శతావధాని సీవీ సుబ్బన్నకు ఘన నివాళి | satavadhani Sivi subbanna Tribute | Sakshi
Sakshi News home page

శతావధాని సీవీ సుబ్బన్నకు ఘన నివాళి

Published Mon, Mar 6 2017 11:29 PM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన శతావధాని కడప వెంకటసుబ్బన్నకు సోమవారం సాహితీవేత్తలు ఘనంగా నివాళులర్పించారు.

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన శతావధాని కడప వెంకటసుబ్బన్నకు సోమవారం సాహితీవేత్తలు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం వేకువజామున హైదరాబాద్‌లోని తన కుమార్తె ఇంటిలో మృతిచెందిన సీవీ సుబ్బన్న భౌతికాయాన్ని సాయంత్రం 6.30 ప్రాంతంలో ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు రామేశ్వరం బైపాస్‌రోడ్డులోని హిందూ స్మృతివనంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనేకమంది ఆయన భౌతికాయాన్ని సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్లు నరాల బాలిరెడ్డి, చెన్నా వెంకటసుబ్బన్న తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement