నిమిషంలో 11 వాయిద్యాలు సూపర్ టాలెంట్ : ఆనంద్ మహీంద్ర
టాలెంట్ ఓ ఒక్కరి సొత్తూ కాదు. ఆధునిక ప్రపంచంలో తనకంటూ ఒక స్పెషాల్టీ సాధించాలంటే ఒక ప్రత్యేకమైన ప్రతిభను సొంతం చేసుకోవాలి. అందరికంటే భిన్నంగా ఉన్నతంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రతిభకు గుర్తింపు,పాపులారిటీ వస్తుంది. అలాంటి వారిలో ప్రముఖ గాయకుడు, రచయిత ఒకరు రాఘవ్ సచార్. అందుకే ఆయన ఆనంద్‌మహీంద్ర పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర దృష్టిని ఆకర్షించారు. అసమాన ప్రతిభ అంటూ రాఘవ్ సచార్ అద్భుమైన టాలెంట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు వాయించాడు అనే కాప్షన్‌తో రాఘవ్ సచార్ వీడియోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు రాఘవ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. మరోవైపు తన వీడియో షేర్ చేయడంపై స్పందించిన రాఘవ్ ఆనంద్ మహీంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Thank you so much sir. Means the world coming from you 🙏. Am truly honoured for your kind words 😊❤️ https://t.co/23AkRAa6y0
— Raghav Sachar (@raghavsachar) September 1, 2024
2001 నాటి హిట్ ‘దిల్ చాహ్తా హై ’ టైటిల్ ట్రాక్‌ను విభిన్న వాయిద్యాలతో వీనుల విందుగా వాయించాడు. శాక్సోఫోన్ ,వేణువు, హ్యాండ్ ప్యాన్ ఇలా పలు రకాల వాయిద్యాలతో మంత్రముగ్ధుల్ని చేశాడు. ఈ వీడియో చూస్తే మీరు కూడా వావ్.. అంటారు.
ఎవరీ రాఘవ్ సచార్
మ్యూజిక్ ఫ్యామిలీలో పుట్టిన రాఘవ్ సచార్‌కు చిన్నప్పటినుంచీ సంగీతం మీద ఆసక్తి. ముఖ్యంగా ఒకేసారి పలు వాయిద్యాలను వాయించడంలో ఆరితేరాడు. 2003లో స్పెషల్ ఆల్బబ్‌తో గాయకుడు పేరు తెచ్చుకున్నాడు. అలాగే కాబూల్ ఎక్స్‌ప్రెస్ (2006)లో బాలీవుడ్ సంగీత దర్శకుడి అరంగేట్రం చేశాడు. ఇంకా బిట్టూ బాస్, వన్‌టూత్రీ లాంటి సినిమాలకు పనిచేశాడు. అలాగే సలామ్ నమస్తే, పరిణీత, ధూమ్, కల్, హమ్ తుమ్, యహాన్, బ్లాక్ ఫ్రైడే, కల్ హో నా హో, డాన్ కొన్నింటిని పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు 150కి పైగా సినిమాల్లో తన వాయిద్య ప్రతిభను చాటుకున్నాడు. పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
ఆస్కార్‌విన్నర్ ఏఆర్ రెహ్మాన్,విశాల్-శేఖర్, శంకర్-ఎహసాన్-లాయ్, సలీం-సులైమాన్, అను మాలిక్ సహా అనేకమంది సంగీత దర్శకులతో కలిసి పనిచేశాడు. అంతేకాదు ఇంటర్నేషనల్ జాజ్ డ్రమ్మర్ డేవ్ వెక్ల్ , సోను నిగమ్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, కైలాష్ ఖేర్, శంకర్ మహదేవన్, అద్నాన్ సమీ, శుభా ముద్గల్, నీరజ్ శ్రీధర్, కునాల్ గంజావాలా, శివమణి, నిలాద్రి వంటి ప్రముఖ కళాకారులతో కూడా రికార్డ్ చేసి ప్రదర్శించారు. కుమార్, తౌఫిక్ ఖురేషి, లూయిస్ బ్యాంక్స్, రంజిత్ బారోట్, తదితరులో కలిసి అనేక ప్రదర్శనలిచ్చాడు. రాఘవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment