సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) మండే మోటివేషన్ పేరుతో తాజాగా ఓ వీడియో షేర్ చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. నాలుగు చక్రాలు, ఒక మోటార్ కలిగిన ఓ బొమ్మ వెహికల్ కనిపిస్తుంది. అది ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లాలంటే.. ఓ చిన్న బ్రిడ్జిలాంటి నిర్మాణాన్ని దాటాల్సి ఉంది. ప్రారంభంలో ఆ కారు ముందుకు వెళ్లి అక్కడే ఆగిపోతుంది. ఆ తరువాత చక్రాలను ఆ బ్రిడ్జి మీద వెళ్ళడానికి అనుకూలంగా ఫిక్స్ చేసినప్పుడు అది సజావుగా ముందుకు సాగింది. ఇలా అక్కడ ఏర్పరచి బ్రిడ్జి మీద వెళ్ళడానికి చక్రాలను అనుకూలంగా ఫిక్స్ చేయడం జరుగుతుంది. చివరకు దారంలాంటి నిర్మాణం మీద నుంచి కూడా కారు ముందుకు వెళ్లగలిగింది.
ఈ వీడియోలో కనిపించిన బొమ్మ వెహికల్ ముందుకు వెళ్లగలిగింది అంటే.. అక్కడున్న మార్గానికి అనుకూలంగా దాన్ని క్రియేట్ చేయడమే. అలా చేయడం వల్లనే.. అది సులభంగా ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లగలిగింది.
వీడియో షేర్ చేస్తూ.. మీలో క్రియేటివిటీ ఉంటే తప్పకుండా సాధించగలరు, అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. దీనికి మండే మోటివేషన్ అని ట్యాగ్ చేశారు. ఇప్పటికే వేల వీక్షణలు పొందిన వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెట్ల వర్షం కురిపిస్తున్నారు.
There is no chasm that creative and solution-oriented thinking won’t help you cross…#MondayMotivation
pic.twitter.com/uExm8r7goq— anand mahindra (@anandmahindra) November 18, 2024
Comments
Please login to add a commentAdd a comment