►ఏడాది దాటినా.. పూర్తికాని పల్స్ సర్వే
►కడప, ప్రొద్దుటూరులలో సర్వేకు దూరంగా 24 వేల కుటుంబాలు
సాక్షి కడప: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ సర్వే జిల్లాలో కొనసాగుతోంది. ఏడాది దాటినా పూర్తికాలేదు. ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కూడా పల్స్ ఆధారంగానే సంక్షేమాన్ని అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో సర్వే కీలకమనే చెప్పాలి.2016 జులై 7వ తేదీ ప్రారంభమైన పల్స్ సర్వే కార్యక్రమాన్ని అప్పట్లో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని నడిపించినా తర్వాత ఆలస్యం అవుతూ వస్తోంది. మారుమూల గ్రామాల్లో ఇంటర్‌నెట్ పనిచేయక.. ట్యాబ్‌లు గంటల తరబడి ఒపెన్ కాకపోవడం లాంటి సమస్యలతో సర్వే అనుకున్న స్థాయిలో సాగలేదు.
జిల్లాలోని కడప, ప్రొద్దుటూరులో ప్రస్తుతం పల్స్ సర్వే కొనసాగుతోంది. కడపలో సుమారు14 వేలు..ప్రొద్దుటూరులో 10 వేల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ప్రస్తుతం అడ్రసులు డోర్‌లాక్.. వలస వెళ్లినవారితో పాటు మరికొన్ని కుటుంబాలు అందుబాటులోకి వస్తే సర్వే పూర్తి కానుంది.çసుమారు 2088 మంది ఎన్యూమరేటర్లు, 200 మంది సూపర్‌వైజర్లు ఉన్నారు. సిబ్బంది, ట్యాబ్‌లు ఉన్నా సర్వే మాత్రం ముందుకు సాగడం లేదు.
సా...గుతోంది..!
Published Fri, Sep 15 2017 3:50 AM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM
Advertisement