Manhattan
-
సార్ మీరు ‘ఎన్నారై’యేనా!.. ఆనంద్ మహీంద్రా రిప్లై అదిరింది!
దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సమకాలిన అంశాలతో స్పందిస్తూ రకరకాల పోస్ట్‌లను షేర్ చేయడమే కాదు. నెటిజన్లకు అడిగిన ప్రశ్నలకు రిప్లయి ఇస్తారు. కొన్నిసార్లు ట్విట్టర్ యూజర్ల విచిత్రమైన ప్రశ్నలకు ఆనంద్ మహీంద్రా చమత్కారంగా జవాబు ఇస్తుంటారు. కొన్నిసార్లు ఆయన స్పందనలు నెటిజన్లను నవ్వులు పూయిస్తాయి. అలాంటి మహీంద్రాను ఓ నెటిజన్ మీరు ఎన్నారైనా? అని అడిగినందుకు ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఆ రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Manhattan. 4th of July. 2022. It’s hard for man-made light to compete with the moon! (3/3) pic.twitter.com/388sXbFg5Q — anand mahindra (@anandmahindra) July 5, 2022 దేశీయ బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా అమెరికా న్యూయార్క్ సిటీ మాన్హాటన్లో ఉన్నారు. మాన్హాటన్లో ఉన్న ఆయన నగర అందాల్ని వర్ణిస్తూ ఫోటోల్ని, వీడియోల్ని ట్వీట్ చేశారు. వాటికి సంబంధించిన ట్వీట్లకు రిప్లయ్ ఇస్తుండగా..ఓ నెటిజన్ ఆనంద్ మహీంద్రాను “మీరు ఎన్నారైనా?” అని అడగ్గా..అందుకు మహీంద్రా చమత్కారంగా నేను 'హెచ్ఆర్ఐ'(మహీంద్రా రెసిడెంట్ ఆఫ్ ఇండియా) అని బదులిచ్చారు. Just visiting family in New York. So am an HRI. Heart (always) resident in India….😊 https://t.co/ydzwTux9vr — anand mahindra (@anandmahindra) July 5, 2022 దీంతో నెటిజన్లు తమదైన శైలిలో ఆనంద్ మహీంద్రాను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “హా హా బాగుంది! మీ దిల్ హై హిందుస్తానీ! అని మాకు బాగా తెలుసు అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే..“సర్. మీరు ఎంఆర్ఐ (మహీంద్రా రెసిడెంట్ ఆఫ్ ఇండియా)” అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. -
కళ: అమెరికాలో పుష్పవిలాసం
కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’ అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి. పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే... కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’ అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి. పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే... మాన్హాటన్ (యూఎస్) 86 స్ట్రీట్‌లోని బస్‌షెల్టర్‌లో కనిపించిన ఒక చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సంప్రదాయ కళాప్రేమికులు, ఆధునిక కళాప్రేమికులు... ఇద్దరూ ఇష్టపడే చిత్రం అది. ‘జాయ్ ఆఫ్ లివింగ్’ అనే ఆ చిత్రాన్ని గీసింది మన ఇండియన్ ఆర్టిస్ట్ పుష్పకుమారి. గత రెండు సంవత్సరాల కరోనా కల్లోల చీకటిని వస్తువుగా తీసుకొని, ఆశావాద దృక్పథాన్ని ప్రతిఫలించేలా గీసిన చిత్రం అది. అమెరికాకు చెందిన ‘పబ్లిక్ ఆర్ట్ ఫండ్’ అనే నాన్–ప్రాఫిట్ ఆర్గనైజేషన్ న్యూయార్క్, బోస్టన్, షికాగోలలో పుష్పకుమారి చిత్రప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ చిత్రాలను సాధారణ కళాప్రేమికుల నుంచి చేయి తిరిగిన చిత్రకారుల వరకు ప్రశంసిస్తున్నారు. పేరులోనే ‘కళ’ ధ్వనించే మధుబని (బిహార్) జిల్లాలోని రంతి అనే గ్రామంలో పుట్టింది పుష్ప కుమారి. రంతి అనేది ఊరు అనడం కంటే ‘ఊరంత బడి’ అనడం సమంజసం. ఎటు చూసినా ఆబాలగోపాలం చేతిలో మధుబని మధుర కళావిన్యాసాలే! పుష్ప అమ్మమ్మ మహాసుందరిదేవి మధుబని ఆర్ట్‌ను అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లిన తొలితరం కళాకారుల్లో ఒకరు. అమ్మమ్మ ఒడిలో ఆర్ట్పాఠాలు నేర్చుకుంది పుష్ప. పదమూడేళ్ల వయసులోనే కుంచె పట్టిన పుష్ప కాలంతో పాటు తన కళను మెరుగు పరుచుకుంటూ వస్తోంది. మొదట్లో అందరూ గీసినట్లే తాను గీసేది. తరువాత కాలంలో మాత్రం తనదైన ప్రత్యేకత గురించి ఆలోచించింది. ‘సింబాలిజం’ను సంప్రదాయ కళలోకి తీసుకురావడం ఒకింత కష్టమైన పని. అయితే ఆ కష్టం పుష్ప చిత్రాలలో కనిపించదు. దీనికి కారణం సింబాలిజంను సృజనాత్మకంగా మధుబనిలోకి తీసుకురావడమే. అమ్మమ్మ కుంచె నుంచి అందమైన చిత్రాలను నేర్చుకోవడమే కాదు, ఆమె నోటి నుంచి పురాణాలు, జానపద కథలు ఎన్నో విన్నది పుష్ప. అవేమీ వృథా పోలేదు. తన కళకు ఇంధనంగా పనికి వచ్చాయి. పుష్ప కళాప్రపంచంలో కేవలం కళ మాత్రమే కనిపించదు. సమాజం కూడా కనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే సంప్రదాయ కళ అనే పునాది మీద తనదైన దృశ్యభాషను సృష్టించుకుంది పుష్ప. సామాజిక,రాజకీయ సమస్యలు, జెండర్ సమస్యలు, పర్యావరణ సంబంధిత అంశాలను కేంద్రంగా చేసుకొని చిత్రాలు గీస్తుంది పుష్ప. నాగరికత అనే పేరుతో భూమాతను ఎంత హింస పెడుతున్నామో ‘ఎర్త్–2’ చిత్రంలో కనిపిస్తుంది. ఇటీవల కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని గీసిన చిత్రాలకు మంచి స్పందన లభించింది. ‘నేను గీసే ప్రతి చిత్రానికి తనదైన భావవ్యక్తీకరణ ఉండేలా చూసుకుంటాను’ అంటుంది పుష్ప. బోల్డ్ స్ట్రైకింగ్ ఫిగర్స్ గీయడంలో దిట్ట అనిపించుకున్న పుష్ప చిత్రాలలో రంగుల ఆర్భాటం కనిపించదు. సాదాసీదా ఇంక్బాటిల్నే ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంది. ‘చిత్రాలు మౌనంగా కనిపిస్తాయి. కాని ఆ మౌనంతోనే అవి మనతో మాట్లాడేలా చేయడం ఆర్టిస్ట్ విశిష్ఠత’ అని చెబుతారు విశ్లేషకులు. పుష్పకుమారి గీసిన చిత్రాలను చూస్తే... అవి మౌనంగా మాట్లాడే చిత్రాలు అనే విషయం కొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది. -
న్యూయార్క్ ఉగ్రదాడి : సంచలన విషయాలు
న్యూయార్క్ : అమెరికా ఆర్థిక రాజధానిలో ఉగ్రదాడి యత్నానికి సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. న్యూయార్క్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే మాన్‌హట్టన్ ప్రాంతంలోని బస్ టెర్మినల్ వద్ద ఆత్మాహుతిదాడికి యత్నించిన వ్యక్తిని.. ఐసిస్ అనుకూలుడిగా గుర్తించినట్లు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్(ఎన్‌వైపీడీ) వర్గాలు తెలిపాయి. అతను బంగ్లాదేశ్‌కు చెందిన అఖాయెద్ ఉల్లా.. మాన్‌హట్టన్ 42వ వీధి, ఎనిమిదో అవెన్యూ బస్ టెర్మినల్ వద్ద పేలుడు అనంతరం ఒక వ్యక్తి గాయాలతో పడిఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దగ్గరికి వెళ్లగా, అతని పొట్ట భాగంలో, వేసుకున్న జాకెట్లో వైర్లు ఉండటాన్ని గమనించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. ఉగ్రవాదిగా భావిస్తోన్న వ్యక్తిని అఖాయెద్ ఉల్లాగా గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఇతను.. గత ఏడేళ్లుగా అమెరికాలోనే నివసిస్తున్నట్లు తెలిసింది. ఎలక్ట్రిక్ కంపెనీలో బాంబు తయారీ ఎన్‌వైపీడీ వర్గాల కథనం ప్రకారం.. అఖాయెద్ ఉల్లా తాను పనిచేస్తోన్న ఎలక్ట్రిక్ కంపెనీలోనే బాంబును తయారుచేసినట్లు విచారణలో వెల్లడైంది. ఐసిస్ ప్రభావితుడైన ఉల్లా.. గుట్టుచప్పుడు కాకుండా పైప్ బాంబును తయారుచేసి.. రద్దీగా ఉండే చోట దానిని పేల్చడం ద్వారా కలకలం రేపాలని భావించాడు. పథకం ప్రకారం సోమవారం ఉదయమే జాకెట్ కుడి జేబులో బాంబును పెట్టుకుని బస్ టెర్మినల్ వద్దకు చేరుకున్నాడు. అయితే అనుకున్నవిధంగా బాంబును పేల్చడంలో ఉల్లా విఫలమయ్యాడు. దీంతో స్వల్ప పేలుడు మాత్రమే సంభవించింది. ఉల్లా వేసుకున్న జాకెట్, దుస్తులు, పొట్టభాగంలో కుడివైపు స్వల్పంగా కాలిపోయాయి. ఈ ఘటనలో ఉల్లాతోపాటు మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాంబును సరిగా పేల్చలేకపోవడంతో గాయాలతో పడి పోలీసు వర్గాలు తెలిపాయి. -
అమెరికాపై ఉగ్రదాడి! ఆ పైప్బాంబు సరిగా పేలి ఉంటే!!
న్యూయార్క్ : మాన్‌హట్టన్ పేలుడు ఘటనపై అనేక కథనాలు వెలుగులోకి వస్తుండటం అమెరికాను మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. క్రిస్మస్ వేడుకలో మునిగిపోయిన అమెరికాకు ఇదే అదనుగా షాక్ ఇవ్వాలని ఉగ్రవాదులు భావించారా? తమ స్లీపర్‌సెల్స్‌ను నిద్రలేపి ఒంటరి తోడేలు(లోన్ ఊల్ఫ్) దాడులకు ఉసిగొల్పారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పైప్ బాబు పేలి ఉంటే ఘోరవిషాదం చూసేవాళ్లం! న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్ 42వ వీధి, 8వ అవెన్యూలో గల పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్ వద్ద పేలుడు జరిగిన కొద్దిసేపటికి.. గాయపడిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన దగ్గరున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌తో అతను..శక్తిమంతమైన పైప్ బాంబులను పేల్చేందుకు విఫలయత్నం చేసినట్లు తెలిసింది. బాంబును సరిగా పేల్చడంలో అతను విఫలమయ్యాడు. ఒక వేళ బాంబు సరిగా పేలి ఉంటే ఈ పాటికి మనం ఘోరవిషాదాన్ని చూసేవాళ్లం’ అని పోలీస్ వర్గాలు తెలిపాయని సీఎన్ఎన్ వార్త సంస్థ పేర్కొంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. నలుగురికి గాయాలు.. మాన్‌హట్టన్ పేలుడు ఘటనలో మొత్తం నలుగురు గాయపడ్డట్లు ఎన్‌వైపీడీ తెలిపింది. ఆ గాయాలేవీ ప్రాణాంతకమైనవి కావని, అరెస్టైన వ్యక్తి కూడా ఆ నలుగురిలో ఒకరని పేర్కొంది. పొద్దుపొద్దున్నే పేలుడు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగరంలో సోమవారం ఉదయం ఉదయం 7:45 గంటలకు పేలుడు సంభవించింది. 42వ వీధి, ఎనిమిదో అవెన్యూలోని పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్‌ను పేలుడు కేంద్రంగా పోలీసులు గుర్తించారు. పేలుడు అనంతరం పోర్ట్ బస్ టెర్మినల్‌లోని ఏ, సీ, ఈ లైన్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలిసింది. -
అమెరికా : న్యూయార్క్‌లో పేలుడు
న్యూయార్క్ : అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రఖ్యాత మాన్‌హట్టన్ ప్రాంతంలో సోమవారం ఉదయం 7:45 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగింది. 42వ వీధి, ఎనిమిదో అవెన్యూ సమీపంలోని పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్ వద్ద పేలుడు కేంద్రాన్ని గుర్తించారు. ఈ మేరకు న్యూయార్క్ మేయర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్(ఎన్‌వైపీడీ) ఇప్పటికే ఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుందని, పోర్ట్ రవాణా కేంద్రంలోని ఏ, సీ, ఈ లైన్లను తాత్కాలికంగా మూసివేశారని అధికారులు పేర్కొన్నారు. పేలుడు తీవ్రత ఎంత, ఎవరికైనా ప్రాణాపాయం కలిగిందా, గాయపడ్డారా, లేదా అనే వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. ఒకటికాదు రెండు పేలుళ్లు! మాన్‌హట్టన్ పేలుడుకు సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. టెర్మినల్‌లో బదిగిన తనకు రెండు సార్లు భారీ పేలుడు శబ్ధాలు వినిపించాయని, ఆ సమయంలో హెడ్సెట్ పెట్టుకున్నప్పటికీ చెవులు ఘొల్లుమన్నాయని ఫ్రాన్సిస్కో అనే ప్రయాణికుడు తెలిపారు. పేలుడు ఉగ్రదాడా, లేక మరొకటా అన్నది మరికాసేపట్లోనే అధికారులు వెల్లడించనున్నారు.. సొంత ఊర్లో పేలుడుపై అధ్యక్షుడు ట్రంప్ ఆరా.. మాన్‌హట్టన్ బస్ టెర్మినల్ పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధికారులతో మాట్లాడారు. మాన్‌హట్టన్‌లో ఏం జరిగిందో, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే విషయాలను ఎన్‌వైపీడీ.. ప్రెసిడెంట్ ట్రంప్‌కు వివరించిందని వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి తెలిపారు. ట్రంప్ సొంత ఊరు న్యూయార్క్ సిటీనే అన్న సంగతి తెలిసిందే. -
బిల్డింగ్‌ను సగానికి వంచేద్దాం!
న్యూయార్క్: మరో గొప్ప ఆకాశహర్మ్యానికి న్యూయార్క్ వేదిక కాబోతోంది. ప్రపంచంలోనే పొడవైన బిల్డింగ్ నిర్మించేందుకు అక్కడి ఆర్కిటెక్చర్ సంస్థ ఒయివో స్టూడియో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రపంచంలో ఎత్తయిన భవంతులకు పెట్టింది పేరైన మాన్‌హట్టన్ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. మిగతా ఆకాశహర్మ్యాలలా కూకుండా తిరగేసిన 'U' ఆకారంలో చేపట్టనుండటం దీని ప్రత్యేకత. పూర్తయితే.. 4000 అడుగుల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన బిల్డింగ్‌గా ఇది రికార్డులకెక్కనుంది. న్యూయార్క్ జోన్లో ఎత్తైన భవంతులపై ఉన్న పరిమితులను బెండ్(మార్చడానికి) చేయడానికి బదులు బిల్డింగ్‌నే బెండ్ చేయడం వల్ల ప్రతిష్టాత్మకమైన నిర్మాణాన్ని రూపొందించొచ్చని ఒయివో బిల్డింగ్ ప్రపోజల్లో పేర్కొంది. ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ ఇయోన్నిస్ ఒయాన్మవ్ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం పెట్టుబడులు సమీకరించే పనిలో ఉన్నారు. -
సిక్కు అమ్మాయిపై 'తెల్లోడి' పైత్యం
-
సిక్కు అమ్మాయిపై 'తెల్లోడి' పైత్యం
సిక్కు-అమెరికన్ అమ్మాయిపై ఓ శ్వేతజాతీయుడు తన జాతివిద్వేష పైత్యాన్ని వెళ్లగక్కాడు. ఆమెను చూసి మధ్యప్రాచ్యపు యువతిగా భావించిన అతడు.. 'నువ్వు ఈ దేశానికి చెందినదానికి కావు.. లెబనాన్ తిరిగి వెళ్లిపో' అంటూ కేకలు వేశాడు. దక్షిణాసియా వాసులపై అమెరికాలో విద్వేష నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల మ్యాన్‌హట్టన్‌లో ఈ ఘటన జరిగింది. తన స్నేహితురాలి పుట్టినరోజు వేడకకు వెళ్లేందుకు రాజ్‌ప్రీత్ హేర్ సబ్వే రైలులో బయలుదేరింది. రైలులో తాను తన ఫోన్ చూస్తుండగా ఓ శ్వేతజాతీయుడు తనవద్దకు వచ్చి అరవడం మొదలుపెట్టాడని, తనను ఉద్దేశించి పరుషమైన, తీవ్ర వ్యాఖ్యలు చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన ఎదుర్కొన్న భయానక అనుభవం గురించి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించే 'దిస్ విక్ ఇన్ హేట్'లో ఆమె వివరించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్వేష నేరాలను ఈ కాలమ్ కింద న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేకంగా ప్రచురిస్తున్నది. -
పాడైపోయెను గూడు
గ్రౌండ్ అప్ పాడైపోయెను గూడు ఇరాక్ ఇంకా చల్లపడలేదు. సద్దాం హయాం నుంచీ ఆ దేశంలో ఏదో ఒక కల్లోలం! ప్రస్తుతం ఐసిస్ జిహాదీలకు, ఇరాక్ ప్రభుత్వానికీ మధ్య భీకర పోరాటం జరుగుతోంది. ఐసిస్ ఇరాక్‌లో ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటుంటే... ఇరాక్ దీటుగా పోరాడి ఒక్కో ప్రాంతాన్నీ విడిపించుకుంటూ వస్తోంది. జిహాదీలు ఆత్మాహుతి దళాలతో దొంగ దెబ్బ తీస్తుంటే, ఇరాక్... రాకెట్ దాడులతో ఐసిస్ జిహాదీలను తరిమికొడుతోంది. ఈ రెండు వర్గాల నడుమ ఇరాక్‌లోని వేలాది కుటుంబాలు చెల్లాచెదురవుతున్నాయి. అయినవాళ్లను పోగొట్టుకుని ఎందరో అనాథలవుతున్నారు. వీళ్ల కోసం అమెరికా నాయకత్వంలోని సంకీర్ణదళాలు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయి. మోసీల్ పట్టణంలోని అలాంటి ఒక రక్షణ శిబిరంలోకి... కూతుర్ని ఎత్తుకుని, పరుగులు తీస్తున్న ఇరాక్ తండ్రినే మీరిప్పుడు ఫొటోలో చూస్తున్నది. తల్లి ఎక్కడుందో వీళ్లకు తెలియదు. వీళ్లు ఎక్కడున్నారో ఆమెకు తెలియదు. ఒకళ్ల ప్రాణాలు ఒకళ్ల దగ్గరున్నాయని మాత్రం ఈ విషాద దృశ్యం తెలియజేస్తోంది. బుల్ అండ్ లిటిల్ గర్ల్ మాన్‌హట్టన్‌లోని వాల్ స్ట్రీట్ కంచు ఆంబోతుకు సవాల్ విసురుతూ... ‘నువ్వా? నేనా?’ అన్నట్లు దానికి ఎదురుగా నిలుచున్న చిన్న పిల్ల విగ్రహం ఒకటి ఇప్పుడు ప్రపంచానికి ముచ్చటగొల్పుతోంది. మహిళా సాధికారతకు, అంతకు మించి మహిళా శక్తికి తార్కాణంగా ఉన్న ఈ చిన్నారి విగ్రహాన్ని మొన్నటి మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద కంపెనీల బోర్డు నిర్ణయాలలో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ తక్కువగానే ఉందని, మహిళా శక్తిని అంగీకరించి, వారికి సమాన అవకాశాలను కల్పిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉంటుందనీ సూచిస్తూ బుల్కి ఎదురుగా ఈ లిటిల్ గర్ల్‌ని ఉంచారు. సాధించింది సేనాని భార్య మేజర్ అమిత్ దేశ్వాల్! ఏడాది క్రితం మణిపూర్‌లో తీవ్రవాదులతో పోరాడి మరణించిన సైనిక వీరుడు. ఆర్మీ స్పెషల్ ఫోర్స్‌లో పని చేస్తూ దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ అమిత్ దేశ్వాల్ ఆశయాన్ని ఇప్పుడు ఆయన భార్య నీతా భుజం మీదకు తుపాకీలా ఎత్తుకున్నారు. 33 ఏళ్ల నీతా భారత సైన్యంలో ‘షార్ట్ సర్వీస్ కమిషన్’ ఆఫీసర్‌గా ఎన్నికయ్యారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏప్రిల్ 1న ప్రారంభమై 49 వారాల పాటు సాగే శిక్షణ అనంతరం నీతా ఆర్మీ విధుల్లో చేరుతారు. సరిగ్గా గత ఏడాది ఏప్రిల్‌లోనే ఆమె తన భర్తను కోల్పోయారు. ఆ షాక్ నుంచి తేరుకోడానికి ఆమెకు రెండు నెలలు పట్టింది. ఆ తర్వాత గుండె దిటవు చేసుకుని తన మూడేళ్ల కొడుకుతో పాటు హర్యానా నుంచి ఢిల్లీ వెళ్లి ‘సర్వీస్ సెలక్షన్ బోర్డు’ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. తన భర్త అర్ధంతరంగా వదిలిపెట్టి వెళ్లిన దేశ రక్షణ బాధ్యతలో పాల్పంచుకోవడమే ఆమె లక్ష్యం. అదిప్పుడు నెరవేరింది. చెన్నైలో శిక్షణ పూర్తయ్యాక లెఫ్ట్‌నెంట్ క్యాడర్ అధికారిగా దేశానికి సేవలు అందిస్తారు నీతా. కసిగా ఉన్నాడు మిన్ బహదూర్ షేర్‌చాన్ ప్రస్తుత వయసు 86. దేశం నేపాల్. 