Man Caught With Girlfriend Tries To Escape Through Balcony - Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరికిపోయిన కూతురి బాయ్‌ఫ్రెండ్ 

Published Tue, Aug 15 2023 12:52 PM | Last Updated on Tue, Aug 15 2023 2:44 PM

Man Caught With Girlfriend Tries To Escape Through Balcony - Sakshi

Viral Video: బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేస్తుండగా తన తల్లిదండ్రులు ఒక్కసారిగా రావడంతో బిత్తరపోయిన ఓ యువతి ప్రియుడిని బాల్కనీ నుండి పారిపొమ్మని సలహా ఇచ్చింది. దాంతో గాల్లో తాడు పట్టుకుని వేలాడుతూ కిందకు దిగుతున్న ఆ ప్రియుడిని పట్టుకుని ఆమె తల్లి చీపురు తిరగేసి చితక్కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతొంది.    

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. దొంగచాటుగా తన గర్ల్‌ఫ్రెండ్ గదిలోకి దూరిన ఓ యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు  తన గర్ల్‌ఫ్రెండ్ మాత్రం తనని కాపాడేందుకు ప్రయత్నించి అతడి బట్టలను బాల్కనీ నుండి కిందకు విసిరేసింది. ఎలాగోలా తాడుని పట్టుకుని కిందకు జారుతున్న అతడిని కింది అంతస్తులో గర్ల్‌ఫ్రెండ్ తల్లి ఒక చీపురు పట్టుకుని చితక్కొట్టేసింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అప్లోడ్ చేసిన గంటల్లోనే మిలియన్ల వీక్షణలు వచ్చాయి. వీడియో చూస్తే ఎవ్వరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పాపం ప్రియుడు ఏ మాత్రం పట్టు తప్పినా అతడు కింద పడే లోపే ప్రాణాలు గాల్లోకి పోవడం ఖాయం.

ఇది కూడా చదవండి: రష్యాలో భారీ పేలుడు.. 12 మంది మృతి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement