The New York Times
-
సాక్షి కార్టూన్(31-01-2022)
-
ట్రంప్ ఫేక్ న్యూస్ అవార్డులు.. విజేతలెవరో తెలుసా?
వాషింగ్టన్: ముందుగా వెల్లడించినట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఫేక్ న్యూస్ అవార్డులు’ ప్రకటించారు. ప్రముఖ దినపత్రిక ‘ద న్యూయార్క్ టైమ్స్’కు ఫేక్ న్యూస్ అవార్డు ప్రకటించారు. అలాగే, ఏబీసీ న్యూస్, సీఎన్ఎన్, టైమ్, ద వాషింగ్టన్ పోస్ట్ తదితర మీడియా సంస్థలను కూడా విజేతలుగా ప్రకటించారు. ఇలా ట్రంప్ తనదైన శైలిలో అవార్డులు ప్రకటిస్తూ.. ఆ వివరాలు జీవోపీ.కామ్‌లో పొందుపరిచారు. దీని గురించి ట్వీట్ చేసిన వెంటనే ఆ వెబ్సైట్ క్రాష్ అయింది. పాత్రికేయ రంగంలో తాను గౌరవించే ఎంతో గొప్పమంది జర్నలిస్టులు ఉన్నారు కానీ, మీడియా ఇప్పుడు అవినీతి, కపటబుద్ధితో కథనాలు రాస్తున్నదని ట్రంప్ మరో ట్వీట్లో మండిపడ్డారు. ‘2017లో పక్షపాతబుద్ధితో ఏమాత్రం పారదర్శకత లేకుండా అథమస్థాయిలో బూటకపు కథనాలు వెలువడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా 90శాతం ప్రతికూల కథనాలు వెలువడ్డాయి’అని జీవోపీ.కామ్ వెబ్సైట్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రాత్మక విజయం సందర్భంగా.. దేశ ఆర్థిక వ్యవస్థ ఇక కోలుకోలేదంటూ పాల్ క్రుగ్మన్ రాసిన కథనానికిగాను ’ద న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు ఫేక్ అవార్డుల్లో ప్రథమ బహుమతి ప్రకటించగా.. తప్పుడు కథనాలతో మార్కెట్‌ను దెబ్బతీసినందుకు ఏసీబీ న్యూస్‌కు (బ్రియాన్ రాస్ కథనానికి) దిత్వీయ బహుమతిని, వీకీలీక్స్ పత్రాల యాక్సెస్ ట్రంప్‌కు, ఆయన తనయుడికి ఉందంటూ కథనం ప్రసారంచేసినందుకు సీఎన్ఎన్కు తృతీయ బహుమతిని ట్రంప్ ప్రకటించారు. ఒవల్ కార్యాలయంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అర్ధవిగ్రహాన్ని తొలగించారని కథనం ప్రచురించినందుకు ‘టైమ్’ మ్యాగజీన్‌కు నాలుగో స్థానం కట్టబెట్టగా.. ఫ్లోరిడాలోని పెన్సాకోలాలో ట్రంప్ నిర్వహించిన భారీ ర్యాలీలో జనం లేరంటూ ప్రచురించిన ‘ద వాషింగ్టన్ పోస్ట్’కి చివరిస్థానం కేటాయించారు. తన హయాంలో మీడియా కపటబుద్ధితో వ్యవహరిస్తూ నిజాలను ప్రజలకు తెలియజేయడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ట్రంప్ ఇంటర్వ్యూ... అర్ధ గంటలో 24 తప్పులు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మీడియా మధ్య నడిచే కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రంప్ పాలన, విధానాలను ఎండగడుతూ అవి ప్రచురించే కథనాలు.. వాటిని ‘పచ్చి అబద్ధాలు’’గా పేర్కొంటూ ఆయన విరుచుకుపడటం చూస్తున్నదే. అయితే ఎట్టకేలకు మాత్రం ఆయన ది న్యూ యార్క్ టైమ్స్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. కానీ, అధ్యక్షులవారి ఇంటర్వ్యూను చదివేందుకు అమెరికన్లు అస్సలు సాహసించటం లేదు. అబద్ధాలు, తప్పుడు ప్రకటనలు, ఆరోపణలు, గందర గోళానికి గురి చేసే వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి రావటమే అందుకు కారణం. అర్ధ గంటపాటు సాగిన ఆ ఇంటర్వ్యూలో ఆయన 24 సమాధానాలు ఇస్తే అన్నీ అలాగే ఉన్నాయంట. ఈ కథనాన్ని వాషింగ్టన్ ప్రముఖంగా ప్రచురించగా.. ఇప్పుడు అది మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది. రష్యన్ గూఢాచర్యం దగ్గరి నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న సమస్యల దాకా అన్నింటిపైనా ఆయన సమాధానాలు సహేతుకంగా లేవు. హిల్లరీ క్లింటన్ ఎన్నికల ప్రచార మేనేజర్ జాన్ పొడెస్టా రష్యన్ కంపెనీతో కుమ్మక్కయ్యారని ఆరోపించగా.. సదరు కంపెనీ అమెరికాకు చెందినదే కావటం విశేషం. ఇక అధ్యక్ష ఎన్నికల సమయంలో మిచిగాన్, విస్కాన్సిన్లో హిల్లరీ ప్రచారమే నిర్వహించకపోయినా.. ఆమె ‘పాపులర్ ఓట్ల’ కోసం అడ్డదారి తొక్కిందంటూ నోరు జారారు. పశ్చిమ వర్జీనియా ఆర్థిక ప్రగతి గురించి కూడా ఆయన చెప్పిన లెక్కలన్నీ తప్పుగానే తేలాయి. మిడిల్ ఈస్ట్ దేశాలకు యూఎస్ఏ అందించిన ఆర్థిక సాయం విషయంలో కూడా ట్రంప్ అబద్ధాలే చెప్పుకొచ్చాడు. ఉత్తర కొరియా, కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తావనరాగా.. అది గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్య అని తప్పించుకునే యత్నం చేశాడు. మిత్ర దేశాలతో సహకారం విషయంపై అడిగిన ప్రశ్నకు కూడా ఆయన దారుణంగా తడబడ్డాడు. అన్నింటికి మించి కెనెడాతో ఆర్థిక లోటు విషయంలో చెప్పిన గణాంకాలను సుద్ధ తప్పు అని స్వయంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడెవూ చెప్పటంతో... ట్రంప్ ఇంటర్వ్యూ అంతా అస్తవ్యస్థంగా ఉందని.. ఏదో నామ మాత్రపు ఇంటర్వ్యూతో తప్పించుకునే యత్నం చేశారని డెమొక్రటిక్ పార్టీ విరుచుకుపడుతోంది. డిసెంబర్ 28న న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులు ట్రంప్‌ను ఇంటర్వ్యూ తీసుకున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. -
హిందూ రాజ్యంగా మార్చడానికే..
యూపీ సీఎంగా ఆదిత్యనాథ్ ఎంపికపై న్యూయార్క్ టైమ్స్ విమర్శలు న్యూయార్క్: యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ను నియమించడం పట్ల అమెరికా పత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ విస్మయం వ్యక్తం చేసింది. లౌకిక భారత్‌ను హిందూ దేశంగా మార్చివేయడంలో తమకు ఎదురులేదని బీజేపీ భావిస్తున్నట్లు ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోందని శుక్రవారం నాటి తన ఎడిటోరియల్ ‘హిందూ అతివాదులతో మోదీ ప్రమాదకర ఆలింగనం(మోదీస్ పెరిలస్ ఎంబ్రేస్ ఆఫ్ హిందూ ఎక్స్‌ట్రిమిస్ట్స్)’లో తీవ్రంగా విమర్శించింది. 2014 సాధారణ ఎన్నికల్లో గెలిచాక మోదీ ఓ వైపు హిందుత్వ అతివాదులను బుజ్జగిస్తూ, మరోవైపు ఆర్థిక వృద్ధి లాంటి లౌకిక లక్ష్యాలపై మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా వ్యవహరించారంది. ముస్లిం మైనారిటీలపై హింసను ఆయన బహిరంగంగా సమర్థించలేదని పేర్కొంది. అయితే యూపీ ఎన్నికల్లో ఘన విజయం తరువాత మోదీ అసలు రంగు బయటపడిందని, ఆ రాష్ట్రానికి సీఎంగా ఆదిత్యనాథ్‌ను ప్రకటించడం మైనారిటీలను షాక్‌కు గురిచేసే పరిణామమని వెల్లడించింది. ఆదిత్యనాథ్ ముస్లింలను దెయ్యాలుగా చూపుతూ రాజకీయంగా ఎదిగారని, 2015లో బీఫ్ తిన్నదన్న అనుమానంతో ఓ ముస్లిం కుటుంబంపై దాడి చేసిన హిందూ మూకలకు ఆయన మద్దతిచ్చారని తెలిపింది. యోగా చేసే సమయంలో సూర్య నమస్కారాలకు నిరాకరించిన ముస్లింలు సముద్రంలో మునగాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. అయితే, ఆదిత్యనాథ్ సీఎం కావడాన్ని విమర్శించడానికి న్యూయార్క్ టైమ్స్‌కు ఉన్న అవగాహన ఏపాటిదని భారత్ తిప్పికొట్టింది. -
ఆమెను 'సోకాల్డ్' అని ఎందుకన్నామంటే!
న్యూఢిల్లీ: భారత లెజండ్ సినీ గాయని లతా మంగేష్కర్‌ను ఉద్దేశించి 'సోకాల్డ్' ప్లేబ్యాక్ సింగర్ అంటూ కథనాన్ని ప్రచురించడంపై తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక వివరణ ఇచ్చింది. 'సోకాల్డ్' పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆ ప్రఖ్యాత గాయనిని కించపరిచే ఉద్దేశం తమకు లేదని చెప్పుకొచ్చింది. లత, సచిన్ టెండూల్కర్ లను ఉద్దేశించి వెకిలి హాస్యపు వీడియో పెట్టి కమెడియన్ తన్మయ్ భట్ దుమారం రేపిన సంగతి తెలసిందే. ఈ వివాదంపై కథనాన్ని రాస్తూ ఆమె ఒక అనామక గాయని అన్న తరహాలో 'సోకాల్డ్' అని పేర్కొంటూ అమెరికా దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. లతను అవమానపరిచేలా ఈ కథనం ఉండటంతో ట్విట్టర్లో ఆ పత్రిక తీరుపై భారతీయులు మండిపడ్డారు. 1943 నుంచి సినీ పాటలు పాడుతూ.. 13భాషల్లో మధురమైన గీతాలు ఆలాపించి.. భారత రత్న కీర్తిని పొందిన అంత గొప్ప గాయనిని ఇలా అనామక నేపథ్య గాయని అంటూ కథనాన్ని రాస్తారా? అని పలువురు మండిపడ్డారు. దీంతో న్యూయార్క్ టైమ్స్‌లో పనిచేస్తున్న భారతీయ రచయిత అసీమ్ ఛాబ్రా విమరణ ఇచ్చారు. తాము లతను అవమానపరచలేదని పేర్కొన్నారు. -
'హాలీవుడ్ దర్శకుడు వూడీ అలెన్ లైంగికంగా వేధించాడు'
పెంచుకున్న కూతురుపై ఓ హాలీవుడ్ దర్శకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన సభ్య వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన గోల్టెన్ గ్లోబ్ అవార్డుల్లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు దక్కించుకున్న వూడీ అలెన్ తనను ఏడేళ్ల వయసులోనే లైంగికంగా వేధించాడని పెంపుడు కూతురు డైలాన్ ఫారో వెల్లడించినట్టు ది న్యూయార్క్ టైమ్స్ ఆన్ ఎడిషన్ లో ఓపెన్ లెటర్ లో కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటన 90 దశక ఆరంభంలో తనపై లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆన్ లైన్ ఎడిషన్ కు రాసిన ఓపెన్ లెటర్ లో పేర్కొంది. తాను ఏడేళ్ల వయస్సులో ఉండగా తనను అలెన్ లైంగికంగా వేధించారని, ఈ విషయాన్ని తన పెంపుడు తల్లి, నటి మియా ఫారోకు తెలిపానని, కాని అప్పటికే తన పెంపుడు తల్లి అలెన్ తో వైవాహిక సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నారని లెటర్ లో ఫారో పేర్కోంది. 1993 లో ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఆయన కేసు విచారణకు రాకుండా అడ్డుకోవడంలో సఫలమయ్యారని 28 ఏళ్ల ఫారో అన్నారు. అలెన్ తనపై లైంగిక దాడులకు పాల్పడటంతో తన ఆరోగ్యం క్షీణించిందని, జీర్ణ సంబంధమైన సమస్యలు తలెత్తాయని..అంతేకాకుండా ఓ వ్యక్తితో రిలేషన్ కూడా దెబ్బతిందని తెలిపారు. ఆతర్వాత టెలివిజన్, పోస్టర్ లో అలెన్ ను చూస్తే భయమేస్తుందని ఆమె అన్నారు. అలెన్ వ్యవహారాన్ని హాలీవుడ్ నటులు కూడా పట్టించుకోలేదని ఆమె విమర్శించారు.