Viral Video Monsoon Romance Adorable Couple Rain Dance - Sakshi
Sakshi News home page

Viral Video: జోరువానలో ప్రేమజంట డాన్స్.. రొమాన్స్  

Published Sat, Jul 29 2023 6:48 PM | Last Updated on Sat, Jul 29 2023 7:01 PM

Viral Video Monsoon Romance Adorable Couple Mast Rain Dance - Sakshi

భోపాల్: రద్దీ రహదారిపై ఎవరి పనులు వారు చేసుకుంటుంటే ఒక లవ్ కపుల్ మాత్రం హాయిగా జోరువానలో తడుస్తూ రొమాంటిక్ గా డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై కామెంట్ల వెల్లువ వెల్లువెత్తింది.

వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. దైనందిన జీవితంలో దినవారి పనులు చేసుకునేవారికి, వ్యాపారస్తులకు, ఉద్యోగులకి, విద్యార్ధులకి ఇలా కొన్ని వర్గాల వారికి వర్షాలు పెద్ద అడ్డంకనే చెప్పాలి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడే అనిపిస్తుంది ప్రేమికులకు మాత్రమే వర్షాకాలం అనుకూలమని కవులు ఎందుకు చెప్పారోనని. 

భోపాల్‌లో హోరున వర్షం పడుతుండగా ప్రధాన రహదారి మీద ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డు మీద  దూసుకుపోతుంటే ఓ ప్రేమ జంట మాత్రం పరిసరాలను అసలేమాత్రం పట్టించుకోకుండా తన్మయత్వంతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని హాయిగా డాన్స్ చేస్తూ కనిపించారు. పరిసరాలు కూడా వీరి రొమాన్స్ ని పట్టించుకోకపోవడం విశేషం.  

వీరు డాన్స్ చేస్తుంటే వెనుక విక్కీ కౌశల్, సారా ఆలీ ఖాన్ కలిసి నటించిన "జరా హట్కే జరా బచ్కే" చిత్రంలోని తూ హై తో ముఝే పాట వినిపిస్తోంది. ఈ సన్నివేశాన్నివీడియో తీసి సొషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్లో దీనిపై కామెంట్ల రూపంలో విశేష స్పందన లభిస్తోంది.       

ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement