సర్వే సమర్ధవంతంగా నిర్వహించండి
కలెక్టర్ ముత్యాలరాజు
నెల్లూరు రూరల్ : స్మార్ట్‌పల్స్ సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అధికారుల ఆదేశించారు. మంగళవారం ఆయన నెల్లూరులోని వెంకటేశ్వరపురం, బోడిగాడితోట, ఇనమడుగు సెంటర్లలో చేస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. సర్వే గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరు ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్స్ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఉదయం 6.00 గంటలకల్లా సర్వే ప్రారంభిస్తే కుటుంబసభ్యులందరూ అందుబాటులో ఉంటారన్నారు. సకాలంలో సర్వే పూర్తయ్యేలా అవసరమైన చోట సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్‌కార్డుల్లో తప్పులు ఉంటే వెంటనే వాటని సరిదిద్ధి సర్వే చేయాలని సూచించారు. సెప్టెంబర్ నాటికి ఈ–ఆఫీసును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.