2008లో ఈయన ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాడు. ఎక్కిన రెండేళ్ల తర్వాత 2010లో ‘ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతివృద్ధుడు’గా గిన్నిస్ బుక్‌ని ఎక్కాడు. అయితే షేర్చాన్కి ఆ సంతోషం ఎక్కువకాలం మిగల్లేదు. యుచీరో మియూరా అనే 80 ఏళ్ల వృద్ధ మహాశయుడు 2015లో ఎవరెస్టును ఎక్కి, మన షేర్చాన్ని గిన్నెస్లోంచి తోసేశాడు! అప్పట్నుంచీ షేర్‌చాన్ కసిగా ఉన్నాడు. మళ్లీ ఎలాగైనా ఎవరెస్టును ఎక్కేసి, తన జపాన్ ప్రత్యర్థి మియూరాను గిన్నిస్‌నుంచి ఒక్క తన్ను తన్నేయాలన్న దృఢనిశ్చయంతో ఉన్నాడు. ఏడాది లోపు ఎక్కితీరుతాను అని కూడా చెబుతున్నాడు. ‘నేను వృద్ధుడిని కావచ్చు. మనసు ఇంకా యంగ్‌గానే ఉంది’అని అంటున్నాడు. అయితే రికార్డు కోసం పంతాన్ని నెగ్గించుకోవాలనుకోవడం లేదట షేర్‌చాన్. ప్రపంచశాంతి, భూమాతను కాపాడుకోవడం... అనే అంశాలపై ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ శిఖరయాత్రను చేపడుతున్నాడట. నూరేళ్ల విలాపం ఇరవై ఏళ్ల క్రితం ఇండియాలో వినాయకుడు పాలు తాగాడు. ఇప్పుడు క్రిమియా ద్వీపకల్పం సిమ్ఫెరోపోల్లోని రష్యా చివరి చక్రవర్తి రెండవ నికోలాయ్ విగ్రహం కన్నీళ్లు కారుస్తోంది. తర్కానికి అతీతంగా భక్తివిశ్వాసాలు మనుషులను నడిపిస్తాయని అనుకోడానికి ఈ రెండు వార్తలు నిదర్శనం. ఉక్రెయిన్ నుంచి రష్యా సిమ్ఫెరోపోల్ను కలుపుకున్న రెండేళ్ల తర్వాత 2016లో నికోలాయ్ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. పూర్వపు చక్రవర్తుల మాదిరిగానే రెండవ నికోలాయ్ భక్తిపరుడు. నికోలాయ్ పదవీచ్యుతుడై వందేళ్లు అయిన సందర్భంగా అతడి విగ్రహం విలపిస్తూ ఉండివుండొచ్చని క్రిమియా న్యాయవాది నాటాలియా పొర్లోన్స్కయా అంటున్నారు. పాపం.. బ్యాంక్! ఈ తాబేలు పేరు ‘బ్యాంక్’. అసలు పేరు ఆమ్సిన్. వయసు 25. ఇంకో నూటా పాతికేళ్ల జీవితం ఉండగానే ఇదిగో... ఇలా హాస్పిటల్ పాలయింది! తాబేళ్ల జీవితకాలం సాధారణంగా 150 ఏళ్లు. జాతిని బట్టి 200 ఏళ్లు బతికే తాబేళ్లూ ఉన్నాయి. అయ్యో! మరి మన ‘బ్యాంక్’కు ఇంతలోనే ఏమయింది?!తాబేలు ఉన్న కొలనులోకి నాణేలను విసిరితే ఎక్కువకాలం జీవిస్తామని థాయ్‌లాండ్‌లో ఓ నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఇప్పుడు ‘బ్యాంక్’ ప్రాణాల మీదికి తెచ్చింది. థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు దగ్గర్లో శ్రీరచ అనే తీరప్రాంత సమీప పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఓ కొలను ఉంది. ఆ కొలనులో ఓ తాబేలు ఉండేది. ఆ తాబేలే... ఇప్పుడు థాయ్ ఆసుపత్రిలో ఉన్న ‘బ్యాంక్’. బ్యాంక్... కొలనులో ఉన్నప్పుడు అది నీటి పైకి తేలినప్పుడు... కొలను దగ్గరున్న వాళ్లు తాబేలు ఉన్న వైపు నాణేలు విసిరేవారు. వాటిని ‘గుడ్ లక్ పెన్నీస్’ అంటారు. అయితే ఆ గుడ్ లక్ పెన్నీలు... కొలనులోని తాబేలుకు బ్యాడ్ లక్ పెన్నీలు అయ్యాయి. ఎన్నాళ్ల నుంచి ఆ తాబేలు... నీటిలోకి వచ్చి పడుతున్న నాణేలను మింగుతుందో గానీ, దాని కడుపు ఉబ్బిపోయి, కదలలేని స్థితికి వచ్చింది. ఈ సంగతిని ఓ నేవీ అధికారి గమనించాడు. వెంటనే దాన్ని యూనివర్శిటీ ఆసుపత్రికి చేర్చాడు. డాక్టర్లు స్కాన్ చేసి చూస్తే తాబేలు కడుపులో నాణేలు కనిపించాయి! వెంటనే ఆపరేషన్‌కు ఏర్పాట్లు జరిగాయి. తాబేలుకు మత్తు ఇచ్చారు. కడుపుపైన చిన్న కోత పెట్టారు. ఏడు గంటల పాటు శ్రమించి దాని కడుపులోంచి 915 థాయ్ నాణేలను తీశారు. ఒంట్లోంచి ఒక్కసారిగా ఐదు కిలోల బరువు తగ్గిపోవడంతో తాబేలు తేలికపడింది. డాక్టర్లూ ఊపిరి పీల్చుకున్నారు. అసలే ఈ తాబేలు... అంతరించిపోతున్న జీవజాతిలో ఉంది మరి! ఈ సంఘటన యూనివర్శిటీలోని వెటర్నరీ డిపార్ట్మెంట్ హెడ్డు నంతరికా ఛాస్యూకి చాలా బాధ కలిగించింది. మీడియాను పిలిపించి, నీళ్లలో నాణేలు వేయడం మానుకోవాలని స్థానికులకు, టూరిస్టులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బ్యాంక్ ఆసుపత్రిలో కోలుకుంటోంది. -
ట్రంప్ టవర్ లో బాంబు కలకలం
న్యూయార్క్: ట్రంప్ టవర్ లో బాంబు కలకలం రేగింది. గుర్తు తెలియని బ్యాగు పడి ఉండటాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే బిల్డింగును తాత్కాలికంగా ఖాళీ చేయించారు. బాంబు కలకలంతో బాంబు స్క్వాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. సంచిని తనిఖీ చేసి అందులో ఉన్నవి ఆడుకునే బొమ్మలని తేల్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. మాన్‌హట్టన్‌లోని ట్రంప్ టవర్స్ నుంచి ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డేవిస్ మాట్లాడుతూ బాంబ్ స్క్వాడ్ సంచిని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. కాగా, అధ్యక్షపదవిని స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ఇక్కడే నివసించనున్నారు. ఆయన ప్రస్తుతం ఫ్లోరిడాలో క్రిస్మస్ సెలవుల్లో ఉన్నారు. -
భారీ సౌధంపై పిడుగు పడితే..
-
భారీ సౌధంపై పిడుగు పడితే..
మన్‌హట్టన్‌లోని 102 అంతస్తుల భారీ సౌధం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై తాజాగా ఓ పిడుగు విరుచుకుపడింది. నడి వేసవి నడిరాత్రిలో తుఫాన్ చుట్టుముట్టిన సమయంలో సంభవించిన ఈ ఆకాశ అద్భుతాన్ని ఓ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై పిడుగులు పడటం సాధారణ విషయమే. పిడుగులు పడినా తట్టుకొని ఉండేలా ఈ భవనానికి ఏర్పాట్లు చేశారు. తాజాగా కూడా రాత్రిసమయంలో ఓ పిడుగు భారీ మెరుపుతో భవనాన్ని ఢీకొంది. దీనిని ఫొటోగ్రాఫర్ హెన్రిక్ మోల్ట్కే తన కెమెరాతో పర్ఫెక్ట్గా క్లిక్ మనిపించారు. అంతేకాకుండా దీనిని వీడియో కూడా తీశారు. ఈ ఫొటో, వీడియోను యూట్యూబ్, ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ఇవి వెంటనే వైరల్‌గా మారిపోయింది. -
హైడ్రోజన్ బాంబేస్తే మన్‌హట్టన్ బూడిదే!
ప్యాంగ్యాంగ్: తాము తయారు చేసిన హైడ్రోజన్ బాంబు మాజీ సోవియట్ యూనియన్ తయారు చేసిన బాంబుకన్నా శక్తివంతమైనదని, దీన్ని ఖండాంతర క్షిపణి ద్వారా ప్రయోగించినట్లయితే అమెరికా న్యూయార్క్ సిటీలోని మన్హట్టన్ను బూడిద చేయగలదని, మనుషులెవరూ మిగలరని ఉత్తర కొరియా పరోక్షంగా అమెరికాను హెచ్చరించింది. అమెరికాను తాకే శక్తివంతమైన ఖండాంతర క్షిపణులు తమవద్ద ఉన్నాయని పేర్కొంది. నాలుగవ అణు పరీక్ష నిర్వహించిన రెండు నెలలకే ఉత్తర కొరియా ఇలాంటి హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. మానవత్వాన్ని మంటగలుపుతున్న ఉత్తర కొరియా నియంత కిమ్‌జాంగ్ ఉన్, ఆయన సీనియర్ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ఇన్వెస్టిగేటర్ మార్జుకి దర్సుమేన్ సమతి మానవ హక్కుల సమావేశంలో పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి ఇలాంటి హెచ్చరిక వెలువడింది. ఈ సమావేశాన్ని ‘డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా’ బహిష్కరించింది. అమెరికా, ఐరోపా యూనియన్ మద్దతిచ్చింది. ఉత్తర కొరియాకు సన్నిహితంగా ఉండే చైనా మాత్రం మానవ హక్కులను రాజకీయం చేయవద్దని వ్యాఖ్యానించింది. -
ఐక్యరాజ్య సమితికి 70 ఏళ్లు పూర్తి!
ఆ నేడు 24 అక్టోబర్, 1945 ‘ఐక్యరాజ్య సమితి’ ఆవిర్భావానికి ముందు ‘నానాజాతి సమితి’ ఉండేది. అయితే ఆ సమితి మాట ఏ దేశమూ వినకపోవడంతో ఈ సమితి ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితిని ప్రపంచ దేశాలు ఉమ్మడిగా నెలకొల్పుకున్నాయి. భవిష్యత్తులో ఇక ప్రపంచ యుద్ధాలు జరక్కూడదని అవి నిర్ణయించుకున్నాయి. 51 దేశాల సభ్య త్వంతో ప్రారంభమైన ఐరాసలో నేడు 193 దేశాలు ఉన్నాయి. సమితి ప్రధాన కార్యాలయం మాన్‌హట్టన్ (న్యూయార్క్ నగరం)లో ఉంది. మిగతా ముఖ్యమైన కార్యాలయాలు జెనీవా, నైరోబీ, వియెన్నాలలో ఉన్నాయి. ప్రపంచ దేశాల స్వచ్ఛంద విరాళాలలో నడుస్తున్న ఐరాస.. ప్రధానంగా ప్రపంచ శాంతి కోసం పాటుపడుతుంటుంది. మానవహక్కులను, పర్యావరణాన్ని పరిరక్షిస్తుంటుంది. ప్రకృతి వైపరీత్యాలలో ఆయా దేశాలకు సహాయ సహకారాలు అందిస్తుంటుంది. ఎక్కడ సాయుధ పోరాటం మొదలైనా ఆపేందుకు, అంతకన్నా ముందు ఆ పోరాటాన్ని నివారించేందుకు కృషి చేస్తుంటుంది. -
నెత్తుటి రాత
క్రైమ్ ఫైల్ మన్‌హట్టన్ (అమెరికా)... నవంబర్ 2, 2006... ఆండీ ఆస్ట్రాయ్ కళ్లలోంచి కన్నీళ్లు జారిపడుతున్నాయి. అతని వైపే తీక్షణంగా చూస్తున్నాడు ఇన్స్పెక్టర్. ఆయన కళ్లలో కొద్దిగా జాలి. కొన్ని వందల ప్రశ్నలు. ‘‘ఊరుకోండి మిస్టర్ ఆండీ. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు...’’ ‘‘నేనే నేరస్తుడినని అనిపిస్తోంది... అంతే కదా’’... ఇన్స్పెక్టర్ మాట పూర్తి కాకముందే అన్నాడు ఆండీ. ‘‘మీ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమెను మొదట చూసింది మీరే. మాకు ఫిర్యాదు చేసిందీ మీరే. మరి మొదట మా దృష్టి మీమీదే పడటం సహజం కదా?’’ నవ్వాడు ఆండీ. ‘‘మీ వివరణ అద్భుతంగా ఉంది సర్. ఫిర్యాదు చేసినవాళ్లే నేరస్తులు అయి ఉంటారన్న మీ అనాలసిస్ చాలా గొప్పగా ఉంది.’’ ఇన్స్పెక్టర్ ముఖం కోపంతో ఎర్ర బడింది. ‘‘మీరు మాట్లాడుతున్నది ఓ పోలీసాఫీసర్‌తో అని మర్చిపోకండి ఆండీ. ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో, ఎవరిని అనుమానించాలో మాకు తెలుసు. మీరు మా మీద సెటైర్లు వేయాల్సిన పని లేదు.’’ ‘‘నేను సెటైర్లు వేయడం లేదు సర్. మీ అనుమానం కరెక్ట్ కాదంటున్నాను.’’ ‘‘సరే. చెప్పారుగా. ఇక వెళ్లండి. అవసరమైతే మళ్లీ పిలుస్తాను’’... అనేసి ఫైల్లో తల దూర్చాడు ఇన్స్పెక్టర్. ఆండీ ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ ఇన్స్పెక్టర్ ముఖంలో కనిపిస్తోన్న సీరియస్ నెస్ అతణ్ని నోరు విప్పనివ్వలేదు. దాంతో మౌనంగా లేచి బయటకు నడిచాడు. ఆండీ బయటకు వెళ్లగానే సబార్డి నేట్స్ని పిలిచాడు ఇన్స్పెక్టర్. ‘‘అతని మీద ఓ కన్నేసి ఉంచండి. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు... అన్ని వివరాలూ కావాలి నాకు. అతని ఫోన్ కాల్స్ కూడా ట్రేస్ చేయండి’’... అదేశించాడు. వాళ్లు సరేనని వెళ్లిపోయారు. ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడ్డాడు. ఆడ్రియానా షెల్లీ... ఆండీ ఆస్ట్రాయ్ భార్య. మంచి రచయిత్రి. టాలెంటెడ్ నటి. అద్భుతమైన దర్శకురాలు. టీవీలో పని చేసింది. సినిమా రంగంలో పని చేసేం తగా ఎదిగింది. అవార్డులూ రివార్డులూ అందుకుంది. ‘వెయిట్రస్’ అనే సినిమా తీసే పనిలో తల మునకలై ఉంది. కానీ అంతలోనే ఆత్మహత్య చేసుకుంది. సరిగ్గా ముందు రోజు అదే సమయానికి (నవంబర్ 1, 2006, సాయంత్రం 5:30) ఇన్స్పెక్టర్కి ఓ ఫోన్ వచ్చింది. ‘‘సర్... నా పేరు ఆండీ ఆస్ట్రాయ్. నా భార్య ఆడ్రియానా ఆత్మహత్య చేసుకుంది. మీరు వెంటనే రండి.’’ తక్షణం తన టీమ్‌ని తీసుకుని మన్ హట్టన్‌లోని వెస్ట్ విలేజ్ ప్రాంతంలో ఉన్న అబింగ్డన్ స్క్వేర్ అపార్ట్మెంట్స్కి చేరుకున్నాడు ఇన్స్పెక్టర్. బాత్రూములో.. షవర్ గొట్టానికి దుప్పటితో ఉరి వేసు కుంది ఆడ్రియానా. ‘‘తనని మొదట ఎవరు చూశారు?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘నేనే సర్. సాయంత్రం తన పని త్వరగా అయిపోయింది, ఇంటికి వెళ్తు న్నాను అని నాకు నాలుగ్గంటలకి ఫోన్ చేసింది. నేను ఐదున్నరకు ఇంటికొచ్చాను. తలుపు దగ్గరకు వేసివుంది. హాల్లో ఉయ్యాల్లో ఉన్న పాప ఏడుస్తోంది. ఆడ్రియానా కోసం ఇల్లంతా వెతికాను. చివరికి తను బాత్రూములో ఇలా...’’ ఆండీ గొంతు పూడుకుపోయింది. అర్థమైందన్నట్టు తలూపాడు ఇన్స్పెక్టర్. ఆడ్రియానా మృతదేహాన్ని కిందికి దించి, పోస్ట్‌మార్టమ్‌కి పంపించి, తనూ బయలు దేరాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడి మెదడుని తొలుస్తున్న ప్రశ్న ఒకటే. కెరీర్ అంత సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న సమయంలో ఆడ్రియానా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? ఈ ప్రశ్న అతడిలో వంద సందేహాలను రేకెత్తిస్తోంది. అవన్నీ ఆండీ దగ్గరకు వెళ్లే ఆగుతున్నాయి. కచ్చితంగా వ్యక్తిగత జీవితంలోని సమస్య వల్లే ఆమె చనిపోయిందని ఇన్స్పెక్టర్కి అనిపిస్తోంది. రెండు మూడు రోజులపాటు ఇదే ఆలోచనల్లో ఉన్నాడు. తర్వాత అతడికి మరో ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి చెప్పింది విని అవాక్కయ్యాడు. వెంటనే హడావుడిగా బయలుదేరాడు. ‘‘ఏంటి సర్, ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా’’ గుమ్మంలో నిలబడిన పోలీసుల్ని చూసి అన్నాడు ఆండీ. ‘‘నేరస్తుడు పోలీసుల్ని వెతుక్కుంటూ ఎప్పుడూ రాడు. నేరస్తుణ్ని వెతుక్కుంటూ పోలీసులే వెళ్లాలి... తప్పదు’’ అన్నాడు ఇన్స్పెక్టర్ లోపలికి అడుగుపెడుతూ. నిట్టూర్చాడు ఆండీ. ‘‘నా భార్య పోయిందన్న బాధ కంటే ఆమె మరణానికి నేనే కార కుడినని మీరు వేస్తోన్న నిందే ఎక్కువ బాధపెడుతోంది సర్ నన్ను.’’ ‘‘ఆహా అలాగా! ఏ మూలో నీ మాటలు నిజమేమోనన్న అనుమానం ఉండింది నాలో. కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే నాకిప్పుడే ఓ కొత్త నిజం తెలిసింది. ఆడ్రియానా ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరో హత్య చేశారు.’’ విస్తుపోయాడు ఆండీ. ‘‘నిజమా సర్? తనది హత్యా? నేను అనుకుంటూనే ఉన్నాను. నా భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. కానే కాదు.’’ ఇన్స్పెక్టర్ భృకుటి ముడివడింది. అనుమానిస్తున్నాడే గానీ ఆండీలో నేరస్తుడి లక్షణాలు ఎక్కడా కనిపించడం లేదు. తడబాటు లేదు. మాటల్లో బాధ ఉంది. కళ్లలో నిజాయతీ ఉంది. పైగా తన టీమ్ అతణ్ని ఫాలో అవుతోంది. ఎక్కడా అతని ప్రవర్తనలో తేడా లేదు. అయినా కూడా ఆడ్రియానాది హత్య అని అటాప్సీ చేసిన డాక్టర్ ఫోన్ చేసి చెప్పగానే, కావాలనే ఆండీని పరీక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు కూడా ఆండీలో ఏ తేడా కనిపించడం లేదు. మరి హత్య ఎవరు చేశారు? ‘‘నేను క్రైమ్స్పాట్ని మళ్లీ చూడాలి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘మీ ఇష్టం సర్’’ అన్నాడు ఆండీ. ఆడ్రియానా మరణించిన బాత్రూమ్ దగ్గరకు వెళ్లారు. ఆ రోజు వేసిన సీలును తొలగించి ఇన్స్పెక్టర్ లోనికి ప్రవేశించాడు. బాత్రూముని మరోసారి క్షుణ్నంగా పరిశీలించాడు. అతడి కళ్లు ఒకచోట ఆగిపోయాయి. క్లూ దొరికింది. వెంటనే అతని మెదడు చురుగ్గా పని చేయడం మొదలు పెట్టింది. ‘‘నిజం చెప్పు... ఆడ్రియానాని నువ్వే కదూ చంపింది?’’... గర్జించినట్టే అన్నాడు ఇన్స్పెక్టర్. అతడికి ఎదురుగా కూర్చుని ఉన్న పందొమ్మిదేళ్ల డీగో పిలికో భయంతో వణికాడు. ఇక తప్పించుకోలేనని అర్థమై మొత్తం కక్కేశాడు. ఆడ్రియానా వాళ్లు నివసిస్తోన్న అపార్ట్ మెంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది. అక్కడికి కూలీగా వచ్చాడు డీగో. ఓ రోజు అందరూ భోజనం చేయడానికి వెళ్లారు. ఆకలిగా లేకపోవడంతో డీగో మాత్రం పని చేస్తున్నాడు. ఇనుపరాడ్లను సుత్తితో కొడు తున్నాడు. అంతలో ఆడ్రియానా వచ్చింది. చాలా శబ్దం వస్తోందని, పాప నిద్ర పాడ వుతోంది మెల్లగా పని చేసుకొమ్మని అంది. నువ్వే సర్దుకుపో అంటూ నిర్లక్ష్యంగా సమా ధానమిచ్చాడు డీగో. ఆడ్రియానా ఏదో చెప్పబోతే ఎగ తాళిగా మాట్లాడాడు. ఆమెకు కోపం వచ్చింది. వెళ్లి అపార్ట్ మెంట్ యజమానికి ఫిర్యాదు చేసింది. అతడు కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్‌కి విషయం చెప్పాడు. అతడు డీగోని పిలిచి క్లాసు పీకాడు. దాంతో పగబట్టాడు డీగో. నవంబర్ 1 సాయంత్రం క్రష్ నుంచి పాపను తీసుకుని ఇంటికొచ్చింది ఆడ్రియానా. కార్ పార్క్ చేసి తన ఫ్లాట్‌కి వెళ్తోన్న ఆమెను అనుసరించాడు డీగో. ఆమె వెనకాలే అపార్ట్మెంట్లోకి దూసు కెళ్లాడు. ఆడ్రియానా మీద దాడి చేశాడు. ఆమె చెప్పేది కనీసం వినకుండా పీక నులిమి చంపేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు బాత్రూమ్లోకి తీసుకెళ్లి దుప్పటితో ఉరి వేశాడు. అంతా విని చాచి కొట్టాడు ఇన్స్పెక్టర్. ‘‘మనిషివా రాక్షసుడివా! చిన్నబిడ్డకు తల్లి. ఆ పాప కళ్లముందే తల్లిని చంపేశావ్. అది కూడా చిన్న కారణానికి. నిన్నేం చేసినా పాపం లేదు... ఛీ’’ అనేసి బయటకు వచ్చే శాడు. అతడి కోసమే ఎదురు చూస్తోన్న ఆండీ కంగారుగా లేచి దగ్గరకు వెళ్లాడు. ‘‘ఏమైనా చెప్పాడా?’’ అన్నాడు ఆతృతగా. ‘‘సారీ ఆండీ... మిమ్మల్ని అనుమా నించాను. మీ భార్యను చంపింది వీడే’’ అని, ఏం జరిగిందో చెప్పాడు. ఆండీ కళ్లలో నీళ్లు పొంగుకొచ్చాయి. ‘‘అంత చిన్నదానికి నా భార్యను చంపేశాడా? చేతులెలా వచ్చాయి సర్ వాడికి? నా బిడ్డను తల్లి లేనిదాన్ని చేశాడు’’ అంటూ చేతుల్లో ఉన్న పాపను గుండెకు హత్తుకు న్నాడు. ఓదార్పుగా అతని భుజమ్మీద చేయి వేశాడు ఇన్స్పెక్టర్. ‘‘అసలు వాడే చంపి ఉంటాడని మీకెలా అనుమానం వచ్చింది సర్’’... అడిగాడు ఆండీ. ‘‘రెండోసారి బాత్రూమ్ని పరిశీలించి నప్పుడు ఇసుక కనిపించింది. అప్పుడే నా దృష్టి కన్స్ట్రక్షన్ వర్క్ మీద పడింది. అక్కడ మాత్రమే ఇసుక ఉంది. అది ఆడ్రియానా చెప్పులకు అంటుకునే చాన్స్ లేదు. తర్వాత ఇంట్లోకి వచ్చిన నీ బూట్లకూ అంటుకునే అవకాశం లేదు. కచ్చితంగా అక్కడి నుంచే ఎవరో వచ్చి ఉంటారనిపించింది. అందరి గురించీ ఎంక్వయిరీ చేస్తే గతంలో డీగో మీద ఆడ్రియానా కంప్లయింట్ ఇచ్చిన విషయం బయటికొచ్చింది. వాణ్ని లాక్కొచ్చి నాలుగు పీకితే నిజం కక్కాడు.’’ ‘‘మ్మ్మ్... నా భార్య ఎన్నో కథలు రాసింది. వీడు మాత్రం తన నుదుటన నెత్తుటి రాత రాశాడు. వస్తాను సర్’’ అనేసి వెళ్లిపోతోన్న ఆండీ వైపు జాలిగా చూస్తూండిపోయాడు ఇన్స్పెక్టర్. ఆడ్రియానా భర్త ఆండీ, వారి ప్రేమకు ప్రతిరూపం సోఫియా ఆవేశంలో చేసినా, డీగో చేసిన నేరాన్ని తీవ్రగానే పరిగణించింది న్యాయస్థానం. పెరోల్ తీసుకునే అవకాశం కూడా లేకుండా పాతికేళ్ల కఠిన కారాగారశిక్షను విధించింది. ప్రస్తుతం అతను జైలులో మగ్గుతున్నాడు. ఆడ్రియానా గుర్తుగా ‘ఆడ్రియానా షెల్లీ ఫౌండేషన్’ను స్థాపించాడు ఆమె భర్త ఆండీ. దాని ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ను, పేద రోగులకు వైద్య సహాయాన్ని, పేద కళాకారులకు ఆర్థిక సాయాన్నీ అందిస్తున్నాడు. తమ ప్రేమకు గుర్తుగా మిగిలిన కూతురు సోఫీ (ప్రస్తుతం ఏడేళ్లు)ని గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు. - సమీర నేలపూడి -
