ఆ రోజుల్లో ఈ డిజైన్ చూసి ఉంటే?: ఆనంద్ మహీంద్రా | Sunday is Perfect for Paper Planes Anand Mahindra | Sakshi
Sakshi News home page

ఆ రోజుల్లో ఈ డిజైన్ చూసి ఉంటే?: ఆనంద్ మహీంద్రా

Published Sun, Aug 25 2024 3:18 PM | Last Updated on Sun, Aug 25 2024 3:39 PM

Sunday is Perfect for Paper Planes Anand Mahindra

దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఇప్పుడు ఓ పేపర్ ప్లేన్‌కు సంబంధించిన వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పేపర్ ప్లేన్ రూపొందించడం చూడవచ్చు. బహుశా ఇలాంటివి చిన్నప్పుడు అందరూ చేసి ఉంటారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ''పిల్లలకు ఇంకా ఇలాంటి వాటిమీద ఆసక్తి ఉందో లేదో తెలియదు, కానీ నా స్కూల్‌ రోజుల్లో చాలా దూరం ప్రయాణించే పేపర్‌ ప్లేన్‌ని డిజైన్‌ చేయాలనే ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో నేను ఈ డిజైన్‌ని చూసి ఉంటే... పోటీలో తేలికగా గెలిచి ఉండేవాడిని'' అని వెల్లడించారు.

నిజానికి పేపర్ ప్లేన్స్ అనేవి వివిధ రకాలుగా తయారు చేయవచ్చు. అయితే ఎక్కువ దూరం ప్రయాణించే పేపర్ ప్లేన్ తయారు చేయడానికి కొన్ని టిప్స్ అవసరం. అలాంటివి ఈ వీడియోలో చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఈ వీడియో వేల లైక్స్ పొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement