sadik
-
చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది
కోల్‌కతా: అదృష్టవంతుడిని ఎవ్వరూ చెడగొట్టలేరు దురదృష్టవంతున్ని ఎవరూ బాగుచేయలేరు అనే మాట మరోమారు నిజమైంది. లాటరీ టికెట్ కొని ఎవరో ఏదో అన్నారని దాన్ని చెత్తబుట్టలో పడేసిన లాటరీ టికెట్‌కు రూ.కోటి రూపాయలు ప్రైజ్ మనీ వచ్చింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాకు చెందిన వ్యాపారి తలదిక్ దమ్‌దమ్ ప్రాంతంలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. యధాప్రకారం ఒక రోజు నాగాలాండ్ లాటరీ టికెట్లు కొన్నాడు. ఆ సమయంలో షాపు వద్ద ఉన్న తెలిసినవారు నువ్వు ఎన్నిసార్లు లాటరీ టికెట్లను కొన్నా.. డబ్బులు వృథా కావాల్సిందే కానీ, నీకు లాటరీ తగలడం భ్రమే అంటూ ఎగతాళి చేశారు. చదవండి: కోడి కూరతో పాటు నువ్వూ కావాలన్న తహసీల్దార్ ఆవేదనతో అక్కడ నుంచి ఇంటికి వెళ్లిన సాదిక్ ఆ టికెట్లను చెత్తబుట్టలో పడేశాడు. తరువాత వాటి సంగతి మరచిపోయాడు. ఇక ఎప్పటిలానే తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే సాదిక్‌కు లాటరీ టికెట్లు అమ్మిన వ్యక్తి కనిపించి, నీకు కోటి రూపాయలు లాటరీ తగిలిందని చెప్పడంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతనికి ఆ టికెట్లను చెత్తబుట్టలో పడేసిన ఘటన గుర్తుకొచ్చి.. భార్య అమీనాకు ఫోన్ చేసి చెత్తబుట్టలో పడేసిన లాటరీ టిక్కెట్లు ఉన్నాయేమో వెతకమని చెప్పాడు. ఆమె లాటరీ టికెట్ల కోసం చెత్త బుట్టలో చూడగా అవి దొరికాయి. సాదిక్ కొన్న మొత్తం ఐదు టిక్కెట్లలో ఒక టికెట్‌కు కోటి రూపాయలు దక్కగా, మిగిలిన నాలుగు టికెట్లకు లక్ష రూపాయల చొప్పున బహుమతి లభించింది. ఈ సందర్భంగా అమీనా మాట్లాడుతూ లాటరీలో వచ్చిన మొత్తంతో తమ జీవితం మారిపోతుందని ఇప్పటి వరకూ ఎన్నో కష్టాలు చూశాం. ఇక నా కొడును మంచి స్కూల్లో చదివిస్తాం అంటూ సంతోషపడిపోతోంది. -
'విలాసాలకు భార్య అడ్డుగా ఉందని..
బంజారాహిల్స్ (హైదరాబాద్): తన విలాసాలకు అడ్డు వస్తున్న భార్యను అంతం చేయాలనుకున్నాడు. కానీ, చివరికి అతడే అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని కమాన్ ప్రాంతానికి చెందిన ఎండీ సాదిక్(68) అర్కిటెక్చర్గా పని చేస్తున్నాడు. 2013లో పాతబస్తీకి చెందిన నస్రీన్ మల్లికను రెండో వివాహం చేసుకున్నాడు. గత కొంత కాలం నుంచి భార్య కళ్ల ముందే పరాయి యువతులను ఇంటికి తీసుకువస్తూ శారీరక వాంఛలు తీర్చుకుంటున్నాడు. ప్రశ్నించిన భార్యను కొట్టడంతోపాటు చంపుతానని బెదిరించేవాడు. అంతేకాదు, రోజూ అన్నంలో, తాగే నీళ్లల్లో, కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు వేసి భార్యకు ఇచ్చేవాడు. ఆమె నిద్రమత్తులో ఉండగానే పరాయి స్త్రీలను ఇంటికి తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఓ యువతిని ఇంటికి తీసుకుని రాగా, భార్య నస్రీన్ అడ్డు చెప్పింది. దీంతో సాదిక్ కత్తితో నస్రీన్‌పై దాడికి పాల్పడ్డాడు. ఆమె భయంతో భర్తను బెడ్రూంలోకి నెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరిస్తుండగానే సాదిక్ కుప్పకూలిపోయాడు. అప్పటికే అతడు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. -
టీడీపీ కౌన్సిలర్ దారుణ హత్య
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. గురువారం సాయంత్రం గుర్తు తెలియని దుండగులు టీడీపీ కౌన్సిలర్ సాధిక్ ను వేటకొడవళ్లతో నరికారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సాధిక్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాసేపటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. సాధిక్ హత్య నేపథ్యంలో తాడిపత్రిలో బందోబస్తును పెంచారు. -
ఒక్కరోజు సీపీగా సాదిక్
-
చిన్ని... చిన్ని...ఆశ
-
ఒక్కరోజు పోలీస్ కమిషనర్ గా సాదిక్
-
ఒక్కరోజు సీపీగా సాదిక్
హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి చిరకాల కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ తీర్చింది. కరీంనగర్ జిల్లాకు చెందిన సాదిక్ (10) బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్ కావలన్నది అతడి కోరిక. మేక్ ఏ విష్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సాదిక్ కోరికను తీర్చింది. సాదిక్ బుధవారం ఉదయం తన ఇంటికి వచ్చిన బుగ్గకారులో కమిషనర్ కార్యాలయానికి వెళ్లాడు. ఈ బుల్లి కమిషనర్‌కు అక్కడ రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు సాదిక్‌కు గౌరవ వందనం చేసారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అతడిని సీపీ సీట్లో కూర్చొపెట్టారు.