
కోల్‌కతా: అదృష్టవంతుడిని ఎవ్వరూ చెడగొట్టలేరు దురదృష్టవంతున్ని ఎవరూ బాగుచేయలేరు అనే మాట మరోమారు నిజమైంది. లాటరీ టికెట్ కొని ఎవరో ఏదో అన్నారని దాన్ని చెత్తబుట్టలో పడేసిన లాటరీ టికెట్‌కు రూ.కోటి రూపాయలు ప్రైజ్ మనీ వచ్చింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాకు చెందిన వ్యాపారి తలదిక్ దమ్‌దమ్ ప్రాంతంలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. యధాప్రకారం ఒక రోజు నాగాలాండ్ లాటరీ టికెట్లు కొన్నాడు. ఆ సమయంలో షాపు వద్ద ఉన్న తెలిసినవారు నువ్వు ఎన్నిసార్లు లాటరీ టికెట్లను కొన్నా.. డబ్బులు వృథా కావాల్సిందే కానీ, నీకు లాటరీ తగలడం భ్రమే అంటూ ఎగతాళి చేశారు.
చదవండి: కోడి కూరతో పాటు నువ్వూ కావాలన్న తహసీల్దార్
ఆవేదనతో అక్కడ నుంచి ఇంటికి వెళ్లిన సాదిక్ ఆ టికెట్లను చెత్తబుట్టలో పడేశాడు. తరువాత వాటి సంగతి మరచిపోయాడు. ఇక ఎప్పటిలానే తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే సాదిక్‌కు లాటరీ టికెట్లు అమ్మిన వ్యక్తి కనిపించి, నీకు కోటి రూపాయలు లాటరీ తగిలిందని చెప్పడంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతనికి ఆ టికెట్లను చెత్తబుట్టలో పడేసిన ఘటన గుర్తుకొచ్చి.. భార్య అమీనాకు ఫోన్ చేసి చెత్తబుట్టలో పడేసిన లాటరీ టిక్కెట్లు ఉన్నాయేమో వెతకమని చెప్పాడు.
ఆమె లాటరీ టికెట్ల కోసం చెత్త బుట్టలో చూడగా అవి దొరికాయి. సాదిక్ కొన్న మొత్తం ఐదు టిక్కెట్లలో ఒక టికెట్‌కు కోటి రూపాయలు దక్కగా, మిగిలిన నాలుగు టికెట్లకు లక్ష రూపాయల చొప్పున బహుమతి లభించింది. ఈ సందర్భంగా అమీనా మాట్లాడుతూ లాటరీలో వచ్చిన మొత్తంతో తమ జీవితం మారిపోతుందని ఇప్పటి వరకూ ఎన్నో కష్టాలు చూశాం. ఇక నా కొడును మంచి స్కూల్లో చదివిస్తాం అంటూ సంతోషపడిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment