creative
-
క్రియేటివిటీ ఉంటే.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చూశారా?
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) మండే మోటివేషన్ పేరుతో తాజాగా ఓ వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. నాలుగు చక్రాలు, ఒక మోటార్ కలిగిన ఓ బొమ్మ వెహికల్ కనిపిస్తుంది. అది ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లాలంటే.. ఓ చిన్న బ్రిడ్జిలాంటి నిర్మాణాన్ని దాటాల్సి ఉంది. ప్రారంభంలో ఆ కారు ముందుకు వెళ్లి అక్కడే ఆగిపోతుంది. ఆ తరువాత చక్రాలను ఆ బ్రిడ్జి మీద వెళ్ళడానికి అనుకూలంగా ఫిక్స్ చేసినప్పుడు అది సజావుగా ముందుకు సాగింది. ఇలా అక్కడ ఏర్పరచి బ్రిడ్జి మీద వెళ్ళడానికి చక్రాలను అనుకూలంగా ఫిక్స్ చేయడం జరుగుతుంది. చివరకు దారంలాంటి నిర్మాణం మీద నుంచి కూడా కారు ముందుకు వెళ్లగలిగింది.ఈ వీడియోలో కనిపించిన బొమ్మ వెహికల్ ముందుకు వెళ్లగలిగింది అంటే.. అక్కడున్న మార్గానికి అనుకూలంగా దాన్ని క్రియేట్ చేయడమే. అలా చేయడం వల్లనే.. అది సులభంగా ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లగలిగింది.వీడియో షేర్ చేస్తూ.. మీలో క్రియేటివిటీ ఉంటే తప్పకుండా సాధించగలరు, అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. దీనికి మండే మోటివేషన్ అని ట్యాగ్ చేశారు. ఇప్పటికే వేల వీక్షణలు పొందిన వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెట్ల వర్షం కురిపిస్తున్నారు.There is no chasm that creative and solution-oriented thinking won’t help you cross…#MondayMotivationpic.twitter.com/uExm8r7goq— anand mahindra (@anandmahindra) November 18, 2024 -
The Little Theatre: వందలాది పిల్లల అమ్మ
‘ఆరంభ శూరత్వం’ చాలామందిలో కనిపిస్తుంది. అయితే చెన్నైకి చెందిన అయేషా మేడమ్‌లో అది మచ్చుకైనా కనిపించదు. మూడు దశాబ్దాల క్రితం నాటకరంగంలోకి అడుగు పెట్టిన అయేషా పిల్లల్లో సృజనాత్మక కళల వికాసానికి ‘ది లిటిల్ థియేటర్’ ప్రారంభించింది. కాలంతో పాటు నడుస్తూ కొత్త ఆలోచనలు జత చేస్తూ థియేటర్‌ను ఎప్పటికప్పుడు క్రియాశీలంగా, నిత్యనూతనంగా నిర్వహిస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ‘క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేయాలని ఉంది’ అని తన మనసులో మాటను తండ్రి దగ్గర బయట పెట్టింది అయేషా. ఆయన ప్రోత్సాహకరంగా మాట్లాడారు. అలా తండ్రి–కూతురు ఆలోచనల్లో నుంచి వచ్చిందే ది లిటిల్ థియేటర్ ట్రస్ట్. ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత చాలామందిలో కరుగుతూ పోతుంది. కాని మూడు దశాబ్దాలు దాటినా ‘ది లిటిల్ థియేటర్’ ఉత్సాహం. సృజన శక్తి రవ్వంత కూడా తగ్గలేదు. ‘ఇంకా కొత్తగా ఏం చేయవచ్చు’ అని ఆలోచిస్తూ వెళుతోంది ది లిటిల్ థియేటర్. కళలు, ఆరోగ్యాన్ని మేళవించి 2015లో చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో ‘హాస్పిటల్ క్లౌన్స్’ను పరిచయం చేసింది లిటిల్ థియేటర్. కీమో థెరపీ చేయించుకునే పిల్లలకు ‘క్రియేటివ్ థెరపీ’ అందిస్తోంది. ‘లిటిల్ థియేటర్’ ద్వారా ఏడాది పొడవునా సృజనాత్మక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లల కోసం ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఫైర్ కథల కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. కోవిడ్ కల్లోల సమయంలో ‘లిటిల్ థియేటర్’ ఆన్‌లైన్‌లోకి వచ్చింది. మల్టీ–కెమెరా సెటప్‌తో షోలను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవారు. యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతోమందికి చేరువ అయింది. వన్స్ అపాన్ ఏ టైమ్ తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తూ ‘పిల్లలకు క్లాసు, హోంవర్క్ తప్ప మరో వ్యాపకం లేకుండా ఉంది’ అని నిట్టూర్చింది అయేషా. విదేశాల్లో ఉన్నత చదువు చదివిన అయేషా అక్కడ పిల్లల సృజనాత్మక వికాసానికి ఎన్నో వేదికలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడ వాటి కొరత ఉంది అని గ్రహించి ‘ది లిటిల్ థియేటర్’కు శ్రీకారం చుట్టింది. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లితో ‘నాకు వందలాది పిల్లలు పుడతారు’ అని చెప్పింది చిన్నారి అయేషా. కూతురు మాట విని తల్లి పెద్దగా నవ్వింది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ‘నా మాట నిజమైంది. ఇప్పుడు నాకు వందలాది పిల్లలు. ది లిటిల్ థియేటర్‌కు దగ్గరైన వాళ్లందరూ నా పిల్లలే’ అంటుంది అయేష. స్కూల్ ముగిసిన తరువాత పిల్లల కోసం నాటకానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను పరిచయం చేసే కార్యక్రమాల నుంచి కుండల తయారీ వర్క్‌షాప్‌ల వరకు ఎన్నో నిర్వహించింది ది లిటిల్ థియేటర్. ‘ది లిటిల్ థియేటర్’ ట్రస్టు ప్రతి సంవత్సరం వందలాది మంది నిరుపేద పిల్లలకు సహాయపడుతుంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న అయేషా థియేటర్‌కు సంబంధించి సృజనాత్మక కార్యకలాపాలను మాత్రం యువతరానికే అప్పగించింది. ‘ప్రతిభావంతులైన యువతరానికి సృజనాత్మక బాధ్యతలు అప్పగిస్తే కంటెంట్‌లో కొత్తదనం కనిపిస్తుంది. సంస్థ మరింత ముందు వెళుతుంది’ అంటుంది అయేషా. ‘నాటకరంగంలోకి అడుగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా, నేర్చుకున్నది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు ఆమె మాటల్లోనే... ‘నాటకరంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. అయినప్పటికీ నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనిపిస్తుంది. నాటకరంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ కోర్సులలో చేరుతుంటాను. నేను నేర్చుకున్నదాన్ని లిటిల్ థియేటర్‌కు తీసుకువస్తుంటాను’ అంటోంది అయేషా. క్రియేటివ్ థెరపీ హాస్పిటల్ వాతావరణంలో గాంభీర్యం, విషాదం, నిర్వేదం మిళితమై కనిపిస్తుంటాయి. ఈ వాతావరణాన్ని మార్చడానికి ఆస్పత్రిలో చేరిన పిల్లల్లో హుషారు తెప్పించడానికి, వారి పెదవులపై నవ్వులు మెరిపించడానికి చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో ది లిటిల్ థియేటర్ ‘క్రియేటివ్ థెరపీ’ నిర్వహిస్తోంది. కథల కార్యక్రమం నుంచి తోలుబొమ్మలాట వరకు రకరకాల సృజనాత్మక కళలలో పేషెంట్లుగా ఉన్న పిల్లలను కలుపుకుంటూ వారిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతారు. ‘క్రియేటివ్ థెరపీ’ కోసం హాస్పిటల్లో ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ ఏసీ స్టూడియోలో పెర్ఫార్మెన్స్ లైట్లు, సౌండ్ సిస్టమ్స్, డిజిటల్ టీవీ స్క్రీన్, వర్క్‌షాప్‌కు సంబంధించి రకరకాల వస్తువులు ఉంటాయి. హాస్పిటల్‌లోని పిల్లల దిగులును దూరం చేయడంలో క్రియేటివ్ థెరపీ సత్ఫలితాలు ఇచ్చింది. హాస్పిటల్‌లోని పిల్లల కోసం షెల్ఫ్‌ల నిండా బట్టలు, బొమ్మలు, కలరింగ్ బుక్స్... మొదలైనవి ఏర్పాటు చేశారు. ఇతర హాస్పిటల్స్ కూడా పిల్లల కోసం ‘ఆర్ట్ థెరపీ’ని మొదలుపెట్టాయి. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రకరకాల పూల మొక్కలు, ప్లే పార్క్, పిట్టగూళ్లతో పేషెంట్ల కోసం ‘హ్యాపీ ప్లేస్’ను ప్రారంభించింది. మా అదృష్టం ‘చదువే కాదు మా పిల్లలకు కళలు కూడా కావాలి’ అంటున్న తల్లిదండ్రుల పరిచయం నిజంగా మా అదృష్టం. ‘చదువు తప్ప మా పిల్లలకు ఏమీ అవసరం లేదు’ అని వారు అనుకొని ఉంటే ది లిటిల్ థియేటర్ ఇంత దూరం వచ్చేది కాదు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది కాదు. డబ్బున్న కుటుంబం, డబ్బు లేని కుటుంబం అని తేడా లేకుండా పిల్లలందరూ కళలతో మమేకం కావాలి. మనిషి సంపూర్ణ మానవుడిగా మారడానికి కళలు ఉపయోగపడతాయి. – అయేషా, ఫౌండర్, ది లిటిల్ థియేటర్ -
ప్రతిష్టాత్మక 'ఐఏఏ' అవార్డు విజేతలు వీరే..
ఇండియా చాప్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) తన ప్రతిష్టాత్మకమైన IndAA అవార్డుల ఎనిమిదవ ఎడిషన్ కార్యక్రమాన్ని 2023 సెప్టెంబర్ 1న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు ఏబీపీ నెట్వర్క్ అండ్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్ కో-పార్ట్నర్గా ఉండగా.. నెట్వర్క్18 & జియో సినిమా అసోసియేట్ పార్ట్నర్గా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో 15 క్రియేటివ్ ఏజెన్సీలు 18 ప్రోడక్ట్ అండ్ సర్వీస్ కేటగిరీలు.. ఒక ప్రత్యేక కేటగిరీలో అవార్డులు పొందాయి. అవార్డులలో 102 క్యాంపెయిన్స్ షార్ట్‌లిస్ట్ చేయగా.. వీటిలో డిజైన్ ప్రకారం, ప్రతి విభాగంలో ఒకటి మాత్రమే ఇవ్వడం జరిగింది. క్లోజ్ కాంటెస్ట్ విషయంలో మాత్రం జ్యూరీ చాలా చర్చల తర్వాత ఉమ్మడి విజేతలను ప్రకటించింది. క్రియేటివ్ ఏజెన్సీలలో లియో బర్నెట్, ముల్లెన్‌లోవ్ లింటాస్ గ్రూప్, ఒగిల్వీ ఆ కేటగిరీలో ఒక్కొక్కటి మూడు IndIAA అవార్డులను గెలుచుకున్నారు. కాగా బీబీడీవో, డీడీబీ ముద్ర అండ్ టీబీడబ్ల్యుఏ రెండు అవార్డులను గెలుచుకున్నాయి. గ్రే గ్రూప్, కెహత్ కబీరా పిక్చర్స్, మెక్కాన్ వరల్డ్‌గ్రూప్, పబ్లిసిస్ వరల్డ్‌వైడ్, రీడిఫ్యూజన్, ఎస్జీ మీడియా, టాలెంటెడ్, ది స్క్రిప్ట్ రూమ్, ది వోంబ్, టిల్ట్ బ్రాండ్ సొల్యూషన్స్ వంటి ఇతర క్రియేటీవ్ ఏజెన్సీలు & క్రియేటర్లు IndAA అవార్డును గెలుచుకున్నాయి. ఇక ఫుడ్ అండ్ బెవెరగె (పానీయాలు) & పర్సనల్ కేర్ కేటగిరి HUL బ్రాండ్లు విజేతలుగా నిలిచాయి. HDFC లైఫ్ ఇన్సూరెన్స్‌లో గెలుపొందగా, HDFC మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో గెలిచింది. ఈ సందర్భంగా జ్యూరీ ఛైర్మన్ అండ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, నెస్లే ఇండియా 'సురేష్ నారాయణ్' మాడ్లాడుతూ.. జ్యూరీ ఛైర్మన్‌గా నా ఐదవ సంవత్సరంలో ఇక్కడ సన్నిహితంగా పరిచయం చేసుకున్నాను. దేశంలోని గొప్ప క్రియేటివ్ మైండ్స్ కలిగిన కొందరిలో ఒకడిగా ఉన్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా 'జ్యూరీ చైర్ కా శంబోధన్' అనే పేరుతో ఒక చిన్న కవితతో అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో IAA ప్రెసిడెంట్ అవినాష్ పాండే, IAA ఇండియా అవార్డ్స్ ఛైర్మన్ అభిషేక్ కర్నాని కూడా మాట్లాడారు. బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానాను ఏఐఐ సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'లక్ష్మీదేవి కంటే ముందు సరస్వతీ దేవి వచ్చిందని తన తండ్రి చెప్పినట్లు వెల్లడించాడు. -
వింత రిజిగ్నేషన్ లెటర్.. విస్తుపోతూ, నవ్వును కంట్రోల్ చేసుకోలేక..
నేటి రోజుల్లో చాలామంది వర్క్ కల్చర్‌లో వినోదానికి పెద్దపీట వేస్తున్నారు. చివరికి ఉద్యోగానికి రిజైన్ చేసే విషయంలోనూ దానికి వినోదాన్ని జోడిస్తున్నారు. తాజాగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ అత్యంత విచిత్రమైన రీతిలో రిజిగ్నేషన్ లెటర్ రూపొందించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిని చూసినవారెవరూ నవ్వకుండా ఉండలేరు. ట్విట్టర్లో షేర్ అయిన ఈ పోస్టులో ఇన్‌స్టామార్ట్‌లో లభ్యమయ్యే అన్ని స్నాక్ ఐటమ్స్‌ను ఉపయోగించి ఆ సంస్థ రిజిగ్నేషన్ లెటర్ తయారు చేసింది. ఈ పోస్టుకు 90 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి.అలాగే లెక్కకు మించిన కామెంట్లు వస్తున్నాయి. ఈ రిజిగ్నేషన్ లెటర్ చాలామందిని ఆకట్టుకుంది. మరికొందరు దీనిని సీరియస్‌గా తీసుకుంటున్నారు. రాజీనామా లాంటి సీరియస్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఈ పోస్టులో చెప్పిన మాదిరిగానే తమన రిజిగ్నేషన్‌ను సెలబ్రేట్ చేసుకుంటామని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మంచం కింద మొసలి.. మంచంపైన ఇంటి యజమాని.. తెల్లారి కళ్లు తెరవగానే.. how to quit your job using Instamart 🚶♀️ pic.twitter.com/CyhSDyvWaq — Swiggy Instamart (@SwiggyInstamart) July 24, 2023 -
చదివింది 8వ తరగతే.. ఆవిష్కరణలు అద్భుతం.. ఎవరా ఘనాపాటి!
ఆయనకు 67 ఏళ్లు. తలపండిన రైతు, అంతకుమించిన శాస్త్రవేత్త. చదివింది 8వ తరగతే. అయినా.. జ్ఞాన సంపన్నుడు. పురుగులను అరికట్టే బవేరియా బాసియానా అనే శిలీంద్రాన్ని 44 ఏళ్ల క్రితం ఆయన గుర్తించే నాటికి దాని గురించి శాస్త్రవేత్తలకే తెలీదు. అప్పటి నుంచి జీవన పురుగుమందు(బయో పెస్టిసైడ్)లను సొంతంగా తయారు చేసుకొని మిరప, పత్తి, మామిడి తదితర పంటలపై వాడుతున్నారు. అనేక సరికొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. దేశ విదేశీ యూనివర్సిటీలతో కలసి సుదీర్ఘకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. అంతర్జాతీయ జర్నల్స్‌లో శాస్త్రజ్ఞులతో కలిసి 3 పరిశోధనా వ్యాసాలు ప్రచురించిన ఘనాపాటి ఆయన. ప్రకృతి వ్యవసాయానికి బయో పెస్టిసైడ్స్ ఎంతో అవసరమంటున్న విలక్షణ రైతు శాస్త్రవేత్త కొంగర రమేష్‌పై ప్రత్యేక కథనం. స్వీయ అనుభవ జ్ఞానంతో వ్యవసాయ రంగంలో అద్భుత ఆవిష్కరణలు వెలువరిస్తున్న తపస్వి కొంగర రమేష్. వ్యవసాయ కుటుంబంలో ఆయన పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా కాకుమాను గ్రామంలో. రైతు శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తున్నది విశాఖ జిల్లా ఆనందాపురం మండలం తర్లువాడలో. సొంతంగా తయారు చేసుకున్న జీవన పురుగుమందులతో మిరప, పత్తి, మామిడి వంటి పంటలను సాగు చేయటంతో పాటు.. అనేక విశిష్టమైన వంగడాలకు రూపుకల్పన చేసి భళా అనిపించుకుంటున్నారు. ఎంతకాలమైనా నిల్వ ఉండే, అత్యంత తీపి, సువాసన కలిగిన మామిడి వంగడాలు.. విలక్షణమైన మిరప వంగడం.. ఆవులకు ప్రాణాంతకమైన బ్రూస్లోసిస్ వ్యాధిని హోమియో వైద్యంతో తగ్గించడం.. ఇవీ రైతు శాస్త్రవేత్తగా రమేష్ సాధించిన కొన్ని విజయాలు. బయో పెస్టిసైడ్స్పై ఆయన సుదీర్ఘకాలంగా చేస్తున్న పరిశోధనల గాథ ఆసక్తిదాయకం.. ‘బవేరియా’ అప్పటికి ఎవరికీ తెలీదు సొంత పొలంలో పత్తి తదితర పంటల ఆకులు తినే పురుగుల్ని చంపుతున్న బవేరియా బాసియానా అనే శిలీంధ్రాన్ని 1978లో 22 ఏళ్ల యువ రైతుగా రమేష్ తొలుత గుర్తించారు. 1977లో దివిసీమ ఉప్పెన కారణంగా కోస్తా ఆంధ్ర తీరప్రాంతంలో లెక్కలేనన్ని పక్షులు మత్యువాత పడ్డాయి. పురుగులను తినే పక్షులు లేనందున వాటి సంఖ్య ఉధృతంగా పెరిగిపోయింది. ఒక పొలం నుంచి మరో పొలంలోనికి పురుగుల మంద గొర్రెల మందలా వచ్చేవి. ఏమి చేయాలో పాలుపోని ఆ దశలో.. కొన్ని పురుగులు సహజసిద్ధంగా చనిపోతున్నట్లు ఆయన గమనించారు. ఒక్కోసారి గుంపులో 90% పురుగులు చనిపోతూ ఉండేవి. చనిపోయిన పురుగులపై బూజు మాదిరిగా పేరుకొని ఉండేది. ఏదో ఒక ఫంగస్ ఈ పురుగులను చంపగలుగుతోందని రమేష్ గమనించారు. ఆ ఫంగస్‌ను తిరిగి వాడుకొని పురుగులను చంపగలమా? అన్న జిజ్ఞాస కలిగింది. ఫంగస్ సోకి చనిపోయిన పురుగులను బాపట్ల వ్యవసాయ కళాశాల, గుంటూరు లాం ఫారం, హైదరాబాద్‌లోని ఇక్రిశాట్, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు యూపీలోని పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లి శాస్త్రవేత్తలకు చూపించారు. ఆరేళ్లపాటు ఎంతోమంది శాస్త్రవేత్తలను కలిసి వివరించినా దీనిపై వారు సరైన అవగాహనకు రాలేకపోయారని రమేష్ తెలిపారు. రమేష్ మాత్రం పట్టువీడలేదు. ప్రయత్నం మానలేదు. చివరికి 1984లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల వ్యవసాయ కళాశాలలో పాథాలజిస్టు డాక్టర్ మొహిద్దీన్ దీన్ని ఇంగ్లాండులోని మైకలాజికల్ సొసైటీకి పంపంగా.. ఇది పురుగుల పాలిట మృత్యుపాశం వంటి ‘బివేరియా బాసియానా’ అనే శిలీంధ్రం అని వెల్లడైంది. ఆ తరువాత కాలంలో శాస్త్రజ్ఞుల సూచనలతో రమేష్ స్వయంగా పరిశోధనలు చేపట్టారు. చనిపోయిన పురుగుపై నుంచి సేకరించిన ఈ ఫంగస్‌ను వేరు చేసి, తన వ్యవసాయ అవసరాల మేరకు శుద్ధమైన బవేరియా బాసియానా శిలీంధ్రాన్ని అభివృద్ధి చేయటం, పంటలపై వాడి ఫలితాలు సాధించడం నేర్చుకున్నారు. అతి తక్కువ ఖర్చుతో బవేరియా బాసియానా వంటి జీవన పురుగుమందులను పత్తి, మిరప తదితర పంటలు సాగు చేసే రైతులకు విస్తృతంగా అందుబాటులోకి తెస్తే రసాయనిక పురుగుమందుల అవసరం లేకుండా చేయవచ్చని రమేష్ భావించారు. 1987లో రాజేంద్రనగర్‌లో జరిగిన పత్తి శాస్త్రవేత్తల జాతీయ సదస్సులోనూ బవేరియా బాసియానాపై లోతైన పరిశోధనలు చేస్తే జల్లెడ పురుగులు, తెల్లదోమ ఆట కట్టించవచ్చని సూచించినా ఎవరికీ పట్టలేదు. అయినా రమేష్ తన పరిశోధనలు కొనసాగించారు. రూ. 200 ఖర్చుతో పురుగులకు చెక్ బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్ వంటి శిలీంధ్రాలను శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసుకుని జాగ్రత్తగా వినియోగిస్తే ఎకరాకు సుమారు రూ. 200 ఖర్చుతోనే మిర్చి, పత్తి, మామిడి, కూరగాయ పంటల్లో పురుగుల బెడదను తప్పించుకోవచ్చని రమేష్ అంటున్నారు. మిరప తదితర పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్న నల్ల తామర (బ్లాక్ త్రిప్స్)పై బవేరియా బాసియానా పని చేస్తున్నట్లు కొందరు రైతులు చెబుతున్నారు. అయితే, జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర రకాల ఫంగస్‌లతో కలుషితమై ప్రతికూల పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో ఇలాంటి బయో ఫెస్టిసైడ్‌ను వాడిన అనుభవం రైతులకు లేనందున శాస్త్రజ్ఞులు సరైన విధానాలను రైతులకు వివరించాలన్నారు. ఏ స్ట్రెయిన్? ఏ పురుగు? బవేరియా బాసియానా శిలీంద్రానికి సంబంధించి అనేక స్ట్రెయిన్లు ఉంటాయి. ఏ స్ట్రెయిన్ ఏ పంటపై, ఏయే పురుగులపై పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్థానికంగా పరిశోధనలు చేసి, జీవన పురుగుమందులను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. జీవన ఎరువులపై పరిశోధనలు కొంత మెరుగ్గా జరుగుతున్నప్పటికీ.. జీవన పురుగుమందులపై పరిశోధనలు మన దేశంలో చురుగ్గా జరగటం లేదని రమేష్ తెలిపారు. బవేరియా శిలీంధ్రం అనేక దేశాల్లో 200 వరకు పురుగుల నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తున్నదని రమేష్ తెలిపారు. 16 మందికి డాక్టరేట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిసి రమేష్ తర్లువాడలోని తన క్షేత్రంలో పత్తి పంటపై బవేరియా ప్రభావంపై చింతా విశ్వేశ్వరరావు సహకారంతో పరిశోధనలు కొనసాగించారు. ఈ పరిశోధనలపై అంతర్జాతీయ జర్నల్స్‌లో రమేష్ ముఖ్య పరిశోధకుడిగా 3 పరిశోధనా పత్రాలు అచ్చయ్యాయి. ఈ క్రమంలో ఏకంగా 16 మంది శాస్త్రవేత్తలకు డాక్టరేట్లు వచ్చాయి. ఈ పరిశోధనలు అడకమిక్ స్థాయిలోనే ఆగిపోయాయి. బవేరియాకు చెందిన 4–5 స్ట్రెయిన్లను వేరు చేసి యూనివర్సిటీలో భద్రపరచటం సాధ్యపడిందే తప్ప.. వాటిని విస్తృతంగా రైతుల దగ్గరకు తీసుకెళ్లటం సాధ్యపడలేదని రమేష్ తెలిపారు. జర్మనీ శాస్త్రవేత్తలు తమ కాకుమాను పొలంలో నుంచి మట్టి నమూనాలు సేకరించి తీసుకువెళ్లి ఈ ఫంగస్‌ను వాడుతున్నా తెలిపారు. ఈ నేపథ్యంలో నాబార్డ్ ఆర్థిక సాయంతో వైజాగ్‌లోని గీతం విశ్వవిద్యాలయంతో కలసి రమేష్ పరిశోధనలు చేశారు. గీతం యూనివర్సిటీ తన పేరుతో పేటెంట్‌కు దరఖాస్తు చేయబోగా, రమేష్ పేరును మొదటి ఆవిష్కర్తగా పెట్టాలని నాబార్డ్ సూచించింది. అయితే, వారు అంగీకరించకపోవటంతో వారితో నాబార్డ్ నిధులు ఇవ్వటం నిలిపివేసింది. నూనెతో కలపి చల్లాలి బవేరియా బాసియానా వంటి శిలీంధ్రాలతో తయారు చేసిన జీవన పురుగుమందులను సాయంత్రం పూట, తేమ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో నీటిలో కాకుండా ఏదో ఒక నూనె (ఎకరానికి 2 లీ.)లో శిలీంధ్రాన్ని కలిపి హెలీస్ప్రేయర్/డ్రోన్‌తో సాయంకాలం పూట పిచికారీ చేయాలని రమేష్ సూచిస్తున్నారు. రైతులు నీటితో కలిపి చల్లుతున్నారని, నీటి తేమ ఆరిపోతే శిలీంద్రపు బీజాలు చనిపోయి పురుగులపై ప్రభావం చూపలేకపోవచ్చు. అందుకని ఏదో ఒక నూనెలో కలిపి పిచికారీ చేస్తే ప్రయోజనం బాగుంటుందన్నారు. నిద్రాణంగా ఉండే శిలీంద్రపు బీజాలకు తేమ తగిలితే జర్మినేట్ అవుతాయని, ఆ తర్వాత కొద్ది గంటల వరకే బతికి ఉంటాయి. ఆ లోగానే పురుగు వాటిని తినటం లేదా దాని శరరీంపై ఇవి పడటం జరిగితే.. ఆ శిలీంద్రం పురుగు దేహంలో పెరిగి దాన్ని చంపగలుగుతుంది. అందుకు రెండు–మూడు రోజుల సమయం పడుతుంది. నూనెతో కలిపి చల్లితే బీజాలు వారం, పది రోజుల పాటు గింజగానే ఉంటాయని.. పురుగులు ఈ బీజాలను తిన్నా, వాటి శరీరానికి తగిలినా చాలు. (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!) శిలీంధ్రం బారిన పడిన చనిపోయిన తర్వాత 5 రోజుల్లోనే ఒక పురుగులో కోట్ల కొలదీ శిలీంధ్రపు బీజాలు పెరిగి, గాలి ద్వారా వ్యాపించి, పురుగులను నాశనం చేస్తాయి. ఇందువల్లనే జీవన పురుగుమందులు రసాయన పురుగు మందుల్లా వెంటనే కాక రెండు రోజుల తర్వాత ప్రభావం చూపుతాయి. రీసైక్లింగ్ పెస్టిసైడ్గానూ పనిచేస్తాయి. రైతులు చల్లిన గంటలోనే ఫలితం ఆశిస్తున్నారు తప్ప తర్వాత రోజుల్లో ఏమి అవుతుందో గమనించడం లేదని, ఈ విషయమై రైతుల్లో అవగాహన కలిగించాలని రమేష్ సూచిస్తున్నారు. జీవన పురుగుమందుల వల్ల పర్యావరణానికి, మనుషులకు, ఇతర జీవులకు ఎటువంటి సమస్యా ఉండదు. – గేదెల శ్రీనివాసరెడ్డి, సాక్షి, తగరపువలస, విశాఖ జిల్లా ప్రకృతి వ్యవసాయానికి తప్పనిసరి అవసరం రైతులకు మోయలేని ఆర్థిక భారంతో పాటు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న రసాయనిక పురుగుమందులకు ఎన్నో విధాలుగా చక్కటి ప్రత్యామ్నాయం జీవన పురుగుమందులే. బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్, వర్టిసెల్ల లకాని వంటి శిలీంధ్రాలతో కూడిన జీవన పురుగుమందులపై ప్రభుత్వం విస్తృతంగా పరిశోధనలు జరపాలి. ఏయే పురుగులపై ఏయే స్రెయిన్లు పనిచేస్తున్నాయో నిర్థారించాలి. వ్యవసాయ వర్సిటీ నిపుణుల పర్యవేక్షణలో జీవన పురుగుమందులను ప్రభుత్వమే ఉత్పత్తి చేయించి రైతులకు అందుబాటులోకి తేవాలి. నిల్వ సామర్థ్యం తక్కువ కాబట్టి రైతులను ముందుగా చైతన్యవంతం చేయాలి. ప్రకృతి వ్యవసాయం వ్యాప్తికి బయో పెస్టిసైడ్స్ తప్పనిసరి అవసరం. – కొంగర రమేష్, నవనీత ఎవర్గ్రీన్స్, తర్లువాడ, విశాఖ జిల్లా -
హైదరాబాద్ ఆహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం ప్రఖ్యాతిగాంచిన యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌కు అర్హత పొందింది. ‘గ్యాస్ట్రానమీ’ కేటగిరీలో హైదరాబాద్‌కు ఈ గుర్తింపు లభించినట్టు జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. హైదరాబాద్ ఎంపికయ్యేందుకు దరఖాస్తు నుంచి ప్రెజెంటేషన్ దాకా వివిధ వర్గాలు, సంస్థలతో సమావేశాలు నిర్వహించి ముషార్రఫ్ అలీ కీలకభూమిక పోషించారు. శతాబ్దాల ఘనత.. వందల ఏళ్లనుంచి వివిధ రకాల వంటలకు సుప్రసిద్ధమైన హైదరాబాద్ నగరం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని దేశాల వారినీ ఆకట్టుకోవడమేకాక ఇక్కడి వివిధ రకాల వంటకాలు అందరినీ అలరిస్తున్నాయి. తరతరాల సంప్రదాయాలను అందిపుచ్చుకున్న పాకశాస్త్ర ప్రవీణులేగాక ఈ రంగానికి సంబంధించి ఎన్నో సంస్థలు, పరిశోధనశాలలు సైతం నగరంలో ఉన్నాయి. వీధిబండ్ల నుంచి సెవెన్ స్టార్ హోటళ్ల దాకా వివిధ ఆహారాలను అందిస్తుండటం నగరానికి ఈ చోటు దక్కడంలో కీలకపాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైన హలీం వరకు హైదరాబాద్‌కే ప్రత్యేకమైనవి కావడం కూడా ఇందుకు ఉపకరించాయి. కాకతీయుల కాలం నుంచి టర్కీలు, మొఘల్ వంటకాలు హైదరాబాద్ జిహ్వచాపల్యాన్ని పెంచాయి. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ గురించి వేరుగా చెప్పాల్సిన పనిలేదు. కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలు మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా, అమెరికా, చైనా తదితర దేశాలకు చెందిన రుచికరమైన ఆహారాలను హైదరాబాద్‌కు పరిచయం చేశారు. పరిశ్రమగానూ ఉపాధి నగరంలో రిజిస్టర్ చేసుకున్న రెస్టారెంట్లు 2,200 కాగా, మరో లక్ష కుటుంబాలు ఆహారమే జీవనాధారంగా కలిగి ఉన్నాయి. దాదాపు 3 లక్షలకు పైచిలుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంలో ఉన్నారు. ఆహార వినియోగంలోనూ హైదరాబాద్ తక్కువేం లేదు. నిత్యం 700 టన్నుల చికెన్, (ప్రత్యేక సందర్భాల్లో 2000 టన్నులు), 291 టన్నుల మాంసం వినియోగమవుతున్నాయంటే నగర వాసులకు వంటకాలపై ఎంత మక్కువో అంచనా వేసుకోవచ్చు. అన్ని వర్గాల వారికి తగినట్లుగా ఇరుకుసందులోని టిఫిన్ బండి నుంచి ప్రపంచశ్రేణి తాజ్, నోవాటెల్ వంటి గ్రూప్ హోటళ్లు, వాటి వినియోగదారులు నగరంలో ఉన్నారు. స్వీట్ఫెస్టివల్స్ వంటివి ఇక్కడే నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల వారిని ఒక్కచోట చేరుస్తున్నారు. నగరానికి గర్వకారణం: మేయర్ నాలుగు వందల ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన హైదరాబాద్ దేశవిదేశాలకు చెందిన అన్ని రకాల ఆహారం దొరికే ఏకైక నగరం. మన నగరం యునెస్కో క్రియేటివ్ సిటీల జాబితాలో చేరడం అందరికీ గర్వకారణం. మంత్రి కేటీఆర్ ప్రశంసలు.. హైదరాబాద్ నగరానికి క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో స్థానం లభించడంపై మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్లు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన జీహెచ్ఎంసీ అధికారులను అభినందించారు. -
హైదరాబాద్‌కు అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్: విలక్షణమైన సిటీగా పేరొందిన హైదరాబాద్.. ప్రపంచంలోని సృజనాత్మక నగరాల (క్రియేటీవ్ సిటీస్) జాబితాలో స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా యునెస్కో ఎంపిక చేసిన క్రియేటీవ్ సిటీస్ నెట్‌వర్క్‌లో 66 నగరాలను ఎంపిక చేయగా.. అందులో మన హైదరాబాద్ సిటీ ఉంది. భారత్ తరపున ముంబై మహా నగరాన్ని సినిమా, హైదరాబాద్ నగరాన్ని ఆహారం, తినుబండారాల (గాస్ట్రోనమీ) విభాగం నుంచి ఎంపికచేశారు. భారతదేశం నుంచి మొత్తం 18నగరాలు ఈ నెట్‌వర్క్‌లో స్థానం కోసం పోటీపడగా.. ఎనిమిది నగరాలు మాత్రమే తమ దరఖాస్తులను యునెస్కోకు పంపాయి. అందులో కేవలం నాలుగు నగరాలు మాత్రమే (హైదరాబాద్, ముంబాయి, శ్రీనగర్, లక్నో) ఎంపికయ్యాయి. హైదరాబాద్ క్రియేటీవ్ సిటీస్ నెట్‌వర్క్‌లో స్థానం పొందడం పట్ల రాష్ట్ర మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
క్రియేటివ్ భూతం సీసాలోంచి బయటికి వచ్చేసింది
రోడ్డు మీద చెత్త పడితే ఎత్తేయొచ్చు. మురికి అయితే కడిగేయొచ్చు. కానీ సమాజంలో కంపు.. అది.. భరించలేని విధంగా మారితే? మన సమాజంలో మహిళల పట్ల మర్యాద లేదు. వారి పనికి గుర్తింపు లేదు. వారి మనుగడకు భరోసా లేదు. వారి అస్తిత్వాన్నే చీకటిలో కలిపేసే ధోరణి! స్త్రీల విషయం ఒక్కటనే కాదు.. వంచన, కపటం, మాయ తప్ప నీతి, నిజాయితీలేని ఈ సమాజంపై అసహ్యం కలిగింది ఆమెకు. ‘తను కాలిపోతూ, మనిషిని కాల్చేస్తూ పారదర్శక నైజం కలిగిన సిగరెట్ మీ కన్నా నయంగా ఉంది’ అంటూ ఓ పాట రాసింది. పాడింది. వీడియో చేసింది. ‘స్మోకింగ్ కిల్స్.. బట్ సిగరెట్ రాక్స్’ అనే పేరుతో రూపొందించిన ఆ మల్టీ లింగ్వల్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది.. దశాబ్ద కాలానికి పైగా ఘోస్ట్ (అజ్ఞాత) రైటర్‌గా, సింగర్‌గా, కంపోజర్‌గా కొనసాగిన ఫీబా మార్టిన్! ఆ వీడియో ఇప్పుడొక సోషల్ మీడియా సెన్సేషన్! ఇన్నాళ్లు ఎన్నో విభాగాల్లో దేశంలోని పలు భాషల సినీ పరిశ్రమల్లో ఘోస్ట్‌గా వర్క్ చేసిన ఫీబా తన కష్టం ఇప్పటికైనా గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తోంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రపంచ పౌరురాలు అమ్మ తమిళియన్. నాన్నది ఇంగ్లండ్. నేను నా భర్తతో కలిసి ముంబైలో ఉంటున్నాను. బెంగళూరులో పన్నెండు మంది చిన్నారులను మేము అడాప్ట్ చేసుకున్నాం. క్తుప్లంగా ఇవీ మా కుటుంబ వివరాలు. ఇక నా విషయం. డబుల్ మాస్టర్స్ చేశాను. ఎంఏ లిటరేచర్, కూచిపూడి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేశాను. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నాను. గతంలో సాఫ్ట్‌వేర్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా జాబ్ చేశాను. కార్పొరేట్ జాబ్ వదిలేసి ఇప్పుడు ఫుల్‌టైం మ్యూజిక్, రైటింగ్‌కే కేటాయిస్తున్నాను. అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటాను. ప్రపంచ పౌరురాలిని అనుకోండి. ఇప్పటి వరకు రెండు వందల చిత్రాలకు మ్యూజిక్, డైరెక్షన్, రైటింగ్ విభాగాల్లో ఘోస్ట్‌గా వర్క్ చేశాను. చాలామంది మ్యుజీషియన్స్ దగ్గర ఘోస్ట్ కంపోజర్‌గా చేశాను. వారి పేర్లు ఏవీ చెప్పలేను. ఆర్పీ పట్నాయక్ గారు చేసిన ‘ఈమీ’ హాలీవుడ్ చిత్రానికి పనిచేశాను. అందులో రైటర్‌గా నాకు ఆయన టైటిల్ క్రెడిట్ ఇచ్చారు. అనేక చిత్రాలకు ర్యాప్ మ్యూజిక్ పాడాను. తెలుగులో వచ్చిన మ్యాక్సిమమ్ ర్యాప్ పాటలు నేను పాడినవే. ఇక్కడి అందరి ర్యాపర్లతో కలిసి పనిచేశాను. అలాగే తమిళ్, కన్నడ, బెంగాళీ, హిందీ, ఇంగ్లిష్ జింగిల్స్కి వాయిస్ ఇచ్చాను. ఆర్పీ, రామ్‌గోపాల్ వర్మ తప్ప మరెవ్వరూ నాకు గుర్తింపు ఇవ్వలేదు. ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని, జీవితకాలమంతా ఒకరి కింద పనిచెయ్యకూడదనే లక్ష్యంతో ఇప్పుడు పనిచేస్తున్నాను. ప్రస్తుతం పారిస్‌లోని రాక్‌బ్యాండ్ ‘పుల్ఆర్ట్ బీ’తో ర్యాపర్‌గా ట్రావెల్ చేస్తున్నాను. సంగీత కచేరీలో పాల్గొంటున్నాను. మోడలింగ్ చేస్తున్నాను. అవికాక సొంతగా ప్రైవేటు ఆల్బమ్స్ మీద ఫోకస్ చేస్తున్నాను. రెండేళ్ల క్రితం రాంగోపాల్‌వర్మ కలిసి చేసిన ఒక ప్రాజెక్ట్ రిలీజ్ అయి ఉంటే ఈపాటికి మంచి గుర్తింపు వచ్చి ఉండేది. వీడియో వెనుకజనాలతో బాగా విసిగిపోయి ఉన్నాను. చెప్పేదొకటి, చేసేదొకటి. రిలేషన్‌షిప్స్‌కి, పనికి, ఆడవాళ్లకి వాల్యూ లేదు. ఇవన్నీ చూసి చూసి సమాజం మీద ఏవగింపు కలిగింది. ఏ భావన అయినా.. నేను చేసేది, నాకు తెలిసింది, రాయటం, కంపోజ్ చెయ్యటమే. దానినే మాటల్లో పెట్టి ఈ ర్యాప్ చేశాను. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జీవితంలో నాకు ఎదురైన చేదు అనుభవాలే ఈ వీడియోకి ప్రేరణ. సౌత్‌లో, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో నేను ఎదుర్కొన్న చేదు అనుభవాలు అని చెప్పాలి. ఇందులో చూపించినట్లు నేను స్మోక్ చెయ్యను, డ్రింక్ చెయ్యను. అవన్నీ గ్రాఫిక్స్‌తో చేశాను. భావాన్ని అర్థం చేసుకునే వారికే ఈ వీడియో అర్థమవుతుంది. మనుషుల కంటే సిగరెట్ ఎంతో మేలు. ప్యాకెట్ మీద వార్నింగ్ ఉంటుంది. సిగరెట్ తన గురించి ఏమీ దాచదు. తాగితే చస్తావ్ అంటుంది. ఆ తర్వాత చావడం, బతకడం మన చాయిస్. భక్తి, బంధం.. వీటి ముసుగులో మనుషులు మోసం చెయ్యటం దారుణం అనిపిస్తుంది. అది తీవ్రంగా గాయపరుస్తుంది. సిగరెట్ డబ్బా మీద ఉన్న హెచ్చరిక మనుషుల ముఖాల మీద కూడా ఉంటే బాగుండు. ఇదే ఈ పాటలో రాశాను. – ఓ మధు క్యాస్టింగ్ కౌచ్ ఉంది అడిగారు కాబట్టి చెబుతున్నాను. ‘క్యాస్టింగ్ కౌచ్’ అన్ని పరిశ్రమల్లోనూ ఉంది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో మాత్రం.. మనం ఎప్పుడొచ్చాం అనే దగ్గర నుంచి మన పని, మన మూమెంట్స్ అన్నీ రికార్డ్ అవుతుంటాయి కనుక క్యాస్టింగ్ కౌచ్ కొంత తక్కువ. కానీ ఫిలిం ఇండస్ట్రీలో అలా ఉండదు. అలాగే సినిమా పరిశ్రమలో గుర్తింపు రావడం కష్టం. పేమెంట్లు కూడా సరిగా అందవు. చేసిన పనికి గుర్తింపు లభించక పోవటం అక్కడ చాలా కామన్ విషయం. ‘నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో మీ పేరు పెడతాం, ఈసారికి చెయ్యండి’ అనేవాళ్లే ఎక్కువ. – ఫీబా మార్టిన్ -
కర్సింగ్ రైటింగ్
రాత్రి పన్నెండింటికి మెలకువొచ్చింది అర్జున్‌కి. గబగబా లేచి గ్లాసెడు నీళ్ళు తాగి, మరో గ్లాసెడు నీళ్ళు మొహాన కొట్టుకుని పుస్తకం తెరిచాడు. అదొక ఫోర్ రూల్ బుక్.ప్రతి పేజీలోని పై వరుసల్లో ఇంగ్లీష్ నీతి వాక్యాలున్నాయి. ఉదయానికల్లా దాన్ని నింపేయాలి. పీరియడ్ మొదలవ్వడానికి ముందే.. పెద్దాయనకి చూపించాలి.వాళ్ల అమ్మ మెల్లగా లేచి దగ్గరికి వచ్చి ’నిద్రని ఆపుకోలేవు.. ఉండు.. కాస్త బూస్టు కలిపి తెస్తాను..’ అని వంటగదిలోకి వెళ్ళింది.అర్జున్‌కి ఆవిడ మాటలేవీ వినపడలేదు. పెన్సిలు కళ్లద్దానికి దగ్గరగా పెట్టుకుని ముల్లు పదును పరిశీలించాడు. తల అడ్డంగా ఊపుతూ షార్పెనర్ల గుట్ట వైపు చూశాడు.రెండు మూడు షార్పెనర్లను పట్టుకుని తేరిపార చూస్తూ, చివరికి ఎర్రరంగుది ఎంచుకుని పెన్సిలు చెక్కుకున్నాడు. పని పూర్తవ్వగానే తృప్తినిచ్చే నవ్వు కళ్లలోంచి బయటపడి మూతి మీదకు చేరింది.ఇది హోమ్‌వర్కు కాదు.రాత్రి పన్నెండింటికి మేలుకుని మరీ చేస్తున్నాడంటే.. దాని అర్థం పనిష్మెంట్ అని! ఈ మాత్రం విషయానికి ఆశ్చర్యం రాకపోవచ్చు. కానీ..అర్జున్ వయసు నలభై రెండేళ్లు.. ఈ మాట చెప్పగానే ఆశ్చర్యపోకుండా కాసేపాగి.. మతి చలించినవాడేమోలే.. అనుకోవచ్చు. కానీ.. అర్జున్ ఈజ్ ఏన్ అసిస్టెంట్ ప్రొఫెసర్.. క్రియేటివ్ రూల్స్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో. ఇప్పుడు సందిగ్ధంలో పడి ఉంటారు.ఏంటీ ఇతని మేటర్ అని.అమ్మ ఇచ్చిన బూస్టు తాగి శ్రద్ధగా రాయడం మొదలు పెట్టాడు. దేర్ ఈజ్ నో క్రియేటివిటీ వితవుట్ ఫెయిల్యూర్...’ నాలుగో పదం దగ్గర పెన్సిల్లో స్వేచ్ఛ ఆవిరైపోయింది.సన్నగా వొణికింది. ‘‘సి కీ ఆర్ కీ కర్సిప్ లింక్ సరిగా చేయట్లేదు..’’ వాయిస్ గుండె బ్యాక్గ్రౌండ్లోంచి గుంభనంగా వినపడింది.. వాయిస్ మాత్రమే కాదది. బెదిరింపు.. హింస. పైశాచిక ఆనందం.అది కాలేజీ స్థాపించిన పెద్దాయనది. కళ్ల నుంచి నీళ్లు ఉబికాయి. రెప్పాడిస్తే కన్నీటిబొట్టు పుస్తకం మీద పడుతుందని, పుస్తకం దూరంగా నెట్టేశాడు. అమ్మ చూడకుండా తమాయించుకున్నాడు.భుజంమీది టవల్ తో మొహం తుడుచుకున్నాడు. ఆందోళనతో కూడిన ఆ ఏడుపాగట్లేదు. ఓ కొత్త రేజర్ అందుకుని, దాని అంచుతో తప్పు అనిపిస్తున్న పదాన్ని తుడిచాడు.. ఒకసారి.. రెండుసార్లు.. మూడుసార్లు... సరిగ్గా రాశాడో లేదో తనకే అర్థం కావట్లేదు. పుస్తకం నింపేశాడు.కాలేజీ క్యాంటిన్లో ఎప్పట్లా సేమ్యా ఉప్మా పెట్టుకుని కూర్చున్నాడు అర్జున్. ఉప్మాలో సేమ్యా పుడకలు కలగాపులగంగా ఉన్న ఇంగ్లీష్ అక్షరాల్లాగ కనిపిస్తున్నాయి. వాటివంక కూడా కలవరంగా చూశాడు. ఫోర్కుతో అటూ ఇటూ కదిపాడు.. ఫోర్ రూల్ బుక్కులాగ గీతలు పడ్డాయి. అసహ్యపడి.. చప్పున దూరంగా తోసేశాడు.‘‘నేను మా పెద్దమ్మాయితో రాయించాను. బాగానే రాసింది.చూడాలి.. వాడేమంటాడో..’’ ఆనందంగా చెప్పాడు పక్కనే కూర్చున్న ప్రసాదరావు. అర్జున్ ‘అదృష్టవంతుడివి’ అన్నట్లుగా చిన్న నవ్వు నవ్విఊరుకున్నాడు.ఈలోగా అటెండరు పరుగెత్తుకుంటూ వచ్చి ‘‘మీటింగ్ హాల్ కి అర్జెంటుగా రావాలంట..’’ అని చెప్పి లైబ్రరీ వైపు కూడా కేకెయ్యడానికి దారితీశాడు.అర్జున్‌తో పాటు అక్కడున్న మరికొంతమంది ఉన్నపళంగా ఫోర్ రూల్ బుక్కులతో పరుగులు తీశారు.అప్పటికే అక్కడ కూర్చున్నాడాయన.ఆయన పేరు అప్రస్తుతం. కార్పొరేట్ వ్యవస్థను కరెన్సీతో కొలిచి కొనుక్కుని పెట్టిన కాలేజీ శాఖలను తన సామంత రాజ్యాలుగా భావిస్తాడు. తాను చట్టాలను చేయగల మేధావిగా.. సమర్థుడిగా.. నియంతగా.. వ్యవహరిస్తుంటాడు.స్టూడెంట్లు ప్రతిరోజూ హాజరవ్వాలి. యూనిఫామ్ వేయాలి. మొబైల్ నాట్ అలవ్డ్. లీవు కోసం పేరెంట్ ఆన్లైన్లో అప్లై చేయాలి. ప్రాపర్ కాజ్ సర్టిఫై చేసి చూపాలి.వాహ్.. మంచి కాలేజ్. ఈ తరం పిల్లలకు ఇలాంటిదే కరెక్టు.. అనుకుని చాలామంది జాయిన్ అయ్యారు. ఓరోజు సడెన్‌గా కర్సివ్ రైటింగ్ బుక్సు తెచ్చి మనిషికి ఓ పదేసి కాపీలు ఇచ్చారు. స్టాఫ్‌కి కూడా. డబ్బులు కట్టించుకుని మరీ.. ఇంజనీరింగ్ పిల్లలు ఎందుకు రాస్తారు? రాయలేదు. వాళ్ల వాళ్ల ఇళ్లల్లో ఈ పెద్దాయనకి మెంటల్ అని చెప్పారు. వాళ్లల్లో పేరున్నవాళ్లు వచ్చి తిట్టారు. వార్త వైరల్ అయిపోయింది. పెద్దాయన ఇగో దెబ్బతింది. రెండ్రోజుల్లో స్టాఫ్ అందరికీ సర్క్యులర్ వచ్చింది. కర్సివ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిన బుక్సు చూపించాలని. ఇంక్రిమెంట్లు వేసే టైమ్.. ప్రమోషన్లు ఇచ్చే టైమ్...మధ్యతరగతి మెట్లమీద నడిచే మాస్టార్లు.. ఏంచేస్తారు? రాత్రికి రాత్రి రాశారు. రాయించారు. ఉద్యోగం కోసం.. ఉన్నతిని దిగజార్చుకున్నారు. ఆ బుక్సు దిద్దుతున్నప్పుడే మరో ఆజ్ఞ జారీ చేశాడు పెద్దాయన. ‘రేపు ఎస్సే రైటింగ్ ఎగ్జామ్. ప్రిపేర్ అయ్యి రండి..’ అని.అతని మొహంలో నవ్వు ఉంది. వీళ్లందర్నీ ఆటాడిస్తున్నానన్న అహం.. వీళ్లంతా సఫర్ అవుతూ కూడా నా ముందు వంగి వంగి ఉండాల్సిందే అన్న పైశాచిక ఆనందం.ఇంగ్లీష్ సార్ హాస్పిటల్లో ఉంటే.. ఆయనకు బుక్స్ వీపీపీలో పంపాడు. ’చిన్న విషయం’ అనుకునే స్థాయి దాటిన భావం అందరిలోనూ మొదలైంది అప్పుడే.మేథ్స్ లెక్చరర్, వెళ్లిపోతానన్నారు. రిజైన్ లెటర్ ఇచ్చినప్పటి నుంచి ఆయన్ను ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేందుకు మూడు నెలలుగా తిప్పుతున్నారు. అప్పుల్లో పడి ఆయన కుమిలిపోవడం.. ఈమధ్యనే ఆత్మహత్యాప్రయత్నం చేయడం.. అందరిలోనూ భయాన్ని రేపింది.పెద్దాయన పక్కనే ఓ టేబుల్ మీద పుస్తకాలన్నీ పెట్టారు. అటెండరు కృష్ణ అందివ్వడానికి వచ్చాడు. పైన రీనా మేడమ్ బుక్కు ఉంది. దానికి కలర్ పేపర్ అట్ట, లేబుల్, పువ్వుల అంచు డిజైన్ ఉంది.దాన్నిఅందించాడు కృష్ణ.అందుకుని.. దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి.. తెరిచాడు. ఒక రెండు నిమిషాల తర్వాత దాన్ని మూసేసి.. ‘‘రీనామేడమ్.. మీరు మరో నాలుగు పుస్తకాలు తీసుకోండి. రేపు సెలవు కదా.. ఎల్లుండి చూపించండి..’’ అన్నాడు. మళ్లీ అందరి వైపు చూస్తూ.. ఇలాంటి అట్టలు వేసి నన్ను మాయ చేయలేరు.. అంటూ నవ్వాడు.నెక్స్›్ట అంటూ పుస్తకం అందుకుని.. తెరిచీ తెరవగానే.. దాన్ని విసిరేశాడు. ‘టెన్ బుక్స్ రాసి పట్రా.. వరస్ట్ రైటింగ్..’ అన్నాడు.. అదెవరిదా అనుకుంటుండగా.. ప్రసాదరావు పరుగెత్తుకుంటూ ఆ పుస్తకం పడ్డ మూల వైపు వెళ్లాడు.అందరివీ విసిరేస్తున్నాడు..మనోజ్.. పుస్తకంలో మాత్రం మొహం పెట్టి అయిదు నిమిషాలు ఉన్నాడు. బైటికి వచ్చి. ’గుడ్.. నువ్వు ఎక్స్ట్రా బుక్ రాయక్కర్లేదు. లెవెల్ టూ బుక్ తీస్కో.. అని అభినందించాడు. లెవెల్ టూనా.. అంటూడీలా పడ్డాడతను. తర్వాత అర్జున్ పేరు చదివాడు. ‘‘నీ పిల్లలది ఎల్ కేజీ యూకేజీ అయిపోయిందా’’ అన్నాడు నవ్వుతూ. ‘‘పెళ్ళి కాలేదండీ..’’ అన్నాడు పెద్దాయన వ్యంగ్యంగా అడిగాడని తెలిసి కూడా. ‘‘మరి ఇదెవరు రాశారు?’’ గద్దించాడాయన. ‘నేనే సార్..’’ అన్నాడు పెద్దాయనకి జవాబు తెలిసే అడిగాడని తెలిసినా. ‘‘అచ్ఛా.. తమరు మంచి ఆర్టిస్టులా ఉన్నారే.. ఓ పదిహేను పెయింటింగ్స్ గీసి తీస్కురండి..’’ అన్నాడు కాళ్లూపుతూ.. మరింత వెటకారంగా.మర్నాడు లీవు కావాలని అడగాలన్న మాట గొంతు దాటలేదు. అమ్మను హాస్పిటల్‌కి తీసు కెళ్లాలి. తతంగం పూర్తయ్యాక ధైర్యంచేసి వెనకాలే వెళ్లాడు అర్జున్.. ‘‘సార్.. రేపు లీవు..’’...‘‘మొన్న తీసుకున్నావ్ కదా.. నీకు రెండు వారాలకే నెల పూర్తవుతుందా? ఏమనుకున్నావ్? కాలేజీలో వర్క్‌షాప్ ఉంది. ఎట్లా పోతావ్? నెలకి ఒకటే సీఎల్... అర్థం కాదా మీకు.. సెలవు పెట్టి ఏదో వేరే ఎగ్జామ్స్‌కి అటెండ్ అవుతారు.. గ్రూప్ వన్నా టూనా..? నాకు తెలీదా..’’‘‘అది కాదు సార్.. అమ్మకి బాలేదు.. హాస్పిటల్‌కి..’’ ‘‘మా అమ్మకీ బాలేదు.. నేను వస్తున్నా కదా.. సాకులు.. సాకులు... వరస్ట్ మెంటాలిటీస్..’’ఆయన ఆగకుండా.. నడుస్తూనే ఉన్నాడు. కార్ డోర్ తెరిచే ఉంచారు.లోపల కూర్చుని రయ్యిమని వెళ్లిపోయాడు.దుఃఖం ముంచుకొచ్చింది అర్జున్‌కి. ఎటెండరు కృష్ణ పక్కకి వచ్చి సముదాయింపుగా తల ఊపాడు.‘సాయంకాలాలూ రాత్రిళ్లూ ఈయనిచ్చిన ఫోర్ రూల్ పుస్తకాలు నింపేసరికే అయిపోతుంది.. అమ్మ సంగతి..? అటు ఉద్యోగం ఊడిపోతే.. ఉన్నపళంగా ఏదీ తోచని బ్రతుకు..’’ గొంతు తడారిపోయింది అర్జున్‌కి..రీనా మేడమ్, పక్కనే ప్రసాదరావు.. మరికొందరు స్టాఫ్... అర్జున్ మాటలు వింటూ నిల్చుండిపోయారు.‘‘ఇద్దరు పిల్లల ఒంటరి రీనా మేడమ్.. లక్షల్లో అప్పులు తీర్చలేక నెట్టుకొస్తున్నరు ప్రసాద్ సార్.. తొంభై అయిదు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్న వెంకట్ బాబుసార్.. ఒకరికి కాదు.. అందరికీ.. అందరికీ.. టార్చర్ పెడుతున్నాడు. ఏమీ చేయలేరని.. వాడికేమీ చేయలేరా సార్..? కూర్చుని ఏడుస్తరు.. మా నాయనమ్మ ఓ కత చెప్పింది.. పిల్లి మెడలో గంట కట్టడానికి ఎలకలన్నీ మీటింగు పెట్కున్నయంట. తర్వాత ఏం జరిగిందో అనవసరం. మీరు మీటింగన్నా పెట్కోలే..? అంతకన్నా హీనమా? ‘ కృష్ణ చీదరింపు ఇది ఎన్నోసారో తెలీదు.‘‘ఎవరి బతుకులు వారివి.. ఏం చేస్తాంరా కృష్ణా..’’ నిరాశగా మాట్లాడాడు ప్రసాద్సార్. ‘‘కనీసం గట్టిగా మాట్లాడండి సార్..’’ ‘‘నీకేమన్నా పిచ్చా..?’’ ‘‘ఈ మాట.. ఇదే మాట.. వాడి ఎదురుగా అనండి.. నిజంగా..’’ ‘‘మెంటల్ నా కొడుకు.. కేసు పెడితే.. మా ఉద్యోగాలు ఏమవుతాయ్? మళ్లీ ఎక్కడ వెతుక్కుంటాం..’’‘‘ఉద్యోగం పోతే మళ్లీ వెతుక్కోలేం.. అన్నది ఎంత చేతకాని మాట సార్? పీజీలూ పీహెచ్‌డీలూ చేసి ఇంత దేభ్యం బతుకు ఎందుకుసార్? సిగ్గుండాలి.. ఛత్.. జైల్లో ఖైదీల్లెక్క ఉన్నారు. ఇదా ఉద్యోగం? కాపీరైటింగు కర్సివ్ రైటింగులేంది? పిచ్చకాకపోతే? ఒకసారి సరే.. వారం వారం.. ఆదివారాలు మింగేస్తన్నాడు. సోమవారాలు ఏడుపుమొహాలతో.. సిగ్గుండాలి.. లాస్ ఆఫ్ పే సెలవు కూడాఇవ్వడా..? హలో.. బ్రిటీషోళ్లు వెళ్లిపోయి చాలాకాలం అయింది సారూ..’’‘‘అయితే ఇప్పుడేం చేయమంటావ్ రా..?’’ ‘‘ఎవడికి కాలితే వాడు.. నిలదీయాలి సార్‘ ‘‘ఎవరు చేస్తారు చెప్పు.. ఎవ్వరూ ముందుకు రారు..’’ రీనా మేడమ్ గొంతు తగ్గిస్తూ అంది.‘‘ఎవరో ఒకరు చెయ్యాలి.. ఇంతమందికి మేలు జరుగుతుందంటే.. చెయ్యరా?.. ప్రపంచం చాలా విశాలమైనది. కుటుంబాల్ని కూలి పనిచేసుకుని అయినా పోషించుకోవచ్చు ప్రసాద్ సార్! చాలామంది టైలరింగులు లాంటి పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు రీనా మేడమ్!! తట్టలు మోసేవాళ్లకు కూడా తల్లిని చూడాల్సిన బాధ్యత ఉంది అర్జున్ సార్!!! వీడేమన్నా హిట్లరా? తుపాకీ ఉందా? చంపేస్తాడా? నోరెందుకు పెగలదు? ఒక్కసారి ఎదురునిల్చి మాట్లాడండి సార్.. తలదించుకుని కాదు.. వాడి కళ్లలోకి చూస్తూ.. తెలుసుగా.. ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలో మళ్లీ మీరే చెప్తారు అందరికీ.. ఈ ఒక్క పనితో మీకు చాలా సమస్యలు తీరుతాయి. ఈ సాయంత్రం సమస్య మీది. మీకోసం మీరే నిలబడాలి. పోరాడాలి. ఎవరో వస్తారని ఎదురు చూడకండి.మీరొకరికి స్ఫూర్తి అవుతారు. జీవితం రేపటినుంచే కొత్తగా ఉంటుంది. నమ్మండి. నేను వెళ్లి ఏదో మాట్లాడొచ్చు.. కానీ.. ఎవరి ఆట వాళ్లు ఆడాలికదా.. నాకు కాలినప్పుడు నేను లేస్తా.. ఇక మీ ఇష్టం..’’ కృష్ణ తన తల కుడివైపుకి కాస్త వాల్చి తూటాల్లా మాటలు విసురుతుంటే.. యమస్పీడులో కర్సివ్ రైటింగ్ రాస్తున్నట్లుంది..‘‘నాకు కాల్తంది...’’ నింపాదిగానే అన్నాడు అర్జున్.‘‘ఇదేమన్నా స్వతంత్ర పోరాటమా? విశాఖ ఉక్కు ఆంధ్రులహక్కు అన్నట్లు తిరగాలా.. ఉన్న ఉద్యోగం ఉంటే చాలు..’’ ప్రసాదరావు తప్పుకుని వెళ్లిపోయాడు. మిగతావాళ్లు ’ఏంచేస్తాంలే.. మన లైఫ్‌లు ఇంతే..’ అనుకుంటూ నీరుగారిపోయారు...అర్జున్ ఒక్క నిమిషం పాటు కదల్లేదు. బిగుసుకున్న దవడల మధ్య అతని నిర్ణయం స్పష్టంగా ధ్వనించింది.‘‘ఛీ.. దీనమ్మా జీవితం.. ఒరే కృష్ణా.. ఏదైతే అదైంది.. కర్రీ పాయింటు పెట్టుకున్నా చాలు.. బతికేస్తా.. సగం జీవితం అయిపోయింది.. బాగా చెప్పావురా.. జీవితాంతం నిన్ను గుర్తు పెట్టుకుంటా..’’ పరుగులాంటి నడకతో ఇంటికి బయల్దేరాడు అర్జున్. .అర్జున్ ఆరేడడుగులు వేశాడో లేదో.. వెనకాల్నించి కృష్ణ ‘‘సార్.. మీ నడకలోనే కర్సివ్ రైటింగ్ కనిపిస్తంది. సూపర్..’’ అన్నాడు. అర్జున్ వెనక్కి తిరిగి ఓ కామా పెట్టినట్లు నవ్వి బయల్దేరాడు.అమ్మను హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. ఆ రాత్రి తనే వంట చేసి ఆమెకు వడ్డించాడు. ఆమె కొడుకు చూపించే ప్రేమకు తృప్తిపడింది. అర్జున్‌కి ఆ తృప్తి మరికొంత ధైర్యాన్నిచ్చింది. భోజనాలు అయ్యాక రీడింగ్ టేబుల్ దగ్గర ఫోర్ రూల్ బుక్ తెరిచి రాయడం మొదలు పెట్టాడు. అదీ రెడ్ ఇంక్ పెన్‌తో! గంట సేపు ఏకధాటిగా రాస్తున్నంతసేపూ మొహాన చిరునవ్వు చెరగలేదు.‘‘సార్.. మన కాలేజీ చీడ మిగతా కాలేజీలకు కూడా పాకేసింది. ‘స్నేక్మూవ్స్’ కాలేజీవాళ్లు కూడా ఫోర్ రూల్ బుక్కులు పెట్టారంట తెల్సా..‘ కొత్త ప్రొఫెసర్ ఒక్కొక్కరి చెవుల్లో గుసగుసలాడాడు.‘‘మంచి మూడు అడుగులు వేసేలోపు.. పైత్యం పది కిలోమీటర్లు పోతాది మరి...’’ అన్నాడు అర్జున్. అందరూ నిర్వేదంగా నవ్వేరు.ఈలోగా మీటింగ్ హాల్ కి రమ్మని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇన్స్పెక్షన్ కి పై అధికారులు కూడా అక్కడే ఉన్నారని మరొకాయన అన్నాడు.అందరూ పుస్తకాలను పట్టుకుని బయల్దేరారు. దొంతులు పెట్టి ఎదురుగా కూర్చున్నారు. అందరికంటే చివరగా పుస్తకాల మీద అర్జున్ పుస్తకం పెట్టాడు.పెద్దాయన పొట్ట మీద గోక్కుంటూ విలాసంగా నవ్వుతూ అధికారులకు తన నియమాలను చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘మొన్న ఎస్సే రైటింగ్ పెట్టాం. అందరూ మొబైల్లో కాపీ కొట్టి రాశారు.. నాకు తెలిసింది.. ఏంచేయాలా అని ఆలోచిస్తున్నా.. వాళ్లు రాసింది హండ్రెడ్ టైమ్స్ ఇంపొజిషన్ రాయిస్తా..’’ అంటూ వాళ్లను నవ్వించాననుకున్నాడు.‘‘బై ద వే.. ఇవి మావాళ్ల ఇంప్రూవ్ మెంట్ వర్క్’’ అంటూ అర్జున్ పుస్తకం తీసి ఒకాయనకి అందించాడు.అందుకున్నాయన అది తీసి, ఒక నిమిషం చదివి ఒకటే నవ్వు! పక్కాయనకి అందించాడు.. ఆయన కూడా శ్రుతి కలిపాడు.మూడో ఆయన బైటికే చదివాడు.. ‘‘డియర్ సర్.. యూ హావ్ ఏ సీరియస్ డిజార్డర్ సమ్ థింగ్ లైక్ డీలూజన్ సిమ్టమ్స్. బెటర్ టు కన్సల్ట్ ఇమ్మీడియట్లీ. వి ఆర్ ఆల్ యువర్ వెల్ విషర్స్. వి ప్రే ఫర్ యూ.. వి లవ్ యూ.. ప్లీజ్ చెక్ యువర్ మైండ్.. ఆల్ నెర్వ్స్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఫోర్ రూల్!.. వాటీజ్ దిస్ నాన్సెన్స్? లెటజ్ మూవ్ టు సేవ్ యూ..’’పెద్దాయన మొహాన నెత్తురు చుక్కలేదు. ‘‘ఏంటి సార్.. ఇదంతా?’’ అడిగారా అధికారి. అందరి మొహాలూ స్విచ్చులు వేసిన ట్యూబ్ లైట్లలా ఉన్నాయి. వెలగలేదింకా...! అర్జున్ లేచాడు..‘‘ఇదంతా మా బతుకు సార్.. బాధలు సార్.. ఎక్కడా చెప్పుకోలేని ఛండాలమైన టార్చర్ సార్..’’ అంటూ గుక్కతిప్పకుండా గంట సేపు మాట్లాడాడు.లైట్లన్నీ వెలిగాయి.ప్రసాదరావు.. రీనామేడమ్.. శరత్ కుమార్.. అందరూ ఒక్కో మాటా.. కర్సివ్ రైటింగ్లాగ ఎక్కడా తెగనీకుండా తేడా రాకుండా.. బాధలన్నీ చెప్పుకొచ్చారు.అధికార్ల ముందు పెద్దాయన కుక్కచెవులొచ్చిన పిల్లాడి నోట్సులా ఉండిపోయాడు. ‘క్రమశిక్షణ కోసమని రాయిస్తున్నా..‘ అని ఏదో చెప్పబోతుంటే.. ‘‘నువ్వొక పేజీ రాయవయ్యా చూస్తాం..’’అన్నాడొక అధికారి.‘‘క్రమశిక్షణ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచు. ఇష్టానుసారం పిచ్చిపనులు చెయ్యడం కాదు..’’ ముక్తాయింపునిచ్చాడు మరొకాయన.పెద్దాయన ముఖంలో ఓ తెల్లకాగితంలాంటి పశ్చాత్తాపం తలదించుకుంది. ఇప్పుడు నిలబడి ఉన్న అర్జున్, ఫోర్ రూల్ బుక్కులో ఇంగ్లీష్ మూడోబడి క్యాపిటల్ అక్షరంలా ఠీవిగా కనిపిస్తున్నాడు. - ఎస్.ఎస్.దేవసింధు -
బీ క్రియేటివ్!
ఏ రంగంలో రాణించాలన్నా ఆసక్తి, పట్టుదల ముఖ్యం. వీటికి క్రియేటివిటీ తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. మరి మనలో ఎంత మంది తమ తమ సామర్థ్యాల మేరకు క్రియేటివ్‌గా వ్యవహరిస్తున్నారు? ఎంత మంది తమ సృజనాత్మకతకు పదునుపెడుతున్నారు? ప్రతి పది మందిలో కేవలం ముగ్గురు మాత్రమే తమ శక్తి సామర్థ్యాల మేరకు సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘అడోబ్ మ్యాక్స్-2016 క్రియేటివ్ కాన్ఫరెన్స్’ను పురస్కరించుకుని అడోబ్ సంస్థ ‘స్టేట్ ఆఫ్ క్రియేట్-2016’ పేరిట ఐదు దేశాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది. - సాక్షి సెంట్రల్ డెస్క్ క్రియేటివిటీతో అధిక ఆదాయంతో పాటు పోటీతత్వం, ఉత్పాదకత పెరుగుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. సృజనాత్మకతకు పదునుపెడితే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పేర్కొం ది. సృజనాత్మకంగా వ్యవహరించేవారు 13% ఎక్కువగా సంపాదిస్తున్నట్లు సర్వేలో తేలింది. మంచి ఉద్యోగులు గా, నాయకులుగా, తల్లిదండ్రులుగా, విద్యార్థులుగా ఎదగడంలో క్రియేటి విటీ ఉపయోగపడుతుందని మూడింట 2 వంతుల మంది విశ్వసిస్తున్నారు. జర్మనీ, యూకే, యూఎస్, ఫ్రాన్స్, జపాన్ దేశాల్లో సర్వే నిర్వహించారు. భారత్‌లో... సృజనాత్మకత, డిజైన్.. కంపెనీలకు అత్యంత కీలకమని 98 శాతం మంది భారతీయ వృత్తి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతం సగటు (89)తో పోలిస్తే ఇది అధికమని అడోబ్ క్రియేటివ్ పల్స్ సర్వే-2016 గత నెలలో వెల్లడించింది. నేర్చుకోవాలనే తపన ఉన్నట్లు 83 శాతం మంది, సవాళ్లకు పరిష్కారాలను కనుగొనాలనే జిజ్ఞాస ఉన్నట్లు 61% మంది చెప్పారు. సర్వే ముఖ్యాంశాలు ⇒ ‘సృజనాత్మకత’కు తలుపులు తె రవడం ఆర్థిక వృద్ధికి అత్యంత ‘కీ’లకమని 76 శాతం మంది అభిప్రాయపడ్డారు. ⇒ తాము క్రియేటివ్ అని 41 శాతం మంది చెప్పగా, తమ శక్తి సామర్థ్యాల మేర సృజనాత్మకంగా వ్యవహరిస్తున్నామని 31 శాతం మంది మాత్రమే తెలిపారు. ⇒ తమలోని సృజనాత్మకతను గుర్తించామని 31 శాతం మంది చెప్పారు. ⇒ క్రియేటివిటీని ప్రోత్సహించే కంపెనీల్లో ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుందని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. ⇒ కంపెనీలు మంచి డిజైన్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరముందని 74 శాతం మంది చెప్పారు. ఐదేళ్ల కిందటితో పోలిస్తే మంచి డిజైన్ అనేది ఇప్పుడు మరింత అవసరమని ప్రతి ముగ్గురిలో ఇద్దరు అభిప్రాయపడ్డారు. ⇒ విద్యా వ్యవస్థలో క్రియేటివిటీ కొరవడిందని 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. ⇒ క్రియేటివిటీని ప్రోత్సహించే ప్రభుత్వాలు ఉన్న చోట ఉత్పాదకత (79 శాతం), పోటీతత్వం (78 శాతం) పెరుగుతుందని, పౌరులు సంతోషంగా ఉంటారని 76 శాతం మంది చెప్పారు. ⇒ మిగతా నాలుగు దేశాలను వెనక్కి నెట్టి జపాన్ సృజనాత్మక దేశంగా నిలువగా. టోక్యో సృజనాత్మక నగరంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా యూఎస్, న్యూయార్క్ చోటు దక్కించుకున్నాయి. ‘సృజనాత్మకత, ఉత్పాదకత రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ సృజనాత్మకతను ప్రోత్సహించాలనే విషయం మన నేతల ఎజెండాలో ఉండటం లేదు. తాజా సర్వే వ్యాపార సంస్థలకు ఓ ‘వేకప్ కాల్’ లాంటిది. సంస్థలు విభిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. క్రియేటివ్‌గా ఉండేందుకు ఉద్యోగులకు అవసరమైన స్వేచ్ఛనివ్వాలి’ - మాలా శర్మ, వైస్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ మేనేజర్, అడోబ్. -
పోనీ రోజెస్ ఫ్లవర్‌పాట్
ఇంటిప్స్ సిట్టింగ్ రూమ్‌లోకి పూలతోట నడిచి వచ్చినట్లుంది కదూ! నిండుగానూ సింపుల్‌గానూ కంటికి ఆహ్లాదకరంగానూ కనిపిస్తున్న ఈ ఫ్లవర్ అరేంజ్మెంట్ కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మందపాటి గాజు బాటిల్ కాని పింగాణి జాడీ కాని తీసుకుని అందుబాటులో ఉన్న పూలు, ఆకులన్నింటినీ ఒక క్రమపద్ధతిలో క్రియేటివ్‌గా అమర్చడమే. గులాబీ, జినియా పూలతోపాటు రకరకాల ఆకులను వాడారు. అవి, ఇవి అన్న తేడా లేకుండా అన్ని రకాల పూలను వాడవచ్చు. ఈ సీజన్ చేమంతులు బాగా పూస్తాయి కాబట్టి తెల్ల చేమంతులను వాడి చూడండి. గదికి అందాన్ని తీసుకురావడంతోపాటు చేమంతుల నుంచి వచ్చే పరిమళం ఊపిరితిత్తుల సమస్యలను నివారిస్తుంది కూడా. తెలుపు, పచ్చ రంగుల కాంబినేషన్ ఎక్కడయినా అమరుతుంది. గది గోడల రంగు, ఫర్నిచర్ గురించి పట్టించుకోవాల్సిన పనే ఉండదు. -
పరిశోధనాత్మక విద్యకు ప్రాధాన్యమివ్వాలి
♦ ఏపీ సైన్స్ అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ డాక్టర్ బీఎల్ దీక్షితులు ఎచ్చెర్ల: ఇంజినీరింగ్ కళాశాలల్లో పరిశోధనాత్మక విద్యకు ప్రాధాన్యమివ్వాలని ఏపీ సైన్స్ అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ డాక్టర్ బీఎల్ దీక్షితులు పిలుపునిచ్చారు. చిలకపాలేం సమీపంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా ‘రీసెంట్ ట్రెండ్స్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇమేజ్ ప్రొసెసింగ్’ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. కార్యక్రమానికి దీక్షితులు రీసోర్సు పర్సన్‌గా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఇమేజ్ ప్రోసెసిగ్ సాంకేతి పరిజ్ఞానం శరవేగంగా విస్తరిస్తోందన్నారు. కొత్త ఆవిష్కరణలతో వైద్య, వాతావరణ, రవాణా వంటి రంగాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఆర్థోపెడిక్ విభాగంలో చిన్నలోపంలో ఉన్నా గుర్తించే అధునాతన ఎక్స్‌రే వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. రోబోటిక్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, న్యూరో సైన్స్, క్లోడ్ కంప్యూటరింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రస్తుతం విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. రైల్వే, బ్యాంకింగ్, మెడిసిన్... ఇలా అన్ని రంగాలు ఇమేజ్ ప్రొసెసింగ్ రంగంపై ఆధారపడుతున్నాయని వివరించారు. వైద్య శాస్త్రంలో ముందుగా జబ్బు గుర్తిస్తేనే అందుకు తగ్గ చికిత్స ప్రారంభించగలమన్నారు. ప్రస్తుత విద్యావిధానంలో సైతం మార్పులు అవసరంగా చెప్పారు. విద్యార్థులు తరగతి గదికి పరిమితం కావటం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. నిరంతర పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై విశ్లేషనాత్మక సదస్సులు అవసరంగా చెప్పారు. సదస్సు అనంతరం దీక్షితులను కళాశాల మేనేజ్ మెంట్ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు డాక్టర్ బి.మురళీకృష్ణ, డాక్టర్ జి.రమేష్‌బాబు, ప్లేస్ మెంట్ అధికారి డాక్టర్ గణియా రాజేంద్రకుమార్, సీఎస్ఈ ప్రొఫెసర్లు డాక్టర్ టి.వి.మధు సూధనరావు, టంకాల మాణిక్యాలరావులు పాల్గొన్నారు. -
నో కన్ఫ్యూజన్
Guest Time అందరిలోనూ సృజన అంతర్లీనంగా దాగి ఉంటుంది. సాధనతో మనకు మనమే దానిని వెలికి తీసుకోవాలి అంటారు ప్రముఖ సంతూర్ వాద్యకారుడు పండిట్ రాహుల్ శర్మ. సాధనతోనే రాణింపు వస్తుందనేది ఆయన మాట.ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ‘జాదవ్‌పూర్ యూనివర్సిటీ హైదరాబాద్ చాప్టర్ అలుమ్ని’ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయనను సాక్షి సిటీప్లస్ పలకరించినపుడు తన సంగీత ప్రయాణం గురించి ఇలా వివరించారు. నాన్న, ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ నా తొలిగురువు. సంగీత ప్రపంచంలో ఆయన పేరు తెలియని వారు లేరు. నేను 13వ ఏట నుంచే సంతూర్ వాయించడం నేర్చుకున్నాను. నాన్నతో కలసి ఎన్నో ప్రదర్శనలిచ్చాను. సంగీతం నేర్చుకోవటంతో పాటు పాటలు పాడటం, వేదికలపై ప్రదర్శలివ్వడం చిన్న వయసులోనే ప్రారంభించాను. ఏ రంగమైనా సృజన ముఖ్యం సృజనతో మాత్రమే ఏ రంగంలోనైనా రాణించగలం. క్రియేటివిటీతోనే ప్రతి సందర్భాన్నీ సంగీతమంత అందంగా మలుచుకోవచ్చు. సాధనతోనే హోదా, గుర్తింపు లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి చదువుతో పాటే సంగీతం లేదా మరేదైనా అంశాన్ని హాబీగా మలచుకోవాలి. హిందుస్థానీ మ్యూజిక్‌తో పాటు ఫ్యూజన్ మ్యూజిక్‌లోనూ నా ముద్ర ఉంది. ముఖ్యంగా ఫ్యూజన్‌ను కన్ఫ్యూజ్ చేయకూడదు. కచేరీకి ముందు పరికరాల శబ్దాలను, మైకుల నుంచి వచ్చే ధ్వనులను సరిచేసుకోవాలి. అప్పుడే ఫ్యూజన్ సూటిగా హృదయాలను తాకుతుంది. ఇక్కడ ధ్వని బదలాయింపు చాలా ముఖ్యం. వెస్ట్రన్, ఇండియన్ మ్యూజిక్ల తీరు వేరు. ఫ్యూజన్ మ్యూజిక్ తీరు వేరు. మై ఫేవరెట్ ప్లేస్ హైదరాబాద్ నాకు ఇష్టమైన ప్రాంతం. నేను సంగీత కచేరీలు ఇవ్వడం ప్రారంభించిన నాటి నుంచి ఇక్కడకు వస్తూనే ఉన్నాను. ఖాదర్ అలీ బేగ్‌తో పాటు ఆయన కుమారుడు మహ్మద్ అలీ బేగ్ ప్రోగ్రామ్‌లకు ఎన్నోసార్లు వచ్చాను. హైదరాబాదీలు సంగీతప్రియులు. వారు చూపించే ఆదరణ కళాకారులకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. యువత ఇటు వైపు రావాలి మన సంస్కృతి, సంప్రదాయాలు విలక్షణమైనవి. వీటి పరిరక్షకులు యువతే. అన్నింటా, అంతటా సంగీతమే ప్రాముఖ్యం వహిస్తుంది. యువత దీనినో కెరీర్‌గా మలచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నేను ముంబైలోని మిథిబాయి కాలేజీ నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశాను. కానీ, విచిత్రంగా సంగీత ప్రపంచం వైపు అడుగులు వేశాను. 1996 నుంచి నా సంగీత ప్రదర్శనలు మొదలయ్యాయి. 2000 సంవత్సరం నుంచి సొంతంగా కచేరీలు ఇస్తున్నాను. అప్పటి నుంచి దేశ, విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చాను. హిమాలయశర్మ, భవానీశంకర్, తబలా ఉస్తాద్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి చేసిన ప్రదర్శనలు రికార్డులు సృష్టించాయి. 2002లో నా సంగీత ప్రదర్శనలకు సంబంధించి ఆరు టైటిల్స్ గెలుచుకొన్నాను. ‘ముసే దోస్తీ కరోగే’ సినిమాకి సంగీతం అందించినందుకు ‘ఉత్తమ తొలి సంగీత దర్శకుడు’ అవార్డ్ అందుకున్నాను. -
అతడిది అదో టైపు!
హైదరాబాద్‌లో పాతబస్తీలోని తలాబ్‌కట్ట దగ్గర నివసించే మహమ్మద్ ఖుర్షీద్ హుస్సేన్ రెండు గిన్నిస్ రికార్డులు అందుకున్నారు. రెండూ టైప్ చేయడంలోనే. 2012వ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీన ఇంగ్లిష్ అక్షరమాలను 3.43 సెకన్లలో టైప్ చేయడంలో మొదటి రికార్డు సాధించారు. అది మాత్రం చేత్తోనే. ఆ తర్వాత మరింత సృజనాత్మకంగా మరేదైనా చేయాలనిపించడంతో ఇలా ముక్కుతో టైప్ చేశాడు. ‘‘అప్పుడు నాకు ఏడేళ్లు. సమ్మర్ కోచింగ్ క్యాంపులో చేర్చింది మా అమ్మ. అక్కడ శిక్షకులు, సీనియర్ స్టూడెంట్స్ నేను టైప్ చేసే వేగం చూసి ఆశ్చర్యపోయేవారు. ప్రాక్టీస్ చేస్తే రికార్డు సాధించవచ్చు అని చెప్పారు. అప్పుడు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. మా అమ్మకు పిల్లలు చురుగ్గా ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఉండడం ఇష్టం. ఆమె రోజూ పేపర్ చదివి, పిల్లలు సాధించిన విజయాల వార్తలను మాకు చూపించేది. అలా నాకు కూడా ఏదో ఒక ప్రత్యేకత సాధించాలనిపించింది. నాకు బాగా వచ్చిన టైప్‌లోనే ప్రయత్నిద్దామనుకున్నాను’’ అని వివరించారీ యువకుడు. టైప్ చేయడంలో వేగం పెంచుకోవడానికి ఖుర్షీద్ కఠోరమైన సాధన చేశాడనే చెప్పాలి. రోజుకు ఎనిమిది గంటల సాధన చేయడంలో స్నేహితులు, కాలేజ్ యాజమాన్యం, తండ్రి అందరూ అతడికి సహకరించారు. బిటెక్ చదువుతున్న సమయంలో ‘కెఎమ్ఐటి’ కాలేజ్ యాజమాన్యం మధ్యాహ్నం నుంచి ఖుర్షీద్ టైప్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతిచ్చింది. టైప్ మొదలు పెట్టగానే టైమ్ రికార్డు చేయడానికి స్నేహితులు సహకరించేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని తండ్రి అక్బర్ హుస్సేన్ చేసేవారు. ఇంటివద్ద రాత్రి ఏడు నుంచి పదకొండు వరకు సాధన చేసేవారు. ‘‘ఒక్కోసారి రాత్రి ఒంటిగంట అయినా ప్రాక్టీస్ ఇక చాలంటే వినేవాడు కాదు. నేను రికార్డు బ్రేక్ చేస్తాను పాపా... అని మొండిగా సాధన చేస్తుంటే ఖుర్షీద్‌తోపాటు కూర్చుని టైమ్ రికార్డు చేసేవాడిని. మామూలు కీబోర్డు రెండు వందలకు వస్తుంది. టీవీఎస్ కీబోర్డు అయితే సౌకర్యంగా ఉంటుందంటే పదిహేను వందలు పెట్టి కొన్నాను. కొన్నిసార్లు ఆర్థికంగా సర్దుబాట్లు చేసుకుని మరీ డబ్బు సిద్ధం చేశాను. బాబు గిన్నిస్ రికార్డు సాధించాడనే ఆనందం కంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించి విజయుడైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు తండ్రి అక్బర్. ఖుర్షీద్ చక్కటి క్రికెట్ క్రీడాకారుడు కూడా. గౌతమ్ మోడల్ స్కూల్లో క్రికెట్ జట్టుకి కెప్టెన్. పదవ తరగతిలో తల్లిదండ్రుల హెచ్చరికతో పుస్తకాలకే పరిమితమయ్యాడు. ‘‘క్రికెట్లో రాణించాలంటే చదువును పక్కన పెట్టి మరీ ప్రాక్టీస్ చేయాలి. పైగా చాలా ఖర్చవుతుంది. అంత ఖర్చుని భరించడం మాకు కష్టమే. దాంతో ఖుర్షీద్‌ని క్రికెటే కెరీర్ కావాలనుకుంటున్నావా, చదువు మీద ఆసక్తి ఉందా లేదా... అని అడిగితే చదువును పక్కన పెట్టడానికి ఇష్టపడలేదు. దాంతో ఖుర్షీద్ క్రికెట్ ప్రాక్టీస్ పాఠశాల స్థాయిలోనే ఆగిపోయింది. బాబు బెంగపెట్టుకోకూడదనే ఉద్దేశంతో... దేశమంతటా నీ పేరు తెలియాలంటే ఇంకా చాలా మార్గాలున్నాయని చెప్పాను. అలా తన దృష్టి రికార్డుల మీదకు మళ్లింది’’ అంటారు ఖుర్షీద్ తల్లి దిల్నాజ్ బేగం. ముక్కుతో టైప్ చేసే క్రమంలో జటిలమైన ఇబ్బందులనే ఎదుర్కొన్నాడు ఖుర్షీద్. టైప్ రైటర్ మీద సాధన చేయడంతో ముక్కు టైప్‌రైటర్ కీస్ మధ్యలో నలిగి, ముక్కు దూలానికి గాయమై రక్తం కారింది. వైద్యం చేసిన డాక్టర్ మందలించారు కూడా. ఆ సందిగ్ధ సమయంలో అమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపించింది. ‘‘దేశానికి రికార్డు తీసుకురావడంలో అయిన గాయం ఇది. రికార్డు వస్తే ప్రపంచ రికార్డుల జాబితాలో ఇండియా పేరు మరోసారి నమోదవుతుంది. గాయం నీ ఒక్కడిదే. రికార్డు దేశానిది. ప్రాక్టీస్ అపేసి నీ మనసు కష్టపెట్టుకుని, అసంతృప్తి చెందడం కంటే కొంత విరామం తీసుకుని గాయం తగ్గిన తర్వాత ప్రాక్టీస్ కొనసాగించు...’’ అని చెప్పింది. అంతటితో ఆగిపోలేదు. ‘‘ఖురాన్ చెప్పిన సూక్తులను విశ్వసించు. అవి నీలో ఆత్మవిశ్వాసం సడలకుండా మానసిక ధైర్యాన్నిస్తాయి...’’ అని కూడా చెప్పింది. అలాగే రికార్డు సాధనకు దేహదారుఢ్యం కూడా చక్కగా ఉండాలని శిక్షణ ఇప్పించింది. రోజూ ఉదయం కనీసం మూడు కిలోమీటర్ల దూరం పరుగెత్తడం, ఆ తర్వాత జిమ్‌లో వ్యాయామం తప్పనిసరి చేసింది’’ అని తన విజయంలో అడుగడుగునా ఉన్న తల్లి పాత్రను గుర్తు చేసుకున్నారు ఖుర్షీద్. ఈ ఏడాది బి.టెక్. పూర్తి చేసిన ఖుర్షీద్ పైచదువుల కోసం అమెరికా వెళ్తున్నారు. ఎంఎస్ చేయడానికి చికాగోలోని వాల్పరాసియో యూనివర్శిటీలో సీటు వచ్చింది. రానున్న ఆగస్టు ఐదవ తేదీ అమెరికా వెళ్లే విమానం ఎక్కనున్నారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసంతోపాటు ఇండియాకు మరిన్ని రికార్డులు సాధించడమే తన లక్ష్యం అంటారు. తల్లి తనకు పేపర్లలో వచ్చిన ప్రముఖులను ఆదర్శంగా చూపించేది. అలాంటిది తమ్ముళ్లిద్దరికీ తాను రోల్‌మోడల్ కావడం గర్వంగా ఉందంటారు. - వాకా మంజులారెడ్డి ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హ్యావ్ చాలెంజ్డ్ మి టు టైప్ దిస్ సెంటెన్స్ యూజింగ్ మై నోస్ ఇన్ ద ఫాస్టెస్ట్ టైమ్’ ఈ వాక్యాన్ని ఇంగ్లిష్‌లో అక్షర దోషాలు, విరామ దోషాలు లేకుండా టైప్ చేయాలి. ఈ వాక్యాన్ని ఆరేళ్ల కిందట దుబాయ్‌లో ఓ అమ్మాయి ఒక నిమిషం 33 సెకన్ల సమయంలో టైప్ చేసి రికార్డు సృష్టించింది. 103 వర్ణాలున్న ఇదే వాక్యాన్ని 47.44 సెకన్ల సమయంలో టైప్ చేసి రికార్డును బ్రేక్ చేశాడు ఓ భారతీయుడు. ఆ కుర్రాడే -ఖుర్షీద్ హుస్సేన్. టైప్‌తో పరిచయం ఉన్న ఎవరికైనా... ఈ వాక్యాన్ని టైప్ చేయడానికి అంత సమయం తీసుకున్నారా? దానికి ప్రపంచ రికార్డు దక్కడమా అనే సందేహం వచ్చి తీరుతుంది. ఇది అలవోకగా చేతివేళ్లతో టైప్ చేయడంలో పోటీ కాదు. ముక్కుతో టైప్ చేయడంలో రికార్డు. గాయం నీ ఒక్కడిదే. రికార్డు దేశానిది. ప్రాక్టీస్ అపేసి నీ మనసు కష్టపెట్టుకుని, అసంతృప్తి చెందడం కంటే కొంత విరామం తీసుకుని గాయం తగ్గిన తర్వాత ప్రాక్టీస్ కొనసాగించు... అని అమ్మ దిల్నాజ్ బేగం చెప్పిన మాటలు ఖుర్షీద్‌కు స్ఫూర్తినిచ్చాయి. టైపింగ్‌లో రెండు గిన్నిస్ రికార్డులు సాధించిన తొలి భారతీయుడు ఖుర్షీద్ 2012లో చేతితో 3.43 సెకన్లలో ఇంగ్లిష్ అక్షరమాల టైప్‌చేయడం ఈ ఏడాది ముక్కుతో టైపింగ్‌లో రికార్డ్. -
నేను తీయలేనని వాళ్ల నమ్మకం!
చెరుకుగడలా నిటారుగా,‘నవ్వించడానికే’ అన్నట్టుగా ఉంటారు అవసరాల శ్రీనివాస్. ఆయనను చూస్తే హాలీవుడ్ హాస్య ద్వయం లారెల్-హార్డీలో లారెల్ గుర్తొస్తాడు. శ్రీనివాస్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆర్జించిన పేరు మాత్రం ఎక్కువ. ఇప్పుడందరికీ షాకిస్తూ.. ‘ఊహలు గుసగుసలాడే’తో డెరైక్టర్‌గా కూడా మారిపోయాడు. అవసరానికి నటునిగా మారి.. ఇప్పుడు తెలుగు తెరకు అవసరం అన్నట్లుగా ఎదిగిన ఈ ప్రవాస భారతీయుడితో కాసేపు... చెప్పండి సార్... దర్శకునిగా తొలి అనుభవం ఎలా ఉంది? చాలా బాగుంది... క్రియేటివ్ కంట్రోల్ అంతా మన చేతిలోనే ఉంటుంది. నిజంగా ఇదో కిక్కు. అసలు డెరైక్టర్ అవ్వాలని ఎందుకనిపించింది? నిరుత్సాహానికి గురైన ప్రతిసారీ... ఉత్సాహంగా ముందుకు దూకడం నాకు అలవాటు. ‘నువ్వు నటుడివి అవడం ఏంటి?’ అన్నారు అప్పట్లో చాలామంది. దాంతో, నటుడినై చూపించాను. ‘నీకు డెరైక్షన్ దేనికి?’ అన్నారు కొంతమంది. డెరైక్టర్ అయి చూపించాను. అంతే. డెరైక్షన్ అంటే దానికి కొన్ని అర్హతలుండాలేమో కదా! నాకు లేవని ఎందుకు అనుకుంటున్నారు! నేను కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా కూడా పనిచేశాను. ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రానికైతే... రచయితల టీమ్‌లో నేనూ ఒకణ్ణి. డెరైక్టర్‌కు ఉండాల్సింది విజన్. అది నాకుంది. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన మీకు అసలు సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇంటర్మీడియట్లో బైపీసీ చదువుదామనుకున్నా. ఇంట్లోవాళ్లు బలవంతంగా ఎంపీసీ గ్రూపు అంటగట్టారు. ఆ పైన ఇంజినీరింగ్ పూర్తవగానే పై చదువులకు అమెరికా పంపారు. ఇష్టం లేని కాపురం చేయలేంగా... చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. దాంతో అమెరికాలో ఫిల్మ్ స్కూల్లో చేరా. ‘అష్టాచమ్మా’కు సెలక్టయ్యా. ఆ తర్వాత తెలిసిందే. మరి... డెరైక్టర్‌గా తొలి అవకాశం? సినిమాలు చేస్తూనే ఓ వైపు కథలు రాసుకుంటూ ఉండేవాణ్ణి. అలా రాసుకున్న కథే ‘ఊహలు గుసగుసలాడే’. చాలామంది కథ బాగుందన్నారు కానీ, అవకాశం ఇవ్వలేదు. నేను సినిమా తీయలేనని వాళ్ళ నమ్మకం. కానీ... నిర్మాత కొర్రపాటి సాయిగారు కథ వినగానే ‘చేస్కో’ అని అవకాశం ఇచ్చేశారు. స్క్రిప్టే ఈ సినిమాకు స్టార్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. త్వరలో విడుదల చేస్తాం. డెరైక్టర్‌గా కొనసాగుతారా? ఓ వైపు క్యారెక్టర్లు చేస్తూనే మరో వైపు డెరైక్షన్ చేస్తా. కొర్రపాటి సాయిగారిదే మరో సినిమా చేయాలి. స్క్రిప్ట్ వర్క్‌కు నేను ఎక్కువ టైమ్ తీసుకుంటా. తొలి ప్రాధాన్యం మాత్రం నటనకే. నాకు నటన అంటే ప్రాణం. కామెడీ హీరోగా బావుంటారు. ఆ ప్రయత్నం చేయొచ్చుగా? అప్పుడప్పుడైతే ‘ఓకే’.‘అమృతం చందమామలో’ హీరోని నేనేగా. అయితే, అలాగే కొనసాగలేను. హీరో అంటే సినిమా భారమంతా మోయాలి. అంత బలం నాకు లేదు. నటునిగా మీకంటూ డ్రీమ్‌రోల్ ఏమైనా ఉందా? నెగిటివ్ షేడ్సున్న పాత్ర చేయాలనుంది. అలాంటివి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డెరైక్టర్‌గా చాలా చేయాలి. ‘శ్రీనివాస్ ఇలాంటి సినిమాలే చేస్తా’డనే పేరు నాకొద్దు. ‘ఎలాంటి సినిమా అయినా చేయగల’డనే పేరు కావాలి. అది సరే.. కానీ... మీరు ‘రాకెట్‌బాల్’ బాగా ఆడేవారట కదా? అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి తెలుగువాళ్లందరం కలిసి అప్పుడప్పుడు క్లబ్‌కి వెళ్లి అమెరికన్లతో సరదాగా ఆడేవాణ్ణి. పోనుపోనూ ఆ ఆటపై ఆసక్తి పెరిగింది. స్టేట్ లెవల్లో స్వర్ణ, రీజినల్ లెవల్లో రజత పతకాలు సాధించా. మార్చి 1న మన దేశంలో తొలిసారిగా ‘ఇండియా ఓపెన్ రాకెట్‌బాల్ సింగిల్స్ చాంపియన్‌షిప్’ జరిగింది. అదీ హైదరాబాద్‌లో! అప్పుడు దక్షిణ కొరియాపై ఆడాం. మళ్లీ అక్టోబర్‌లో అమెరికా టోర్నమెంట్ ఉంది. వెళ్లాలి. అప్పటివరకూ సినిమాలతోనే బిజీ. - బుర్రా నరసింహ -
కథ కంచి నుంచి తిరిగొస్తుంది...
వెన్నెల రాత్రిలో అమ్మమ్మ కథ మొదలు పెడుతుంది.... ‘‘అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆరాజుకు ఏడుగురు కుమారులు...’’ పిల్లలు ఆరు బయట కూర్చున్నట్లే కనిపిస్తున్నారుగానీ, వారు రాకుమారులతో పాటు వేటకు వెళ్లారు. వస్తూ వస్తూ చేపలు తెచ్చారు. ‘‘చేప... చేప ఎందుకు ఎండలేదు?’’ అని అడిగారు. చేప సమాధానాలు సావధానంగా విన్నారు... ‘చేప...చేప ఎందుకు ఎండలేదు?’ అని అడిగితే ఆ చేప ఎన్ని కారణాలు చెప్పిందో ‘కథ...కథ...ఎందుకు వినిపించడం లేదు?’ అని అడిగితే కథ కూడా ఎన్నో కారణాలు చెప్పింది. ఇంట్లో పెద్దవాళ్లందరూ బిజీగా ఉన్నారని, పిల్లలు చదువుల్లో అంతకంటే బిజీ బిజీగా ఉన్నారని. ఇక కథ మాత్రం ఏం చేస్తుంది పాపం... కంచికి పోకుండా!! కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! మళ్లీ మంచి కాలం వస్తోంది. ఇది ఆశాభావం కాదు...అక్షరాలా నిజం! పిల్లలు కథలు వినడాన్ని కాలహరణంగా భావించే తలిదండ్రులు మారిపోతున్నారు. పిల్లలను ప్రేమగా దగ్గరకు పిలిచి కథలు చెబుతున్నారు. తమకు వీలు కాకపోతే కథల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకుంటున్నారు. ఎందుకీ మార్పు?: బోలెడు చానళ్ల పుణ్యమా అని పిల్లల వినోదానికి కొదవ లేదు. అయితే టీవీ వినోదం పిల్లల మానసిక ఎదుగుదల మీద మితిమీరి ప్రభావం చూపుతోంది. మితిమీరి టీవి చూడడం వల్ల ఆలోచన, విశ్లేషణా సామర్థ్యానికి పిల్లలు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కథలు వినడానికి ప్రాముఖ్యం పెరిగింది. ఉపయోగం ఏమిటి?: కథ వినే క్రమంలో పిల్లలలో రకరకాల సందేహాలు వస్తుంటాయి. అవి వారి మానసిక ఎదుగుదలకు తోడ్పడతాయి. కథ వినే క్రమంలో రకరకాల దృశ్యాలను ఊహించుకుంటారు. ఇది వారి సృజనను శక్తిమంతం చేస్తుంది. విన్న కథను తిరిగి చెప్పే క్రమంలో పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కథ మొత్తం చెప్పకుండా సగం వరకు చెప్పి... ‘ఆ తరువాత ఏమైందో చెప్పండి?’ అని అడిగితే పిల్లలు అప్పటికప్పుడు కథను అల్లుతూ పోతారు. ఇది ఒక రకంగా సృజనను పెంపొందించే విధానం. కథను పూరించే క్రమంలో ఆశావాద దృక్పథానికి ప్రాధాన్యం ఇస్తారు. సమస్యకు పరిష్కారం ఆలోచించడాన్ని పెంపొందించుకుంటారు. మానవసంబంధాలు, నైతిక విలువల్లోని గొప్పదనాన్ని గుర్తిస్తారు. కొత్త ప్రదేశాలు, పాత ఆచారాలు, భాషావ్యవహారాలు, పద పరిచయం, సాంస్కృతిక మూలాలు...ఒక్కటనేమిటి సమస్త విషయాలను, విలువలను ‘కథ’ పిల్లలకు పరిచయం చేస్తుంది. సృజనాత్మక ఆలోచనలకు, ఆలోచన పరిధిని పెంచడానికి కథను మించిన సాధనం లేదనే విషయం ఎన్నో పరిశోధనల్లో తెలిశాక...మెల్లిగా కథలకు ప్రాముఖ్యం పెరగడం మొదలైంది. కొన్ని పాఠశాలల్లో కథ చెప్పడం కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకుంటున్నారు. బెంగళూరులోని ‘మహాత్మా స్కూలు’లో ‘కథాలయ’ పేరుతో విరివిగా కథా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ‘మహాత్మా’ బాటలోనే చాలా పాఠశాలలు ‘కథాలయ’లు నిర్వహిస్తున్నాయి. ‘‘కథ అనేది అనేక కళల సమాహారం. కథ చెబుతున్నప్పుడు ఆడతాం, పాడతాం, అనుకరిస్తాం. అందుకే పిల్లలు కథ వినడానికి ఇష్టపడతారు. కథలు చెప్పడం అనేది కాలక్షేపం కోసం కాదు..పిల్లలను చక్కగా తీర్చిదిద్దడానికి’’ అంటున్నారు ‘కథాలయ’ ట్రస్ట్ డెరైక్టర్ గీతా రామానుజన్. విదేశాల నుంచి కూడా ప్రసిద్ధ కథకులను రప్పించి పిల్లలకు కథలు చెప్పించడం ఈ ‘కథాలయ’ ప్రత్యేకత. ‘ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లింగ్ నెట్వర్క్’తో ‘కథాలయ’ ప్రత్యేక ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్‌వర్క్‌లో 15 దేశాలకు చెందిన 490 మంది సభ్యులు ఉన్నారు. జూన్ 21ని ‘వరల్డ్ సోరీ టెలింగ్ డే’గా ఈ నెట్వర్క్ ప్రకటించింది. ‘కథాలయ’ మరో ప్రత్యేకత ఏమిటంటే, పిల్లలను మారుమూల ఆదివాసుల దగ్గరికి తీసుకెళ్లి వారి చేత కథలు వినిపిస్తారు. ఇలా ఎన్నో విలువైన జానపద కథలు వినే అదృష్టం పిల్లలకు కలిగింది. ఈ సమకాలీన పరిణామాల మధ్య మన రాష్ట్రంలోని పాఠశాలల్లోనూ ఇప్పుడిప్పుడే ‘కథ చెప్పడం’ అనేది ఊపందుకుంటుంది. అంటే ‘కథ’కు మళ్ళీ బంగారు కాలం వస్తోందని ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది! నేను గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ఆరు పాఠశాలలకు ‘స్టోరీ టెల్లర్’గా పనిచేస్తున్నాను. ఈ మధ్యనే ‘స్టోరీ ఆర్ట్స్ ఇండియా’ పేరుతో హైదరాబాద్‌లో కొన్ని ప్రదేశాల్లో పిల్లల్ని సమీకరించి కథలు చెబుతున్నాను. కథలంటే చందమామ కథలు మాత్రమే కాదు, వయసుని బట్టి వారికి కావాల్సిన భాష, విజ్ఞానం కూడా అందులో ఉండేలా కథలను తయారుచేసుకుంటున్నాను. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయుల కోరిక మేరకు హరికథల రూపంలో కూడా కథలు చెబుతున్నాను. చిన్నపిల్లల విషయానికొస్తే కథ సృజనాత్మకతను పెంచుతుంది కాబట్టి వారి మెదడులో పూర్తిస్థాయి ఊహాచిత్రం వచ్చే విధంగా వివరించి చెబుతాను. అలాగే మన శరీరంలో ఏ అవయవం ఎలా పనిచేస్తుందో చెప్పే కథలను కూడా తయారుచేసుకున్నాను. అరటి పండు తింటే అది ఎలా జీర్ణమవుతుందో చెప్పడానికి...అరటి పండు మాట్లాడుతున్నట్లు కథ అల్లి చెప్పాలి. అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాలు, జాతులు, భాషలు, మతాలు అన్నింటిపై కనీస అవగాహనను పెంచే కథలను ఏ రోజుకారోజు తయారుచేసుకుంటాను. ‘కథ’కున్న శక్తి గురించి ఇంకా చాలామంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియదు. అన్ని పాఠశాలలో కథలు చెప్పే తరగతి ఉండాల్సిన అవసరం చాలా ఉంది. - దీపాకిరణ్ స్టోరీ ఆర్ట్స్ ఇండియా వ్యవస్థాపకురాలు -
దారి చూపు దీపాలు...
పెద్దవారి మాటలు అనుభవాల మూటలు. వెలుగు దీపాలు. యువత సరియైన దారిలో నడవాలంటే, ఒక ఆశయం అంటూ ఏర్పరచుకోవాలంటే, దాన్ని సాధించాలంటే, విజయ ధ్వజాన్ని సగర్వంగా పదిమందిలో ఎగరేయాలంటే ఆ వెలుగు కళ్లలో పడాలి. ప్రపంచవ్యాప్తంగా పేరున్న పెద్దలు, పేరు బయటపడడానికి ఇష్టపడని అజ్ఞాత జ్ఞానులు తమ మాటల్లో ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఆ మాటల వెలుగులు ఇవి.... ఒక యువకుడు తన సాయంత్రాలను ఏ విధంగా గడుపుతున్నాడో చెబితే... అతడు ప్రపంచం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపగలడో చెప్పవచ్చు. తమ ఖాళీ సమయాన్ని హానిరహిత ఆలోచనలతో, సృజనాత్మక, బాధ్యతాయుతమైన విషయాలకు సంబంధించిన చర్చలతో గడిపేవారు గొప్ప బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధులైనవారని చెప్పవచ్చు. - బి.సి.ఫోర్బ్స్, స్కాటిష్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్, ఫోర్బ్స్ మ్యాగజీన్ వ్యవస్థాపకుడు ఒక దేశం, ఆ క్షణంలో నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకోవడం అనేది ఆ దేశంలో ఉండే యువత మీద ఆధారపడి ఉంటుంది. - జాన్ పి.గ్రియర్, జర్నలిస్ట్, ఫోర్బ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ యవ్వనమనేది వసంతకాలంలాంటిది. ఆ సమయంలో నన్ను మనిషిగా నిలబెట్టే సుసంపన్నమైన విత్తనాలు నాటాను. మనిషిగా నేను ఎదిగే క్రమంలో అవి వృక్షాలుగా మారి, వయసులోకి వచ్చేసరికి చక్కని ఫలాలు ఇచ్చాయి. -రిచర్డ్ హిల్ ఫౌస్ యవ్వనంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి. యవ్వనం అంటేనే పోరాడే వయసు అని అర్థం. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే తెలివితేటలతో కూడిన శక్తి ఆ వయసులో వస్తుంది. - అజ్ఞాత రచయిత విజయవంతమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దు. విలువలతో కూడా కూడిన విజయాన్ని సాధించిన వ్యక్తిగా నిలబడేందుకు ప్రయత్నించు. -అల్బర్ట్ ఐన్స్టిన్, శాస్త్రవేత్త నువ్వు చేసే పనులు అవతలి వారిలో స్ఫూర్తిని కలిగించి, ఉత్సాహాన్ని నింపి, నేర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాయంటే... నువ్వే ఒక లీడర్. - అజ్ఞాత రచయిత ఈ ప్రపంచం శక్తియుక్తులు కలిగిన వారి సొంతం. -రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, అమెరికన్ రచయిత ఒక అవసరాన్ని గుర్తించు, దాన్ని తీర్చడానికి ప్రయత్నించు. -మిసెస్ రూత్ స్టాఫోర్డ్ పీలే, అమెరికన్ రచయిత్రి చతురత, తెలివిగలవానిగా ఎదగడంలో ఒక శాతం స్ఫూర్తి ఉంటే 99 శాతం కష్టం ఉంటుంది. -థామస్ ఎడిసన్, శాస్త్రవేత్త భరించలేకపోతున్నాను అనుకుంటే.. దాన్ని ఎదురించి పోరాడు. పోరాడలేకపోతున్నాను అనుకుంటే.. దాన్ని భరించి బతుకు. - అజ్ఞాత రచయిత నిన్న చేసిన పని ఈ రోజుకూ నీకు అనందాన్ని ఇస్తుంటే.. ఈ రోజు అంతకన్నా గొప్పగా ఏమీ చేయలేవు. - అజ్ఞాత రచయిత నువ్వు ఏం ఆలోచిస్తున్నావనే విషయాన్ని ఎదుటివారి అంచనాలకు అందనివ్వకు. - అజ్ఞాత రచయిత