చైనా సంస్థ చేతికి న్యూయార్క్ వాల్డార్ఫ్ ఆస్టోరియా హోటల్
న్యూయార్క్: న్యూయార్క్‌లోని మన్‌హటన్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హోటల్ వాల్డార్ఫ్ ఆస్టోరియా చేతులు మారనున్నది. ఈ హోటల్‌ను చైనాకు చెందిన బీమా కంపెనీ అన్బాంగ్ ఇన్సూరెన్స్ గ్రూప్ 195 కోట్ల డాలర్లకు హిల్టన్ వరల్డ్‌వైడ్ నుంచి కొనుగోలు చేయనున్నది. ఈ కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఈ హోటల్ నిర్వహణ బాధ్యతలను రానున్న వందేళ్ల పాటు హిల్టన్ వరల్డ్‌వైడ్ చూస్తుంది. ఈ హోటల్లో పీకాక్ అల్లే, బుల్ అండ్ బేర్, ప్రైమ్ స్టీక్‌హౌస్, ఆస్కార్స్ వంటి రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ హోటల్‌ను భారీగా పునర్నిర్మాణం చేయనున్నామని ఇరు కంపెనీలు వెల్లడించాయి. ఈ హోటల్ విక్రయం ద్వారా వచ్చిన నిధులతో మరిన్ని హోటళ్లను కొనుగోలు చేయాలని హిల్టన్ వరల్డ్‌వైడ్ యోచిస్తోంది. -
భారతీయ రచయిత దినేష్ డిసౌజ్ కు ఊరట!
న్యూయార్క్: ఫెడరల్ క్యాంపెన్ ఫైనాన్స్ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణల కేసులో భారత సంతతికి చెందిన రచయిత, కామెంటేటర్ దినేష్ డి సౌజాకు ఊరట లభించింది. 2012లో నిర్వహించిన చట్టవ్యతిరేక కాంపెన్ సేవల ద్వారా 20 వేల డాలర్లు కూడగట్టుకునారనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసును మాన్ హట్టన్ కోర్టు విచారించి గతంలో 16 నెల జైలుశిక్ష విధించారు. అయితే తాజాగా జైలుశిక్షకు బదులుగా 30 వేల డాలర్ల జరిమానా, ఐదు సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని విధించారు. ప్రోబేషన్ కాలంలో కమ్యూనిటి కన్ ఫైన్ మెంట్ సెంటర్ లో వారంలో ప్రతిరోజు ఎనిమిది గంటలపాటు శిక్షణ తరగతుల్ని నిర్వహించాలని కోర్టు తీర్పునిచ్చింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ 2012లో 2016: 'ఒబామాస్ అమెరికా' ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. 'ది రూట్స్ ఆఫ్ ఒబామాస్ రేజ్' అనే పుస్తకాన్ని కూడా రచించారు. గత మే నెలలో తనకు విధించిన శిక్షను ఓ పిచ్చి ఐడియా. తప్పుడు నిర్ణయం. తెలివితక్కువ పని అని దినేష్ వ్యాఖ్యలు చేశారు. -
న్యూయార్క్ పేలుళ్లలో ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో బుధవారం ఉదయం మన్ హట్టన్ లోని ఈస్ట్ హార్లెమ్ లో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 18 మందికి గాయలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద ఉన్న బాధితులను రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని హార్లెమ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఓ శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. విద్యుత్ నిలిపివేసేందుకు, గ్యాస్ లైన్లను మూసి వేసేందుకు సంబంధిత సిబ్బంది పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం ఉదయం ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో వందలాది మంది రోడ్లపైకి వచ్చారు. చాలా మంది తీవ్ర ఆందోళనకు గురికాగా, మరికొందరు దిగ్ర్బాంతికి గురయ్యారు. ఈ ఘటనకు కారణమేమి తెలియరాలేదు. అయితే గ్యాస్ లీక్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
'హాలీవుడ్ దర్శకుడు వూడీ అలెన్ లైంగికంగా వేధించాడు'
పెంచుకున్న కూతురుపై ఓ హాలీవుడ్ దర్శకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన సభ్య వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన గోల్టెన్ గ్లోబ్ అవార్డుల్లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు దక్కించుకున్న వూడీ అలెన్ తనను ఏడేళ్ల వయసులోనే లైంగికంగా వేధించాడని పెంపుడు కూతురు డైలాన్ ఫారో వెల్లడించినట్టు ది న్యూయార్క్ టైమ్స్ ఆన్ ఎడిషన్ లో ఓపెన్ లెటర్ లో కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటన 90 దశక ఆరంభంలో తనపై లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆన్ లైన్ ఎడిషన్ కు రాసిన ఓపెన్ లెటర్ లో పేర్కొంది. తాను ఏడేళ్ల వయస్సులో ఉండగా తనను అలెన్ లైంగికంగా వేధించారని, ఈ విషయాన్ని తన పెంపుడు తల్లి, నటి మియా ఫారోకు తెలిపానని, కాని అప్పటికే తన పెంపుడు తల్లి అలెన్ తో వైవాహిక సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నారని లెటర్ లో ఫారో పేర్కోంది. 1993 లో ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఆయన కేసు విచారణకు రాకుండా అడ్డుకోవడంలో సఫలమయ్యారని 28 ఏళ్ల ఫారో అన్నారు. అలెన్ తనపై లైంగిక దాడులకు పాల్పడటంతో తన ఆరోగ్యం క్షీణించిందని, జీర్ణ సంబంధమైన సమస్యలు తలెత్తాయని..అంతేకాకుండా ఓ వ్యక్తితో రిలేషన్ కూడా దెబ్బతిందని తెలిపారు. ఆతర్వాత టెలివిజన్, పోస్టర్ లో అలెన్ ను చూస్తే భయమేస్తుందని ఆమె అన్నారు. అలెన్ వ్యవహారాన్ని హాలీవుడ్ నటులు కూడా పట్టించుకోలేదని ఆమె విమర్శించారు.