pulse survey
-
సా...గుతోంది..!
►ఏడాది దాటినా.. పూర్తికాని పల్స్ సర్వే ►కడప, ప్రొద్దుటూరులలో సర్వేకు దూరంగా 24 వేల కుటుంబాలు సాక్షి కడప: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ సర్వే జిల్లాలో కొనసాగుతోంది. ఏడాది దాటినా పూర్తికాలేదు. ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కూడా పల్స్ ఆధారంగానే సంక్షేమాన్ని అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో సర్వే కీలకమనే చెప్పాలి.2016 జులై 7వ తేదీ ప్రారంభమైన పల్స్ సర్వే కార్యక్రమాన్ని అప్పట్లో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని నడిపించినా తర్వాత ఆలస్యం అవుతూ వస్తోంది. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ పనిచేయక.. ట్యాబ్‌లు గంటల తరబడి ఒపెన్ కాకపోవడం లాంటి సమస్యలతో సర్వే అనుకున్న స్థాయిలో సాగలేదు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరులో ప్రస్తుతం పల్స్ సర్వే కొనసాగుతోంది. కడపలో సుమారు14 వేలు..ప్రొద్దుటూరులో 10 వేల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ప్రస్తుతం అడ్రసులు డోర్‌లాక్.. వలస వెళ్లినవారితో పాటు మరికొన్ని కుటుంబాలు అందుబాటులోకి వస్తే సర్వే పూర్తి కానుంది.çసుమారు 2088 మంది ఎన్యూమరేటర్లు, 200 మంది సూపర్వైజర్లు ఉన్నారు. సిబ్బంది, ట్యాబ్‌లు ఉన్నా సర్వే మాత్రం ముందుకు సాగడం లేదు. -
పల్స్ సర్వేతో ప్రలోభాలకు పక్కా స్కెచ్
-
పల్స్ సర్వేకు ప్రత్యేక కేంద్రాలు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వే (పల్స్ సర్వే) కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కుటుంబంలోని ప్రతి ఒక్కరు తప్పని సరిగా సర్వే చేయించుకోవాలని సూచించారు. ప్రజాసాధికార సర్వే చేయించుకోని వారి కోసం తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సర్వేలో నమోదు కాని ప్రజలు ఆన్లైన్ ద్వారా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
బీ క్రియేటివ్!
ఏ రంగంలో రాణించాలన్నా ఆసక్తి, పట్టుదల ముఖ్యం. వీటికి క్రియేటివిటీ తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. మరి మనలో ఎంత మంది తమ తమ సామర్థ్యాల మేరకు క్రియేటివ్‌గా వ్యవహరిస్తున్నారు? ఎంత మంది తమ సృజనాత్మకతకు పదునుపెడుతున్నారు? ప్రతి పది మందిలో కేవలం ముగ్గురు మాత్రమే తమ శక్తి సామర్థ్యాల మేరకు సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘అడోబ్ మ్యాక్స్-2016 క్రియేటివ్ కాన్ఫరెన్స్’ను పురస్కరించుకుని అడోబ్ సంస్థ ‘స్టేట్ ఆఫ్ క్రియేట్-2016’ పేరిట ఐదు దేశాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది. - సాక్షి సెంట్రల్ డెస్క్ క్రియేటివిటీతో అధిక ఆదాయంతో పాటు పోటీతత్వం, ఉత్పాదకత పెరుగుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. సృజనాత్మకతకు పదునుపెడితే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పేర్కొం ది. సృజనాత్మకంగా వ్యవహరించేవారు 13% ఎక్కువగా సంపాదిస్తున్నట్లు సర్వేలో తేలింది. మంచి ఉద్యోగులు గా, నాయకులుగా, తల్లిదండ్రులుగా, విద్యార్థులుగా ఎదగడంలో క్రియేటి విటీ ఉపయోగపడుతుందని మూడింట 2 వంతుల మంది విశ్వసిస్తున్నారు. జర్మనీ, యూకే, యూఎస్, ఫ్రాన్స్, జపాన్ దేశాల్లో సర్వే నిర్వహించారు. భారత్‌లో... సృజనాత్మకత, డిజైన్.. కంపెనీలకు అత్యంత కీలకమని 98 శాతం మంది భారతీయ వృత్తి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతం సగటు (89)తో పోలిస్తే ఇది అధికమని అడోబ్ క్రియేటివ్ పల్స్ సర్వే-2016 గత నెలలో వెల్లడించింది. నేర్చుకోవాలనే తపన ఉన్నట్లు 83 శాతం మంది, సవాళ్లకు పరిష్కారాలను కనుగొనాలనే జిజ్ఞాస ఉన్నట్లు 61% మంది చెప్పారు. సర్వే ముఖ్యాంశాలు ⇒ ‘సృజనాత్మకత’కు తలుపులు తె రవడం ఆర్థిక వృద్ధికి అత్యంత ‘కీ’లకమని 76 శాతం మంది అభిప్రాయపడ్డారు. ⇒ తాము క్రియేటివ్ అని 41 శాతం మంది చెప్పగా, తమ శక్తి సామర్థ్యాల మేర సృజనాత్మకంగా వ్యవహరిస్తున్నామని 31 శాతం మంది మాత్రమే తెలిపారు. ⇒ తమలోని సృజనాత్మకతను గుర్తించామని 31 శాతం మంది చెప్పారు. ⇒ క్రియేటివిటీని ప్రోత్సహించే కంపెనీల్లో ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుందని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. ⇒ కంపెనీలు మంచి డిజైన్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరముందని 74 శాతం మంది చెప్పారు. ఐదేళ్ల కిందటితో పోలిస్తే మంచి డిజైన్ అనేది ఇప్పుడు మరింత అవసరమని ప్రతి ముగ్గురిలో ఇద్దరు అభిప్రాయపడ్డారు. ⇒ విద్యా వ్యవస్థలో క్రియేటివిటీ కొరవడిందని 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. ⇒ క్రియేటివిటీని ప్రోత్సహించే ప్రభుత్వాలు ఉన్న చోట ఉత్పాదకత (79 శాతం), పోటీతత్వం (78 శాతం) పెరుగుతుందని, పౌరులు సంతోషంగా ఉంటారని 76 శాతం మంది చెప్పారు. ⇒ మిగతా నాలుగు దేశాలను వెనక్కి నెట్టి జపాన్ సృజనాత్మక దేశంగా నిలువగా. టోక్యో సృజనాత్మక నగరంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా యూఎస్, న్యూయార్క్ చోటు దక్కించుకున్నాయి. ‘సృజనాత్మకత, ఉత్పాదకత రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ సృజనాత్మకతను ప్రోత్సహించాలనే విషయం మన నేతల ఎజెండాలో ఉండటం లేదు. తాజా సర్వే వ్యాపార సంస్థలకు ఓ ‘వేకప్ కాల్’ లాంటిది. సంస్థలు విభిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. క్రియేటివ్‌గా ఉండేందుకు ఉద్యోగులకు అవసరమైన స్వేచ్ఛనివ్వాలి’ - మాలా శర్మ, వైస్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ మేనేజర్, అడోబ్. -
పల్స్ సర్వేకు అన్నీ అడ్డంకులే..
సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా తలపెట్టిన ప్రజాసాధికార సర్వే ప్రహసనంగా సాగుతోంది. వివరాల నమోదుకు ప్రభుత్వం రూపొందించిన యాప్ గందరగోళంగా ఉండటం, ఎన్యూమరేటర్లకు అవగాహన కల్పించకపోవడం, పదేపదే కార్యక్రమాన్ని వాయిదా వేయడం వెరసి అనేక సమస్యలతో స్మార్ట్ పల్స్ సర్వే నగరంలో ప్రహసనంగా సాగుతోంది. వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్యూమరేటర్లుగా అవతారమెత్తి ఇంటింటికి తిరిగి వివరాలు నమోదు చేస్తున్నా కొలిక్కి రాకపోవడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. వరుస సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నెల 25 నాటికి పూర్తిచేయాలని గడువు విధించటంతో సిబ్బంది హడావుడి పడుతున్నారు. రాష్ట్రంలోని నివాస గృహాల్లో ఉండే ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించి అన్ని ప్రభుత్వ విభాగాలతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సాధికార సర్వేకు శ్రీకారం చుట్టింది. తద్వారా సంక్షేమ పథకాలు పూర్తి పారదర్శకంగా, అర్హులకు మాత్రమే అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది జూలై 8న సీఎం చంద్రబాబు చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభించిన ఈ ప్రక్రియ అనేక సమస్యలతో కొనసాగుతోంది. సర్వే ప్రారంభించిన వెంటనే జిల్లాలో పుష్కరాల హడావుడి మొదలవడంతో ప్రక్రియ పూర్తిగా నెమ్మదించింది. ఆ తర్వాత ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరించే ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో జూలై 8 నుంచి ఆగస్టు 24 వరకు వివరాలను నమోదు చేసుకునే యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆరుసార్లు మార్పులు చేర్పులు చేశారు. దీంతో కొన్ని వివరాలు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో సర్వే మొదటినుంచి నిర్వహించాల్సిన పరిస్థితి గుంటూరులో ఏర్పడింది. నగరంలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు కలిపి 1,89,733 నివాస గృహాలు ఉండగా, వాటిలో 7,31,501 మంది నివసిస్తున్నారు. వీటిలో ఇప్పటికీ 2,76,436 మంది వివరాలు నమోదు కావాల్సి ఉంది. రెండు నియోజకవర్గాల్లో కలిపి సూపర్వైజర్లతో పాటు 360 మంది ఎన్యూమరేటర్లు విధుల్లో ఉన్నారు. రంగంలోకి ఏఎన్‌యూ విద్యార్థులు.. సర్వేకు గడువు దగ్గర పడుతుండటంతో అధికారులు ఏఎన్‌యూ విద్యార్థులను రంగంలోకి దింపారు. మొత్తం 150 మందిని ఈ సర్వేకు వినియోగించుకోవాలని భావించినా 50 మందికి మించి సర్వేలో పాల్గొనలేదు. సోమవారం కొంతమంది విద్యార్థులకు సర్వేపై అవగాహన కల్పించారు. అయినా వారికి స్పష్టత రాలేదు. దీంతో విద్యార్థులు ఎంతమంది సర్వేలో పాల్గొంటారో అధికారులే చెప్పలేకపోతున్నారు. స్పష్టత లేని ప్రభుత్వ ఆదేశాలు.. రాష్ట్ర ప్రభుత్వం సాధికార సర్వేకు సంబంధించి పూటకో నిబంధన మారుస్తుండటం మరింత సమస్యాత్మకంగా మారింది. తొలుత సర్వేలో భాగంగా కుటుంబ పెద్ద వేలిముద్రలు తీసుకుని మిగిలిన కుటుంబసభ్యుల పేరు, వివరాలు, వారి ఆధార్, రేషన్ కార్డు, ఇతర వివరాలు సేకరించారు. దాదాపు 20 రోజుల పాటు ఈ పద్ధతుల్లో సర్వే సాగింది. మళ్లీ ప్రభుత్వం దీనిలో మార్పులు చేసింది. కుటుంబంలో ప్రతి సభ్యుడి వేలిముద్రలతో పాటు ఆధార్ కార్డు, ఇతర వివరాలు మొత్తం సేకరించాలని ఆదేశించడంతో మళ్లీ రెండోసారి ఇంటిబాట పడుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో వివరాలు నమోదు చేసుకునే మిషన్లలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడం, ఇంటర్నెట్లు పనిచేయక యాప్ పనిచేయకపోవడంతో కొన్ని రోజులపాటు సర్వే నిలిచింది. సోమవారం 360 మంది ఎన్యూమరేటర్లు.. ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో సర్వే నిర్వహించకుండానే వెనుదిరిగారు. -
మళ్లీ మొదటికి..!
♦ వందశాతం ఈకేవైసీ కోసం మళ్లీ పల్స్ సర్వే ♦ వేలిముద్రలు సరిపోకుంటే ఐరిస్ సేకరణ ♦ సరిపడ ఐరిస్ పరికరాలు లేక ఇబ్బందులు ♦ తీవ్ర ఒత్తిడిలో ఎన్యుమరేటర్లు అనంతపురం అర్బన్ : జిల్లాలో ప్రజాసాధికార సర్వే ప్రహసనంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన సర్వే అసమగ్రంగా సాగింది. ప్రతి కుటుంబ సభ్యుని నుంచి ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) తీసుకోవాలని ఆదేశాలు రావడంతో ఎన్యుమరేటర్లు మరోసారి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాల్సిన పరిస్థితి నెలకొంది. వేలిముద్రలు సరిపోకపోతే ఐరిస్ (కంటి పాప) తీసుకోవాలనని ఆదేశాలు అందాయి. అయితే సరిపడ ఐరిస్ పరికరాలను ప్రభుత్వం సరఫరా చేయలేదు. ఈకేవైసీలో ఇదో పెద్ద సమస్యగా మారింది. సర్వే ముగించేందుకు గడవు ముంచుకు వస్తుండటంతో ఎన్యుమరేటర్లు తీవ్ర ఒత్తిడి గురవుతున్నారు. 33.65 లక్షల మంది వివరాల నమోదు జిల్లాలోని అనంతపురం, కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం, పెనుకొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 43.26 లక్షల జనాభా ఉన్నారు. ఇప్పటి వరకు 33.65 మంది వివరాలు సేకరించారు. ఇంత వరకు జరిగిన సర్వే ప్రకారం రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఇక సర్వే క్రమంలో 16.68 లక్షల తప్పులు దొర్లాయి. వీటిని పర్యవేక్షకులు సరిచేయాల్సి ఉంది. అక్టోబర్ 15 డెడ్‌లైన్ సర్వే చేసే క్రమంలో ప్రతి ఇంటిలోని కుటుంబసభ్యుల వేలిముద్రలు (ఈకేవైసీ) తీసుకుంటారు. చాలా చోట్ల కుటుంబసభ్యలందరూ అందుబాటులోకి రాలేదు. దీంతో కుటుంబ యజమాని వేలిముద్రలు తీసుకుని, లేని సభ్యుల ఆధార్ నంబర్ని అనుసంధానం చేసుకున్నారు. అలా కాదు ప్రతి సభ్యుని వేలిముద్రలు తప్పకుండా తీసుకోవాల్సిందేనని అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఎన్యుమరేటర్లు మరోమారు ప్రతి ఇంటికీ వెళ్లి గతంలో వేలిముద్రలు తీసుకోని వారి నుంచి ఇప్పుడు తీసుకోవాల్సి వస్తోంది. సర్వేని అక్టోబరు 15 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఎన్యూమరేటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఐరిస్ పరికరాలు లేకపోవడంతో... వేలిముద్రలు సరిపోలని వారి నుంచి ఐరిస్ (కంటిపాప) తీసుకోవాల్సి ఉంది. అయితే ఎన్యుమరేటర్లకు సరిపడ ఐరిస్ పరికరాలను ప్రభుత్వం సరఫరా చేయలేదు. ఇదే విషయంపై సెప్టెంబర్ 26న జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయభాస్కర్‌రెడ్డి, పెద్దన్నలు కలిసి పరిస్థితి వివరించడంతో పాటు వినతిపత్రం అందజేశారు. వంద శాతం ఈవైకేసీ చేయాలంటే తప్పని సరిగా ఐరిస్ పరికరాలు ఉండాలని తేల్చి చెప్పారు. అయితే జేసీ మాత్రం ఏదో ఒక విధంగా చేయండి.. లేకపోతే వేతనాలను నిలిపివేస్తాన్నారని తెలిపారు. -
బీసీలకు పల్స్ సర్వే వేరుగా నిర్వహించాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు అరండల్‌పేట: మంజూనాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణను కలిపి నిర్వహించడంతో బీసీలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలపలేకపోతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు బ్రాడీపేటలోని రాష్ట్ర సంఘ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి వంటి పట్టణంలో పోలీసు బందోబస్తు మధ్యలో మంజునాథ కమిషన్ సమక్షంలో బీసీలపై దాడులు జరిగాయని తెలిపారు. ఇలాంటి దౌర్జన్య వాతావరణంతో గ్రామీణ ప్రాంతాల్లోని బీసీలు కమిషన్ వద్దకు వచ్చి తమ బాధలన చెప్పుకోవడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చురేపుతుందని మండిపడ్డారు. విలేకర్ల సమావేశంలో బీసీ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, నాయకులు అంగిరేకుల ఆదిశేషు, టీ శ్రీనివాస్‌యాదవ్, ఓలేటి శివాజీ, ఆలా అనంతరామయ్య, కుందుల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
ముమ్మరంగా పల్స్ సర్వే
విజయవాడ: జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే ముమ్మరంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ బాబు.ఏ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్‌కు చెప్పారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్మార్ట్ పల్స్‌సర్వే కోసం 2.800 మంది ఎన్యుమరేటర్లను నియమించామన్నారు. ఆధార్ లేని వ్యక్తులను సర్వేలో నమో దు చేయడం లేదనే విషయాన్ని గుర్తించామని కలెక్టర్ తెలిపారు. ఇకపై ఆధార్ నమోదు ప్రక్రియ చేపడతామని తెలిపారు. జిల్లాలో భూ సంబంధ అంశాలపై వేగవంతమైన చర్యలు తీసుకోవడంతో పాటు పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. సబ్–కలెక్టర్ డాక్టర్ జి. సృజన,డి.ఆర్.ఓ. సి.హెచ్. రం గయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఒకే వ్యక్తి పేరున 23 మోటార్ సైకిళ్లు!
ఆనబకాయలదిబ్బ (పోడూరు) : ఎవరికైనా మోటార్‌సైకిళ్లు ఒకటో, రెండో ఉంటాయి. కాస్త పెద్ద కుటుంబమైతే రెండో, మూడో ఉంటాయి. కానీ పెనుమదం శివారు ఆనబకాయలదిబ్బకు చెందిన కిలారి చంటిబాబు పేరున 23 మోటార్ సైకిళ్లు, 23 డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉండడం స్మార్ట్ పల్స్ సర్వేలో వెలుగుచూసింది. ఇది చూసి సర్వే సిబ్బంది అవాక్కయ్యారు. ఇంతకీ అతనికి నిజంగా అన్ని మోటార్‌సైకిళ్లు, లైసెన్స్‌లు ఉన్నాయా అంటే లేవు. తనకున్నది ‘ఏపీ 37 సీబీ 7902’ ఒకటే మోటార్ సైకిల్ అని, అది కూడా ఏడాది కిందటే కొన్నానని చంటిబాబు చెప్పాడు. అంతకు ముందెన్నడూ తాను మోటార్‌సైకిల్ వాడలేదని చెప్పుకొచ్చాడు. తాను డిగ్రీ పూర్తిచేశాననీ, నిరుద్యోగినని, సామాన్యుడినైన తనకు 23 మోటార్‌సైకిళ్లు ఉన్నట్లు రిజిస్ట్రేషన్ కావడంపై విస్మయం వ్యక్తం చేశాడు. దీనిపై ఆర్టీవోకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపాడు. -
సర్వేపై అపోహలు వీడండి...
♦ కలెక్టర్ వివేక్ యాదవ్ విజయనగరం కంటోన్మెంట్ : స్మార్ట్ పల్స్ సర్వేపై ప్రజలు అపోహలు వీడాలని కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏపీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వేపై ప్రజలకున్న అపోహలు తొలగించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించి సర్వేను వేగవంతం చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు ఎన్యుమరేటర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇవ్వాలన్నారు. సర్వేకు వినియోగిస్తున్న ట్యాబ్‌లను ఆగస్టు 1నుంచి 5 వరకూ పింఛన్ల పంపిణీ చేసే సిబ్బందికి అందజేయాలన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సర్వేను ప్రారంభించి సాయంత్రానికి పూర్తి చేసి ట్యాబ్‌లను అప్పగించాలన్నారు. అలాగే అసంఘటిత కార్మికులకు ప్రవేశ పెట్టిన చంద్రన్న బీమా పథకంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ గ్రీవెన్స్‌సెల్ నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలన్నారు. ప్రతి నెలా సివిల్ రైట్స్ డే విధిగా నిర్వహించి ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ శ్రీకేశ్ బి. లఠ్కర్, డీఆర్డీఏ పీడీ ఎస్. ఢిల్లీరావు, కేఆర్‌సీసీ ఎస్డీసీ ఆర్. శ్రీలత, ఎన్ఐసీ అధికారి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
సర్వే సమర్ధవంతంగా నిర్వహించండి
కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు రూరల్ : స్మార్ట్‌పల్స్ సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అధికారుల ఆదేశించారు. మంగళవారం ఆయన నెల్లూరులోని వెంకటేశ్వరపురం, బోడిగాడితోట, ఇనమడుగు సెంటర్లలో చేస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. సర్వే గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరు ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్స్ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఉదయం 6.00 గంటలకల్లా సర్వే ప్రారంభిస్తే కుటుంబసభ్యులందరూ అందుబాటులో ఉంటారన్నారు. సకాలంలో సర్వే పూర్తయ్యేలా అవసరమైన చోట సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్‌కార్డుల్లో తప్పులు ఉంటే వెంటనే వాటని సరిదిద్ధి సర్వే చేయాలని సూచించారు. సెప్టెంబర్ నాటికి ఈ–ఆఫీసును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పల్స్ సర్వేపై అలసత్వం వద్దు
►జెడ్పీ సీఈఓ నగేష్ శ్రీకాకుళం టౌన్: జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ సర్వేపై అలసత్వం విడనాడాలని జెడ్పీ సీఈఓ బి.నగేష్ పంచాయతీ రాజ్ ఉద్యోగులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులతో, ఎంపీడీఓలతో ఆయన బుధవారం టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ట్యాబ్‌ల పనితీరుపై ఆరా తీశారు. ప్రతి కుటుంబంలో సర్వేకు అవసరమైన డేటాతోపాటు జియో ట్యాగింగ్ చేసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని, పంచాయతీ పరిధిలో సమగ్ర డేలా కార్యదర్శుల చేతిలో ఉంటుందని తెలిపారు. కాన్ఫరెన్సులో డిప్యూటీ సీఈఓ ఎస్.రవీంద్ర, పరిపాలనాధికారి కిరణ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. -
ఇంటికో గంట ప్రహసనంలా పల్స్ సర్వే
♦ కేటాయించిన వారైతేనే.. లేకపోతే ఓపెన్ కాని ట్యాబ్ ♦ ముందుగానే వీధులు.. ఎన్యుమరేటర్ల పేర్లు ఫీడింగ్ ♦ ఈ నెల 31లోపు పూర్తి చేయడం అసాధ్యం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ సర్వే ప్రహసనంలా మారింది... ఇది ప్రజలు, సిబ్బందిలో పల్స్ రేటు పెరిగేలా చేస్తోంది... ఒక్కో ఇంటికి గంట సమయం పడుతుండటంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు... ఇందులో కుల గణన ప్రస్తావన ఉండటంతో అధిక శాతం మంది ప్రజలు అయిష్టత ప్రదర్శిస్తున్నారు. సాక్షి, కడప : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించాలని నిర్ణయించి పల్స్ సర్వేకి శ్రీకారం చుట్టింది. అయితే ప్రస్తుత సర్వే పరిస్థితి చూస్తే ఆశించిన స్థాయిలో అనుకున్న లక్ష్యాలను సాధించేలా కనిపించడం లేదు. ప్రత్యేకంగా ఈ నెల 31లోపు పల్స్ సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. వాస్తవ పరిస్థితి చూస్తే సర్వే పూర్తి చేయడానికి నెలాఖరు కాదు.. రెండు, మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులే పేర్కొంటున్నారు. ఈ నెల 8 నుంచి పల్స్ సర్వే ప్రారంభించినా ఊపందుకోలేదనే చెప్పాలి. ఎన్నో సమస్యలు, ఒక్కో సారి ట్యాబుల ఇబ్బందులు, మరోసారి ఎన్యుమరేటర్లు ఏదో ఒక పరిస్థితుల నేపథ్యంలో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు సర్వే సాగుతోంది. ఒక ఇంటికి ఒక గంట ప్రభుత్వం తరఫున ఎన్యుమరేటర్లు చేపడుతున్న పల్స్ సర్వే చాలా సమయం తీసుకుంటోంది. ఒక ఇంటికి సంబంధించి సర్వే చేయాలంటే దాదాపు గంట సమయం పడుతోంది. సుమారు 91 కాలమ్స్‌ను సంబంధిత వ్యక్తులను అడిగి ఎన్యుమరేటర్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో ఆస్తులు, ఇల్లు, భూములు, ఇంటిలోని వస్తువులు, బయట పని చేస్తున్న ఉద్యోగం, కార్యాలయం, కులం, చదువు ఇలా చెబుతూ పోతే ఎన్నో రకాల ప్రశ్నలతో సమాధానాలు పూరించాలి. అంతే కాకుండా మొదట వీధిలోని ఇంటి వద్దకు వెళ్లగానే యజమాని ఆధార్ కార్డు నంబరు ఫీడ్ చేయడం, తర్వాత వేలిగుర్తు వేయగానే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. తర్వాత జీపీఎఫ్ ద్వారా ఇంటిని బంధించడం, తర్వాత ప్రశ్నల పరంపర మొదలవుతుంది. ఇలా ఒక్కోసారి చేపట్టే పనిలో ఇతర అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఒక ఇంటికి సంబంధించిన సర్వే పూర్తి చేయాలంటే గంట సమయం పడుతోంది. ఎన్యుమరేటర్ కేటాయించిన ప్రకారం వెళితేనే.. జిల్లాలో పల్స్ సర్వేకి సంబంధించి ఎన్యుమరేటర్లు కేటాయించిన వీధుల ప్రకారం వెళితేనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పటికే ట్యాబుల్లో ఎన్యుమరేట్లకు సంబంధించిన గుర్తులు ఫీడ్ చేయడంతో కచ్చితంగా సంబంధిత ఎన్యుమరేటరే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఫలానా వీధి, ఫలానా ట్యాబ్, ఫలానా ఎన్యుమరేటర్ మూడింటికి సంబంధించి లింక్ పెట్టడంతో వేరే వారు సర్వే చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. కేటాయించిన ఎన్యుమరేటరే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కులగణనపై పెదవి విరుపు పల్స్ సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్లు కుల గణన రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం బీసీ, ఎస్సీ, ఓసీ ఇలా గణన నమోదు చేసేవారు. అయితే ప్రస్తుతం కులాలకు సంబంధించిన ప్రాతిపదికన బీసీల్లో ఉన్న ఉప కులాలు, ఎస్సీల్లో ఉన్న ఇతర కులాలు.. ఇలా అన్ని ఉప కులాలను చేరుస్తుండడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. అయితే రానున్న కాలంలో కులాల ప్రాతిపదిక పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం సమాచారాన్ని తీసుకుని అందుకు అనుగుణంగా పావులు కదపడానికి ప్రణాళిక రూపొందిస్తోందని చర్చించుకుంటున్నారు. 31లోపు అసాధ్యం ♦ ఈ నెల 8న ప్రారంభమైన పల్స్ సర్వే ఈ నెల 31లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఎన్యుమరేటర్లు, ఇతర సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ♦ ఎందుకంటే సర్వేలో 91 కాలమ్స్ ఉన్న నేపథ్యంలో ఒక ఇంటిని సర్వే చేయాలంటేనే గంట సమయం పడుతున్న క్రమంలో అంత ఈజీ కాదని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులే పేర్కొంటున్నారు. ఒక్కొక్క ఇంటికి అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో 31లోగా సర్వే పూర్తి చేయడం దాదాపు అసాధ్యం! ఐదు సార్లు మారిన సాఫ్ట్వేర్ రాష్ట్ర ప్రభుత్వం పల్స్ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టినా అనేక రకాల సమస్యలతో రోజూ సాఫ్ట్వేర్ మారుస్తున్నారు. ఈ నెల 8న ప్రారంభమైనా 13వ తేదికి అంటే ఐదు రోజుల నేపథ్యంలోనే సాఫ్ట్‌వేర్‌ను ఐదు సార్లు మార్చారు. దీంతో కొత్త ప్రశ్నలతోపాటు ఇతర అనేక రకాల అంశాలను చేరుస్తుండడంతో రోజురోజుకు సర్వే విషయంలో గందరగోళం నెలకొంటోంది. ఇదేమిటని ప్రశ్నించే అధికారి లేకపోగా...ఉన్నతాధికారులు చెప్పిందేవేదంగా పలువురు ఎప్పటికప్పుడు మారుతున్న సాఫ్ట్వేర్కుఅనుగుణంగా సర్వే నిర్వహిస్తున్నారు. -
‘పల్స్’ దొరకలేదా..?
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ సర్వేకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. శుక్రవారం జిల్లాలో సర్వే ప్రారంభమైనా ఆశించిన స్పందన కాన రాలేదు. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో కాళింగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు వివరాలు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని సమాచారం. మరికొన్ని గ్రామాల్లో ట్యాబ్‌లు మొరాయించాయి. దీంతో తొలిరోజు సమస్యలతోనే సరిపోయింది. పల్స్ సర్వేలో కులాల జాబితా గందరగోళంగా ఉండడంతో కాళింగ వర్గం వారు ఈ సర్వేను మొదట నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికీ ఆ సామాజిక వర్గ నేతలు స ర్వేను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కూడా. దీంతో తొలిరోజు వారు వివరాలిచ్చేందుకు అంగీకరించలేదు. కుల వివరాల్లో స్పష్టమైన విధానాన్ని ప్రకటించిన తర్వాతే వివరాలు చెబుతామని వారు తేల్చి చెప్పారు. శుక్రవారం లావేరు మండలంలో ఉన్న బుడుమూరులో ఈ సామాజిక వర్గానికి చెందిన వారు నమోదు నిలిపివేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ట్యాబ్‌లతో కష్టాలు... ఇక సర్వేలో ట్యాబ్‌లు పెడుతున్న ఇబ్బందులు చెప్పనలవిగానివిగా ఉన్నాయి. జిల్లా కేంద్రం లో బాగానే పనిచేసిన ట్యాబ్‌లు గ్రామాల్లో మాత్రం పనిచేయడం లేదు. ఇప్పటి వరకు ట్యాబ్‌లకు రెండు వర్షన్లలో ప్రభుత్వం యాప్‌ను అందించింది. ఈ యాప్‌లో తొలుత 2.1 వెర్షన్ ఉంచగా అది పనిచేయలేదు. దీంతో ఈ నెల5న రాష్ట్ర ఉన్నతాధికారులు 2.2 వెర్షన్‌ను అందజేశారు. ఇది కూడా కొన్నిప్రాంతాల్లో పనిచేయడం లేదు. తొలిరోజున జిల్లాలో అన్ని మండలాల్లో, పురపాలక సంఘాల్లో 1342 మంది ఎన్యూమరేటర్లు వారి సహాయకులతో ట్యాబ్‌లతో క్షేత్ర స్థాయిలో సర్వేలు ప్రారంభించినా కేవలం 600లు మాత్రమే నమోదు జరిగాయి.శనివారం నుంచి కనీసం సగం గ్రామాల్లోనైనా 2.2 వెర్షన్ యాప్ ద్వారా సర్వే చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
పల్స్ సర్వేపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పల్స్ సర్వేపై జిల్లా కలెక్టర్లతో శనివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 20 కొలమానాల ఆధారంగా, రెవిన్యూ శాఖ నోడల్ ఏజెన్సీగా ఈ సర్వే చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ....పదేళ్లకొక్కసారి జనగణన జరుగుతుండగా, ఈ సర్వే అంతకుమించిన తాజా వివరాలతో చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో దళారీ వ్యవస్థను, అవినీతిని నియంత్రించడానికే ఈ సర్వే చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి, కుటుంబ ఆదాయం, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అన్ని అంశాలను సర్వే ద్వారా తెలుసుకునే అవకాశముంటుందని బాబు చెప్పారు. వీటితో పాటు రాష్ట్రంలోని భూముల వివరాలు, నేల స్వభావం, పంటల వివరాలు, పెన్షన్స్, స్కాలర్ షిప్స్, రుణాలు వగైరా వివరాలన్నీ పల్స్ సర్వేలో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. ఈ సర్వే గణాంకాలు రాష్ట్ర వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయన్నారు తెలిపారు. ప్రజలందరికీ ఆహార, విద్యుత్, ఇంధన, సమాచార భద్రతకు ఈ సర్వే ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ గణాంకాల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల పనిభారం మరింత తగ్గుతుందని చంద్రబాబు తెలిపారు. పల్స్ సర్వేను అధికారులు ఒక యాగంలా చేపట్టాలని బాబు సూచించారు. సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటే పారదర్శకత ప్రతిఫలిస్తుందన్నారు. స్మార్ట్ పల్స్ సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 వేల బృందాలు పనిచేస్తాయని... ట్యాబ్స్, ఐప్యాడ్స్ ద్వారా సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని సీఎం చెప్పారు. ఈ నెల 22 నుంచి పల్స్ సర్వే కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. -
అగ్రగామి రాష్ట్రమే నా లక్ష్యం..
అందుకు అందరూ సంకల్పం చేపట్టాలి - కడప మహాసంకల్ప సభలో సీఎం చంద్రబాబు - ఏడాదిలో 30 లక్షల గ్యాస్ కనెక్షన్ల పంపిణీ లక్ష్యం - 1.5 లక్షలమంది అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేక బీమా సాక్షి ప్రతినిధి, కడప: ‘అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేశారు. అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన చేపట్టి ఆస్తులు తెలంగాణకు కట్టబెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రజలు నమ్మకంతో అండగా నిలిచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆమేరకే నవ నిర్మాణ దీక్షను చేపట్టాను. కలెక్టర్ల నేతృత్వంలో అర్థవంతంగా చర్చ సాగింది. రాష్ట్రాభ్యున్నతికి భవిష్యత్ కార్యాచరణపై సంకల్పం తీసుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం కడప మున్సిపల్ గ్రౌండ్లో నవనిర్మాణదీక్ష ముగింపులో భాగంగా నిర్వహించిన మహాసంకల్పంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ప్రగతి పథంలో 2 సంవత్సరాలు’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. సీఎం స్వయంగా మహాసంకల్పం ప్రతిజ్ఞ చదివి ప్రజానీకంతో చేయించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ విభజనలో అన్యాయం జరిగినా సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ రంగంలో విజయం సాధించామని తెలిపారు. ఏడాదిలో తొలివిడతగా 2 లక్షల మంది రైతులకు ఉచితంగా పంపుసెట్లు సరఫరా చేస్తామన్నారు. అమిత్‌షా కోరిక మేరకే ఎంపీ సీటు కేంద్రప్రభుత్వ సహకారం రాష్ట్రానికి అవసరమని, ఆమేరకే బీజేపీతో చెలిమి చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కోరిక మేరకే రాజ్యసభ స్థానమిచ్చినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రం రూ.16 వేల కోట్ల లోటుబడ్జెట్లో ఉందని, కేంద్రం రూ.2,800 కోట్లు మాత్రమే కేటాయించిందని వాపోయారు. ప్రత్యేకహోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోయినా ఇబ్బందేనని, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం రూ.850 కోట్లు కేటాయిస్తే అదనంగా రూ.1,700 కోట్లు ఖర్చు చేశామన్నారు. ‘ఇక్కడ ఒక మహానాయకుడు మాట్లాడుతున్నారు.. నరేంద్రమోదీని చూసి భయపడుతున్నానంట.. నేనెందుకు భయపడాలి, ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు నా సహచరుడు. ఆయనంటే నాకెందుకు భయం, నిప్పులా బతికాను.’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. చనిపోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికీ రూ.5 లక్షలు చెల్లించేలా ఆగస్టు 15 నుంచి అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేక బీమాను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యోగులు సమైక్య రాష్ట్రం కోసం పెద్దఎత్తున ఉద్యమాలు చేసిన నేపథ్యంలో 80 రోజులు సెలవులు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చామన్నారు. రాబోయే ఏడాదిలో 30 లక్షల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. వచ్చే ఏడాదికల్లా ఇంటింటికీ వంట గ్యాస్ సాక్షి, విజయవాడ బ్యూరో: రెండేళ్ల పాలనలో ప్రతి గ్రామానికీ విద్యుత్ సౌకర్యం కల్పించామని, అలాగే వచ్చే ఏడాది కల్లా ఇంటింటికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుధవారం మహాసంకల్పం సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రతి ఇంటికి తాగునీరు, కరెంటు, వంటగ్యాస్, మంచినీటి కొళాయి, కేబుల్ కనెక్షన్లు, ప్రతి పొలానికి సాగునీరు ఇవ్వాలనే లక్ష్యమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పేదల ఉన్నతే లక్ష్యంగా ఇంటింటి సర్వే కులమతాలతో నిమిత్తం లేకుండా పేదల ఉన్నతి కోసం జూన్ 20 నుంచి ఇంటింటి పల్స్ సర్వే నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. యువత ఆశలను వమ్ము చేయకుండా ‘బాబు వస్తే జాబు వస్తోంది’ అనే నమ్మకం కోసం రూ.4.70 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను తీసుకువస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలకు రూ.650 కోట్లు కేటాయించామని, రాబోవు 9 నెలల్లో కడపలో హజ్‌హౌస్ నిర్మిస్తామన్నారు. -
జూన్ 15 నుంచి ఏపీలో పల్స్ సర్వే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 15 నుంచి రాష్ట్రంలో పల్స్ సర్వే నిర్వహించనుంది. కులాల వారీగా జనాభాను సర్వే చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అయితే సర్వే నివేదికనే కాపుల రిజర్వేషన్‌కు సంబంధించి మంజునాథ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. అన్ని కులాల జనాభా లెక్కలను సేకరించాలని ఏపీ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సర్వే ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కులాల ఆర్థిక స్తోమతను తెలుసుకోవడానికే సర్వే చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఏపీ ప్రజల సమగ్ర సమాచారం సేకరణే సర్వే' అని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యార్హతలు, కులం, ఉద్యోగ, ఆర్థిక స్తొమత సమాచారాన్ని సేకరించనున్నారు. సర్వేకు ఆధికారులంతా సమాయత్తంగా ఉండాలని సీఎం సూచించినట్టు తెలిసింది. సర్వే ఆధారంగా పథకాల్లో కోత వేస్తారనే ప్రచారం జరిగే అవకాశం ఉంది.