హాలీవుడ్ సినీ చరిత్రలో దర్శకుడు-నటుడు ఉడీ అలెన్‌ది ప్రముఖ స్థానం. ముఖ్యంగా రొమాంటిక్ జానర్‌లో ఆయన తెరకెక్కించిన ‘అన్నీహాల్, మాన్ హాట్టన్, మిడ్‌నైట్ ఇన్ ప్యారిస్, టు రోమ్ విత్ లవ్, ఏ రెయినీ డే ఇన్ న్యూయార్క్’ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పలు రొమాంటిక్ చిత్రాలు తెరకెక్కించిన ఉడీ అలెన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘రొమాన్స్ ఆఫ్ ఫిల్మ్‌మేకింగ్ ఈజ్ గాన్’ అన్నారు.
ఇక సినిమాల పరంగా చేయడానికి ఏమీ లేదన్నట్లుగా మాట్లాడారు 88 ఏళ్ల ఉడీ. ఆయన తెరకెక్కించిన ‘కూప్ ది చాన్స్’ గత ఏడాది ఫ్రాన్స్‌లో విడుదలైంది. దర్శకుడిగా ఉడీకి ఇది 50వ చిత్రం. ఇదే చివరి చిత్రం అన్నట్లుగా పేర్కొన్నారు. ఈ చిత్రం రిలీజ్ నార్త్ అమెరికాలో లేట్ అయింది. ఆ ఇంటర్వ్యూలో ఉడీ అలెన్ మాట్లాడుతూ..‘నేనొక సినిమా చేశాక దాని గురించి పట్టించుకోను. డిస్ట్రిబ్యూషన్ అనేది నా పని కాదు. ఇప్పుడు పంపిణీ అంటే ఏ మూవీ అయినా రెండు వారాలే. ఒకప్పుడు నా ‘అన్నీహాల్’ సినిమా న్యూయార్క్ థియేటర్‌లో ఏడాది ఆడింది. ఒక థియేటర్‌లో 6,7 నెలలు ఆడాక వేరేవాళ్లు తీసుకునేవారు. అక్కడ కొన్ని నెలలాడేది. కానీ ఇప్పుడు సినిమా వ్యాపారం మారిపోయింది.ఈ మార్పు ఆకర్షనీయంగా లేదు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment