'హాలీవుడ్ దర్శకుడు వూడీ అలెన్ లైంగికంగా వేధించాడు'
పెంచుకున్న కూతురుపై ఓ హాలీవుడ్ దర్శకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన సభ్య వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన గోల్టెన్ గ్లోబ్ అవార్డుల్లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు దక్కించుకున్న వూడీ అలెన్ తనను ఏడేళ్ల వయసులోనే లైంగికంగా వేధించాడని పెంపుడు కూతురు డైలాన్ ఫారో వెల్లడించినట్టు ది న్యూయార్క్ టైమ్స్ ఆన్ ఎడిషన్ లో ఓపెన్ లెటర్ లో కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటన 90 దశక ఆరంభంలో తనపై లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆన్ లైన్ ఎడిషన్ కు రాసిన ఓపెన్ లెటర్ లో పేర్కొంది.
తాను ఏడేళ్ల వయస్సులో ఉండగా తనను అలెన్ లైంగికంగా వేధించారని, ఈ విషయాన్ని తన పెంపుడు తల్లి, నటి మియా ఫారోకు తెలిపానని, కాని అప్పటికే తన పెంపుడు తల్లి అలెన్ తో వైవాహిక సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నారని లెటర్ లో ఫారో పేర్కోంది. 1993 లో ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఆయన కేసు విచారణకు రాకుండా అడ్డుకోవడంలో సఫలమయ్యారని 28 ఏళ్ల ఫారో అన్నారు.
అలెన్ తనపై లైంగిక దాడులకు పాల్పడటంతో తన ఆరోగ్యం క్షీణించిందని, జీర్ణ సంబంధమైన సమస్యలు తలెత్తాయని..అంతేకాకుండా ఓ వ్యక్తితో రిలేషన్ కూడా దెబ్బతిందని తెలిపారు. ఆతర్వాత టెలివిజన్, పోస్టర్ లో అలెన్ ను చూస్తే భయమేస్తుందని ఆమె అన్నారు. అలెన్ వ్యవహారాన్ని హాలీవుడ్ నటులు కూడా పట్టించుకోలేదని ఆమె విమర్శించారు.