
కోల్‌కతా నుంచి చెన్నైకి కేవలం మూడు గంటల్లో ప్రయాణించడం సాధ్యమేనా అని కొందరు అనుకోవచ్చు. కానీ ఇది త్వరలోనే సాధ్యమవుతుంది. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ 'వాటర్ ఫ్లై టెక్నాలజీస్' తయారు చేసిన ఈ-ఫ్లైయింగ్ బోట్ ద్వారా ఇది సాకారమవుతుంది. ఐఐటీ మద్రాస్ సాయంతో ఈ సంస్థ తయారు చేసిన వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) (wing-in-ground (WIG)) క్రాఫ్ట్ ద్వారా కోల్‌కతా నుంచి చెన్నైకి కేవలం మూడు గంటల్లో ప్రయాణించవచ్చని.. నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ఆనంద్ మహీంద్రాను సైతం ఫిదా చేసింది.
స్టార్టప్‌లను పెంచడంలో సిలికాన్ వ్యాలీకి పోటీగా నిలుస్తామని ఐఐటీ మద్రాస్ హామీ ఇచ్చింది. దాదాపు ప్రతి వారం కొత్త 'టెక్ వెంచర్'లకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) క్రాఫ్ట్ నన్ను ఎంతగానో ఆకట్టుకుందని 'ఆనంద్ మహీంద్రా' ట్వీట్ చేశారు.
బెంగళూరులోని ఏరో ఇండియా 2025లో వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్)ను ఆవిష్కరించారు. ఇది కేవలం రూ.600 ఖర్చుతో మూడు గంటల్లో చెన్నై- కోల్‌కతా మధ్య ప్రయాణం చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ప్రజల దృష్టిని కూడా ఎంతగానో ఆకర్శించింది.
వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్)
ఈ-ఫ్లయింగ్ బోట్ ‘విగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్’ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నీటి నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో ఇది ఎగురుతుంది. ఇది గాల్లో నిలకడగా ఎగురుతూనే నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లయింగ్ బోట్ విగ్ క్రాఫ్ట్ పూర్తిస్తాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నుంచి కోల్‌కతాకు 1,600 కిలోమీటర్లు ప్రయాణానికి సీటుకు కేవలం రూ.600 ఖర్చు అవుతుందని అంటున్నారు.
IIT Madras promises to rival silicon valley in terms of nurturing startups…!
Almost every week there’s news of a new ‘TechVenture’
What I like about this one is not just the promise of exploitation of our vast waterways, but the fact that the design of the craft is stunning!… https://t.co/UttbRFYQGW— anand mahindra (@anandmahindra) February 25, 2025
Comments
Please login to add a commentAdd a comment