ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 15 నుంచి రాష్ట్రంలో పల్స్ సర్వే నిర్వహించనుంది. కులాల వారీగా జనాభాను సర్వే చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 15 నుంచి రాష్ట్రంలో పల్స్ సర్వే నిర్వహించనుంది. కులాల వారీగా జనాభాను సర్వే చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అయితే సర్వే నివేదికనే కాపుల రిజర్వేషన్కు సంబంధించి మంజునాథ కమిషన్కు ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. అన్ని కులాల జనాభా లెక్కలను సేకరించాలని ఏపీ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సర్వే ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో వివిధ కులాల ఆర్థిక స్తోమతను తెలుసుకోవడానికే సర్వే చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఏపీ ప్రజల సమగ్ర సమాచారం సేకరణే సర్వే' అని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యార్హతలు, కులం, ఉద్యోగ, ఆర్థిక స్తొమత సమాచారాన్ని సేకరించనున్నారు. సర్వేకు ఆధికారులంతా సమాయత్తంగా ఉండాలని సీఎం సూచించినట్టు తెలిసింది. సర్వే ఆధారంగా పథకాల్లో కోత వేస్తారనే ప్రచారం జరిగే అవకాశం ఉంది.