బస్.. ఆజ్‌కీ రాత్ హై జిందగీ.. కల్ హమ్ కహాన్.. తుమ్ కహాన్.. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. అందుకే సంతోషంగా గడపడమని చెప్తుండేవాళ్లు పెద్దలు. కానీ, సీను మారింది. మనుషులు ప్రాణాలు.. గాల్లో దీపంగా మారిపోయాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదుకాబట్టి.. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి తోడు..
కుప్పకూలి మరణిస్తున్న వార్తలు ఈమధ్య కాలంలో చాలా చూస్తున్నాం. అందులో వయసు తేడాలు కూడా ఉండడం లేదు మరి!. సీసీ టీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా-మెయిన్‌స్ట్రీమ్ మీడియా ఛానెల్స్ కారణంగా అందరికీ ఆ చావు క్షణాలను వీక్షించే స్థాయికి పరిస్థితి చేరింది. ఒకరకంగా ఇలాంటివి చూడడం అలవాటు అయిపోయింది జనాలకు.
కర్ణుడి చావుకి లక్ష కారణాల మళ్లే.. ఇలాంటి హఠాన్మరణాలపై కూడా పోస్ట్‌మార్టం అనేక రకాలుగా, రకరకాల వెర్షన్‌లుగా ఉంటోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సురేంద్ర కుమార్ దీక్షిత్ మరణం.. మరో చర్చకు తావిచ్చింది.
ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోతున్న ఉదంతాల్లో జిమ్ మరణాలతో పాటు డ్యాన్స్‌లవి కూడా ఉంటున్నాయి. వేడుకల్లో హుషారుగా చిందులేయడం కూడా ఒకరకంగా ప్రమాదమే అంటూ వాదిస్తున్న కొందరు.. సురేంద్ర మరణాన్ని అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ.. వైద్యులు, పరిశోధకుల దగ్గరే దీనికి సమాధానం లేకుండా పోయింది.
ఆల్ ఇండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా.. మార్చి 16వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అందులో హుషారుగా చిందులేస్తూ సందడి చేశారాయన. ఈక్రమంలోనే ఉన్నట్లుండి కుప్పకూలి మరణించాడు. అందుకు కార్డియాక్ అరెస్ట్ కారణమని చెప్పారు వైద్యులు. అన్నట్లు.. పైన రెడ్ కలర్‌లో పేర్కొన్న హిందీ లైన్లతో కూడిన పాటకే పాపం సురేంద్ర డ్యాన్స్ వేశారు. విధి విచిత్రం అంటే ఇదేనేమో!.
Bhopal: Officer dies of cardiac arrest while dancing at a function. #Bhopal #CardiacArrest pic.twitter.com/xgFW2XjqP6
— TIMES NOW (@TimesNow) March 20, 2023
Video Credits: టైమ్స్ నౌ సౌజన్యంతో..
Comments
Please login to add a commentAdd a comment