One crore rupees
-
టీటీడీకి కోటి విరాళం
తిరుమల: టీటీడీకి ఆదివారం భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన వడ్లమూడి సరోజినీ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. వివరాల ప్రకారం.. తన భర్త వడ్లమూడి రమేష్ బాబు జ్ఞాపకార్థం టీటీడీ ఆరోగ్యశ్రీ వరప్రసాదిని పథకానికి హైదరాబాద్‌కు చెందిన వడ్లమూడి సరోజినీ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. విరాళం డీడీని దాతల కార్యాలయంలో ఆదివారం ఆమె అందజేశారు. -
చల్మెడ చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు
-
మునుగోడు పోరు: కారులో ‘కోటి’ స్వాధీనం.. ఎవరిది ఆ డబ్బు?
సాక్షి,నల్గొండ: ఉప ఎన్నిక సమీపిస్తున్నకొద్దీ మునుగోడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ప్రలోభా పెట్టడానికి పార్టీ నేతలు భారీ నగదు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మునుగోడు మండలం చల్మెడ చెక్‌పోస్టు వద్ద పోలీసులు సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీలో భాగంగా నంబర్ ప్లేట్లోని టాటా సఫారీ కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి వాహనంగా గుర్తించారు. కారులో దొరికిన నగదు బీజేపీ నేతకు చెందినదిగా పోలీసులు తెలిపారు. కరీంనగర్ 13 డివిజన్ కార్పొరేటర్ భర్త సొప్పరి వేణు..డబ్బును విజయవాడ నుంచి మునుగోడుకి తరలిస్తుండగా పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన డబ్బుపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. చదవండి: మళ్లీ మొదటికొచ్చిన పీసీసీ సమస్య.. స్లాట్ బుకింగ్‌కే 3 వారాలు -
వైఎస్సార్సీపీ కార్యాలయానికి రూ.కోటి విరాళం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో నూతనంగా నిర్మించనున్న వైఎస్సార్సీపీ కార్యాలయానికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రూ.కోటి విరాళం ప్రకటించారు. వైఎస్సార్సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం మధురవాడ లా కాలేజీ రోడ్డులోని పనోరమ హిల్స్ పక్కన రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం జీవో విడుదల చేయడం తెలిసిందే. ఈ జీవో కాపీని మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యాలయంలో ఉమ్మడి విశాఖ వైఎస్సార్సీపీ రీజినల్ కోర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ విశాఖ కార్యనిర్వాహక రాజధాని కానున్న నేపథ్యంలో పార్టీ జిల్లా కార్యాలయాన్ని అత్యాధునిక డిజైన్లతో నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. చదవండి: (Visakhapatnam: ఇన్ఫోసిస్ @ వైజాగ్!) -
ఎద్దు వయసు మూడున్నరేళ్లు.. విలువ రూ. కోటి!
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): ఒక ఎద్దు విలువ రూ.కోటి, మేక విలువ రూ.7 లక్షలు. బెంగళూరు జీకేవీకే అవరణలో శుక్రవారం ప్రారంభమైన వ్యవసాయ మేళాలో వీటిని రైతులు ప్రదర్శనకు ఉంచారు. మండ్య జిల్లా మళవళ్లికి చెందిన రైతు బోరేగౌడ వ్యవసాయ ప్రదర్శనకు తను పోషిస్తున్న ఈ ఎద్దును ప్రదర్శనకు తీసుకొచ్చారు. దీని వయస్సు మూడున్నర సంవత్సరాలు. దీని వీర్యాన్ని వారానికి ఒక రోజు సేకరిస్తారు. ఒక డోస్‌ను రూ.వెయ్యితో విక్రయిస్తున్నట్లు రైతు తెలిపారు. ఇక దక్షిణ ఆఫ్రికాలోని బోయర్ జాతికి చెందిన మేకపోతును తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లికి చెందిన జితిన్ ఆగ్రో ఫారం యజమాని వెంకటేశ్ ప్రదర్శనలో ఉంచారు. పూణె నుంచి తెప్పించిన ఈ మేకపోతు 70 కేజీల బరువు ఉంది. 135–140 కేజీల వరకు వృద్ధి చెందుతుంది. ఈ మేకపోతును సంతానోత్సత్తికి ఉపయోగిస్తారు. -
‘శ్రీశైలం’ బాధితులకు రూ.కోటి సాయం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలోని తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డీఈ కుటుంబానికి రూ.50 లక్షలు, మిగతా ఉద్యోగులకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. దీనికి అదనంగా ఒక్కో కుటుంబానికి రూ.75 లక్షల చొప్పున జెన్కో సాయం అందిస్తుందని తెలిపారు. దీంతో డీఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందుతుందని ప్రభాకర్‌రావు వెల్లడించారు. అలాగే మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి విద్యుత్ సంస్థల్లో ఉద్యోగమివ్వాలని నిర్ణయించామని తెలిపారు. విద్యార్హతలను బట్టి డీఈ, ఏఈల కుటుంబాలకు ఏఈ/పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఇతరులకు జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇతర శాఖాపరమైన సాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు వెల్లడించారు. ప్రభాకర్‌రావు అధ్యక్షతన శనివారం విద్యుత్ సౌధలో జెన్కో బోర్డు సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు. శ్రీశైలం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ‘ప్రమాదంలో మన తోటి ఉద్యోగులు మరణించడం అత్యంత దురదృష్టకరమైన విషయం. మరణించిన వారిది గొప్ప సాహసం, త్యాగం. వారిని మళ్లీ తీసుకురాలేం. కానీ మానవ మాత్రులుగా సాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ ఘట నను ప్రత్యేక అంశంగా పరిగణించి ప్రభుత్వ సాయంతో పాటు జెన్కో తరఫున అదనపు సాయం అందించాలని భావిస్తున్నాం’అని ప్రభాకర్ రావు సమావేశంలో ప్రకటించగా, బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్యుదుత్పత్తి పునఃప్రారంభానికి కమిటీ.. ప్రమాదానికి గురైన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభాకర్‌రావు నియమించారు. జెన్కో హైడల్, సివిల్ డైరెక్టర్లు, శ్రీశైలం ప్రాజెక్టు సీఈలు ఇందులో సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం ప్లాంటులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడంతో పాటు, అక్కడికక్కడే అవసరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. వీలైనంత త్వరగా ప్లాంటును పునరుద్ధరించే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుంది. -
చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది
కోల్‌కతా: అదృష్టవంతుడిని ఎవ్వరూ చెడగొట్టలేరు దురదృష్టవంతున్ని ఎవరూ బాగుచేయలేరు అనే మాట మరోమారు నిజమైంది. లాటరీ టికెట్ కొని ఎవరో ఏదో అన్నారని దాన్ని చెత్తబుట్టలో పడేసిన లాటరీ టికెట్‌కు రూ.కోటి రూపాయలు ప్రైజ్ మనీ వచ్చింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాకు చెందిన వ్యాపారి తలదిక్ దమ్‌దమ్ ప్రాంతంలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. యధాప్రకారం ఒక రోజు నాగాలాండ్ లాటరీ టికెట్లు కొన్నాడు. ఆ సమయంలో షాపు వద్ద ఉన్న తెలిసినవారు నువ్వు ఎన్నిసార్లు లాటరీ టికెట్లను కొన్నా.. డబ్బులు వృథా కావాల్సిందే కానీ, నీకు లాటరీ తగలడం భ్రమే అంటూ ఎగతాళి చేశారు. చదవండి: కోడి కూరతో పాటు నువ్వూ కావాలన్న తహసీల్దార్ ఆవేదనతో అక్కడ నుంచి ఇంటికి వెళ్లిన సాదిక్ ఆ టికెట్లను చెత్తబుట్టలో పడేశాడు. తరువాత వాటి సంగతి మరచిపోయాడు. ఇక ఎప్పటిలానే తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే సాదిక్‌కు లాటరీ టికెట్లు అమ్మిన వ్యక్తి కనిపించి, నీకు కోటి రూపాయలు లాటరీ తగిలిందని చెప్పడంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతనికి ఆ టికెట్లను చెత్తబుట్టలో పడేసిన ఘటన గుర్తుకొచ్చి.. భార్య అమీనాకు ఫోన్ చేసి చెత్తబుట్టలో పడేసిన లాటరీ టిక్కెట్లు ఉన్నాయేమో వెతకమని చెప్పాడు. ఆమె లాటరీ టికెట్ల కోసం చెత్త బుట్టలో చూడగా అవి దొరికాయి. సాదిక్ కొన్న మొత్తం ఐదు టిక్కెట్లలో ఒక టికెట్‌కు కోటి రూపాయలు దక్కగా, మిగిలిన నాలుగు టికెట్లకు లక్ష రూపాయల చొప్పున బహుమతి లభించింది. ఈ సందర్భంగా అమీనా మాట్లాడుతూ లాటరీలో వచ్చిన మొత్తంతో తమ జీవితం మారిపోతుందని ఇప్పటి వరకూ ఎన్నో కష్టాలు చూశాం. ఇక నా కొడును మంచి స్కూల్లో చదివిస్తాం అంటూ సంతోషపడిపోతోంది. -
నగదు పరిమితి @ రూ.కోటి!
అహ్మదాబాద్: ప్రజలు గరిష్టంగా రూ.కోటి వరకూ నగదును కలిగిఉండేలా నిబంధనల్ని సవరించాలని జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ పరిమితిని దాటి నగదు కలిగిఉంటే మొత్తం డబ్బుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించింది. ప్రజలు గరిష్టంగా కలిగిఉండే నగదు పరిమితిని తొలుత రూ.15 లక్షలు, ఆ తర్వాత రూ.20 లక్షలకు పెంచాలని కొన్నిరోజుల క్రితం కేంద్రానికి సిట్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై జస్టిస్ షా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలు గరిష్టంగా రూ.కోటి మేర నగదును ఉంచుకునేలా నిబంధనల్ని సవరించాలని సిఫార్సు చేశాం. ఈ పరిమితిని మించి నగదు దొరికితే మొత్తం డబ్బుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించాం’ అని చెప్పారు. ఇటీవల తమిళనాడులోని ఓ సంస్థలో ఐటీ దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం దొరకడంపై స్పందిస్తూ.. ‘అధికారులు దాడుల్లో స్వాధీనం చేసుకుంటున్న నగదును చూడండి రూ.160 కోట్లు.. 177 కోట్లు. దీనిబట్టి రూ.20 లక్షల నగదు పరిమితి ప్రయోజనకరం కాదని అర్థమవుతోంది’ అని వ్యాఖ్యానించారు. 2014లో నల్లధనం కట్టడికి సుప్రీంకోర్టు ఆదేశాలతో జస్టిస్ ఎంబీ షా(రిటైర్డ్) నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. -
నమ్మించి.. నట్టేటముంచి
శ్రీకాకుళం రూరల్ : వారంతా రోజువారీ కూలీలే. కష్టాన్ని నమ్ముకున్న నిరుపేదలే. దాచుకున్న సొమ్ముంతా ఊళ్లో ఉన్న నమ్మకస్తుడి చేతుల్లో పెట్టారు. మూడుంతలు చేసి ఇస్తామంటూ మాయమాటలు చెప్పి అందరినీ నమ్మించాడు. రూ.కోట్ల కొద్దీ కలెక్షన్లు రావడంతో కొద్దిరోజులకే మకాం మార్చేయడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. అధికారపార్టీ నేత సాయంతో విశాఖలో తలదాచుకున్న మాయగాడిని పట్టుకుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు ఆదివారం తీసుకొచ్చారు. మండలంలోని కిష్టప్పపేట గ్రామానికి చెందిన కొర్ను రాజు తాపీమేస్త్రీగా చేసేవాడు. ఆయన వద్ద పనికి వచ్చే వారికి ‘పది రూపాయలు పెట్టుబడి పెట్టండి. దానికి మూడింతలు ఇస్తా’ అంటూ నమ్మబలికాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చీటిపాటలతో గ్రామస్తులందరినీ నమ్మించాడు. మూడు నెలల వరకూ సజావుగానే ఈ చీటీపాట నిర్వహించాడు. ఒకటి మూడు రెట్లు ఇస్తానని అందరికీ చెప్పడంతో స్థానికులేగాక చుట్టుపక్కల గ్రామాలైన కిష్టప్పపేట, మామిడివలస, సింగుపురం, బైరి గ్రామస్తులు కూడా తమ వద్ద ఉన్న డబ్బులను రాజు చేతిల్లో ఫిక్స్డ్ డిపాజిట్లా పెట్టేశారు. ఇలా 100 నుంచి 150 మంది వద్ద నుంచి సుమారు రూ.కోటి వసూలు చేసి.. ఏడాది క్రితం పరారయ్యాడు. బ్యాంకులకు టోకరా చదువు లేకపోయినా తనకున్న తెలివితేటలతో బ్యాంకులకే టోకరా వేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. 50 సెంట్లు భూమిని బ్యాంకుకు పద్దుపెట్టి రూ.లక్షల్లో లోను తీసుకున్నాడు. దీనిని కట్టేందుకు బ్యాంకు అధికారులకు చుక్కలు చూపించినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు ఆయన ఇంటిని వేలం వేయడంతో ఆ భూమిని మూడో వ్యక్తికి అమ్మి బ్యాంకు లోను కట్టినట్లు సమాచారం. దీంతో పాటు గ్రామంలోని మిగిలిన ఆస్తిపాస్తులు అమ్మి ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్నాడు. మాటువేసి పట్టుకున్న గ్రామస్తులు తన దగ్గర బంధువుతో విజయవాడలోని ఓ కనస్ట్రక్షన్ బిల్డింగ్ పనిలో రాజు తాపిమేస్త్రీగా చేరాడు. తరచూ భార్యతో ఫోన్లో మాట్లాడేవాడు. కిష్టప్పపేట గ్రామస్తులంతా వెళ్లి రాజు ఆచూకీ అడిగినా.. భార్య తెలీదంటూ సమాధానం చెప్పేదని బాధితులు తెలిపారు. ఒక దశలో వ్యక్తిగత పని మీద భార్య స్వస్థలమైన ఎచ్చెర్ల వచ్చేందుకు రాజు విజయవాడ నుంచి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న కిష్టప్పపేట గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ముందస్తుగా మాటువేసి రెండు రోజులు క్రితం పట్టుకుని రూరల్ పోలీసులకు అప్పగించారు. మాటమాటకో మార్పు ఈ విషయం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. దీంతో బాధితులందరూ పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గంటగంటకో మాట చెబుతున్నట్లు సమాచారం. ఒకసారి స్టాక్ మార్కెట్లో పెట్టానని.. ఇంకోసారి విశాఖలోని ఓ వ్యక్తి వద్ద రూ.25లక్షలు వడ్డీకి ఇచ్చానని పొంతలేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. కొడుకు చదువు కోసం డబ్బులు దాచాను నా కొడుకు చదువు నిమిత్తం రూ.90వేలు దాచిపెట్టా. గ్రామంలో అందరి ముందు నమ్మకంతో ఉండేవాడు. ఎక్కడికీ వెళ్లిపోడన్న ఆశతో ఆయన దగ్గరే దాచాను. ఇలా ముంచేస్తాడనుకోలేదు. – గుండ సూర్యనారాయణ, కిష్టప్పపేట కష్టమంతా చేతిలో పెట్టాను కష్టపడిన సొమ్మంతా తాపీమేస్త్రి చేతిలో పెట్డా. ఆయన చెప్పిన మాటలే నమ్మాను. సుమారు రూ.లక్ష 50వేలు చిన్న కూతురి పెళ్లి కోసం దాచి పెట్టాను. ఇలా మోసం చేస్తాడనుకోలేదు. – కొరికాన మల్లమ్మ, కిష్టప్పపేట అన్నింటిలోను మోసపోతున్నాం మొన్న అగ్రిగోల్డ్‌లో లక్షలు కట్టి మోసపోయాం. ఇప్పుడు నమ్మకమైన వ్యక్తి చేతిలో పెట్టి మరింత అన్యాయానికి గురయ్యాం. పైసాపైసా కూడబెట్టి ఊళ్లో వ్యక్తి చేతిలో పెడితే ఇంత మోసం చేస్తాడనుకోలేదు. కూలీనాలీ చేసుకొని దాచుకున్న రూ.1.50లక్షలు కాజేశాడు. – అరసవల్లి ఏకాసి, గ్రామస్తురాలు -
రూ.కోటికి టోపీ
రంగురాళ్లలో ‘త్రీస్టార్’ తపస్సికొండను తవ్వేశారు ఆ కొండ తవ్వకానికి ఓ పోలీసు అధికారి భరోసా రూ.10 లక్షల డీల్ మధ్యవర్తిగా టీడీపీ సానుభూతి పరుడైన ఓ ఉపాధ్యాయుడు సాక్షి ప్రతినిధి, కాకినాడ : మన్యంలో సహజ వనరులను కొల్లగొడుతున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన పోలీసు అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై లక్షలు ముడుపులు మెక్కి మిన్నకుండిపోతున్నారు. రంపచోడవరం ఏజెన్సీలో అడ్డతీగల మండలం దుప్పిలపాలెం సమీపాన తపస్సు కొండ రిజర్వ్ ఫారెస్టులో రంగురాళ్ల క్వారీలో మూడుపువ్వులు ఆరుకాయలుగా తవ్వకాలు పూర్తిచేశారు. ఈ రంగురాళ్ల క్వారీని ఎప్పుడో మూసేశారు. అటువంటి క్వారీ తవ్వకానికి ఒక పోలీసు ఇన్స్పెక్టర్ అనుమతి ఇచ్చారు. పది రోజులపాటు రంగురాళ్లు తవ్వుకునేందుకు రోజుకు లక్ష వంతున రూ.10 లక్షలకు రంగురాళ్ల వ్యాపారులకు, పోలీసు అధికారికి మధ్య ‘డీల్’ కుదిరింది. ఆ అధికారి ఇచ్చిన అనుమతితో ఎనిమిది మంది రంగురాళ్ల వ్యాపారులు గిరిజనులను వినియోగించుకుని ఆ పది రోజులు మస్తుగా కొండను తవ్వేశారు. ఆ 10 రోజుల్లో సుమారు రూ.కోటి విలువైన వ్యాపారం చేశారని అంచనా. ఆ పోలీసు అధికారిపై విచారణ జరిగినా... ఈ రంగురాళ్ల క్వారీలో కొండలు కూలిపోయి పలు సందర్భాల్లో గిరిజనులు దుర్మరణంపాలైన ఘటనలున్నాయి. ఆ కారణంగానే ఆ క్వారీని మూసేశారు. అటువంటి క్వారీకి దొడ్డిదారిన తవ్వుకునేందుకు అనుమతించి లక్షలు వెనకేసుకున్నారని ఇన్స్పెక్టర్పై గతంలో పలు ఫిర్యాదులు ఏలూరు రేంజ్ డీఐజీ దృష్టికి వెళ్లడం విచారణకు ఆదేశించడం తెలిసిందే. ఆ విచారణను కొనసాగనివ్వకుండా మేనేజ్ చేసుకోగలిగారు. ఇప్పుడు మరోసారి అదే పంధాలో రంగురాళ్ల వ్యాపారానికి తెరతీశారని గిరిజనం కోడై కూస్తోంది. ఆ పోలీసు అధికారి, రంగురాళ్ల వ్యాపారులకు మధ్యవర్తిగా అడ్డతీగల మండలంలో టీడీపీ సానుభూతిపరుడైన ఉపాధ్యాయుడు వ్యవహరించడం ఇక్కడ విశేషం. రిమ్మలపాలెం సహా పలు గ్రామాల్లో సుమారు 16 మంది రంగురాళ్ల వ్యాపారులున్నారు. వారిలో ఎనిమిది మందికి మాత్రమే ఆ ఇన్స్పెక్టర్ అనుమతించగా గుట్టుచప్పుడుకాకుండా తపస్సుకొండ క్వారీలో రంగురాళ్లను తవ్వేసుకున్నారు. సబ్ఇన్స్పెక్టర్ స్థాయి పోలీసు అధికారి విచారించేందుకు సన్నద్ధమవగా కేసులొద్దని లక్షలు మూటగట్టుకున్న అధికారి ఒత్తిడి తెచ్చి మోకాలడ్డారని జిల్లా కేంద్రానికి అందిన సమాచారం ప్రకారం తెలిసింది. దొంగలు దొరికినా తర్జన భర్జనలే... అయినప్పటికీ ఇటీవల దుశ్చర్తి గ్రామానికి చెందిన పలువురిని అడ్డతీగల ఎస్ఐ, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులు పెట్టాలా? వద్దా అనే విషయంలో పోలీసులు తర్జనభర్జనలుపడ్డారు. పై అ«ధికారితో అన్నీ మాట్లాడానని ఉపాధ్యాయుడు చెప్పడంతో తాము రంగురాళ్లు తవ్వామని దుశ్చర్తికి చెందిన వారు విచారణలో వివరించారని పోలీసు వర్గాల విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారం లో 11 మందిని నిందితులుగా గుర్తించి వారిలో ఏడుగుర్ని మాత్రమే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆ 11 మందిలో ఇన్స్పెక్టర్, వ్యాపారులకు మధ్య డీల్ కుదిర్చిన ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడని సమాచారం. అనుమతించిన వ్యాపారాలతో లింకులున్న మరో ముగ్గురు నిందితులను కేసు నుంచి తప్పించేందుకు పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయి. అదుపులోకి తీసుకున్న ఉపాధ్యాయుడిపై కేసు నమోదుచేస్తే ఉద్యోగంపోతుందని సం బంధిత ఇన్స్పెక్టర్ అధికార పార్టీ నేతల తో ఒత్తిడి తెచ్చి కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అందుకే విచారణలో గుర్తిం చిన 11మందిపైనా కేసులు పెట్టి అరెస్టులు చేసేందుకు తటపటాయిస్తున్నారు. వాస్తవమే... ఈ విషయమై అడ్డతీగల ఎస్సై తూపాటి రామకృష్ణను గురువారం సంప్రదించగా తపస్సుకొండ రంగురాళ్లు క్వారీలో తవ్వకాల వ్యవహారంలో ఏడుగురిపై కేసు నమోదుచేసిన మాట వాస్తవమేనన్నారు. మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయుడు విషయమై ప్రశ్నించగా ఆ విషయం కూడా విచారిస్తున్నామన్నారు. -
కోటి రూపాయల స్కాలర్షిప్
కాన్పూర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో కాన్పూర్ ఐఐటి విద్యార్థికి చోటు లభించింది. ఎంఐటీలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించేందుకు కాన్పూర్‌కి చెందిన ఓ 17 ఏళ్ల విద్యార్థి టోఫెల్ ప్రవేశపరీక్ష లోఅగ్రగణ్యుడిగా నిలిచి కోటి రూపాయల ఉపకారవేతనాన్ని గెలుచుకున్నాడు. కాన్పూర్ కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్నఆయూష్ శర్మ ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఎంఐటీ లో సీటు సంపాదించడం తన కల అనీ, దేశనుంచి సెలక్టైన ముగ్గురిలో ఒకడిగా ఉండటం సంతోషంగా ఉందంటున్నాడు ఆయుష్. కాగా ఆయుష్ శర్మ తండ్రి ప్రజా పనుల విభాగంలో ఓ మెకానిక్ గా పనిచేస్తుండగా తల్లి సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పదవీ విరమణ చేశారు. -
రామానాయుడు స్టూడియోలో భారీ చోరీ
హైదరాబాద్: హైదరాబాద్ ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియోలో ఖరీదైన సెట్టింగ్ లైట్లు చోరీకి గురయ్యాయి. స్టూడియోలో సినిమా షూటింగ్ కోసం వినియోగించే ఈ లైట్లు కొద్ది రోజులుగా కనబడటం లేదు. నిర్వాహకులు ఆరా తీయగా చోరీకి గురైనట్లు తెలిసింది. దీంతో వారు స్టూడియో మేనేజర్ శ్రీనుతో పాటు మరో పదిమందిపై అనుమానం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీనుతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చోరీ అయిన లైట్ల విలువ భారీగా ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిర్వాహకులు తెలిపారు. -
బతుకమ్మ పండుగ కోసం జిల్లాకు కోటి
బతుకమ్మ పండుగ కోసం సర్కారు కేటాయింపు సాక్షి, మంచిర్యాల : తెలంగాణ సర్కారు అధికారికంగా ని ర్వహించనున్న బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జిల్లాకు రూ.కోటి రానున్నాయి. శుక్రవారం ఈ పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ శనివారమే కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిధులు కేటాయించారు. ఈ నిధులతో ఈనెల 24 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు వేడుకలు నిర్వహిస్తారు. బతుకమ్మ ఆడే చెరువుల వద్ద మరమ్మతు, రోడ్లు వేయడంపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్కారు ఆదేశించింది. విద్యు త్ దీపాల ఏర్పాటు, తదితర బాధ్యతలను సర్పంచ్, ఎంపీడీవోలకు అప్పజెప్పనున్నారు. -
నష్టాలు రాష్ట్రానికి - గ్యాస్‌లో మాత్రం వాటాలేదు : వైఎస్ జగన్
నగరం: గ్యాస్ ఉత్పత్తిలో, పంపిణీలో ఏదైనా పొరపాటు జరిగితే అన్నిరకాలుగా రాష్ట్రానికి నష్టం వస్తుందని, గ్యాస్‌లో వాటా మాత్రం మన రాష్ట్రానికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ పేలిన ప్రదేశాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ ప్రాంతానికి మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గ్యాస్ ప్రమాదాలన్నీ రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు. అయితే ఈ ప్రాంత మనుషుల జీవితాలకు, పర్యావరణానికి భద్రతలేదన్నారు. ఈ ప్రాంతంలో ఈ రకమైన ప్రమాదం జరగడం ఇదే మొదటి సారి కాదని చెప్పారు. గతంలో ఎన్నో జరిగాయని తెలిపారు. లీకేజీపై ఏడాదిగా ఫిర్యాదు చేస్తున్నట్లు స్థానికులు చెప్పారన్నారు. గ్యాస్ లీకైనప్పడు అప్పటికప్పుడు కాస్త తవ్వి సిమెంట్ వేసి వదిలేస్తున్నారని తెలిపారు. గ్యాస్ లీకవుతుంటే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే ఈ ప్రమాదం జరిగిందన్నారు. సింగరేణి కాలరీస్‌లో ఉత్పత్తి అయ్యే బొగ్గులో రాష్ట్రానికి 50 శాతం వాటా, కేంద్రానికి 50 శాతం వాటా అని వివరించారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి వాటాలేదన్నారు. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తిలో మాత్రం మన రాష్ట్రానికి వాటా లేదని చెప్పారు. బొగ్గుపై సింగరేణి ఇస్తున్నట్లే, గ్యాస్‌పైనా 50 శాతం రాయల్టీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలన్నారు. పైసా ఆదాయం రాని సంస్థల కోసం ప్రమాదాల బారిన పడుతున్నామన్నారు. మనుషులు సజీవ దహనమయ్యారు, ఇంతకన్నా దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. కేంద్రంను అడిగి గ్యాస్‌లో వాటా, ఆదాయంలో వాటా తీసుకోవాలని చంద్రబాబును జగన్ కోరారు. ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చనక్కాయలు వేసినట్లుగా మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తుందన్నారు. ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఓఎన్జిసి, గెయిల్, చంద్రబాబు ఆలోచించాలని కోరారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు విదేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అవే ప్రామాణాలు ఇక్కడా పాటించాలన్నారు. యాజమాన్యాలకు భయం కలిగేలా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. గ్యాస్ పంపిణీ స్టేషన్‌ను జనావాసాలకు దూరంగా తరలించాలని కోరారు. నష్టపోయిన కొబ్బరి రైతాంగానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన చెట్లను కొట్టివేసి కొత్త మొక్కలను నాటడానికి, అవి ఇంత ఎత్తున పెరగడానికి ఎకరానికి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వివరించారు. అందుకు తగ్గ సహాయం రైతులకు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై గెయిల్, ఓన్‌జీసీతోపాటు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా స్పందించాలని కోరారు. అనంతరం జగన్ అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ క్షతగాత్రులను పరామర్శించారు. -
ఆగస్టులో కేబీసీ 8 ప్రారంభం: అమితాబ్
అక్షరాలా కోటి రూపాయలను అందిస్తూ ఇప్పటివరకు ఏడు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమం ఎనిమిదో సీజన్ కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆగస్టు నెలలో ఈ కార్యక్రమ ప్రసారాలను ప్రారంభిస్తున్నట్టు బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలిపారు. 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కొత్త ముఖం ఆగస్టులో ప్రసారం అవుతుందని ఆయన తెలిపారు. 71 ఏళ్ల అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్, ఫేస్బుక్, ట్విట్టర్.. ఇలాంటి సామాజిక మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెబుతుంటారు. అలాగే ఈసారి కూడా ఈ విషయాన్ని ఆయన తన సామాజిక మీడియాతోనే చెప్పారు. ''ఇది కేబీసీ కొత్త ఆకారం. కేబీసీ కొత్త ముఖం ఆగస్టులో ప్రారంభం అవుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు అప్రతిహతంగా జరిగాయి. ఒక్క సీజన్ మాత్రం షారుక్‌ఖాన్ చేశారు'' అని ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. తానెంత పెద్ద నటుడైనా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ గేమ్షోకు వచ్చేవారిని ఆయన సాదరంగా ఆహ్వానిస్తూ వారిని ప్రోత్సహించి, అనేకమందిని ఇప్పటికి కోటీశ్వరులను చేశారు. ''ఇక్కడ కేవలం డబ్బులు మాత్రమే కాదు.. హృదయాలు కూడా గెలచుకుంటారు. ప్రతి ఒక్క పోటీదారు నా హృదయాన్ని గెలుచుకుని వెళ్తుంటారు.. మీ అందరికీ ప్రేమతో'' అంటూ అమితాబ్ పోస్ట్ చేశారు. సోనీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ షోను ప్రసారం చేయనుంది. కేబీసీ స్ఫూర్తితోనే తెలుగులో నాగార్జున హోస్ట్‌గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్‌షో ప్రస్తుతం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అందులో ఇప్పటివరకు అత్యధికంగా 12.50 లక్షలను మాత్రమే గెలుచుకోగలిగారు. -
చిరంజీవి బంపర్ ఆఫర్!
టాలీవుడ్‌ని మకుటంలేని మహారాజులా ఏలిన చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేసి బోల్తాపడ్డారు. ఆ సినీ సుప్రీం ఇప్పుడు మళ్లీ వెండితెరకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారు. రాజకీయాల ద్వారా పోయిన ప్రజాదరణను, సినిమాల ద్వారా ప్రేక్షకాదరణ రూపంలో మళ్లీ పొందాలని ఆయన ఆశిస్తున్నారు. ఇప్పుడు వీలైనంత త్వరగా తన 150వ చిత్రం ప్రారంభించాలన్న ఉత్సాహంతో చిరంజీవి ఉన్నారు. అత్యంత ప్రతాష్టాత్మకంగా, తన మెగా ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమా ఉండాలని ఆశిస్తున్నారు. అయితే ముందుగా అందుకు తగ్గ కథ కావాలి. ఆ ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి పలు కథలు విన్నారు. రీమేక్ కోసం పలు ఇతర భాష చిత్రాలు కూడా చూశారు. ఇప్పటివరకు ఆయనకు ఏ కథా నచ్చలేదు. అందుకని కథా రచయితలకు చిరంజీవి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. తన ఇమేజ్‌కు, తన 150 చిత్రం స్థాయికి తగిన అద్భుతమైన కథ అందిస్తే కోటి రూపాయల పారితోషికం ఇప్పిస్తానని ప్రకటించారట. చిరంజీవి 150వ సినిమాకు కథ అంటే మాటలుకాదు. ఆ చిత్రానికి కథ అందిస్తే ఎంతటి పేరు వస్తుందో అందరికీ తెలిసిందే. చిరుకు నచ్చే విధంగా, మెచ్చేవిధంగా కథను రాయడానికి రచయితలు పోటీపడుతున్నారు. కోటి రూపాయల బంపర్ ఆఫర్ ఎవరిని వరిస్తుందో!