Woody Allen
-
ఇక సినిమాల్లో చేయడానికి ఏమీ లేదు: హాలీవుడ్ దర్శకుడు
హాలీవుడ్ సినీ చరిత్రలో దర్శకుడు-నటుడు ఉడీ అలెన్‌ది ప్రముఖ స్థానం. ముఖ్యంగా రొమాంటిక్ జానర్లో ఆయన తెరకెక్కించిన ‘అన్నీహాల్, మాన్ హాట్టన్, మిడ్నైట్ ఇన్ ప్యారిస్, టు రోమ్ విత్ లవ్, ఏ రెయినీ డే ఇన్ న్యూయార్క్’ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పలు రొమాంటిక్ చిత్రాలు తెరకెక్కించిన ఉడీ అలెన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘రొమాన్స్ ఆఫ్ ఫిల్మ్‌మేకింగ్ ఈజ్ గాన్’ అన్నారు. ఇక సినిమాల పరంగా చేయడానికి ఏమీ లేదన్నట్లుగా మాట్లాడారు 88 ఏళ్ల ఉడీ. ఆయన తెరకెక్కించిన ‘కూప్ ది చాన్స్’ గత ఏడాది ఫ్రాన్స్‌లో విడుదలైంది. దర్శకుడిగా ఉడీకి ఇది 50వ చిత్రం. ఇదే చివరి చిత్రం అన్నట్లుగా పేర్కొన్నారు. ఈ చిత్రం రిలీజ్ నార్త్ అమెరికాలో లేట్ అయింది. ఆ ఇంటర్వ్యూలో ఉడీ అలెన్ మాట్లాడుతూ..‘నేనొక సినిమా చేశాక దాని గురించి పట్టించుకోను. డిస్ట్రిబ్యూషన్ అనేది నా పని కాదు. ఇప్పుడు పంపిణీ అంటే ఏ మూవీ అయినా రెండు వారాలే. ఒకప్పుడు నా ‘అన్నీహాల్’ సినిమా న్యూయార్క్ థియేటర్లో ఏడాది ఆడింది. ఒక థియేటర్లో 6,7 నెలలు ఆడాక వేరేవాళ్లు తీసుకునేవారు. అక్కడ కొన్ని నెలలాడేది. కానీ ఇప్పుడు సినిమా వ్యాపారం మారిపోయింది.ఈ మార్పు ఆకర్షనీయంగా లేదు’ అన్నారు. -
ఆ డబ్బు నేను ఉంచుకోను!!
‘ఎ రెయినీ డే ఇన్ న్యూయార్క్’ అనే సినిమాలో రెబెక్కా హాల్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఉడీ అలెన్ ఈ సినిమాకు దర్శకుడు. సెప్టెంబర్‌లో మొదలైన ఈ సినిమా షూట్ ఇప్పటికే దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ టైమ్‌లో ‘‘ఈ సినిమాకు పనిచేసినందుకు సిగ్గుపడుతున్నా. ఈ సినిమాకు నాకొచ్చిన రెమ్యునరేషన్లో ఒక్క డాలర్ కూడా నేను ఉంచుకోను’’ అని చెప్పేసి ౖ‘టెమ్ ఈజ్ అప్’ అనే సంస్థకు ఆ డబ్బు డొనేట్ చేసింది రెబెక్కా. రెబెక్కా మాత్రమే కాదు, ఈ సినిమాకు పనిచేసిన స్టార్స్ అంతా జీవితంలో మళ్లీ ఉడీ అలెన్‌తో పనిచేయమని చెప్పేసి తమ రెమ్యునరేషన్‌ను టైమ్ ఈజ్ అప్ అనే సంస్థకు డొనేట్ చేశారు. అన్నీ బాగుంటే ‘ఎ రెయినీ డే ఇన్ న్యూయార్క్’ 2018లో వచ్చే క్రేజీ సినిమాల్లో ఒకటి కావాలి. కానీ అలా కావడం లేదు. కారణం ఉడీ అలెన్. నిజానికి ఉడీ అలెన్ సినిమాలంటే ఆయన వల్లే క్రేజ్ తెచ్చుకుంటాయి. అలాంటిది ఇప్పుడు ఆయన పేరే ఇందుకు నెగటివ్‌గా మారింది. కారణం అలెన్ కూతురే ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పడం. ఇప్పుడీ ఆరోపణల వల్లే గ్రేటెస్ట్ ఫిల్మ్‌మేకర్స్‌లో ఒకరనిపించుకున్న అలెన్ ఒక్కసారే ఇలాంటి స్థాయికి వచ్చి పడిపోయాడు. ఇదే సినిమాకు పనిచేసిన తిమోతి, సెలెనా గొమేజ్ కూడా అలెన్‌తో మళ్లీ పనిచేయమని చెప్పేశారు. మొత్తం మీద ఇప్పుడు ఈ సినిమా విడుదల వరకూ వెళుతుందా? అన్న ప్రశ్న కూడా వినబడుతోంది. -
అంతటి స్టార్ డైరెక్టర్ పనైపోయిందా?
ఎంతటి గొప్ప ఫిల్మ్మేకర్కైనా ఒక రోజు వస్తుంది. ఫేడ్ ఔట్ అయిపోయే రోజు అది. అయితే అది పరిస్థితులకు తగ్గట్టు సినిమాలు తీయలేకపోవడం వల్లనో, మేకింగ్‌లో పట్టు కోల్పోవడం వల్లనో కాకుండా, అప్పటివరకూ సంపాదించిన పేరును పోగొట్టే ఒక కారణం వల్ల అయితే? వినడానికే కష్టంగా ఉంది కదూ!? ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఊడీ అలెన్ పరిస్థితి అలాగే ఉందంటోంది హాలీవుడ్. అలెన్ హాలీవుడ్లో రొమాన్స్ జానర్లో పలు తిరుగులేని సినిమాలను అందించాడు. ఎప్పటికైనా చూసి తీరాల్సిందే అని చెప్పుకునే హాలీవుడ్ సినిమాల్లో ఎవ్వరు లిస్ట్ తీసినా అలెన్ సినిమాలు ఉంటాయి. అంతటి టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్. కొద్దికాలంగా ఆయన గొప్ప సినిమాలేవీ తీయలేదు. అయినా అలెన్ లాంటివాడు ఎప్పుడో ఒకప్పుడు అందరినీ కట్టిపడేసే సినిమా ఇస్తాడన్న నమ్మకం మాత్రం అందరికీ ఉంది. ఆ నమ్మకాన్ని ఇక కట్టకట్టేసి మూలన పడేసే పరిస్థితి కనిపిస్తోంది. అదేమంటే, అలెన్‌పై వచ్చిన ఆరోపణలు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అలెన్‌పై డైలన్ ఫారో చాలాకాలంగా ఆరోపణలు చేస్తోంది. అది ఇప్పుడే అలెన్‌ను దెబ్బతీసే దగ్గరకు వచ్చేస్తోంది. చిత్రమేంటంటే ఫారో.. అలెన్ దత్తత తీసుకొని పెంచుకున్న కూతురు. అలెన్‌పై కూతురే ఆరోపణలు చేయడంతో ఆయనను హాలీవుడ్ మెల్లిగా పక్కన పెట్టేస్తోంది. కొద్దికాలంగా అలెన్ ఒక పెద్ద బడ్జెట్ సినిమా తీయాలని స్టార్ హీరోయిన్లను సంప్రదిస్తున్నాడట. అయితే ఈ కేసు గొడవ చూసి, అలెన్‌ను కేర్ చేయడం మానేశారట హీరోయిన్స్. ఇక్కడే అలెన్ పతనం మొదలైందని హాలీవుడ్ భావిస్తోంది. 82 ఏళ్ల వయసున్న అలెన్, తనకున్న గొప్ప పేరును ఇలా పాడు చేసుకోవడం గొప్ప విషాదమే! -
20 ఏళ్ల తర్వాత ఆయనతో కేట్ వస్తోంది
లాస్ ఎంజెల్స్: హాలీవుడ్ ప్రముఖ నటి కేట్ విన్స్లెట్ తదుపరి సినిమా ఖరారైంది. ఆమె ప్రముఖ నటుడు, దర్శకుడు ఊడీ అలెన్(80) చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. అయిత, కథ, దర్శకత్వం, నిర్మాత ఊడీనే కావడం ఈ చిత్ర విశేషం. తన ఇరవయేళ్ల నట ప్రస్తానంలో ఒక్కసారి కూడా వూడీ తీసిన చిత్రాల్లోగానీ, ఆయన నటించిన సినిమాల్లోగానీ కనిపించలేదు కేట్. దీంతో ఈ సినిమాకు ఆమె చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నటించేందుకు కావాల్సిన చర్చలు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇంతకీ కథ ఏమిటన్న విషయంపై మాత్రం గోప్యం వహిస్తున్నారు. గతంలో నటించాలని భావించినా తనకు ఆ అవకాశం రాలేదని, తాజాగా అది రావడంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని కేట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తోందట. -
'హాలీవుడ్ దర్శకుడు వూడీ అలెన్ లైంగికంగా వేధించాడు'
పెంచుకున్న కూతురుపై ఓ హాలీవుడ్ దర్శకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన సభ్య వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన గోల్టెన్ గ్లోబ్ అవార్డుల్లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు దక్కించుకున్న వూడీ అలెన్ తనను ఏడేళ్ల వయసులోనే లైంగికంగా వేధించాడని పెంపుడు కూతురు డైలాన్ ఫారో వెల్లడించినట్టు ది న్యూయార్క్ టైమ్స్ ఆన్ ఎడిషన్ లో ఓపెన్ లెటర్ లో కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటన 90 దశక ఆరంభంలో తనపై లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆన్ లైన్ ఎడిషన్ కు రాసిన ఓపెన్ లెటర్ లో పేర్కొంది. తాను ఏడేళ్ల వయస్సులో ఉండగా తనను అలెన్ లైంగికంగా వేధించారని, ఈ విషయాన్ని తన పెంపుడు తల్లి, నటి మియా ఫారోకు తెలిపానని, కాని అప్పటికే తన పెంపుడు తల్లి అలెన్ తో వైవాహిక సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నారని లెటర్ లో ఫారో పేర్కోంది. 1993 లో ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఆయన కేసు విచారణకు రాకుండా అడ్డుకోవడంలో సఫలమయ్యారని 28 ఏళ్ల ఫారో అన్నారు. అలెన్ తనపై లైంగిక దాడులకు పాల్పడటంతో తన ఆరోగ్యం క్షీణించిందని, జీర్ణ సంబంధమైన సమస్యలు తలెత్తాయని..అంతేకాకుండా ఓ వ్యక్తితో రిలేషన్ కూడా దెబ్బతిందని తెలిపారు. ఆతర్వాత టెలివిజన్, పోస్టర్ లో అలెన్ ను చూస్తే భయమేస్తుందని ఆమె అన్నారు. అలెన్ వ్యవహారాన్ని హాలీవుడ్ నటులు కూడా పట్టించుకోలేదని ఆమె విమర్శించారు.