అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఉద్యమించాలి
-
యువతకు కలెక్టర్, ఎస్పీ పిలుపు
నెల్లూరు(క్రై మ్):
అవినీతి నిర్మూలనే లక్ష్యంగా యువత ఉద్యమించాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజ్ పిలుపునిచ్చారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల ముగింపు సభ శుక్రవారం స్థానిక ఎన్‌జీఓ కార్యాలయంలో జరిగింది. గాంధీబొమ్మ, వీఆర్‌సీ, ఆర్టీసీ బస్టాండు మీదుగా ఎన్‌జీవో కార్యాలయం వరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఏసీబీ అధికారులు, వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు తొలుత అవినీతి నిర్మూలనకు తమవంతు కృషిచేస్తామని, అవినీతిని నిర్మూలించేంతవరకు ఉద్యమిస్తామని కలెక్టర్, ఎస్పీ విశాల్‌గున్నీలు ప్రదర్శనలో పాల్గొన్న వారితో ఽప్రతిజ్ఞచేయించారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ మాట్లాడుతూ సమాజంలో అవినీతిని రూపుమాపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యార్థులు, యువత భవిష్యత్‌లో ఏ రంగంలో ఉన్నా అవినీతికి తావులేకుండా రాణించాలన్నారు. అవినీతిని అంతమొందించడంలో పాలిభాగస్తులు కావాలన్నారు. ఉద్యోగులందరూ అవినీతికి దూరంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. ఆర్‌ఐఓ బాబుజాకబ్ మాట్లాడుతూ అవినీతి జబ్బును సమాజంలోని పారద్రోలేందుకు విద్యార్థులు నడుం బిగించాలన్నారు. విద్యార్థి దశనుంచే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడం ద్వారా అవినీతి రహిత భారతదేశాన్ని సాధించుకోగలమన్నారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి ఏసీబి పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన 40మంది విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎండీ ఇంతియాజ్, అదనపు జేసీ 2 ఆర్‌ఎస్ రాజకుమార్, జెడ్పీ సీఈఓ బి.రామిరెడ్డి, నగర, ఎస్‌బీ డీఎస్పీల జి.వెంకటరాముడు, ఎన్.కోటారెడ్డి, ఆర్టీఓ, రెవెన్యూ, పోలీసు, ఇతరశాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.