భళా శీతల్‌... నీకు గిఫ్ట్‌ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను | Anand Mahindra tweet goes viral on SheetalDevi Paralympics 2024 | Sakshi
Sakshi News home page

భళా శీతల్‌... నీకు గిఫ్ట్‌ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను

Published Mon, Sep 2 2024 2:50 PM | Last Updated on Mon, Sep 2 2024 3:09 PM

Anand Mahindra tweet goes viral on SheetalDevi Paralympics 2024

అద్భుతం తల్లీ, నువ్వు  దేశానికే  కాదు ప్రపంచానికి కూడా స్ఫూర్తి దాయకం- ఆనంద్‌ మహీంద్ర

పారిస్ పారాలింపిక్స్‌లో  ఆర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో  యావత్‌ క్రీడా ప్రపంచాన్నీ అబ్బురపర్చింది. 17 ఏళ్ల శీతల్‌ త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ అదిరిపోయే షాట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర కూడా  ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. అసాధారణ ధైర్యం, నిబద్ధత, పట్టువదలని స్ఫూర్తి పతకాలతో ముడిపడి ఉండదు అంటూ ట్వీట్‌ చేశారు. మీరు దేశానికి, మొత్తం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం అంటూ సోషల్‌ మీడియా వేదికగా శీతల్ దేవిని అభినందించారు. 
 

అలాగే ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌గా  సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.  ‘‘18 ఏళ్లు నిండిన తర్వాత ఆఫర్‌(కారు బహుతి) స్వీకరిస్తారని చెప్పారు. దీని ప్రకారం వచ్చే ఏడాది కారు మీ చేతికి వస్తుంది.  మీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు  ఎదురు చూస్తున్నాను’’ అంటూ  పోస్ట్‌ పెట్టారు ఆనంద్‌ మహీంద్ర.

కాగా పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో  యువ పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రిక్వార్టర్స్‌కు చేరి అరుదైన రికార్డు సాధించింది.  తాజాగా ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ కాలి ఫీట్‌తో అందరూ మెస్మరైజ్‌ అయిపోయారు. ఆమె చేతులకు బదులుగా కాలితో విల్లు ఎక్కి పెట్టిన దృశ్యం వైరల్‌ గా మారింది.  ప్రత్యర్థి వీల్ చైర్‌లోకూర్చుని చేతులతోనే బాణం వేసి పతకాన్ని కైవసం చేసుకోవడంతో తృటిలో పతకం చేజారింది. అయితే శీతల్‌ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచంలో కొద్దిమందిగా ఉన్న ఆర్మ్‌లెస్ ఆర్చర్లలో పిన్న వయసు ఆర్చర్‌గా శీతల్ గుర్తింపు తెచ్చుకుంది. దీంతో శీతల్‌ మున్ముందు అద్భుతాలు సాధిస్తుందంటూ పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులు కొని యాడారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement