అంతటి స్టార్‌ డైరెక్టర్‌ పనైపోయిందా? | Colin Firth says he will never work with Woody Allen again | Sakshi
Sakshi News home page

అంతటి స్టార్‌ డైరెక్టర్‌ పనైపోయిందా?

Published Mon, Jan 22 2018 12:54 AM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM

Colin Firth says he will never work with Woody Allen again - Sakshi

ఎంతటి గొప్ప ఫిల్మ్‌మేకర్‌కైనా ఒక రోజు వస్తుంది. ఫేడ్‌ ఔట్‌ అయిపోయే రోజు అది. అయితే అది పరిస్థితులకు తగ్గట్టు సినిమాలు తీయలేకపోవడం వల్లనో, మేకింగ్‌లో పట్టు కోల్పోవడం వల్లనో కాకుండా, అప్పటివరకూ సంపాదించిన పేరును పోగొట్టే ఒక కారణం వల్ల అయితే? వినడానికే కష్టంగా ఉంది కదూ!? ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఊడీ అలెన్‌ పరిస్థితి అలాగే ఉందంటోంది హాలీవుడ్‌. అలెన్‌ హాలీవుడ్‌లో రొమాన్స్‌ జానర్లో పలు తిరుగులేని సినిమాలను అందించాడు. ఎప్పటికైనా చూసి తీరాల్సిందే అని చెప్పుకునే హాలీవుడ్‌ సినిమాల్లో ఎవ్వరు లిస్ట్‌ తీసినా అలెన్‌ సినిమాలు ఉంటాయి.

అంతటి టాలెంటెడ్‌ ఫిల్మ్‌మేకర్‌. కొద్దికాలంగా ఆయన గొప్ప సినిమాలేవీ తీయలేదు. అయినా అలెన్‌ లాంటివాడు ఎప్పుడో ఒకప్పుడు అందరినీ కట్టిపడేసే సినిమా ఇస్తాడన్న నమ్మకం మాత్రం అందరికీ ఉంది. ఆ నమ్మకాన్ని ఇక కట్టకట్టేసి మూలన పడేసే పరిస్థితి కనిపిస్తోంది. అదేమంటే, అలెన్‌పై వచ్చిన ఆరోపణలు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అలెన్‌పై డైలన్‌ ఫారో చాలాకాలంగా ఆరోపణలు చేస్తోంది. అది ఇప్పుడే అలెన్‌ను దెబ్బతీసే దగ్గరకు వచ్చేస్తోంది.

చిత్రమేంటంటే ఫారో.. అలెన్‌ దత్తత తీసుకొని పెంచుకున్న కూతురు. అలెన్‌పై కూతురే ఆరోపణలు చేయడంతో ఆయనను హాలీవుడ్‌ మెల్లిగా పక్కన పెట్టేస్తోంది. కొద్దికాలంగా అలెన్‌ ఒక పెద్ద బడ్జెట్‌ సినిమా తీయాలని స్టార్‌ హీరోయిన్లను సంప్రదిస్తున్నాడట. అయితే ఈ కేసు గొడవ చూసి, అలెన్‌ను కేర్‌ చేయడం మానేశారట హీరోయిన్స్‌. ఇక్కడే అలెన్‌ పతనం మొదలైందని హాలీవుడ్‌ భావిస్తోంది. 82 ఏళ్ల వయసున్న అలెన్, తనకున్న గొప్ప పేరును ఇలా పాడు చేసుకోవడం గొప్ప విషాదమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement