సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన 'ఎక్స్' (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మొబైల్ ఓవర్‌పాస్ బ్రిడ్జి కనిపిస్తుంది. దీనిపైన వెహికల్స్ వెళ్లడం చూడవచ్చు. నిజానికి అక్కడ రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందో స్పష్టంగా వెల్లడి కాలేదు.
ఎక్కడైనా రోడ్ నిర్మాణం జరిగితే.. అక్కడ వాహనాల రాకపోకలకు రూట్ మారుస్తారు. కానీ వీడియోలో గమనిస్తే.. కింద రోడ్డు పనులు జరుగుతున్నాయి. పైన యధావిధిగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పనులు కొనసాగించేందుకు వీలుగా ఒక మొబైల్ ఓవర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు.
ఈ వీడియో షేర్ చేస్తూ.. మనం కూడా ఇలాంటి ఆపరేటింగ్ విధానాన్ని చేయగలమా? అన్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను వేలమంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
A mobile overpass bridge.
Allows work to continue without traffic being disrupted.
Like everything innovative, it looks so obvious after it’s introduced.
Can we make this ‘standard operating procedure’ please?
pic.twitter.com/RYvPuxDtVO— anand mahindra (@anandmahindra) May 25, 2024
Comments
Please login to add a commentAdd a comment