Prodduturu
-
CM Jagan: ఆరంభం అదరహో! విపక్షాలు బెదరహో!!
బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరంభించిన మేమంతా సిద్ధం బస్ యాత్ర చూసిన తర్వాత వైఎస్సార్సీపీ విజయావకాశాలపై ఇంకెవరికైనా సందేహం ఉంటే పూర్తిగా నివృత్తి అయి ఉంటుంది. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమికి గుండెలు జారిపోయి ఉంటాయి. యాత్ర ఆరంభం అదిరిన తీరు అదరహో అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీచ్ విన్న తర్వాత విపక్షాలు బెదరహో అయి ఉండాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన స్పీచ్ ఎంతో సమగ్రంగా, అన్ని అంశాలను తడుముతూ వచ్చింది. చాలామందికి కొన్ని విషయాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఖరి ఏమిటి అని ఎదురు చూసేవారికి పూర్తి స్థాయి జవాబు ఇచ్చారు. తన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, విశాఖ డ్రగ్ కేసులను ప్రస్తావించి ప్రతిపక్షాల విమర్శలను ఒక్క దెబ్బతో తిప్పికొట్టారు. తన చెల్లెళ్లకు కూడా గట్టిగానే సమాదానం ఇచ్చారని చెప్పాలి. విశాఖ డ్రగ్స్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాన్ని ఆయన బహిర్గతం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీచ్‌లో ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా, సంస్కారవంతమైన విమర్శలు, అర్దవంతమైన వ్యాఖ్యలు కనిపిస్తాయి. ఈ విషయం ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే.. చంద్రబాబు నాయుడు ఈ మద్య కాలంలో ఎక్కడ మాట్లాడినా అసభ్య పదాలను వాడుతూ తన పెద్ద వయసుకు మచ్చ తెచ్చుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ద్వేషంతో ఏదేదో మాట్లాడుతూ తన పరువు పోగొట్టుకుంటున్నారు. వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటున్నా, ఆయన తన వైఖరి మార్చుకోవడం లేదు. తాము గతంలో ఏమి చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఆయనకు దత్తపుత్రుడుగా పేరొందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం అదే ధోరణి అవలంభిస్తున్నారు. చంద్రబాబు అసలు పుత్రుడు సంగతి సరేసరి. ఆయన ఎప్పుడూ స్పీచ్‌లో ఉండాల్సిన డీసెన్సీని మెయింటెన్ చేయడం లేదు. వీరికి భిన్నంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తాను చెప్పదలచుకున్న విషయాలను సవ్యమైన బాషలో వివరించారు. తొలిరోజు ఆయన తన తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయలో నివాళి అర్పించి ప్రారంభించారు. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తల్లికి ఏదో అన్యాయం చేశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేసే దిక్కుమాలిన ప్రచారానికి చెక్ పెడుతూ వైఎస్ విజయమ్మ స్వయంగా అక్కడకు వచ్చి కుమారుడిని ఆశీర్వదించారు'. ఎప్పటిమాదిరి నుదుట ముద్దు పెట్టి తన ప్రేమను చాటుకున్నారు. ఆ సన్నివేశం వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎంతో ఉత్సాహం ఇచ్చిందని చెప్పాలి. అక్కడ నుంచి బయల్దేరి వేంపల్లి, వీరపనాయుని పల్లి, ఎర్రగుంట్ల తదితర గ్రామాల గుండా ప్రొద్దుటూరు చేరుకునే మార్గమధ్యంలో వేలాది మంది జనం తరలివచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డికు స్వాగతం చెప్పారు. "కొందరైతే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న బస్తో పాటు పరుగులు తీస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను అభినందించడానికి పోటీ పడ్డారు. మామూలుగా అయితే ఈ దూరం గంటన్నర నుంచి రెండు గంటలలోపు చేరవచ్చు. అలాంటిది సుమారు ఐదారు గంటలు పట్టింది". కడప లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన సభను ప్రొద్దుటూరులో నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన బాబాయి వివేకా హత్య కేసు గురించి ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావించి, చిన్నాన్నను ఎవరో చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, దేవుడికి, కడప జిల్లా ప్రజలందరికి తెలుసునని అన్నారు. 'వివేకాను చంపి, తానే చంపానని చెప్పుకుంటున్న హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు'. ఇద్దరు చెల్లెమ్మలు అంటూ షర్మిల, సునీతలను పేర్లు చెప్పకుండానే వారి గురించి మాట్లాడుతూ, 'రాజకీయ స్వార్దంతో తపిస్తున్న నా చెల్లెళ్లు" అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఎల్లో మీడియా, చెల్లెళ్లు హంతకులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని కూడా ఆయన చెల్లెళ్లను తప్పు పట్టారు. ఇదంతా నన్ను దెబ్బతీసే రాజకీయం అని కూడా అంటున్నారంటే.. ఇది కలియుగం అని అనుకోవాల్సి వస్తుందని తాత్వికంగా వ్యాఖ్యానించారు. దీంతో.. "వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి షర్మిల, సునీత మద్దతు ఇస్తున్నారన్న అంశాన్ని ఆయన ప్రజల దృష్టికి తెచ్చారు. అలాగే వారిద్దరు తెలుగుదేశం నేతలతో మిలాఖత్ అవడం, చంద్రబాబు చెప్పినట్లు చేయడం వంటి విషయాలను ఆయన వివరించారు. 'తమ కుటుంబంలో కూడా చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆయన ద్వజమెత్తారు. అలాగే విశాఖ డ్రగ్ కేసులో చంద్రబాబు తనకు సంబందించినవారు ఉన్నారని గుర్తించి, దానని కప్పిపుచ్చేందుకు వెంటనే వైఎస్సార్సీపీపై నెట్టివేస్తూ ఆరోపణలు చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు'. ఈ కేసులో ఉన్నది చంద్రబాబు, ఆయన వదినకు చెందిన బంధువులేనని ఆయన అన్నారు. తాను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముతున్నానని వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు." చంద్రబాబు గురించి విశ్లేషిస్తూ నలభై ఐదేళ్లుగా కుట్రలు చేస్తూ రాజకీయాలు సాగిస్తున్నారని, వివేకా బతికి ఉంటే శత్రువుగా చూస్తారని, ఆయన చనిపోగానే కొత్త రాగం అందుకుంటారని, ఎన్.టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనవారు, చనిపోయిన తర్వాత ఎన్.టీ రామారావు శవాన్ని లాగేసుకున్నారని, దండలు వేసి, విగ్రహాలు పెట్టారని.. సీఎం ఎద్దేవ చేశారు. చంద్రబాబు గుణగణాలను ఆయా సందర్భాలలో వివరిస్తూ.. చంద్రబాబు నిత్యం అబద్ధాలు, మోసాలపై ఆధారపడి రాజకీయాలను చేస్తారని అని ఆయన ద్వజమెత్తారు. 2014 తెలుగుదేశం మానిఫెస్టోలో చెప్పిన అంశాలను ప్రస్తావించి వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా? అంటూ రుణమాఫి తదితర వాగ్దానాలను ఉటంకించి ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. టీడీపీ మానిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన సంగతి కూడా గుర్తు చేశారు. 2014లో ఏ మూడు పార్టీల కూటమి అయితే పోటీచేసి ప్రజలను మోసం చేసిందో, ఇప్పుడు కూడా అదే కూటమి పోటీలో ఉందని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాళ్లా, వేళ్లపడి పొత్తు పెట్టుకున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవ చేశారు. 2014లోచంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్‌ల ఫోటోలతో కూడిన కరపత్రాలను ప్రజలకు చూపిస్తూ, అందులో ఉన్న రుణమాఫీ, నిరుద్యోగ బృతి తదితర హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు. వీరు ముగ్గురు మళ్లీ మోసం చేయడానికి సిద్ధం అవుతున్నారని ఆయన విమర్శించారు. ఒకవైపు చంద్రబాబు హామీలలోని డొల్లతనాన్ని వివరిస్తూ.., తాను ఏభైఎనిమిది నెలల్లో అమలు చేసిన వాగ్దానాల గురించి వివరించారు. ప్రత్యేకించి ఇళ్లవద్దకే ప్రజలకు అవసరమైన సేవలు అందించడం, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, వృద్దాప్య పెన్షన్, ఫీజ్ రీయింబర్స్ మెంట్, ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం, ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్యశ్రీ, కాపు నేస్తం, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర స్కీములను తాను అమలు చేశానని ప్రజలకు తెలియచేశారు. దిశ యాప్‌తో సహా పాలనతో తీసుకు వచ్చిన సంస్కరణలను, పేదలకు ఇళ్ల స్థలాలు మొదలైనవాటితో పాటు తన హయాంలో జరిగిన అభివృద్ది పనులను కూడా తెలియచేశారు.17 మెడికల్ కాలేజీలు, కొత్తగా పోర్టుల నిర్మాణం, కడప తదితర జిల్లాలలో వస్తున్న పరిశ్రమలు మొదలైనవాటి గురించ కూడా వివరించారు. "దుష్టచతుష్టయంలో బాగంగా ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 ల పాత్రను విమర్శిస్తూ, ఈనాడు రాస్తున్న రోత రాతలు చూశాక 'ఛీ' అని పారేస్తానని" ఆయన చెప్పారు. పొత్తు ద్వారా ప్రత్యేక హోదాకానీ, ఇతరత్రా కొత్త హామీ ఏదైనా సాధించారా అని మూడు పార్టీలను ప్రశ్నించారు. స్థూలంగా చెప్పాలంటే ఈ మూడు పార్టీల కూటమిని అభివృద్ది నిరోధక, పేదల వ్యతిరేక కూటమిగా అభివర్ణించారు. 'ఎప్పటి మాదిరి మళ్లీ కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని వీరు ప్రజల వద్దకు వస్తారని, వారిని నమ్మవద్దని' వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. చంద్రబాబును పొరపాటున నమ్మితే తమ కంటిని తమ వేలుతోనే పొడుచుకున్నట్లేనని, ఇప్పుడు అమలు అవుతున్న స్కీములు రద్దు అవుతాయని కూడా ఆయన హెచ్చరించారు. పేదల భవిష్యత్తు బాగుండాలంటే మీ బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డినే ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు అప్పీల్ చేశారు. 'ఒక మాటలోచెప్పాలంటే ఈ ప్రసంగం అంతా ఒక సమగ్రమైన స్పీచ్' అనిపిస్తుంది. అన్ని కోణాలను గంట సమయంలో సృజించారు. "ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజలలో స్పందన పెద్ద ఎత్తున కనిపించింది. సభ గంటల తరబడి ఆలస్యం అయినా పెద్ద సంఖ్యలో వచ్చిన జనం అంతా అక్కడే ఉండి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను 'సీఎం.., సీఎం..' అంటూ శుభాకాంక్షలు చెప్పిన తీరు కచ్చితంగా ఆయనకు పెద్ద బూస్ట్‌గానే ఉంది. ఇది వైఎస్సార్సీపీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటే, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి మరింత కంగారు పుట్టిస్తుంది". ఇదే రోజు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పెట్టిన సభలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సభతో పోల్చితే చాలా తక్కువ వచ్చినట్లు చెప్పక తప్పదు. చంద్రబాబు స్పీచ్‌లో కొత్త విషయం ఏమీ ఉండడం లేదు. ఒక అపనమ్మకం కనిపిస్తుంది. అందుకే భయపడి మొదటిసారి కుప్పంలో చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఓట్లు వేయాలని అర్ధించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్కీముల గురించి ప్రస్తావించడానికి ఆయన వెనుకాడుతున్నారు. చంద్రబాబుకు క్రెడిబిలిటి లేని అంశాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదాహరణంగా వివరిస్తూ ఉంటే, చంద్రబాబు మాత్రం కేవలం దూషణలకే పరిమితం అవుతున్నారు. "ఒక పరిశీలకుడు అన్నట్లు చంద్రబాబు ఇస్తున్న సూపర్ సిక్స్ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు". క్రెడిబిలిటి ఆయనకు లేకపోవడమే పెద్ద సమస్యగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఆ ఇబ్బంది లేదు. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యంగా పేదల బవిష్యత్తు కోసం అంతా అండగా నిలబడాలని పిలుపు ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు సభలను చూస్తే ఏపీలో రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలలో ఉత్సాహం ఉరకలేస్తుంటే, చంద్రబాబు సభలలో ఆ స్పూర్తి కొరవడినట్లు అనిపిస్తుంది'. చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ వల్లో, ఏమో తెలియదు కానీ, 2019లో మాదిరి తొలి దశలో కాకుండా, ఈసారి నాలుగో దశకు ఎన్నికల తేదీలు వచ్చాయి. అంటే సుమారు నెల రోజులు ఆలస్యంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 'చంద్రబాబు తాను, కూటమి పక్షాలు సర్దుకోవడానికి ఈ టైమ్ అవసరం అని భావిస్తుంటే, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఈ టైమ్‌ను తనకు అనుకూలంగా మలచుకుని బస్ యాత్రను పెట్టుకుని జనంలోకి మరింత చొచ్చుకువెళ్లగలిగారు. తద్వారా జనంలో తనకు ఉన్న పట్టు ఏమిటో చూపించగలుగుతున్నారు'. దీని ఫలితంగా వైఎస్సార్సీపీ ప్రభంజనం మరోసారి రావచ్చన్న అబిప్రాయం కలుగుతోంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అడుగడుగునా అపూర్వ ఆదరణ...జనసంద్రమైన ప్రొద్దుటూరు
-
నేరం వాళ్లది..నింద మనమీద..ప్రొద్దుటూరు గడ్డపై సీఎం జగన్ సింహ గర్జన
-
ప్రొద్దుటూరులో సీఎం జగన్ భారీ బహిరంగ సభ
-
ప్రొద్దుటూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్
-
తనువు లేకున్నా.. తనుంది!
ప్రొద్దుటూరు క్రైం: తాను చనిపోయినా.. తన శరీరంలోని అవయవాలు పది మందికి ఉపయోగపడాలనే ఆమె గొప్ప ఆలోచన పలువురికి ప్రాణం పోసింది. అవయవ దానంతో యువతి ఆదర్శంగా నిలవడమే కాకుండా మరికొందరికి కొత్త జీవితాన్ని అందిస్తున్నది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దేవరశెట్టి సుచిత్ర (25) అనే యువతి బ్రెయిన్ డెడ్‌తో సోమవారం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందింది. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్‌కు చెందిన దేవరశెట్టి నరసింహులు, అనురాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్ద కుమార్తె రూపశరణ్య, చిన్న కుమార్తె సుచిత్ర. సుచిత్ర స్థానికంగా బీ ఫార్మసీ పూర్తి చేసింది. కొన్ని నెలల క్రితం నుంచి బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, రూపశరణ్య బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. నరసింహులు విద్యుత్‌శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. సుచిత్రకు డిసెంబర్ 31న తీవ్ర తలనొప్పిగా ఉందని చెప్పడంతో స్నేహితులు, తోటి ఉద్యోగులు హుటాహుటిన ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి వైద్యుల సూచన మేరకు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించారు. బ్రైయిన్లో రక్తం గడ్డకట్టిందని స్కానింగ్‌లో నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు సుచిత్రను వెంటనే హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ జరిగినా కోలుకోలేక సుచిత్ర సోమవారం మృతి చెందింది. కాగా తమ కుమార్తె మరణానంతరం అవయవ దానం కోసం రిజిస్టర్ చేయించిందనే విషయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులకు తెలిపారు. దీంతో కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి యువతి శరీరంలోని నేత్రాలు, గుండె, మూత్రపిండాలు, వెన్నెముకను సేకరించి భద్రపరిచారు. మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూర్చులో అంత్యక్రియలు నిర్వహించారు. -
బంగారం.. ప్రొద్దుటూరు
వింటే భారతమే వినాలి.. కొంటే ప్రొద్దుటూరు బంగారన్నే కొనాలంటారు ఈ ప్రాంత వాసులు. ఇక్కడ కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండదు. నాణ్యత, తూకంలో తేడా కనిపించదు. కచ్చితమైన ధర.. మగువలు మెచ్చేలా కోరిన డిజైన్‌లో నగలు తయారు చేసే స్వర్ణకారులు ఇక్కడ కోకొల్లలు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ప్రముఖ స్థానం పొందింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే మాత్రం పొద్దుటూరుకు వెళ్లాల్సిందే.. ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా): ప్రొద్దుటూరు బంగారు వ్యాపారానికి వందేళ్ల చరిత్ర ఉంది. చిన్న గ్రామంగా ఉన్న ఈ ఊరు అప్పట్లో నీలి మందు వ్యాపారానికి ప్రసిద్ధి. స్థానిక అమ్మవారిశాల వీధిలోని పలువురు వర్తకులు నీలిమందు వ్యాపారం చేస్తూ నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేసేవారు. కాలక్రమేణా నీలిమందుకు ఆదరణ తగ్గింది. దీంతో వీరంతా ఏం చేస్తే బాగుంటుందని కొన్ని రోజుల పాటు సమాలోచనలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే బంగారం వ్యాపారం వైపు వారి దృష్టి మళ్లింది. 100 ఏళ్ల కిందట కేవలం 20 మంది స్థానికులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. తర్వాత వ్యాపారులతో పాటు స్వర్ణకారుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. బంగారు ఆభరణాలు తయారు చేయడంలో ఇక్కడి స్వర్ణకారులు మంచి నైపుణ్యం సంపాదించుకున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణా, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి బంగారు కొనుగోళ్ల నిమిత్తం ఇక్కడికి వస్తారు. రెండో ముంబైగా ప్రసిద్ధి 1960లో అప్పటి జనతా ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం దేశంలో లైసెన్సు లేకుండా ఏ ఒక్కరూ బంగారు దుకాణాలు నిర్వహించరాదు. రాయలసీమలోని కడపతో పాటు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా బంగారు దుకాణాలు నిర్వహించుకునేవారు. వీరంతా లైసెన్సు లేకుండా వ్యాపారాలు చేసేవారు. ప్రొద్దుటూరులో మాత్రం అప్పట్లోనే లైసెన్సు కలిగిన దుకాణాలు ఉండేవి. దీంతో రాయలసీమలోని ఇతర ప్రాంత వ్యాపారులు ప్రొద్దుటూరుపై ఆధారపడేవారు. ఇక్కడి నుంచి బంగారు కొనుగోలు చేసి వారి ప్రాంతాల్లో విక్రయించేవారు. నాటి భారత ప్రభుత్వం బంగారాన్ని టెండర్ల ద్వారా విక్రయించేది. ఈ టెండర్లలో పాల్గొన్న ప్రొద్దుటూరు వర్తకులు 90 శాతం బంగారాన్ని దక్కించుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారాన్ని దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపు చూసింది. ఆ రోజు నుంచి రెండో ముంబైగా, పసిడిపురిగా ప్రొద్దుటూరును పిలుస్తారు. టెండర్ల అనంతరం ప్రొద్దుటూరులో సీబీఐ దాడులు ఎక్కువగా జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ముంబై, బెంగళూరులకు దీటుగా విక్రయాలు ఇక్కడి బంగారు వ్యాపారం రాష్ట్రంలోనే పెద్ద పరిశ్రమగా వెలుగొందుతోంది. ఒకప్పుడు మెయిన్‌బజార్ (అమ్మవారిశాలవీధి)లో మాత్రమే దుకాణాలు ఉండగా ప్రస్తుతం 10 వీధులకు దుకాణాలు, వర్క్ షాపులు విస్తరించాయి. సుమారు 400కు పైగా బంగారు విక్రయించే దుకాణాలు, 1500కు పైగా వర్క్ షాపులు ఉన్నాయి. 12 వేల మంది స్వర్ణకారులు ఈ రంగంపై ఆధార పడి జీవిస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాలకు దీటుగా ఇక్కడ పసిడి విక్రయాలు జరుగుతున్నాయి. వివాహ ముహుర్తాలు, పండుగలు, అక్షయ తృతీయ రోజున ప్రొద్దుటూరు గోల్డ్ మార్కె ట్ నూతన శోభను సంతరించుకుంటుంది. అక్షయ తృతీయ రోజున బంగారు కొనడాన్ని మహిళలు సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ఈ సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని బంగారు వ్యాపారులు మంచి డిజైన్లను తయారు చేయిస్తారు. ఆన్లైన్ధరల ప్రకారం బంగారు విక్రయాలు నిర్వహిస్తారు. దీంతో ఏ షాపునకు వెళ్లినా ఒకటే ధర ఉంటుంది. అందువల్ల ప్రొద్దుటూరు బంగారాన్ని అందరూ ఇష్టపడతారు. వ్యాపారులు, స్వర్ణకారులు బ్యాంక్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసి నగలను తయారు చేస్తారు. నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు ప్రొద్దుటూరుతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన స్వర్ణకారులు ఇక్కడ పని చేస్తున్నారు. మిషనరీ అందుబాటులో లేని రోజుల్లో ఇక్కడి స్వర్ణకారులు చేసిన ఆభరణాలకు మంచి గుర్తింపు ఉండేది. బెంగాల్ రాష్ట్రానికి చెందిన స్వర్ణకారులు అత్యధికంగా ప్రొద్దుటూరులో పని చేస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణా, కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాల నుంచి రోజు కొనుగోళ్ల నిమిత్తం పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. కోరిన డిజైన్లలో నగలు తయారు చేయడంలో ఇక్కడి స్వర్ణకారులు సిద్ధహస్తులు. ముక్కు పుడక.. పెద్ద ఆభరణాలను స్థానికంగా తయారు చేస్తారు. దేవతా మూర్తులకు అలంకరించే కిరీటాలు, ఇతర కంఠాభరణాలను తయారు చేసే స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారు. బంగారు కరిగించేవారు, నగను తయారు చేసేవారు. తయారైన నగకు రాళ్లను పొదిగేవారు, మెరుగులు దిద్దేవారు.. ఇలా పలువురు కష్టపడితేనే అందమైన నగలు తయారు అవుతాయి. స్వచ్ఛమైన బంగారంతో నగలు స్వచ్ఛమైన బంగారంతో నగలను తయారు చేయడం ప్రొద్దుటూరు వ్యాపారుల ప్రత్యేకత. వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్నాం. ప్రొద్దుటూరుకు పసిడిపురిగా పేరు రావడం వెనుక ఎందరో స్వర్ణకారులు, వ్యాపారుల శ్రమ ఉంది. స్వర్ణకారుల ప్రతిభ వల్లనే ఇంతటి పేరు వచ్చింది. – ఉప్పర మురళీ, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు, ప్రొద్దుటూరు. రెడీమేడ్ ఆభరణాలతో పని తగ్గింది కొన్ని రోజుల క్రితం వరకు పని బాగా ఉండేది. ఇటీవల రెడీమేడ్ ఆభరణాల దిగుమతి ఎక్కువైంది. ఇతర రాష్ట్రాల నుంచి వీటిని ఇక్కడికి తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న స్వర్ణకారులకు పనులు లేకుండా పోయాయి. పెళ్లి ముహుర్తాల్లోనే కొంత పని ఉంటుంది. మిగతా సమయాల్లో బాడుగలు కూడా రావడం కష్టమే. –షామీర్, స్వర్ణకారుడు, ప్రొద్దుటూరు కటింగ్ వర్క్ షాపు నిర్వహిస్తున్నా ఏడేళ్ల నుంచి గోల్డ్ కటింగ్ వర్క్‌షాపు నిర్వహిస్తున్నా. ఈ పని చాలా సంతృప్తి కరంగా ఉంది. దీపావళి, దసరా పండుగలు, గ్రామాల్లో పంటలు చేతికి వచ్చినప్పుడు మార్కెట్ కళ కళ లాడుతుంటుంది. ఆ సమయంలో మాకు చేతినిండా పని ఉంటుంది. స్వర్ణకారులకు ప్రభుత్వం రాయితీలతో రుణాలు ఇప్పిస్తే బాగుంటుంది. – అబ్దుల్ రెహమాన్, ఫ్యాన్సీ వర్క్ షాపు, ప్రొద్దుటూరు. -
అందరికీ ఆదర్శం.. చెన్నమరాజుపల్లె గ్రామం
ప్రొద్దుటూరు క్రైం : కొన్నేళ్ల క్రితం వరకు ఆ గ్రామం నిత్యం ఫ్యాక్షన్ గొడవలతో అట్టుడుకుపోయేది. ఆ ఊరు పేరెత్తితేనే చుట్టు ప్రక్కల ప్రాంతాల వాళ్లు హడలెత్తిపోయే పరిస్థితి. ఒకానొక సమయంలో వేరే ఊరి అమ్మాయిని ఆ గ్రామానికి ఇవ్వాలన్నా భయపడిపోయేవాళ్లు. ఫ్యాక్షన్ తో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాక గ్రామస్తులు బిక్కు బిక్కు మంటూ జీవనం సాగించేవారు. ఆ గ్రామం ఎక్కడో మారు మూల ప్రాంతంలో లేదు. వైఎస్సార్ జిల్లాకు వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కుందూ నది ఒడ్డున..పచ్చని పొలాల మధ్యన ఉన్న ఆ ఊరే చెన్నమరాజుపల్లె. ఫ్యాక్షన్ ఘర్షణలు గ్రామాభివృద్ధిని పడేలా చేశాయి. పగలు, ప్రతీకారేచ్ఛల మధ్య పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఊ ఊళ్లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఆ గ్రామం ఉపాధిబాటలో పయనిస్తోంది. మంచాల అల్లిక గ్రామ స్వరూపాన్నే మార్చేసింది. ఫ్యాక్షన్ వద్దు ప్యాషన్ ముద్దు అనే నినాదంతో గ్రామస్తులు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. 1970 నుంచి 12 ఫ్యాక్షన్ హత్యలు ప్రొద్దుటూరు మండలంలోని చెన్నమరాజుపల్లెలో 1970లో ఫ్యాక్షన్ మొదలైంది. గ్రామాధిపత్యం కోసం మొదలైన ఫ్యాక్షన్ గొడవల్లో ఇప్పటి వరకు 12 మంది హత్యకు గురయ్యారు. ఇవి గ్రామంలో జరిగిన హత్యలే. గ్రామ ఫ్యాక్షన్ గొడవలకు అనుబంధంగా ఇతర ప్రాంతాల్లోనూ చాలా మంది హత్యకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. రెండు కుటుంబాల మధ్య మొదలైన గ్రామాధిపత్య పోరుతో ఈ హత్యల పరంపర కొనసాగింది. ఈ క్రమంలోనే ఆలయ భూముల కోసం కొన్నేళ్ల పాటు హత్యలు, ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. 1970లో ఇద్దరు, 71లో ఇద్దరు, 72లో ఒకరు, 79లో ముగ్గురు, 99లో ఒకరు, 2011 ముగ్గురు హత్యకు గురయ్యారు. 1970 నుంచి 79 వరకు 8 మంది ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయారు. తర్వాత 20 ఏళ్ల పాటు చెన్నమరాజుపల్లెలో ఎలాంటి గొడవలు లేవు. అంతా సద్దుమణిగి అభివృద్ధి వైపు అడుగులు పడుతున్న సమయంలో పాతకక్షలు ఒక్కసారిగా మళ్లీ భగ్గుమన్నాయి. 1999–2011 మధ్య నలుగురు హత్యకు గురయ్యారు. 1999 నుంచి గ్రామంలో పోలీస్ పికెట్ నడుస్తోంది. గ్రామ స్వరూపాన్నే మార్చేసిన అల్లికలు మంచాల అల్లికలు చెన్నమరాజుపల్లె గ్రామ స్వరూపాన్నే మార్చేశాయని చెప్పవచ్చు. 450 కుటుంబాలున్న ఈ గ్రామంలో వ్యవసాయం, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. భూస్వాములైతే గ్రామంలో ఎక్కువ మంది సన్నకారు రైతులే ఉన్నారు. రాందాసు అనే వ్యక్తి మొదట్లో ఇనుప పైపుల మంచాల అల్లికలు చేసేవాడు. రామలక్షుమ్మ అతని వద్ద అల్లిక పని నేర్చుకుంది. సుమారు 15 ఏళ్ల క్రితం వరకు ఐదారుగురు ఈ పని చేసేవారు. మంచాలను అల్లడానికి సమీపంలోని ప్రొద్దుటూరుకు వెళ్లేవారు. రాను రానూ అల్లిక పని చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. ప్రతి రోజు ప్రొద్దుటూరుకు వెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకున్నదని వారు భావించారు. దీంతో మంచాల ఫ్రేంలు, వైరు పంపిస్తే ఇంటి వద్దనే అల్లి పంపిస్తామని కొందరు గ్రామస్తులు దుకాణ యజమానులకు తెలిపారు. ఇందుకు వారు అంగీకరించి ఇనుప ఫ్రేంలు, వైర్‌ను చెన్నమరాజుపల్లెకు పంపించసాగారు. 4–5 ఏళ్ల వరకు 20 కుటుంబాలు మాత్రమే అల్లిక పని చేసేవారు. ఇంట్లోనే ఉంటూ ఈ పని చేయడం మిగతా వారిని ఆకర్షించింది. దీంతో గ్రామంలోని ఇతర మహిళలు, పురుషులు అల్లిక పని నేర్చుకునేందుకు మక్కువ చూపసాగారు. కొందరు గ్రామంలోనే తెలిసిన వారి వద్ద పని నేర్చుకోగా, ఇంకొందరు ప్రొద్దుటూరుకు వెళ్లి నేర్చుకున్నారు. ప్రస్తుతం 75 శాతం కుటుంబాలు అల్లిక పనిని వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. చాలా మంది మహిళలు ఈ వృత్తిలో చక్కటి నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. నెమలి, చిలుక, పుష్పాలు, హంస, చిలక ఇలా అనేక రకాల డిజైన్లతో అల్లికలు చేస్తున్నారు. ఆర్థికంగా పరిపుష్టి చెన్నమరాజుపల్లె గ్రామంలోని అనేక కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. ప్రొద్దుటూరులో ఫర్నీచర్ దుకాణాలు, మంచాల ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. ఇక్కడ తయారైన మంచాలు రాయలసీమ వ్యాప్తంగా సరఫరా అవుతుంటాయి. ఇనుప ఫ్రేంలు మాత్రమే తీసుకొని వెళ్లే వారు కొందరుంటే, అల్లిన మంచాలను తీసుకెళ్లేవారు ఎక్కువ శాతం ఉన్నారు. చెన్నమరాజుపల్లె గ్రామం అల్లికలకు ప్రసిద్ధిగాంచడంతో ప్రొద్దుటూరులోని ఫ్యాక్టరీ, దుకాణ యజమానులు ఈ పనిని వీరికి అప్పగిస్తున్నారు. ఇక్కడ ప్రతి రోజు 1500 నుంచి 2000 మంచాలు తయారుఅవుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. మూడు రకాల వైర్లతో మంచాలను అల్లుతారు. లావుగా ఉన్న వైర్‌తో మంచం అల్లినందుకు రూ. 120 నుంచి 150, సన్నటి వైర్‌తో అల్లితో రూ. 280– 300, మహారాష్ట్ర వైర్‌తో మంచం అల్లితే రూ. 1000–1200 కూలిగా ఇస్తారు. లావు వైర్‌తో ఒక్కో వ్యక్తి రోజుకు 5 మంచాల వరకు అల్లుతారని చెబుతున్నారు. సన్నటి వైర్‌తో అయితే 2 లేదా మూడు మంచాలు అల్లుతామన్నారు. నలుగురు, ఐదుగురు ఉన్న కుటుంబాల్లో అయితే ఎక్కువ సంఖ్యలో మంచాలను అల్లుతున్నారు. కొన్నేళ్ల నుంచి పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరులలోని ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు యువకులు ఆర్మీ, పోలీసు, బ్యాంకు, ట్రాన్స్‌కో. సచివాలయ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. గ్రామస్తుల్లో మార్పు రావడం సంతోషాన్ని ఇస్తుంది ఫ్యాక్షన్ గొడవలతో అభివృద్ధికి దూరంగా ఉన్న చెన్నమరాజుపల్లె గ్రామస్తుల్లో మార్పు రావడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. అల్లిక పనులతో వారి కుటుంబాలతో పాటు గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు. పోలీసు శాఖ తరపున వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. – సంజీవరెడ్డి, రూరల్ ఎస్ఐ, ప్రొద్దుటూరు పిల్లలను బాగా చదివించుకుంటున్నాం కొన్నేళ్ల క్రితం వరకు గ్రామంలో అభివృద్ధి ఊసే లేదు. ఫ్యాక్షన్ గొడవల్లో అనేకమందిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మా గ్రామంలో గతంలో నాటి పరిస్థితులు లేవు. మంచాల అల్లిక పనులతో గ్రామం ఉపాధి బాట పట్టింది. పిల్లలను బాగా చదివించుకుంటున్నాం. – ఎన్ వెంకటసుబ్బయ్య, చెన్నమరాజుపల్లె ఆరేళ్ల నుంచి అల్లిక పని చేస్తున్నా ఆరేళ్ల నుంచి అల్లిక పని చేస్తున్నా. ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి పని చేసుకోవడం బాగుంది. మా గ్రామంలో ఎక్కువ మందికి ఉపాధి దొరకడం సంతోషంగా ఉంది. – దేవి, చెన్నమరాజుపల్లె ఆరుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాం మాకు ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అందరం అల్లిక పని చేసేవాళ్లం. అల్లిక పని ద్వారా వచ్చిన డబ్బుతో కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాం. ఇద్దరు కుమారుల్లో వెంకటగ్రేస్ ఆర్మీలో సైనికుడిగా, చైతన్యకుమార్ లైన్మెన్గా పని చేస్తున్నారు. – గుర్రమ్మ, చెన్నమరాజుపల్లె -
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం(వైఎస్సార్ జిల్లా) : డ్వాక్రా మహిళలపై దాడి చేసిన కేసులో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ పట్టణాధ్యక్షురాలు బోగాల లక్ష్మీనారాయణమ్మతో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించిన టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పొదుపు ఖాతాల్లో అవినీతి జరగలేదని, ఆడిట్ జరిగి ఒకవేళ అవినీతి జరిగిందని నిర్ధారణ అయితే ఆ డబ్బు తాను చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు తమ డబ్బు ఇవ్వాలని ప్రవీణ్ ఇంటి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వారిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం వేకువజామున ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిపై 147, 148, 323, 324, 307, 386, 509 రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. గురువారం జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఘర్షణ : ఏఎస్పీ ప్రేర్ణాకుమార్ టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రెచ్చగొట్టేలా వ్యవహరించడం వల్లే గొడవ జరిగిందని ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేర్ణాకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి డీఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 12న లక్ష్మీనారాయణమ్మ అనే మహిళ రూ.40 లక్షల మేర మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ డ్వాక్రా మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీనారాయణమ్మ గురువారం ప్రవీణ్ ఇంటి వద్దకు వెళ్లి మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఏదైనా ఉంటే తన ఇంటి వద్దకు రమ్మని రెచ్చగొట్టే ధోరణిలో ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడారన్నారు. దీంతో డ్వాక్రా మహిళలు ఆయన ఇంటి వద్దకు వెళ్లారని తెలిపారు. ‘ధైర్యం ఉంటే లోపలికి రండి..’ అంటూ ప్రవీణ్ మరోమారు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిందన్నారు. -
ప్రొద్దుటూరులోని నడింపల్లెలో గడపగడపకు మన ప్రభుత్వం
-
కడప జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంది
-
వైఎస్సార్ జిల్లా: ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు!
సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో 8 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొద్దుటూరు మండలం, రాజుపాలెం మండలంలో పలువురి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదిలా ఉండగా... టీటీడీ మాజీ చైర్మన్, మైదుకూరు టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు భారీ షాక్ తగిలింది. స్వగ్రాంలోనే ఆయన పట్టు కోల్పోయారు. ఈ క్రమంలో బి.మఠం మండలంలో పలుగురాళ్లపల్లెలో వైఎస్సార్ సీపీ మద్దతుతో ఎస్సీ మహిళ మార్తమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొద్దుటూరు మండలం: సోములవారిపల్లి- మోపురి ప్రశాంతి దొరసానిపల్లి- ఆరవ ఈశ్వరమ్మ చౌటపల్లి- మార్తల లక్ష్మీ సునీత తాళ్లమాపురం- మాదిరెడ్డి కొండారెడ్డి చౌడూరు- నేతిపల్లి చండ్రాయుడు రాజుపాలెం మండలం ఏక గ్రీవమైన పంచాయతీలు వెంగలాయపల్లి- దనిరెడ్డి రేణుకమ్మ కొర్రపాడు- పిల్లి ఓబులమ్మ కుమ్మరపల్లి- బీరం నారాయణమ్మ గాదే గూడూరు- పొలా వరలక్ష్మీ మైదుకూరు నియోజకవర్గం: దువ్వూరు మండలం, సంజీవరెడ్డిపల్లెలో ఇరగంరెడ్డి వీరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జొన్నవరం- మరియమ్మ ఎర్రబెల్లి పంచాయతీ- మదార్ బీ టి. చల్లబసయ్య పల్లి- చంద్రకళ పోరుమామిళ్ళ మండలం పుల్లివీడు- తిమ్మారెడ్డి రఘునాథరెడ్డి తిమ్మారెడ్డి పల్లి- బీరం ఉమ కలసపాడు మండలం పెండ్లిమర్రి.. కొండా రమణమ్మ మహనందిపల్లి... దేవసాని సుగుణ చెన్నుపల్లి: ముద్దేటి నవీన్ కుమార్ కాశినాయన మండలం బాలాయపల్లి: పాలగుల్ల తిరుమలరెడ్డి కోడిగుడ్లపాడు: సోమేసుల బాలగురయ్య కొండ్రాజుపల్లి: కోనేటి శారద దేవి ఏకగ్రీవం అట్లూరు మండలంలో మొత్తం 12 పంచాయతీలకుగాను 4 పంచాయతీలు (వైఎస్సార్ సీపీ మద్దతుదారులు)ఏకగ్రీవం కామ సముద్రం- రాజవోలి లక్ష్మీదేవి మన్నెంవారిపల్లె- చాట్ల వెంకటమ్మ వేములూరు- గోవర్ధన్ రెడ్డి అట్లూరు- చెంచు సుబ్బరాయుడు చాపాడు మండలంలో ఏకగ్రీవమైన పంచాయతీలు ఎన్ ఓబయ్య పల్లె- అంజనమ్మ కుచ్చు పాప చింతకుంట సుబ్బారెడ్డి ఎదురూరు- బాల ఓబులమ్మ చిన్న గొడవ లూరు - పాలగిరి సుజాత పెద్ద గొడవ లూరు- పాలగిరి రాజేశ్వర్ రెడ్డి విశ్వనాథపురం- భూమి రెడ్డి నారాయణ రెడ్డి లక్ష్మీ పేట- కర్నాటి శ్రీవిద్య సీతారామపురం- వర స్వాతి ఖాజీపేట మండలంలో ఏకగ్రీవం పంచాయితీ గ్రామాలు చెన్నముక్కపల్లె- గోట్టి గంటి చంద్రశేఖర్ సన్న పల్లె- తుమ్మలూరు సుబ్బమ్మ త్రిపురవరం- మీగడ సుస్మిత కొమ్ములూరు- పోతులూరు రుక్మిని -
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదనే కారణంతో యువతిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. వివరాలు.. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ , లావణ్య అనే యువతిని మూడు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎవరూ లేని సమయంలో లావణ్య ఇంటికి వెళ్లిన సునీల్ తనను ప్రేమించాల్సిందిగా బెదిరించాడు. ఆమె అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో లావణ్యపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లావణ్యను ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ప్రేమోన్మాది ఆత్మహత్య)\ -
నాగలి పట్టిన కుర్రాడు.. నేడు డీఎస్పీ
సాక్షి, ప్రొద్దుటూరు: ఆ యువకుడు సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు.. వారికున్న కొద్దిపాటి పొలంలో వ్యవసా యం చేసి కష్టపడి తల్లిదండ్రులు బాగా చదివించారు.. తన అభ్యున్నతి కోసం తండ్రి పడిన కష్టాలను చిన్నప్పటి నుంచి కళ్లారా చూశాడు ఆ యువకుడు. కుటుంబ పరిస్థితులు అతడిలో కసిని పెంచాయి. బాగా చదివి పది మందికి సాయం చేసే ఉద్యోగం పొందాలి... తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. ఎంతో క్రమశిక్షణ.. అంతకు మంచి నిబద్ధతతో చదివాడు. నాడు నాగలి పట్టిన విజయనగరం కుర్రాడు నేడు లాఠీ పట్టాడు. ప్రొద్దుటూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఏగిరెడ్డి ప్రసాదరావు గురించి ఆయన మాటల్లోనే.. రైతు కుటుంబం నుంచి... విజయనగరం జిల్లాలోని పార్వతీపురం సమీపంలో ఉన్న గుణానుపురం మా స్వగ్రామం. తల్లిదండ్రులు మహాలక్ష్మి, సత్యంనాయుడు. మేము ఇద్దరం అన్నదమ్ములం. మా అన్న శంకర్రావు ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. గ్రామంలో ఆరు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయమే మాకు జీవనాధారం. కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసి మా తల్లిదండ్రులు మా ఇద్దరినీ చదివించారు. మేము నాన్నతో పాటు పొలం పనులు చేసేవాళ్లం. మా ఊళ్లోని ప్రభుత్వ హైస్కూళ్లో 10వ తరగతి వరకు చదివాను. విజయవాడలోని గౌతమ్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశా ను. గౌహతిలోని ఐఐటీలో డిగ్రీ చదివాను. తర్వాత హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను. కుటుంబ పరిస్థితుల ప్రభావంతో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను, గ్రూప్స్‌లో మంచి ర్యాంక్ రావడంతో ఇష్టమైన పోలీసు శాఖలో చేరాను. 2018 బ్యాచ్‌లో డీఎస్పీగా ఎంపికై అనంతపురంలోని పీటీసీలో శిక్షణ పొందాను. డి్రస్టిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిగా వైఎస్సార్ జిల్లాలోనే చేశాను. రాయచోటి, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, పులివెందులలో ట్రైనీ డీఎస్పీగా విధులు నిర్వర్తించా ను. అందువల్ల జిల్లాపై మంచి అవగాహన ఉంది. చట్టపరిధికి లోబడి పని చేస్తా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తారనే భావన చాలా మందిలో ఉంది. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి చెప్పుకోవచ్చు. నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ మా విధానం. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారు. సబ్‌డివిజన్‌లోని అన్ని గ్రామాలు తిరిగి స్వయంగా సమస్యలు తెలుసుకుంటాను అని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. -
మధ్యాహ్నం నిశ్చితార్థం.. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం!!
పెద్దల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరిగింది. ఆ శుభ క్షణాలను తలచుకుంటూ ఆమె ఎన్నో కలలు కనింది. పెళ్లి..ఆ తర్వాత గడిపే నూరేళ్ల జీవితం ఆమె కళ్ల ముందు సాక్షాత్కరించింది. అలా కలగంటూనే నిద్రలోకి జారుకుంది. అదే శాశ్వత నిద్ర అవుతుందని కలలోనూ ఊహించలేదు. ఓర్వకల్లు రాక్‌గార్డెన్ ఎదుట శుక్రవారం అర్ధరాత్రి ఆగివున్న ట్రాక్టర్‌ను టవేరా వాహనం ఢీకొనడంతో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గోథ్నవి (22) దుర్మరణం పాలైంది. ఆమెతో పాటు మరో ఇద్దరు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. సాక్షి, ఓర్వకల్లు/ప్రొద్దుటూరు క్రైం : పెళ్లి మంత్రాలకు బదులు ఆ ఇంటిలో మృత్యు ఘంటికలు మోగాయి. నిశ్చితార్థం చేసుకుని వస్తున్న వారిని మార్గమధ్యంలోనే మృత్యువు కాటేసింది. అర్ధరాత్రి కాస్త వారి పాలిట కాళరాత్రిగా మారింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని ద్వారకానగర్‌కు చెందిన ఈదుల మల్లికార్జునరెడ్డి తిరుపతిలో వాచ్‌మన్‌గా పని చేస్తుండేవారు. ఇటీవల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆయన కుమార్తె గోథ్నవి ప్రొద్దుటూరు ఆచార్ల కాలనీలోని సరస్వతీ విద్యామందిరంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడితో గోథ్నవికి పెళ్లి నిశ్చయమైంది. ఇందులో భాగంగా రెండు కుటుంబాలు నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో గోథ్నవితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు టవేరా (ఏపీ 07 ఏఎం 5999) వాహనంలో ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిశ్చితార్థమయ్యింది. తిరిగి ప్రొద్దుటూరుకు బయలుదేరారు. కాగా.. నందికొట్కూరు మండలంలోని వడ్డెమాను గ్రామానికి చెందిన ఎల్లప్ప.. మద్దిలేటయ్య స్వామి దర్శనం కోసం 20 మంది బంధువులతో ట్రాక్టర్ (ఏపీ 22ఏసీ 7033)లో శుక్రవారం రాత్రి బయలు దేరారు. ట్రాక్టర్ ముందు భాగం లైట్లు సరిగా పనిచేయడం లేదని ఓర్వకల్లు రాక్‌గార్డెన్ వద్ద రోడ్డు పక్కన నిలిపారు. టవేరా వాహనం ఢీకొట్టింది ఈ ట్రాక్టర్‌నే.. అదే సమయంలో వేగంగా వచ్చిన టవేరా వాహనం ట్రాక్టర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టవేరా వాహనంలో డ్రైవర్ పక్కన కూర్చున్న మార్తల కొండారెడ్డి (65) అనే వ్యక్తి, బి.కోడూరు మండలం పాయలకుంట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి (60) వాహనంలోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీటులో కూర్చున్న గోథ్నవి తీవ్రగాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తల్లి ఇందిర, పెద్దమ్మ సక్కుబాయి, సన్నిహితురాలు లత తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇందిర, లత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తండ్రి మల్లికార్జునరెడ్డి, డ్రైవర్ మహబూబ్బాషాలకు రక్తగాయాలయ్యాయి. చిన్నాన్న శివనాగిరెడ్డి మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే ట్రాక్టర్లో ఉన్న బోయ శ్రీనివాసులు(నాగటూరు), బోయ నరసింహులు(కల్లూరు), డ్రైవర్ పరశురాముడు(వడ్డెమాను), తెలుగు సుబ్బన్న(వడ్డెమాను), బోయ సవారి(మల్యాల), బోయ పవన్‌కుమార్(నాగటూరు) కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిశ్చితార్థానికి పెద్ద మనిషి వెళ్లి.. ప్రొద్దుటూరు పట్టణంలోని మిట్టమడి వీధికి చెందిన మార్తల కొండారెడ్డికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అతను కొన్ని రోజుల క్రితం నుంచి ద్వారకానగర్‌లో ఇంటిని బాడుగకు తీసుకుని ఉంటున్నాడు. కుమార్తె నీరజకు వివాహం కాగా.. అమెరికాలోని టీసీఎల్ కంపెనీలో పని చేస్తోంది. మల్లికార్జునరెడ్డి ఇంటికి సమీపంలో ఉన్నందున నిశ్చితార్థంలో పెద్ద మనిషిగా మాట్లాడేందుకు రావాలని గోథ్నవి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ప్రమాదంలో కొండారెడ్డి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. శనివారం సాయంత్రం ఆయన మృతదేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకువచ్చారు. భార్య లక్ష్మీదేవి, కుమారులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా నుంచి కుమార్తె వచ్చిన తర్వాత సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. సంతోషంగా పుట్టిన రోజు జరుపుకున్న గోథ్నవి గోథ్నవి బీటెక్ చదివింది. ప్రొద్దుటూరులోని సరస్వతీ విద్యామందిరంలో 1, 4,5 తరగతులకు బోధించేది. గత నెల 22న పుట్టిన రోజు వేడుకలను స్కూల్లో ఉపాధ్యాయులతో కలిసి సంతోషంగా జరుపుకుంది. గురువారం పాఠశాలకు వచ్చిన ఆమె శుక్రవారం ఒక్క రోజు సెలవు పెట్టింది. శనివారం స్కూల్‌కు తిరిగి వస్తానని వెళ్లిందని ఉపాధ్యాయులు తెలిపారు. మూడేళ్ల క్రితం కుమారుడు మృతి మల్లికార్జునరెడ్డి, ఇందిర దంపతులకు శివ, గోథ్నవి సంతానం. మూడేళ్ల క్రితం శివ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మరువక ముందే కుమార్తె కూడా అకాల మరణం చెందింది. ఇద్దరు పిల్లలను కోల్పోయి..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ దంపతులను చూసి స్థానికులు చలించిపోయారు. -
రాయలసీమ వేదికగా మరో రాజకీయ పార్టీ!
సాక్షి, కడప: రాయలసీమ వేదికగా మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రొద్దుటూరు జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ఇంజా సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ సమతా పార్టీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా పార్టీ జెండా, లోగోను వ్యవస్థాపక అధ్యక్షుడైన ఇంజా సోమశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. విద్య, వైద్యం, సంక్షేమం ప్రధాన ఎజెండాగా పార్టీని స్థాపిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు, అభివృద్ధి కోసం ప్రత్యక్ష రాజకీయాల ద్వారా కృషి చేస్తామని చెప్పారు. -
షాహిదా బేగం ఇక నా దత్త పుత్రిక : ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు : ఓ పేద విద్యార్థినిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అక్కున చేర్చుకున్నారు. ఆమెను అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. సోమవారం ప్రొద్దుటూరులో టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్ సన్మాన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు 6 తరగతి విద్యార్థిని షాహిదా బేగం జానపద గేయం పాడి అందరినీ అలరించింది. ఎమ్మెల్యే స్పందించి విద్యార్థినిని వేదికపైకి పిలిచారు. రూ.5వేలు నగదు బహుమతి అందించారు. మండలంలోని మీనాపురం గ్రామానికి చెందిన షాహిదాబేగంకు తండ్రి లేడని ఆయన తెలుసుకున్నారు. పేదరికంలో పుట్టిన ఆమె చదువుకు తాను పూర్తిగా సహకరిస్తానని వెంటనే ప్రకటించారు. ఎంత వరకు చదివినా ఆర్థిక సహాయం అందిస్తానన్నారు. పెళ్లి బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పడంతో హర్షధ్వానాలు మారుమోగాయి. ఎమ్మెల్యే నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. -
రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. డబ్బులు ఎగ్గొట్టారు
సాక్షి, కడప : రూ.10 కోట్ల 24 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇవ్వాల్సిన డబ్బుల్లో రూ.50 లక్షలు ఎగ్గొట్టడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు.. కడప నగరం హబీబుల్లా వీధిలో నివాసముంటున్న జేకే రాజేష్‌సింగ్, అతని అన్న రమేష్‌సింగ్‌లకు కడప సమీపంలోని విశ్వనాథపురంలో 3 ఎకరాల 30 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలాన్ని వారు ప్రొద్దుటూరులోని బి.కొత్తపల్లె, వీఆర్ కాలనీకి చెందిన మణిప్రసాద్‌రెడ్డి భార్య కవితకు అమ్మాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత ఏడాది అక్టోబర్ 24న రూ.2కోట్ల 50 లక్షలు అడ్వాన్సుగా తీసుకుని అగ్రిమెంట్ రాయించారు. ఈమేరకు ఈ ఏడాది ఆగస్టు 28న భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు కడప బాలాజీనగర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వారిని పిలిపించారు. అయితే వారు పూర్తి స్థాయిలో డబ్బులు తీసుకురాకపోవడంతో ఈనెల 3వ తేదీకి రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రాజేష్ సింగ్, రమేష్ సింగ్‌లు 3వ తేదీ మంగళవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ప్రొద్దుటూరుకు చెందిన కవిత, మణిప్రసాద్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, మురళి ఉన్నారు. వారంతా కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇవ్వాల్సిన డబ్బుల్లో రూ.50 లక్షలు తక్కువ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత డబ్బులు తక్కువ ఇస్తే ఎలా అని బాధితులు ప్రశ్నించగా ‘ మీకు డబ్బులు ఇచ్చేది లేదు.. మా జోలికి వస్తే చంపుతాం’ అంటూ బెదిరించి దాడికి పాల్పడ్డారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించి రిజిస్ట్రేషన్ చేయించుకుని, తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కడప తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. -
ఆ బాబు బాధ్యత నాది: ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు : ‘తండ్రి లేని పిల్లాడని దిగులు చెందవద్దమ్మా.. ఈ బాబు బాధ్యత నేను తీసుకుంటా’ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ వీధిలో నివాసం ఉంటున్న రాజేష్ గత నెల 7న తొండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇతనితో పాటు మరో ఇరువురు మృత్యువాత పడ్డారు. రాజేష్ చనిపోయే నాటికి అతని భార్య షబానా గర్భిణి. సోమవారం ఆమె జిల్లా ఆస్పత్రిలో ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వార్డుకు వెళ్లి షబానా, పసికందు ఆరోగ్య స్థితిగతులపై వైద్యులతో మాట్లాడారు. ఆమె బిడ్డను చేతుల్లోకి తీసుకొని రాజేష్ రూపంలో దేవుడు పంపించాడని అన్నారు. ‘దిగులు పడ వద్దమ్మా.. ఈ బిడ్డ బాధ్యత నేను తీసుకుంటా ’ అని అన్నారు. బాబుకు 19 ఏళ్లు వచ్చే నాటికి రూ. 10 లక్షలు చేతికి వచ్చేలా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తానని చెప్పారు. ఆ డబ్బు అతని జీవనోపాధి కోసం ఉపయోగపడుతుందన్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ పని చేస్తానన్నారు. ముగ్గురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకొని వెళ్లగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కేవలం రెండు రోజుల్లోనే రూ. 5 లక్షలు చొప్పున ముగ్గురి కుటుంబాలకు అంద చేశారన్నారు. -
మళ్లీ చిన్నశెట్టిపల్లె వివాదం
సాక్షి, ప్రొద్దుటూరు: చిన్నశెట్టిపల్లె గ్రామానికి సంబంధించి రెండు వర్గాల మధ్య మళ్లీ వివాదం రాజుకుంటోంది. సమస్యను పరిష్కరించకపోతే గత పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. టీడీపీలోని మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి పొట్టిపాడు గ్రామం వద్ద మైలవరం ఉత్తర కాలువ వెంబడి రోడ్డు పనులు చేపడుతున్నారు. గత ఏడాది మార్చి నెలలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు ప్రారంభించారు. పనుల అంచనా వ్యయం రూ.1,33,421 మాత్రమే. ఈ పనుల్లో భాగంగా ప్రభాకర్‌రెడ్డి ప్రత్యర్థి వర్గానికి చెందిన బయపురెడ్డి సూర్యనరసింహారెడ్డి పొలంలో కాలువ నీరు వెళ్లేందుకు పైపులు ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ప్రభాకర్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు పొలంలో పైపులు వేస్తున్నాడని సూర్యనరసింహారెడ్డి భావించారు. ముందుగా ఈ విషయంపై చెప్పినా పనులు ఆపకపోవడంతో ఇరువర్గాల మధ్య పొలంలోనే ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీస్‌స్టేషన్ వద్ద ఇరు వర్గాలు రాళ్లు కూడా విసురుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటన జిల్లాలో చర్చాంశనీయంగా మారింది. అప్పటి హోం మంత్రి చినరాజప్ప వరకు వెళ్లిందంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. పనుల నాణ్యతపై ఇటీవల ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు రెండు వారాల క్రితం స్వయంగా పనులను పరిశీలించి వెళ్లారు. మూడు రోజుల క్రితం కాంట్రాక్టర్ మరోమారు రోడ్డుపై గ్రావెల్ పరిచారు. అలాగే వివాదానికి సంబంధించిన స్థలంలో మాత్రం పనులను పూర్తి చేయకుండా పైపులను అలానే వదిలేశారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇరువర్గాల మధ్య మళ్లీ ఈ పనులకు సంబంధించిన వివాదం ఏర్పడింది. ఏడాదిన్నర కాలంగా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నా ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని ప్రభాకర్‌రెడ్డి ప్రత్యర్థి వర్గీయులు చెబుతున్నారు. పనులు పూర్తి చేయకుండా ఎందుకు అసంపూర్తిగా వదిలేశారని ప్రశ్ని స్తున్నారు. ఈ విషయంపై పీఆర్ ఏఈ మల్లారెడ్డిని వివరణ కోరగా తాను ఇటీవలే బదిలీపై వచ్చానని, తనకు వివరాలు తెలియదని చెప్పారు. సూర్యనరసింహారెడ్డి పొలం వద్ద అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పనులు -
పదోన్నతి కల్పించాల్సి ఉన్నా..
సాక్షి, ప్రొద్దుటూరు (కడప) : ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు ప్రకటించిన జేఏఓల పదోన్నతుల్లో తనకు అన్యాయం జరిగిందని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న దివ్యాంగుడు బి. సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం సాక్షి తో మాట్లాడారు. 2006లో రిక్రూట్మెంట్ ద్వారా 88 మార్కులతో తాను విద్యుత్ సంస్థలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందానని పేర్కొన్నారు. ఈ నెల 21 తేదీన ఎస్పీడీసీఎల్ అధికారులు సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న 12 మంది జేఏఓలకు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లుగా (ఏఏఓ) పదోన్నతులు కల్పించారని తెలిపారు. జీఓఎంఎస్ నంబర్42, 2011 అక్టోబర్ 19 తో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సివిల్ అప్పీల్ నంబర్.9096 ఆఫ్ 2013 ప్రకారం దివ్యాంగుల కోటాలో తనకు పదోన్నతి కల్పించాల్సి ఉందన్నారు. అయితే అధికారులు ఇందుకు భిన్నంగా తనకంటే తక్కువ మార్కులు పొందిన మరో అధికారికి పదోన్నతి కల్పించారన్నారు. రిక్రూట్ మెంట్లో 75 మార్కులు పొందిన అతనికి ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం ఇచ్చిన అధికారులు ప్రస్తుతం అదే రోస్టరు ద్వారా పదోన్నతి కల్పించకుండా దివ్యాంగుల కోటాలో ఎలా పదోన్నతి కల్పిస్తారని ప్రశ్నించారు. పదోన్నతి గురించి దాదాపు రెండేళ్లుగా సీఎండీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. -
చంద్రబాబు వస్తే కరువే
సాక్షి, ప్రొద్దుటూరు : చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువే. టీడీపీ ప్రభుత్వ హయాంలో పదును వర్షం కూడా లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరువుకు రోల్ మోడల్‌గా చంద్రబాబు నిలిచారని వైఎస్సార్సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. వర్షాలు లేక బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి, సక్రమంగా పంటలు పండక, పండిన వాటికి గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లె గ్రామంలో సోమవారం ఉదయం ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డితోపాటు రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ తన పార్లమెంట్ పరిధిలోని మూడు గ్రామ పంచాయతీలను దత్తత తీసుకోగా ఇందులో దొరసానిపల్లె ఒకటి అన్నారు. దత్తత గ్రామాలను ఎంపిక చేశాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం నిధులు విడుదల చేయలేదన్నారు. దీంతో ఎంపీ కోటా కింద నిధులు విడుదల చేసి ఈ గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో పోస్టుడేటెడ్ చెక్కులు ఇచ్చి మభ్యపెట్టారన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారన్నారు. జగనన్న ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఈ గ్రామంలో నివసిస్తున్న తాను నిత్యం మీకు అందుబాటులో ఉంటున్నానన్నారు. ఎవరు తనను ఆశ్రయించినా తన వంతు సహాయం చేస్తున్నాని తెలిపారు. వందకు ఒక్క ఓటు ఇతర పార్టీలకు పడినా తనకు బాధగా ఉంటుందని తెలిపారు. గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేశానని అన్నారు. శ్మశానవాటికకు కాంపౌండ్ నిర్మించడం, రూ.40లక్షలతో రైల్వేస్టేషన్‌కు సిమెంటు రోడ్డు, రూ.50లక్షలతో జమ్మలమడుగు మెయిన్ రోడ్డుకు సిమెంటు రోడ్డు నిర్మించామని, అధికారులపై ఒత్తిడి తెచ్చి కమ్యూనిటీ హాల్‌తోపాటు అంగన్వాడీ భవనాలను మంజూరు చేయించామన్నారు. తన గ్రామ మహిళలు ఇబ్బంది పడకుండా ఉండాలనే లక్ష్యంతో రూ.20లక్షలు సొంత నిధులు వెచ్చించి స్థలాన్ని కొని బోరు వేయించి తాగునీటి సమస్యను పరిష్కరించానన్నారు. సొంత డబ్బుతో దొరసానిపల్లె హైస్కూల్ విద్యార్థులకు సైకిళ్లు కొనుగోలు చేయించానని పేర్కొన్నారు. చెత్త సేకరణ కోసం రూ.7లక్షలు వెచ్చించి ట్రాక్టర్లను కొనుగోలు చేయించానని చెప్పారు. సుమారు రూ.2కోట్లు వెచ్చించి గ్రామ పంచాయతీలో సిమెంటు రోడ్లు నిర్మింపజేశానన్నారు. జగనన్న ప్రభుత్వం వస్తే దొరసానిపల్లెను బృందావనంలా తయారు చేస్తానని తెలిపారు. ఏ పథకమైనా తన గ్రామ పంచాయతీ నుంచే ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో దొరసానిపల్లె గ్రామ పంచాయతీ నాయకులు పాతకోట రామ్మోహన్‌రెడ్డి, గోపిరెడ్డి చిన్నరెడ్డి, ప్రాప్తం యాకోబ్, అనిల్, మార్తల నారాయణరెడ్డి, పాతకోట పునరుద్రారెడ్డి, నందం వెంకటసుబ్బయ్య, వంకం సుబ్బరాయుడు, శ్రీనుతోపాటు దనియాల గంగిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామిరెడ్డి, తులసిరెడ్డి, కరాటె జయరామిరెడ్డి, మార్తల కృష్ణారెడ్డి, బుజ్జిబాబు, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, గంగిరెడ్డి మాధవరెడ్డి పాల్గొన్నారు. -
నాడు అరణ్యం.. నేడు సుందరవనం
సాక్షి, ప్రొద్దుటూరు : సెలవు రోజుల్లో.. వారాంతంలో పట్టణ ప్రజలు సరదాగా బయటికి వెళ్లి కాసేపు గడపడానికి పరిసర ప్రాంతాల్లో ఒక్క ప్రదేశం కూడా లేదు. పిల్లలతో కలిసి సరదాగా బయటికి వెళ్దామనుకున్న వారికి నిరాశే మిగిలేది. పట్టణంలో మున్సిపల్ పార్కు ఉన్నా అక్కడ సరైన వసతులు లేకపోవడంతో వెళ్లడానికి ప్రజలు పెద్దగా ఇష్టపడరు. ఇవి 2004 ముందు నాటి పరిస్థితులు. ఆ సమయంలో ఎర్రగుంట్ల రోడ్డులోని అటవీ శాఖ స్థలంలో పార్కును ఏర్పాటు చేయాలని కొందరు స్థానికులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక నాయకులు అడిగిన మరుక్షణమే ప్రతిపాదనలు పంపాలని అటవీ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. సాక్షాత్తు సీఎం చెప్పడంతో ఆ ఫైలు వేగంగా కదిలింది. కేవలం రెండు నెలల్లోనే పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 2005 ఆగస్టు 3న వైఎస్ రాజశేఖరరెడ్డి నేషనల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెంటనే రూ.6 కోట్ల నిధులు కేటాయించడంతో పనులు చకచకా ప్రారంభమయ్యాయి. కేవలం ఏడాది తిరక్కుండానే రాజీవ్‌గాంధీ నేషనల్ పార్కు సుందరంగా రూపుదిద్దుకుంది. 238 హెక్టార్లలో పార్కు ఏర్పాటు ఎర్రగుంట్ల రోడ్డులోని అటవీ శాఖ కార్యాలయం పక్కన ఉన్న దట్టమైన అరణ్యం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో సుందరవనంగా మారింది. పార్కు కోసం సుమారు 238.52 హెక్టార్ల స్థలాన్ని కేటాయించారు. పార్కు చుట్టూ ప్రహరీకి శ్రీకారం చుట్టారు. పరిధి ఎక్కువగా ఉండటంతో పనులు చివరి దశకు చేరుకున్నాయి. అందులో 23.5 హెక్టార్ల స్థలంలో సందర్శకుల కోసం అభివృద్ధి చేశారు. కిడ్స్‌జోన్, వాకర్ ట్రాక్, అక్కడక్కడా కూర్చోడానికి అందమైన షెడ్లు, అరుగులు, పూల మొక్కలు, చెట్లను ఏర్పాటు చేశారు. పార్కులోని జింకలు, కుందేళ్లు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. పండుగలు, ఆదివారం, ఇతర సెలవు దినాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి ఉల్లాసంగా గడుపుతారు. ప్రొద్దుటూరుతో పాటు ఎర్రగుంట్ల, రాజుపాళెం, దువ్వూరు మండలాల నుంచి ప్రజలు వస్తుంటారు. విశాలమైన వాకింగ్ ట్రాక్ ఉండటంతో రోజు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తుంటారు. నంగనూరుపల్లె వనసంరక్షణ సమితి ఆధ్వర్యంలో పార్కు నిర్వహణ పనులు జరుగుతున్నాయి. నిరంతరం 8 మంది పార్కులో పని చేస్తుంటారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతోనే పార్కు ఏర్పాటు సాధ్యమైందని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. పార్కులో మరికొంత అభివృద్ధి పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దట్టమైన చెట్లు ఉండేవి 2005కు ముందు ఈ ప్రాంతం దట్టమైన చెట్లతో నిండి ఉండేది. అయితే వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎం అయ్యాక ఈ ప్రాంతంలో నేషనల్ పార్కును ఏర్పాటు చేశారు. పార్కులో చెట్లు, పూల మొక్కలు, గ్రీనరీ, కిడ్స్ జోన్ ఉన్నాయి. ఆదివారం, పండుగ రోజుల్లో ఎక్కువ మంది వస్తుంటారు. – మనోహర్, వీఎస్ఎస్ సభ్యుడు, నంగనూరుపల్లి మొదటి నుంచి ఇక్కడే పని చేస్తున్నాను పార్కు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇందులోనే పని చేస్తున్నాను. చెట్లకు నీరు పోయడం, పెరిగిన మొక్కలను కత్తిరించడం, గ్రీనరీని శుభ్రం చేయడం లాంటి పనులు చేస్తుంటాను. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పార్కుకు భూమి పూజచేయడం నేను చూశాను. – మరియమ్మ, వీఎస్ఎస్ సభ్యురాలు వైఎస్ చలువతో పార్కు ఏర్పాటైంది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ తీసుకోవడంతోనే ప్రొద్దుటూరులో నేషనల్ పార్కు ఏర్పాటైంది. పట్టణ శివారులో పార్కు ఉండటంతో సెలవు రోజుల్లో పిల్లలతో కలిసి చాలా మంది సరదాగా గడిపేందుకు వెళ్తున్నారు. వాకింగ్ ట్రాక్ కూడా బాగుంది. పార్కును ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. – వెంకటసుబ్బయ్య, ప్రొద్దుటూరు -
ప్రోద్దుటూరు టీడీపీలో కొనసాగుతున్న రచ్చ
-
టీడీపీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి.. నిరసన!
సాక్షి, ప్రొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో టికెట్ల రగడ మొదలైంది. ఎమ్మెల్యే టికెట్‌ను లింగారెడ్డికి ఇవ్వడంతో.. వరదరాజులరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందంటూ వరదరాజులరెడ్డి వర్గీయులు కూడా తమ నిరసన తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీలను తొలగించారు. పార్టీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి తమ నిరసన తెలిపారు. ఐదేళ్లుగా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జిగా వరదరాజులరెడ్డి ఉండగా.. టికెట్‌ను లింగారెడ్డికి కేటాయించడంతో వరద వర్గీయులు అధిష్టానంపై మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో వరదరాజులరెడ్డి ఆయన అనుచరులతో సమావేశమై చర్చలు జరిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కార్యకర్తలు, అభిమానుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని వరదరాజులరెడ్డి తెలిపారు. -
ప్రొద్దుటూరు టీడీపీలో టికెట్ల రగడ
-
అధికార పార్టీ నేత నిర్వాకం
సాక్షి, ప్రొద్దుటూరు : అధికార పార్టీని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరతీసిన సంఘటన ప్రొద్దుటూరు మండలంలోని చర్చాంశనీయంగా మారింది. వాస్తవానికి 20 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కుందూనదిలో ట్రాక్టర్ బోల్తాపడి తీవ్రంగా నష్టం జరిగింది. డ్రైవర్ కూడా గాయపడ్డాడు. అయితే అప్పుడు ట్రాక్టర్‌కు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపునకు గడువు ముగి యడంతో యజమాని ట్రాక్టర్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి బీమా కోసం అదే ప్రాంతంలో ట్రాక్టర్‌ను మళ్లీ పడేశారు. తద్వారా ఇన్సూరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ దువ్వూరు మండలంలోని ఎర్రబల్లి గ్రామానికి చెందిన రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా రోజూ ప్రొద్దుటూరు మండలంలోని నక్కలదిన్నె గ్రామం వద్ద ఉన్న కుంటకు వచ్చి మట్టి తీసుకెళుతున్నారు. ఇలా వచ్చి వెళుతుండగా గత నెల 27న ఉదయం 7.30 గంటలకు మార్గం మధ్యలోని కుందూ నదిలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ పడింది. టీడీపీ ఇన్చార్జి వరదరాజులరెడ్డి స్వగ్రామమైన కామనూరుకు చెందిన రామముర్తి కుమారుడు డ్రైవర్‌గా ఉన్నాడు. వాస్తవంగా ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. ప్రమాద సమయంలో చాలా వరకు డీజల్ కారిపోయి కిందపడింది. ఇది జరిగిన సంఘటన. ప్రస్తుతం జరిగిన సంఘటన ప్రమాదం జరిగిన రోజున క్రేన్ సహాయంతో చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగా ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. ఏడాది క్రితం కొనుగోలు చేసిన ఈ ట్రాక్టర్‌కు ఇన్సూరెన్స్ ప్రీమియం గడువు చెల్లింపు ఆలస్యమైంది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ శివనాగిరెడ్డి ఇటీవల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించారు. ఇన్సూరెన్స్ కోసం సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డ్రైవర్ ద్వారా ట్రాక్టర్‌ను తీసుకొచ్చి అదే కుందూ నదిలో పడేశారు. ఈ విషయాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని టీడీపీ ఇన్చార్జి వరదరాజులరెడ్డి బంధువులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. -
అమరావతి వెళ్లినా...తేలని టీడీపీ అభ్యర్థి!
సాక్షి, ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నెల రోజులు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు సగం నియోజకవర్గంలో ప్రచారాన్ని పూర్తి చేశారు. అధికార పార్టీని గత ఐదేళ్లలో గట్టిగా ఎదుర్కోవడంతోపాటు ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారనే మంచి పేరు రాచమల్లుకు ఉంది. ఈ కారణాల వల్ల ఆయన విజయం ఖాయమని, మెజారిటీపైనే స్పష్టత రావాల్సి ఉందని చర్చ జరుగుతోంది. ఇది ఇలా ఉండగా టీడీపీ అభ్యర్థిని ఇంత వరకు ఆ పార్టీ అధిష్టానం ప్రకటించలేదు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి ఎంపిక అయోమయంగా మారింది. కొత్తపేర్లు సైతం ప్రచారంలోకి వస్తున్నాయి. ఆ పేర్లు వింటున్న టీడీపీ కార్యకర్తలు తమ అధిష్టానం ఇలా చేయడం ఏమిటని లోలోన ఆవేదనచెందుతూ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. దాదాపు డజను పేర్లు తెరమీదికి వచ్చి కనుమరగైపోయాయి. ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. పలు మార్లు స్థానిక నేతలు అమరావతికి వెళ్లడం, తిరిగి రావడం జరుగుతోంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుడుతుండగా అధిష్టానం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఫిబ్రవరి 6 నుంచే ప్రచారం ప్లాన్ ప్రకారం ఎన్నికల బరిలోకి దిగుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఫిబ్రవరి 6వ తేదీ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈకార్యక్రమానికి వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ కన్వీనర్ కె.సురేష్‌బాబు హాజరయ్యారు. నియోజకవర్గ పరిధిలో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాలకు సంబంధించి 30 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులు ఉన్నాయి. రాజుపాళెం మండలంలో రాజుపాళెం గ్రామ మినహా మిగతా మండలమంతా ప్రచారం దాదాపుగా పూర్తయింది. ప్రొద్దుటూరు మండలంలో కాకిరేనిపల్లె, చౌడూరు, నరసింహాపురం, రామాపురం, రేగుళ్లపల్లి, సీతంపల్లి, ఎర్రగుంట్లపల్లి, కొట్టాల, నంగనూరుపల్లి, సోములవారిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే పూర్తి చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రచారం ఓటర్లను ఆకర్షిస్తుండటంతోపాటు వైఎస్సార్సీపీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మంగళవారం నుంచి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఒకటో వార్డు నుంచి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 30 రోజుల్లో ప్రచారం చేస్తారా.. షెడ్యూల్ ప్రకారం ఈనెల 18 నుంచి అసెంబ్లీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. అన్నింటికి కలిపి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానం అభ్యర్థిని ఎంపిక చేయలేదు. మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లేల లింగారెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డితోపాటు వరద కుమారుడు కొండారెడ్డి, ఉక్కు ప్రవీణ్కమార్రెడ్డి, డాక్టర్ వైవీ స్వరూప్‌కుమార్‌రెడ్డి, ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీను, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పేర్లు పార్టీ వైపు నుంచి వినిపించగా స్థానికంగా పలువురు తామూ టికెట్ రేసులో ఉన్నామని ప్ర చారం చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు అభ్యర్థి ని అధిష్టానం ఎంపిక చేసినా నియోజకవర్గమంతా తిరిగి ప్రచారాన్ని పూర్తి చేయడం అంత సులు వు కాదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జగన్ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు ప్రొద్దుటూరు : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు పూర్తిగా కోరుకుంటున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో మంగళవారం ఉదయం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తొలి రోజు ఇక్కడ ప్రచారం చేస్తున్నానన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, చిన్న వ్యాపారులు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని తెలుస్తోందన్నారు. ఈ వార్డు పూర్తిగా వైఎస్సార్సీపీకి పట్టుకొమ్మలాంటిదన్నారు. ఈ కారణంగా 2014 ఎన్నికల్లో ఇక్కడ మంచి మెజారిటీ వచ్చిందని అన్నారు. అంతకు రెండింతలు ఈ ఎన్నికల్లో మెజారిటీ వస్తుందని తెలిపారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని సర్వత్రా అభిప్రాయం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. దీనిని బట్టి చూస్తే ఆ బ్రహ్మదేవుడు వచ్చినా చంద్రబాబును కాపాడలేరన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైతే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే తాను నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా తన వంతు ప్రజా సేవ చేశానన్నారు. టీడీపీ ప్రభుత్వం మాత్రం దృష్టి సారించకపోవడంతో నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. అభివృద్ధి విషయంలో ప్రొద్దుటూరుకు పట్టిన దరిద్రం వదలాలంటే జగన్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ వార్డు నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్ గోనా సరస్వతీ ప్రభాకర్‌రెడ్డి, పోరెడ్డి ప్రదీప్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దేవీ ప్రసాదరెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఓబయ్య, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి స్నూకర్ భాస్కర్, గోకుల్ సుధాకర్, మాజీ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి, ఆయిల్ మిల్ ఖాజా, మార్కెట్ దాదాపీర్, 24వ వార్డు మహ్మద్‌రఫి పాల్గొన్నారు. -
ప్రొద్దుటూరులో ఎన్నికల శంఖారావం పూరించిన వైఎస్ఆర్సీపీ
-
పెద్ద మనసు చాటుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు
-
ప్రొద్దుటూరు జలగలు
-
బీజేపీ కంటే బ్రిటీష్ పాలనే మేలు: రఘువీరా
ప్రొద్దుటూరు: బీజేపీ ప్రభుత్వం కంటే బ్రిటీష్ ప్రభుత్వ పరిపాలనే మేలు అనిపిస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ... రైతులను నమ్మించి బీజేపీ ప్రభుత్వం గొంతు కోసిందని విమర్శించారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం రోజున హింసను ప్రోత్సహించిందని తూర్పారబట్టారు. జై జవాన్- జై కిసాన్ అనే నినాదం వదిలేసి జై జపాన్- జై కార్పొరేట్ అని అంటోందని ధ్వజమెత్తారు. కోర్టుఇచ్చిన ఫ్రీ సెక్స్ తీర్పు పైన బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడం అరాచకమని, ఇది మన సంప్రదాయానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ టాక్స్ కాదని, గబ్బర్ సింగ్ టాక్స్‌గా పరిగణిస్తున్నామని వ్యంగ్యంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు దేశవ్యాప్తంగా 2లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, అలాగే జీఎస్టీని సరళీకృతం చేసి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చారు. టీడీపీతో పొత్తు గురించి ఇంకా ఆలోచనలు చేయలేదని అన్నారు. -
అతను కన్నేస్తే.. టీవీఎస్ ఎక్సెల్ మాయం..!
ప్రొద్దుటూరు క్రైం : అతను టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను మాత్రమే నడపగలడు.. గేర్ బైక్‌లను నడపడం చేతకాదు.. ఈ తరహా బైక్‌లను చోరీ చేసినా తీసుకెళ్లడం కష్టమనుకున్న అతను టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను చోరీ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. బుధవారం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. చాపాడు మండలం, వెదురూరు గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్‌బాషా సైకిల్లో పండ్లు పెట్టుకొని గ్రామాలు తిరుగుతూ వ్యాపారం చేసుకునేవాడు. మద్యం తాగనిదే అతనికి నిద్ర వచ్చేది కాదు. పండ్ల వ్యాపారంతో వచ్చే ఆదాయం తాగుడుకు, కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో అతను గ్రామంలోని పలువురి వద్ద అప్పు చేశాడు. అతనికి వి.రాజుపాళెం గ్రామానికి చెందిన గాలం శ్రీనివాసులుతో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. అతను వ్యవసాయం చేస్తాడు. షుగర్ వ్యాధి ఉన్నందున వ్యయసాయ పనులకు వెళ్లడం మానేశాడు. గూడ్స్ ఆటో తీసుకొని ఇద్దరు కలసి కూరగాయల వ్యాపారాన్ని చేసుకునేవారు. సంసారం విషయంలో మనస్పర్థలు రావడంతో హుస్సేన్‌బాషా కొన్ని రోజుల నుంచి భార్యతో విడిపోయి వేరుగా ఉంటున్నాడు. దీంతో ఇటీవల తాగుడుకు బానిస అయ్యాడు. తాగడానికి డబ్బు లేకపోతే శ్రీనివాసులు వద్ద అప్పు తీసుకునేవాడు. ఈ క్రమంలోనే టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను దొంగిలించి సులభంగా డబ్బు సంపాదించాలని అతను భావించాడు. టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిళ్లను చోరీ చేయాలని.. పెద్ద మోటార్ బైక్ అయితే పోలీసులకు రికార్డులు చూపించాల్సి వస్తుందని, చిన్న వాహనం అయితే పోలీసులు రికార్డు అడగరని అతను ఈ నిర్ణయానికి వచ్చాడు. అదీగాక అతనికి టీవీఎస్ ఎక్సెల్ మాత్రమే నడపడం వస్తుంది, పెద్ద బైక్ నడపలేడు. టీవీఎస్ ఎక్సెల్‌లను మాత్రమే చోరీ చేయడానికి అది కూడా కారణమని డీఎస్పీ తెలిపారు. రికార్డులు లేకున్నా చిన్న వాహనాలను పల్లెల్లో సులభంగా అమ్ముకోవచ్చనుకున్న అతను ఈ విషయాన్ని శ్రీనివాసులుకు చెప్పాడు. అందుకు శ్రీనివాసులు కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు. సైడ్ లాక్ వేయని టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిళ్లను మాత్రమే ఎంచుకోవాలని అతను హుస్సేన్‌బాషాకు సూచించాడు. అంతేగాక వైర్లను కట్ చేసి ఎలా స్టార్ట్ చేసుకొని వెళ్లాలో కూడా అతను నేర్పించాడు. అప్పటి నుంచి హుస్సేన్‌బాషా శ్రీనివాసులుతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. పలు స్టేషన్ల పరిధిలో చోరీలు జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో ఇద్దరు టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను చోరీ చేశారు. ప్రొద్దుటూరు టూ టౌన్లో మూడు, వన్‌టౌన్‌లో రెండు, త్రీ టౌన్లో నాలుగు, జమ్మలమడుగులో రెండు, ఎర్రగుంట్లలో రెండు, పోరుమామిళ్లలో మూడు,బద్వేల్లో రెండు వాహనాలను చోరీ చేశారు. వాహన యజమానుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బుధవారం మోడంపల్లె బైపాస్‌రోడ్డులో డీఎస్పీ ఆదేశాల మేరకు టూ టౌన్ ఎస్ఐ మధుమళ్లేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో మైదుకూరు వైపు నుంచి హుస్సేన్‌బాషా, శ్రీనివాసులు వేర్వేరు టీవీఎస్ ఎక్సెల్ వాహనాలపై వచ్చారు. రికార్డులు చూపించమని పోలీసులు అడుగగా తడబడుతూ లేవని చెప్పారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పలు ప్రాంతాల్లో చోరీ చేసినట్లు అంగీకరించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ చేసిన 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో సీఐ ఓబులేసు పాల్గొన్నారు. ఈ కేసులో మంచి ప్రతిభ చూపించిన ఎస్ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
అతి వేగం.. యమపాశం
