బతుకమ్మ పండుగ కోసం జిల్లాకు కోటి
బతుకమ్మ పండుగ కోసం సర్కారు కేటాయింపు
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ సర్కారు అధికారికంగా ని ర్వహించనున్న బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జిల్లాకు రూ.కోటి రానున్నాయి. శుక్రవారం ఈ పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ శనివారమే కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిధులు కేటాయించారు. ఈ నిధులతో ఈనెల 24 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు వేడుకలు నిర్వహిస్తారు. బతుకమ్మ ఆడే చెరువుల వద్ద మరమ్మతు, రోడ్లు వేయడంపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్కారు ఆదేశించింది. విద్యు త్ దీపాల ఏర్పాటు, తదితర బాధ్యతలను సర్పంచ్, ఎంపీడీవోలకు అప్పజెప్పనున్నారు.