బంజారాహిల్స్ (హైదరాబాద్): తన విలాసాలకు అడ్డు వస్తున్న భార్యను అంతం చేయాలనుకున్నాడు. కానీ, చివరికి అతడే అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని కమాన్ ప్రాంతానికి చెందిన ఎండీ సాదిక్(68) అర్కిటెక్చర్‌గా పని చేస్తున్నాడు. 2013లో పాతబస్తీకి చెందిన నస్రీన్ మల్లికను రెండో వివాహం చేసుకున్నాడు. గత కొంత కాలం నుంచి భార్య కళ్ల ముందే పరాయి యువతులను ఇంటికి తీసుకువస్తూ శారీరక వాంఛలు తీర్చుకుంటున్నాడు.
ప్రశ్నించిన భార్యను కొట్టడంతోపాటు చంపుతానని బెదిరించేవాడు. అంతేకాదు, రోజూ అన్నంలో, తాగే నీళ్లల్లో, కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు వేసి భార్యకు ఇచ్చేవాడు. ఆమె నిద్రమత్తులో ఉండగానే పరాయి స్త్రీలను ఇంటికి తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఓ యువతిని ఇంటికి తీసుకుని రాగా, భార్య నస్రీన్ అడ్డు చెప్పింది. దీంతో సాదిక్ కత్తితో నస్రీన్‌పై దాడికి పాల్పడ్డాడు. ఆమె భయంతో భర్తను బెడ్‌రూంలోకి నెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరిస్తుండగానే సాదిక్ కుప్పకూలిపోయాడు. అప్పటికే అతడు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
'విలాసాలకు భార్య అడ్డుగా ఉందని..
Published Tue, May 19 2015 4:57 PM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement
Advertisement