బీ క్రియేటివ్! | Bee Creative | Sakshi
Sakshi News home page

బీ క్రియేటివ్!

Published Thu, Nov 3 2016 2:22 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

బీ క్రియేటివ్!

బీ క్రియేటివ్!

ఏ రంగంలో రాణించాలన్నా ఆసక్తి, పట్టుదల ముఖ్యం. వీటికి క్రియేటివిటీ తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. మరి మనలో ఎంత మంది తమ తమ సామర్థ్యాల మేరకు క్రియేటివ్‌గా వ్యవహరిస్తున్నారు? ఎంత మంది తమ సృజనాత్మకతకు పదునుపెడుతున్నారు?  ప్రతి పది మందిలో కేవలం ముగ్గురు మాత్రమే తమ శక్తి సామర్థ్యాల మేరకు సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘అడోబ్ మ్యాక్స్-2016 క్రియేటివ్ కాన్ఫరెన్స్’ను పురస్కరించుకుని అడోబ్ సంస్థ ‘స్టేట్ ఆఫ్ క్రియేట్-2016’ పేరిట ఐదు దేశాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది.     - సాక్షి సెంట్రల్ డెస్క్
 
క్రియేటివిటీతో అధిక ఆదాయంతో పాటు పోటీతత్వం, ఉత్పాదకత పెరుగుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. సృజనాత్మకతకు పదునుపెడితే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పేర్కొం ది. సృజనాత్మకంగా వ్యవహరించేవారు 13% ఎక్కువగా సంపాదిస్తున్నట్లు సర్వేలో తేలింది. మంచి ఉద్యోగులు గా, నాయకులుగా, తల్లిదండ్రులుగా, విద్యార్థులుగా ఎదగడంలో క్రియేటి విటీ ఉపయోగపడుతుందని మూడింట 2 వంతుల మంది విశ్వసిస్తున్నారు. జర్మనీ, యూకే, యూఎస్, ఫ్రాన్స్, జపాన్ దేశాల్లో సర్వే నిర్వహించారు.
 
భారత్‌లో...
సృజనాత్మకత, డిజైన్.. కంపెనీలకు అత్యంత కీలకమని 98 శాతం మంది భారతీయ వృత్తి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతం సగటు (89)తో పోలిస్తే ఇది అధికమని అడోబ్ క్రియేటివ్ పల్స్ సర్వే-2016 గత నెలలో వెల్లడించింది. నేర్చుకోవాలనే తపన ఉన్నట్లు 83 శాతం మంది, సవాళ్లకు పరిష్కారాలను కనుగొనాలనే జిజ్ఞాస ఉన్నట్లు 61% మంది చెప్పారు.
 
సర్వే ముఖ్యాంశాలు
⇒ ‘సృజనాత్మకత’కు తలుపులు తె రవడం ఆర్థిక వృద్ధికి అత్యంత ‘కీ’లకమని 76 శాతం మంది అభిప్రాయపడ్డారు.
⇒ తాము క్రియేటివ్ అని 41 శాతం మంది చెప్పగా, తమ శక్తి సామర్థ్యాల మేర సృజనాత్మకంగా వ్యవహరిస్తున్నామని 31 శాతం మంది మాత్రమే తెలిపారు.
⇒ తమలోని సృజనాత్మకతను గుర్తించామని 31 శాతం మంది చెప్పారు.
⇒ క్రియేటివిటీని ప్రోత్సహించే కంపెనీల్లో ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుందని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు.
⇒ కంపెనీలు మంచి డిజైన్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరముందని 74 శాతం మంది చెప్పారు. ఐదేళ్ల కిందటితో పోలిస్తే మంచి డిజైన్ అనేది ఇప్పుడు మరింత అవసరమని ప్రతి ముగ్గురిలో ఇద్దరు అభిప్రాయపడ్డారు.
⇒ విద్యా వ్యవస్థలో క్రియేటివిటీ కొరవడిందని 71 శాతం మంది అభిప్రాయపడ్డారు.
⇒ క్రియేటివిటీని ప్రోత్సహించే ప్రభుత్వాలు ఉన్న చోట ఉత్పాదకత (79 శాతం), పోటీతత్వం (78 శాతం) పెరుగుతుందని, పౌరులు సంతోషంగా ఉంటారని 76 శాతం మంది చెప్పారు.
⇒ మిగతా నాలుగు దేశాలను వెనక్కి నెట్టి జపాన్ సృజనాత్మక దేశంగా నిలువగా. టోక్యో సృజనాత్మక నగరంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా యూఎస్, న్యూయార్క్ చోటు దక్కించుకున్నాయి.
 
‘సృజనాత్మకత, ఉత్పాదకత రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ సృజనాత్మకతను ప్రోత్సహించాలనే విషయం మన నేతల ఎజెండాలో ఉండటం లేదు. తాజా సర్వే వ్యాపార సంస్థలకు ఓ ‘వేకప్ కాల్’ లాంటిది. సంస్థలు విభిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. క్రియేటివ్‌గా ఉండేందుకు ఉద్యోగులకు అవసరమైన స్వేచ్ఛనివ్వాలి’
- మాలా శర్మ, వైస్ ప్రెసిడెంట్  అండ్ జనరల్ మేనేజర్, అడోబ్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement