- కలెక్టర్ ముత్యాలరాజు
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
Published Wed, Dec 14 2016 12:45 AM | Last Updated on Thu, Mar 21 2019 7:28 PM
నెల్లూరు(పొగతోట):
వార్దా తుపాను ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాలకు అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు మండల అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ మండలాల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. విషజ్వరాలకు ఇతర వ్యాధులుకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని సూచించారు. గ్రామాల్లో బ్లీచింగ్ చల్లాలని తెలిపారు. వర్షాలు కురిసిన మండలాల్లో నీరు వృథా కాకుండా చెరువులు, కుంటల్లో నింపేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావానికి సంబంధించి పంట నష్టాలను అంచనావేసి నివేదికలను సిద్ధం చేయాలని తెలిపారు.
Advertisement
Advertisement