ముమ్మరంగా పల్స్ సర్వే
విజయవాడ: జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే ముమ్మరంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ బాబు.ఏ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్‌కు చెప్పారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్మార్ట్ పల్స్‌సర్వే కోసం 2.800 మంది ఎన్యుమరేటర్లను నియమించామన్నారు. ఆధార్ లేని వ్యక్తులను సర్వేలో నమో దు చేయడం లేదనే విషయాన్ని గుర్తించామని కలెక్టర్ తెలిపారు. ఇకపై ఆధార్ నమోదు ప్రక్రియ చేపడతామని తెలిపారు. జిల్లాలో భూ సంబంధ అంశాలపై వేగవంతమైన చర్యలు తీసుకోవడంతో పాటు పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. సబ్–కలెక్టర్ డాక్టర్ జి. సృజన,డి.ఆర్.ఓ. సి.హెచ్. రం గయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.