Anand Mahindra Reply To Twitter User Comment On His Manhattan Tweet - Sakshi
Sakshi News home page

Anand Mahindra: సార్‌ మీరు ‘ఎన్నారై’యేనా!.. ఆనంద్‌ మహీంద్రా రిప్లై అదిరింది!

Published Wed, Jul 6 2022 2:31 PM | Last Updated on Wed, Jul 6 2022 3:25 PM

 Anand Mahindra Reply To Twitter User Comment On His Manhattan Tweet - Sakshi

దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సమకాలిన అంశాలతో స్పందిస్తూ రకరకాల పోస్ట్‌లను షేర్‌ చేయడమే కాదు. నెటిజన్లకు అడిగిన ప్రశ్నలకు రిప్లయి ఇస్తారు. కొన్నిసార్లు ట్విట్టర్ యూజర్ల విచిత్రమైన ప్రశ్నలకు ఆనంద్‌ మహీంద్రా చమత్కారంగా జవాబు ఇస్తుంటారు.

కొన్నిసార్లు ఆయన స‍్పందనలు నెటిజన్లను నవ్వులు పూయిస్తాయి. అలాంటి మహీంద్రాను ఓ నెటిజన్‌ మీరు ఎన్నారైనా? అని అడిగినందుకు ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఆ రిప్లై సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

దేశీయ బిజినెస్ టైకూన్ ఆనంద్‌ మహీంద్రా అమెరికా న్యూయార్క్‌ సిటీ మాన్హాటన్‌లో ఉన్నారు. మాన్హాటన్‌లో ఉన్న ఆయన నగర అందాల్ని వర్ణిస్తూ ఫోటోల్ని, వీడియోల్ని ట్వీట్‌ చేశారు. వాటికి సంబంధించిన ట్వీట్‌లకు రిప్లయ్‌ ఇస్తుండగా..ఓ నెటిజన్‌ ఆనంద్‌ మహీంద్రాను “మీరు ఎన్నారైనా?” అని అడగ్గా..అందుకు మహీంద్రా చమత్కారంగా నేను 'హెచ్‌ఆర్‌ఐ'(మహీంద్రా రెసిడెంట్ ఆఫ్ ఇండియా) అని బదులిచ్చారు.  

దీంతో నెటిజన్లు తమదైన శైలిలో ఆనంద్‌ మహీంద్రాను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “హా హా బాగుంది! మీ దిల్ హై హిందుస్తానీ! అని మాకు బాగా తెలుసు అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేస్తే..“సర్. మీరు ఎంఆర్‌ఐ (మహీంద్రా రెసిడెంట్ ఆఫ్ ఇండియా)” అని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement