అన్ని కళారూపాలు ట్యాంక్‌బండ్‌పై కనువిందు చేశాయి. ఉపన్యాసాలు లేకుండా.. సాధారణంగా లక్షల మంది ఒకచోట చేరినప్పుడు రాజకీయ నేతల ఉపన్యాసాలు సర్వ సాధారణం. కానీ ఈ వేడుకలో ఎక్కడా ఉపన్యాసాల విసిగింపు లేకుండా సాగిపోవడం మరో ప్రత్యేకత. వేదికపై పలు పార్టీల సీనియర్ నేతలు కొలువుదీరినా... ఎవరూ మాట్లాడలేదు. వేడుక సాగుతున్న తీరును వ్యాఖ్యాతలు వివరించడం మినహా మైకు మరొకరి చేతుల్లోకి వెళ్లలేదు. భారీ పోలీసు బందోబస్తు.. భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటారనే అంచనా మేరకు పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పోలీసులు డేగకళ్లతో కాపలా కాశారు. దీంతో చిన్న అవాంతరం కూడా లేకుండా ఈ వేడుక ప్రశాంతంగా ముగిసి ప్రజలకు మధురస్మృతులను మిగిల్చింది. సమాచార శాఖ ‘తెలంగాణ’ పత్రిక ఆవిష్కరణ.. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను వివరించే తెలంగాణ మాసపత్రికను వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ వెలువరించే ఈ పత్రిక ఉమ్మడి రాష్ట్రంలో ‘ఆంధ్రప్రదేశ్’ పేరుతో కొనసాగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ‘తెలంగాణ’ పేరుతో ప్రజల్లోకి వస్తోంది. సద్దుల బతుకమ్మ వేడుక నేపథ్యంలో ఆ వేదికపైనే తొలి సంచికను సీఎం ఆవిష్కరించి తొలి ప్రతిని గవర్నర్‌కు అందజేశారు. పత్రిక సంపాదక వర్గాన్ని కూడా ఈ సందర్భంగా పరిచయం చేశారు. తెలంగాణ పుష్పోత్సవం పేరుతో రచించిన మరో పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు: తెలంగాణలో జరిగే వేడుకల్లో ప్రజలు మతాలకతీతంగా పాల్గొనే సంప్రదాయం గురువారం కనిపించింది. వందల సంఖ్యలో ముస్లింలు ట్యాంక్‌బండ్‌పైకి చేరుకుని వేడుకలను వీక్షించారు. ముఖ్యంగా ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో కొందరు బతుకమ్మలను తీసుకురావటం విశేషం. ఇక విదేశీ పర్యాటకులు కూడా ట్యాంక్‌బండ్‌పై సందడి చేశారు. అబ్బురపరిచిన లేజర్ షో బతుకమ్మ ఆటపాటలు, తెలంగాణ కళారూపాల ప్రదర్శనలు, శకటాలు కొనసాగుతుండగానే... రాత్రి ఏడున్నర సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. గతంలో ఆఫ్రో ఆసియన్ గేమ్స్ సందర్భంగా తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో లేజర్ ప్రదర్శనను హైదరాబాద్‌కు చూపించి అబ్బురపరిచిన విజ్‌క్రాఫ్ట్ సంస్థ ఆధ్వర్యంలో లేజర్ షో విన్యాసాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 20 నిమిషాల పాటు నెక్లెస్ రోడ్డు వైపు నుంచి ట్యాంక్‌బండ్ దిశగా ఆకాశంలో లేజర్ కిరణాల అద్భుత విన్యాసాలు వీక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. క్షణాల్లోనే చిత్రవిచిత్ర ఆకృతులు ప్రత్యక్షమై మరో రూపంలోకి మారుతూ సాగిన షో అబ్బురపరిచింది. ఆ కిరణాలకు తగినట్లుగా ఏర్పాటు చేసిన ధ్వనులు మరింతగా ఆకట్టుకున్నాయి. ఇదే సమయంలో సంజీవయ్య పార్కులోంచి పేల్చిన తారాజువ్వలు నింగిలో వెలుగులు పూయించాయి. అప్పటికే నిమజ్జనమైన వేలాది బతుకమ్మలు ప్రశాంతంగా తేలియాడుతుండగా.. ఆకాశం నుంచి వెలుగు పూల వాన కురిసినట్లుగా ఆ దృశ్యం కనిపించింది. అలరించిన శకటాలు ఇప్పటివరకు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో మాత్రమే శకటాలను ప్రదర్శిస్తారు. కానీ తొలిసారిగా సంప్రదాయ వేడుక అయిన ‘బతుకమ్మ’ సందర్భంగా కూడా శకటాలను ఏర్పాటు చేయడం పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. జిల్లాల వారీగా రూపొందించిన బతుకమ్మ శకటాలతో ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ప్రదర్శన బాగా ఆకట్టుకుంది. అప్పటివరకు తెలుగు లలితకళా తోరణంలో కొలువుదీరిన ఈ శకటాలు ఒకదాని తర్వాత ఒకటిగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాయి. జీహెచ్ఎంసీ రూపొందించిన పూల కారు బతుకమ్మ చూపరులను కట్టి పడేసింది. సమాచార పౌరసంబంధాల శాఖ రూపొందించిన శకటంపై క్రీడాకారులు గుత్తా జ్వాల, సింధు, నైనా జైస్వాల్, పెండ్యాల సౌందర్య, ఎవరెస్టును అధిరోహించిన పూర్ణ నిలిచారు. ఆదిలాబాద్ జిల్లాకు గుస్సాడీల నృత్య ప్రదర్శన, బాసర దేవాలయ శకటం, హైదరాబాద్ జిల్లా శకటంపై బోనాలు, మహాంకాళీ కళారూపాలు, చార్మినార్, గోల్కొండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరీంనగర్ శకటంపై ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ కమాన్, కొండగట్టు అంజన్న, మానేరు డ్యామ్ చూపరులను ఆకట్టుకున్నాయి. ఖమ్మం శకటం హంసను తలపించింది. ఆ జిల్లాకు చెందిన కొమ్మ కోయల నృత్యాలు అద్భుతంగా సాగాయి. మెదక్ మంజీరా శకటం, వర్గల్ సరస్వతీ దేవాలయంతో పాటు చిందు యక్షగాన నృత్యాలు, నల్లగొండ శకటంపైన యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్, ఛాయా సోమేశ్వరాలయం నమూనాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ శకటంపై ఆలంపూర్ దేవాలయం, పిల్లలమర్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వరంగల్ శకటంపై కాకతీయ కళాతోరణం, భద్రకాళి దేవాలయం, వేయి స్తంభాలగుడి నమూనాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ అమరవీరుల సంక్షేమ సంఘం ప్రత్యేకంగా సమ్మక్క సారక్క శకట స్థూపాన్ని ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసింది. వాటి ఔన్నత్యాన్ని వివరిస్తూ తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడు రాళ్లబండి కవితాప్రసాద్ తదితరుల వ్యాఖ్యానం ఆకట్టుకుంది. -
కవితను తప్ప మరెవరినీ పిలవరా?
బతుకమ్మ ఉత్సవానికి ఒక్క కేసీఆర్ కూతురు కవితకు తప్ప మరెవరికీ ఆహ్వానాలు ఉండవా అని హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి మండిపడ్డారు. బతుకమ్మ సంబరాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆమె తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ నగరంలో అట్టహాసంగా నిర్వహిస్తామని చెబుతున్న సద్దుల బతుకమ్మ సంబరాలకు జీహెచ్ఎంసీలోని కార్పొరేటర్లు ఎవరికీ ఇంతవరకు ఆహ్వానాలు అందలేదని ఆమె తెలిపారు. అసలు బతుకమ్మ ఉత్సవాలకు కేటాయించిన పది కోట్ల రూపాయలను ఎలా ఖర్చుచేస్తున్నారో ముఖ్యమంత్రి, ఇతర అధికారులు చెప్పాలని కార్తీకరెడ్డి డిమాండ్ చేశారు. -
కువైట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కువైట్ తెలంగాణ సమితి (కేటీఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఇప్పటివరకు గల్ఫ్ దేశమైన కువైట్‌లో ఎప్పుడూ ఈ ఉత్సవాలు చేసుకోలేదని, భారత్‌లో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా ఈ ఉత్సవాలు చేసుకోవడం ఆనందంగా ఉందని కువైట్‌లో భారత రాయబారి సునీల్ జైన్ అన్నారు. తెలంగాణ ప్రవాసీయులలో ఆత్మవిశ్వాసం ఇప్పుడు పెరిగిందని, అందుకు ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలే నిదర్శనమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలకు గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లోని తెలంగాణ ప్రాంతీయులు కూడా బాగా స్పందిస్తున్నారని ఆయన అన్నారు. స్వీయ అస్తిత్వం కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ కళలు, సంస్కృతి ప్రధాన పాత్ర పోషించాయని, అందులో భాగంగానే ఇప్పుడు ఎడారి ప్రాంతాలకు కూడా బతుకమ్మ ఉత్సవం పాకిందని తెలిపారు. ఈ ఉత్సవాల్లో కువైట్ తెలంగాణ సమితి అధ్యక్షుడు ముత్యాల వినయ్, రంజిత్, చెల్లంశెట్టి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మపై వివక్ష: స్వామిగౌడ్
ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ వివక్షకు గురైందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ మహిళా ఉద్యోగుల బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అలాంటి ఉద్యోగులను తరిమికొడతామని, తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. సొంత పదవిని కూడా కాపాడుకోలేని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తమను విమర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. -
‘బతుకమ్మ’లో విభేదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని మహిళా ఉద్యోగ సంఘాల మధ్య ఉన్న విభేదాలు గురువారం బతుకమ్మ నిర్వహణ సందర్భంగా బయటపడ్డాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ముందున్న కార్ల పార్కింగ్ ఆవరణలో బతుకమ్మను తామంటే.. తాము నిర్వహిస్తామని తెలంగాణ మహిళా ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం, సచివాలయ టీఎన్జీఓ మహిళా విభాగం ప్రతినిధులు వాదనలు చేసుకోగా.. పోలీసులు కల్పించుకొని కలిసి చేసుకొమ్మని సర్దిచెప్పారు. దీంతో వేర్వేరుగా పెట్టుకున్న బతుకమ్మలను ఒకేదగ్గర పెట్టుకొని కాసేపు ఆడారు. అయితే తెలంగాణ మహిళా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమానికి తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్కను ఆహ్వానించారు. దీంతో తమకు తెలియకుండా ఆమెను ఎలా ఆహ్వానిస్తారని వాపోయిన సచివాలయ ఉద్యోగుల సంఘం, సచివాలయ టీఎన్జీఓ మహిళా విభాగం వారు తమ బతుకమ్మలను పక్కకు తీసుకెళ్లి వేరుగా ఆడుకున్నారు. ఇక బహుజన బతుకమ్మతో చేరుకున్న విమలక్క తెలంగాణ మహిళా ఉద్యోగుల సంఘం వారితో కలిసి ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సచివాలయం అందరిది అనీ, అక్కడ ఆడి పాడే హక్కు అందరికీ ఉందన్నారు. ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించవద్దని కోరారు. సహజ వనరులను కాపాడటమే లక్ష్యంగా తాము బహుజన బతుకమ్మను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఉత్సాహంతో బతుకమ్మ ఉత్సవం నిర్వహించారు. అయితే విమలక్కను సచివాలయంలో లోపలికి వచ్చే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ విషయమై చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో.. ఆయన ఆదేశాల మేరకు విమలక్కను సచివాలయంలోకి అనుమతించారు. -
అధికారికంగా ‘బతుకమ్మ’ షురూ
ఉత్సాహంగా పాల్గొన్న సచివాలయ ఉద్యోగినులు సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. బుధవారం సచివాలయంలో జరిగిన ఉత్సవాల్లో పలువురు మహిళా అధికారులు, ఉద్యోగులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వమే బతుకమ్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుండడంతో.. సచివాలయమంతా సందడిగా మారింది. తెలంగాణ ప్రజల ఉద్యమ ప్రతీక: కవిత భువనగిరి: బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజల ఉద్యమ ప్రతీక అని తెలంగాణ జాగృతి అధృక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా భువనగిరిలో ఏర్పాటు చేసిన బంగారు బతుకమ్మ సంబరాలను ఆమె మంత్రి జగదీష్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజల బతుకు చిత్రమన్నారు. ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబంగా ఎదిగిన బతుకమ్మ పండగ ఇంత పెద్దఎత్తున జరుపుకోవడం అనందంగా ఉందని చెప్పారు. మంత్రి జగదీష్‌రెడ్డి మాట్టాడుతూ తెలంగాణ ప్రజల సంస్కృతి, జీవన విధానంలో బతుకమ్మ భాగ్యమన్నారు. -
బతుకమ్మకు గోరంత నిధులే..!
మోర్తాడ్ : తెలంగాణ ఆడపడుచులకు ఇష్టమైన పండుగ బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగను తెలంగాణ పండుగగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో తెలంగాణ ఆడపడుచుల్లో ఆనందం వెల్లివిరిసింది. కాగా ప్రభుత్వం పండుగ నిర్వహణకు కేటాయించిన నిధులను పరిశీలిస్తే సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. బతుకమ్మ పండుగకు సీఎం కేసీఆర్ రూ. 10 లక్షలు మాత్రమే కేటాయించారు. పండుగ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లకు ఈ నిధులు ఏ మాత్రం సరిపోవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బతుకమ్మ పండుగను వారం రోజుల పాటు నిర్వహించిన తరువాత చెరువుల్లో రాత్రి పూట నిమజ్జనం చేయడం సంప్రదాయం. బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి చెరువులకు వెళ్లడానికి రోడ్డును నిర్మించడం, లైటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బతుకమ్మ ఊరేగింపు సందర్భంగా ప్రధాన కూడలి వద్ద భారీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాకు కేటాయించిన రూ. 10 లక్షలతో ఇవన్నీ చేయాలంటే కష్టమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు, ఒక నగర కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. మండలాల వారీగా నిధులు కేటాయిస్తే ఒక మండలానికి రూ. 27 వేల చొప్పున కేటాయించాల్సి వస్తుంది. గ్రామాల వారీగా అయితే ఒక గ్రామానికి రూ. 1,300 మాత్రమే కేటాయించవచ్చు. నగర కార్పొరేషన్, మున్సిపాలిటీలకు నిధులు ఎక్కువగా అవసరమవుతాయి. మున్సిపాలిటీలకు నిధులు ఎక్కువగా కేటాయిస్తే గ్రామాలకు నిధుల శాతం తగ్గుతుంది. గత ప్రభుత్వం బతుకమ్మ పండుగకు జిల్లాకు రూ. లక్ష మాత్రమే నిధులను కేటాయించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీరు పట్ల నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు నిధుల పరిమితిని టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచినా సరిపడేంత కేటాయించకపోవడంతో స్థానిక సంస్థలపై భారం తప్పడం లేదనే వాదన వినిపిస్తుంది. గ్రామానికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు కేటాయిస్తే బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు సజావుగా చేయవచ్చని పలువురు సర్పంచ్‌లు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిధులు సంపూర్ణంగా కేటాయించకపోవడంతో ఏర్పాట్లు ఎలా చేయాలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిధులను పెంచాలని పలువురు కోరుతున్నారు. -
బతుకమ్మ పండుగ కోసం జిల్లాకు కోటి
బతుకమ్మ పండుగ కోసం సర్కారు కేటాయింపు సాక్షి, మంచిర్యాల : తెలంగాణ సర్కారు అధికారికంగా ని ర్వహించనున్న బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జిల్లాకు రూ.కోటి రానున్నాయి. శుక్రవారం ఈ పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ శనివారమే కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిధులు కేటాయించారు. ఈ నిధులతో ఈనెల 24 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు వేడుకలు నిర్వహిస్తారు. బతుకమ్మ ఆడే చెరువుల వద్ద మరమ్మతు, రోడ్లు వేయడంపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్కారు ఆదేశించింది. విద్యు త్ దీపాల ఏర్పాటు, తదితర బాధ్యతలను సర్పంచ్, ఎంపీడీవోలకు అప్పజెప్పనున్నారు. -
అధికారిక..సంబురం
సాక్షిప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ‘బతుకమ్మ’ పండగను తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. రాష్ట్ర అవతరణ సందర్భంగా జిల్లా కేంద్రంలో తెలంగాణ సంబరాలు నిర్వహించి విజయవంతం చేసిన కలెక్టర్ ఇప్పుడు ‘బతుకమ్మ’ పండగకు కొత్త శోభ తీసుకువచ్చే పనిలో ఉన్నారు. బతుకమ్మ పండగ ఈసారి అత్యంత ఉత్సాహాల మధ్య జరిగేలా కార్యక్రమం రూపు దిద్దుకుం టోంది. జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ఈ పండగను అద్భుతంగా నిర్వహించేందకు మహిళలకు బతుకమ్మ పోటీలను నిర్వహించనున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో బతుకమ్మ సంబరాలు జరుపుతారు. అక్టోబరు 1వ తేదీన జిల్లా స్థాయిలో పండగను జరపాలని నిర్ణయించారు. బతుకమ్మల నిమజ్జన కార్యక్రమానికి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఇవీ...పోటీలు..! బతుకమ్మ పోటీలు, విజేతలకు బహుమతుల కోసమే కనీసం రూ.20లక్షల దాకా వెచ్చించనున్నారు. ఇదంతా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా జరిగే కార్యక్రమమే. 28వ తేదీన గ్రామస్థాయిలో జరిపే పోటీలు సర్పంచ్ నేతృత్వంలో జరుగుతాయి. గ్రామ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా, రూ.ఒక వెయ్యి, రూ.500, రూ.300 అందజేస్తారు. గ్రామస్థాయిలో ప్రథమ బహుమతులు వచ్చిన వారందరితో 29వ తేదీన మండల స్థాయిలో పోటీ నిర్వహించి మండల అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యుల ఆధ్వర్యంలో మూడు బహుమతులు ఇస్తారు. ప్రథమ -రూ.3వేలు, ద్వితీయ- రూ.2వేలు, తృతీ య - రూ.వెయ్యి బహుమతిగా అందజేస్తారు. 30వ తేదీన నియోజకవర్గ స్థాయిలో పోటీలు ఉంటాయి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయి. మండల స్థాయిలో మొదటి స్థానం దక్కించుకున్న వారితో నియోజకవర్గ స్థాయి పోటీలు ఉంటాయి. ఈ దశలోనూ మూడు బహుమతులు ఉంటాయి. ప్రథమ -రూ.5వేలు, ద్వి తీయ-రూ.3వేలు, తృతీయ-రూ.2వేల బహుమతి ఉంటుంది. ఇక, ఆఖరిరోజైన అక్టోబరు 1న జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో జిల్లాస్థాయి పోటీలు జరుగుతాయి. నియోజకవర్గస్థాయిలో ప్రథమ బహుమతి పొందినవారు ఇక్కడ పోటీలో పాల్గొంటారు. ప్రథమ-రూ.10వేలు, ద్వితీయ-రూ.5వేలు, తృతీయ - రూ.3వేలు బహుమతిగా అందజేస్తారు. జిల్లా పోటీలో పాల్గొనే మిగిలిన తొమ్మిదిమందికి పార్టిసిపేషన్ గిఫ్ట్‌గా రూ.వెయ్యి గిఫ్టు ఓచర్ ఇస్తారు. వీరందరికీ ప్రశంసపత్రాలు కూడా ఇస్తారు. ఇక, డివిజన్, జిల్లాస్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు బతుకమ్మ అంశంపైనే వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. -
'బతుకమ్మ'కు స్పీకర్, నలుగురు సీఎంలకు ఆహ్వానం!
-
'బతుకమ్మ'కు స్పీకర్, నలుగురు సీఎంలకు ఆహ్వానం!
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, చరిత్రని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కవిత,ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...బతుకమ్మ పండుగకు 10 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. తెలంగాణలో 10 జిల్లాలతోపాటు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వేదికగా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తోపాటు నలుగురు మహిళా సీఎంలను బతుకమ్మ పండుగకు ఆహ్వానిస్తామని ఎంపీ కవిత తెలిపారు. -
బతుకమ్మకు 10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. బతుకమ్మ పండగ నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నిజమాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతంలో సెప్టెంబర్ 24నుంచి అక్టోబర్ 2వరకు బతుకమ్మ పండగ జరుగనుంది. బతుకమ్మ పండగ ఉత్సవాలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని ఆధికారులను ఆదేశించారు. -
షార్జాలో బతుకమ్మ వేడుకలు
సాక్షి, ముంబై: దుబాయ్‌లోని ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం (ఈటీసీఏ) ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దసరా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. షార్జా నేషనల్ పార్క్‌లో ఈనెల 14న సాయంత్రం బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని సంఘం వ్యవస్థాపకుడు పీచర కిరణ్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బతుకమ్మ దసరా సంబరాల నిమిత్తం ఈటీసీఏ మహిళా విభాగంలోని 20 మంది సభ్యులను నిర్వాహకులుగా నియమించారు. ఈ సమావేశంలో బతుకమ్మ సంబరాల పోస్టర్‌ను మహిళా సభ్యులు విడుదల చేశారు. బాలికలకు వివిధ పోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అక్కడి తెలుగు ప్రముఖులు హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో ఈటీసీఏ మహిళా సభ్యులు ప్రీతి, సౌజన్య, రిశిత, సారిక, స్వాతి, పద్మ, మాధవి, లత, సుమలత, లక్ష్మి, ప్రియాంక, ప్రితీ, సుజాత తదితరులు పాల్గొన్నారు. నిరంతరం యాంత్రిక జీవనం గడిపే మనకు ఈ పండుగ మన గ్రామీణ సాంస్కృతిక సౌందర్యాన్ని, చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెప్పిస్తుంది. రంగురంగుల పువ్వులు, వాటి గుబాళింపుల మధ్య అంతా ఒకే చోట చేరి బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఎంతో ఉల్లాసాన్ని పంచుతుంది. మనుషుల మధ్య అనుబంధం పెంపొందించగల శక్తి బతుకమ్మకు ఉంది. - ప్రీతి ఈ సంబరాలను నిర్వహించడం వల్ల భావితరాలకు మన ప్రాంత ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుస్తుంది. మన మధ్య దూరం తగ్గి అనుబంధం పెరుగుతుంది. - ఆక్కెనపెల్లి రిశిత తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ కుల, మత, పేద, ధనిక తారతమ్యాలు లేకుండా గల్ఫ్‌లోని తెలుగువారంతా ఒక్కచోటి చేరి పండుగ చేసుకోవడం నిజంగా ఆనందదాయకం. ఇలాంటి పండుగలు జరుపుకోవడం వల్ల సొంత ఊరిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. -కొండ సౌజన్య -
ఒక్కేసి పువ్వేసి చందమామ..
ప్రపంచీకరణం ఎన్ని హొయలు పోతున్నా ప్రజల సంస్కృతీ సంప్రదాయాలు ప్రభావితం కావనడానికి బతుకమ్మ పండుగ చక్కని ఉదాహరణ. తెలంగాణ ప్రాంతంలోని అతిముఖ్యమైన పండుగల్లో ఒకటైన బతుకమ్మ ప్రజల జీవితాల్లో మమేకమైంది. రాత్రి కురిసిన మంచులో విప్పారిన రంగురంగుల పూలను పోటీపడి కోసుకొచ్చి వాటితో అందంగా బతుకమ్మలను పేర్చి మహిళలు భక్తితో ఆడిపాడతారు. బొడ్డెమ్మ, బతుకమ్మ, దసరా వేడుకలను కలుపుకుంటే ఇరవై రోజులపాటు ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగ సంబరాలు జరుపుకుంటారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ సంబరాల సందర్భంగా ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం. బతుకమ్మ పండుగకు పురాణ, ఇతి హా స, చారిత్రాత్మమైన నేపథ్యాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. లయకారుడు పరమ శివుడి అర్ధాంగి, జగన్మాత పార్వతీదేవే బతుకమ్మ అని ప్రజల నమ్మకం. ఇందుకు దక్షయజ్ఞం కథ ప్రామాణికంగా వాడుకలో ఉంది. దక్షుడి కూతురైన పార్వతి తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి పిలవని పేరంటంగా వెళ్తుంది. అక్కడ ఆమెకు, ఆమె భర్త పరమేశ్వరుడికి అవమానకరమైన పరిస్థితులు పరోక్షంగా ఎదురవుతా యి. పుట్టింట్లో ఎదురైన ఆ అవమానాన్ని తట్టుకోలేని పార్వతి యాగాగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆమె ప్రాణత్యాగాన్ని జీర్ణించుకోలేని ప్రజలు, భక్తులు శోకంతో ముక్తకంఠంగా బతుకమ్మా.. బతుక మ్మా అంటూ విలపించగా కరుణించిన జగన్మాత ప్రత్యక్షమై భక్తులను ఓదార్చిందని.. ఆనాటి నుంచి ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారనే కథ పూర్వ కాలం నుంచి ప్రచారంలో ఉంది. తొమ్మిది రోజుల వేడుక తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుక మ్మ పండుగను మహిళలు తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వర్షరుతువు చివరి దశలో తెలంగాణ ప్రాంతంలో పల్లెల్లో విరబూసే తంగేడు, బీర, గుమ్మడి, కట్లపూలు, బంతిపూలు, పొలాల గట్ల మీద లభించే ఎన్నో రకాల పూలను కోసుకొచ్చి బతుకమ్మను పేరుస్తారు. అందంగా పేర్చిన బతుకమ్మను గ్రామ చావడిలోగానీ దేవాలయంలోగానీ చెరువులు, కుంటల వద్దకు గానీ తీసుకెళ్లి మహిళలు పాడలు పాడుతూ అందుకు లయబద్ధంగా పాదాలు కదుపుతూ వలయాకారంలో తిరుగుతారు. వారు పాడే పాటల్లో పురాణ, ఇతిహాసాలతోపాటు ప్రకృతి వైపరీత్యాలు, పేదల బతుకులు, కష్టాలు, కన్నీళ్లు, ప్రేమలు, బంధాలు, మానవ సంబంధాలను ఆవిష్కరిస్తా రు. చివరి రోజున చెరువుల్లో బతుకమ్మను నిమజ్జనం చేసిన అనంతరం ఒకరికొకరు వాయినా లు ఇచ్చి పుచ్చుకుంటారు. దీంతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. పెద్దల ఆత్మశాంతి కోసం చనిపోయిన ఇంటిపెద్దలకు ఆత్మశాంతి జరగాలని పితృ అమావాస్య రోజున బ్రాహ్మణులకు బియ్యం ఇస్తారు. ఉదయ మే తలస్నానం ఆచరించి పల్లెంలో బియ్యం పోసి మోదుగాకు విస్తరిలో పప్పు, చింతపండు, ఉప్పు, కారం, అందుబాటులో ఉండే కూరగాయలు వోనగాయ, చెమ్మకాయ, బెండకాయ, బుడమకాయ, ఆనపకాయ, రూపాయి, కుంకుమ డబ్బి పెట్టుకుని వస్తారు. అయ్యగారింటికి వెళ్లి అతనితో బొట్టుపెట్టించుకుని తిరిగి ఇంటికి వచ్చాక భోజనాలు చేస్తారు. ఈ రోజున బియ్యం ఇవ్వడం వీలులేని పరిస్థితి ఉన్నవారు దసరారోజున ఇస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ భాద్రపద బహుళ అమావాస్యను పెత్రమాస(పితృ అమావా స్య) అంటారు. ఆ రోజున పేర్చే మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూవు బతుకమ్మగా పిలుస్తారు. గ్రామంలోని శివాల యాలు, ఆంజనేయస్వామి ఆలయాలు మొదలైన చోట్ల బతుకమ్మను ఆడతారు. రెండోరోజు నుంచి ఒక్కోచోట బతుకమ్మలను ఉంచి ఆడిపాడతారు. ఆరోరోజు అర్రెంగా భావిం చి బతుకమ్మను ఆడరు. తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. మరో కథ ఒక గ్రామంలో పుట్టిన ప్రతీ బిడ్డ పురిటిలోనే చనిపోతుండడంతో తీవ్ర శోకం లో మునిగిన ప్రజలు ఓ మునిని ఆశ్రయించారు. జగన్మాతను ప్రార్థిస్తే శుభం జరుగుతుందని, ఇకనుంచి పుట్టిన ప్రతీ ఆడబిడ్డకు బతుకమ్మ అని, మగబిడ్డకు బతుకయ్య అని నామకర ణం చేయాలని ఆదేశిస్తాడు. ప్రజలు అలా చేయడంతో మరణాలు ఆగిపోయాయని ప్రతీతి. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో పురిటిలో పిల్లలు చనిపోతున్న కుటుంబాల్లో బతుకమ్మ, బతుక య్య పేర్లు పెట్టే ఆచారం ఉంది. బతుకమ్మ పుట్టుచరిత్రను తెలియజేసే ఈ పాటను మొదట పాడిన తరువాతే ఇతర బతుకమ్మ పాటలను పాడతారు. 200ఏళ్ల నుంచే ఈ పాట ప్రచారంలో ఉన్నట్టు చెబుతారు. శ్రీలక్ష్మి దేవియు చందమామ - సృష్టి బ్రతుకమ్మయ్యె చందమామ పుట్టిన రీతి జెప్పె చందమామ - భట్టు నరసింహకవి చందమామ ధర చోళదేశమున చందమామ - ధర్మాంగుడను రాజు చందమామ ఆరాజు భార్యయు చందమామ - అతి సత్యవతి యండ్రు చందమామ నూరునోములు నోచి చందమామ - నూరు మందిని గాంచె చందమామ వారు శూరులయ్యు చందమామ - వైరులచే హతమైరి చందమామ తల్లిదండ్రులపుడు చందమామ - తరగని శోకమున చందమామ ధనరాజ్యమును బాసి చందమామ - దాయాదులను బాసి చందమామ వనితతో ఆ రాజు చందమామ - వనమందు నివసించె చందమామ కలికి లక్ష్మిని గూర్చి చందమామ - పలికె వరమడుగుమని చందమామ వినుతించి వేడుచు చందమామ - వెలది తన గర్భమున చందమామ పుట్టుమని వేడగా చందమామ - పూబోణి మది మెచ్చి చందమామ సత్యవతి గర్భమున చందమామ - జన్మించ్చె శ్రీలక్ష్మి చందమామ అంతలో మునులునూ చందమామ - అక్కడికి వచ్చిరి చందమామ కపిలగాలవులునూ చందమామ - కశ్యపాంగిరసులు చందమామ అత్రి వశిష్ఠులూ చందమామ - ఆ కన్నియను జూచి చందమామ బ్రతుకు గనె ఈ తల్లి చందమామ - బ్రతుకమ్మ యనిరంత చందమామ