‘వేగం కన్నా ప్రాణం మిన్న.. అతివేగం ప్రమాదకరం.. హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి’ పోలీసులు నిత్యం చెప్పే సూచనలు ఇవి... అయితే కొందరు వారి సూచనలను పెడచెవిన పెడుతున్నారు... పర్యవసానంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు... ప్రొద్దుటూరు మండలంలో మంగళవారం రెండు బైక్‌లు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ప్రొద్దుటూరు క్రైం : రూరల్ పరిధిలోని ఆర్టీపీపీ రహదారిలో మంగళవారం ఎదురెదురుగా వస్తున్న– వెళ్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డినగర్కు చెందిన జానపాటి నాగసుబ్బయ్య (28), వరకాల నారాయణ (21), ఎర్రగుంట్ల మండలంలోని ఇల్లూరు గ్రామానికి చెందిన ఇల్లూరి గంగరాజు (42), గిత్తగాండ్ల దానమయ్య (38) మృతి చెందారు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ♦ ఈశ్వరరెడ్డినగర్కు చెందిన నాగమయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో నాగసుబ్బయ్య రెండో వాడు. చేనేత పని వీరి జీవనాధారం. కుటుంబ సభ్యులందరూ చేనేత పని చేస్తుంటారు. వీరి ఇంటి పక్కనే వరకాల రామకృష్ణ నివాసం ఉన్నాడు. వీరు కూడా చేనేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు నారాయణతోపాటు ఉదయ్ అనే ఇద్దరు కుమారులు, విజయ, విజయదుర్గ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నారాయణ పట్టణంలోని రాణీతిరుమలదేవి కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పెద్ద చదువులు చదివించి కుమారుడ్ని గొప్ప వాడిగా చూడాలనేది తల్లిదండ్రుల కోరిక. ఎర్రగుంట్ల మండలంలోని ఇల్లూరు గ్రామానికి చెందిన ఇల్లూరి గంగరాజు బేల్దారి పనికి వెళ్తుంటాడు. అతనికి భార్య పుల్లమ్మతోపాటు గంగామహేశ్వరి అనే కుమార్తె ఉన్నారు. అతను రోజూ బేల్దారి పని చేయడానికి ప్రొద్దుటూరు వెళ్తాడు. అదే గ్రామంలోని గిత్తగాండ్ల దానమయ్య ప్రొద్దుటూరుకు చెందిన ఒక వ్యక్తి ట్రాక్టర్‌కు డ్రైవర్‌గా వెళ్తున్నాడు. అతనికి భార్య జ్యోతితోపాటు గ్లోరీ అనే నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. మృత్యువులోనూ వీడని స్నేహం ఈశ్వరరెడ్డినగర్కు చెందిన నాగసుబ్బయ్య, నారాయణ ఇళ్లు పక్కనే ఉండటంతో ఎక్కడికైనా వెళ్లాలంటే ఇద్దరూ కలసి వెళ్తుంటారు. ఈ క్రమంలో కలమల్లలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వెళ్దామని నారాయణ చెప్పడంతో అతనితో కలసి బైక్‌లో నాగసుబ్బయ్య వెళ్లాడు. బేల్దార్ పనికి వెళ్లిన గంగరాజు మ««ధ్యాహ్నం భోజనం చేయడానికి ప్రొద్దుటూరు నుంచి ఇల్లూరుకు బయల్దేరేందుకు ఆర్టీపీపీ రోడ్డులో నిల్చున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న దానమయ్య పని ముగించుకొని బైక్‌లో గ్రామానికి వెళ్తుండగా.. దారిలో ఉన్న గంగరాజు ఆ బైక్ ఎక్కాడు. కలమల్లలో పని ముగించుకున్న నారాయణ ఇంటికి పయనమయ్యారు. అయితే ప్రొద్దుటూరు పెన్నా నది సమీపంలోకి రాగానే.. ముందు వైపు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేశారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న గంగరాజు బైక్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో నాగసుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే డిగ్రీ విద్యార్థి నారాయణ మృతి చెందాడు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు గంగరాజును తిరుపతికి, దానమయ్యను కర్నూలుకు తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే దువ్వూరు సమీపంలోకి వెళ్లగానే దానమయ్య, చాపాడు వద్దకు వెళ్లేలోపు గంగరాజు చనిపోయారు. మిన్నంటిన రోదనలు జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈశ్వరరెడ్డినగర్కు చెందిన మృతుల బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృత్యువాత పడటంతో నారాయణ తల్లిదండ్రులు, చెల్లెలు విజయ బోరున విలపించారు. ‘గొప్ప వాడివి అవుతావని కలలు కన్నానే’ అని చెప్పుకుంటూ తల్లి లక్ష్మీదేవి రోదించింది. ♦ దానమయ్య, గంగరాజు మృతి చెందంతో ఇల్లూరు గ్రామంలో విషాదం నెలకొంది. భార్య పుల్లమ్మ, కుమార్తె గంగామహేశ్వరి గంగరాజు మృతదేహంపై పడి కన్నీరుమున్నీరయ్యారు. ‘నీవు లేకుండా కుమార్తెను ఎలా పోషించుకోవాలా’ అంటూ భార్య విలపించింది. దానమయ్యకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఊహ తెలియని వయసులో తండ్రి మరణించడంతో చిన్నారిని చూసిన వాళ్లు చలించిపోయారు. ఆయన భార్య జ్యోతిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. భర్త మృతదేహం వద్ద రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ♦ ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ నాయకుడు బంగారురెడ్డి, ఇల్లూరు నాయకులు దస్తగిరిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు. -
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ఒక్కరోజు దీక్ష
-
సిరిపురి ‘దేశం’లో.. సీఎం రచ్చ
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చ కెక్కాయి. ఇంతకాలం పరోక్షంగా సాగుతూ వచ్చిన కలహాలు ఇప్పుడు ప్రత్యక్ష పోరుకు రెడీ అన్నట్లు తయారయ్యాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించడంతో పాటు.. తాను పార్టీలో ఉంటానో... లేదో తెలియదని అయితే జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ సహించబోనని వరదరాజులరెడ్డి చెప్పడాన్ని బట్టిచూస్తే ఆయన పార్టీలో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరదరాజులరెడ్డిని పార్టీ ఇన్చార్జి పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలుస్తానని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ప్రకటించారు. అసలు విషయం ఏమిటంటే .. మంగళవారం మున్సిపల్ చైర్మన్ చాంబర్లో వరదరాజులరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీఎం రమేష్‌ను దూషించినదానికంటే కొద్ది నిమిషాల ముందు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మరో ప్రెస్‌మీట్‌కు హాజరయ్యారు. దీనిని బట్టి సీఎం రమేష్‌పై వరద చేసిన దూషణలు జిల్లా అధ్యక్షునికి తెలుసుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనకు టికెట్ రాదని తెలిసే వరద ఈ విమర్శలు చేశాడని లింగారెడ్డి అనడం గమనార్హం. తాజా పరిస్థితిని బట్టి చూస్తే జిల్లాలోని మిగతా నియోజకవర్గాలలాగే ప్రొద్దుటూరులో కూడా తెలుగు తమ్ముళ్ల మధ్య రాజకీయ విభేదాలు రచ్చకెక్కాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజకీయాల్లో తలదూర్చుతున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పోట్లదుర్తిలో ఎలా కాపురం చేస్తాడో చూస్తానని వరద చెప్పడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గత పదేళ్లుగా సీఎం రమేష్ ప్రొద్దుటూరు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను అడ్డుపెట్టుకుని ఇక్కడ తన వ్యూహాన్ని రచిస్తున్నారు. గతంలో రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్టు టెండర్ విషయంలో వరద తనయుడు కొండారెడ్డి, సీఎం రమేష్ సోదరులు స్వయంగా పోటీ పడ్డారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య విభేదాలు ఉన్నాయి. వరద కాలువకు పోటీ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల తాగునీటి కోసం 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుందూ–పెన్నా వరద కాలువను మంజూరు చేశారు. కాంట్రాక్టు పనులు దక్కించుకున్న వరదరాజులరెడ్డి అలైన్మెంట్ మార్చడంతో పనులు ఆగిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మళ్లీ టెండర్లు పిలవగా పనుల కోసం వరద తనయుడితోపాటు పోట్లదుర్తి సోదరులు పోటీ పడ్డారు. చివరికి వరద తనయుడు ఈ పనులు దక్కించుకుని ఇటీవల ప్రారంభించారు. మరో మారు అలైన్మెంట్ మార్చేందుకు యత్నిస్తున్నారు. రైతులు వ్యతిరేకిస్తున్నా పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుందూ–పెన్నా వరద కాలువ నిర్మాణానికి సీఎం రమేష్ అడ్డుతగులుతున్నాడని కాంట్రాక్టర్‌గా ఉన్న వరదరాజులరెడ్డి విమర్శలు చేశారు. పైగా తన ప్రత్యర్థులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాడని విమర్శించడం గమనార్హం. ఇటీవల మున్సిపల్ మాజీ చైర్మన్ వీఎస్ ముక్తియార్ ఏర్పాటు చేసిన మైనారిటీల సభ వెనుక సీఎం రమేష్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే పరోక్షంగా వరద విమర్శలు చేశారు. వర్గాలుగా నేతలు తొలి నుంచి టీడీపీలో ఉన్న లింగారెడ్డిని కాదని గత ఎన్నికల సందర్భంగా వరదరాజులరెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. నాటి నుంచి నేటి వరకు నిత్యం ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఎవరి ఇళ్లలో వారు పార్టీ సమావేశాలు పెట్టుకోవడం, తమకు అనుకూలంగా చెప్పుకోవడం జరిగింది. లింగారెడ్డితోపాటు ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డిలను సీఎం రమేష్ బలపరుస్తుండగా వరదరాజులరెడ్డికి మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అండగా ఉన్నారు. పార్టీ కార్యకర్తల నుంచి ఇన్చార్జిల వరకు ఇరువురి నేతల మధ్య సఖ్యత లేదు. గత ఎన్నికల సందర్భంగా పార్టీ టికెట్ దక్కించుకున్న వరదరాజులరెడ్డి ఎన్నికలో ఓటమి పాలైన తర్వాత ఏడాదికి పార్టీ ఇన్చార్జి పదవిని కూడా దక్కించుకున్నారు. దీంతో లింగారెడ్డి తీవ్ర నిరుత్సాహానికి గురికాగా పార్టీ అధిష్టానం ఆయనకు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఇటీవలే ఆ పదవీకాలం పూర్తి కాగా తనకు పార్టీ ఇన్చార్జి పదవి ఇవ్వాలని లింగారెడ్డి కోరుతున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తామని పార్టీ ముఖ్య నేతలు చెప్పినట్లు కార్యకర్తల సమావేశంలో ఆయన చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో రాజుకున్న పోరు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. -
చంద్రబాబు తూట్లు పొడిచారు
ప్రొద్దుటూరు : చంద్రబాబు నాయుడు రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 127వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం మైదుకూరు రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ భారత జాతి యావత్తుకు ఈ రోజు నిజమైన పండుగ అని అన్నారు. అంబేడ్కర్ చూపిన మార్గంలోనే మనమందరం నడుస్తున్నామని, ఈ జాతికి దిశ, దశ నిర్మించింది ఆయనేనన్నారు. చక్కటి ప్రజాస్వామ్యాన్ని రూపకల్పన చేసిన ఘనత ఆ మహానుభావుడిదేనని తెలిపారు. మంచి ఆశయాలతో రూపకల్పన చేసిన రాజ్యాంగం నేడు కొన్ని ప్రభుత్వాలు, కొందరి నేతల వల్ల పలుమార్లు మరణిస్తోందన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో జరిగిన రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు అంబేడ్కర్ ఆత్మ ఎన్నో మార్లు ఘోషించి ఉంటుందన్నారు. స్వయంగా చంద్రబాబే ఎస్సీ, ఎస్టీ కులంలో జన్మించాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నారంటే అది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మంత్రి ఆది దళితులు అపరిశుభ్రమైన మనుషులని, వారు మారరని మాట్లాడి దళిత జాతిని అవహేళన చేశారన్నారు.ఈ నాయకులకు దళిత ఓట్లు మాత్రం కావాల్సిందేనన్నారు. సింహాసనం ఎక్కడానికి, ఊగడానికి వారి అవసరం మాత్రం ఉంటుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు దళితులు సమాజంలో అభివృద్ధి చెందలేదన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి జీవితాలు పూర్తిగా మారకపోవడం పట్ల విచారం, బాధను వ్యక్తం చేస్తున్నానన్నారు. నేటికీ దళితులు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీ«ధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఆయిల్‌మిల్ ఖాజా, దాదాపీర్, జాఫర్, రఫి, సోములవారిపల్లె శేఖర్, ఎంపీటీసీ సభ్యుడు ఓబుళరెడ్డి, వెల్లాల భాస్కర్, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మల్లికార్జున ప్రసాద్ యాదవ్, మల్లికార్జునరెడ్డి, జింకా విజయలక్ష్మి, రాచంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, కౌన్సిలర్ శివకుమార్ యాదవ్ పాల్గొన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తూ పరాయి పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను డబ్బు పెట్టి కొనుగోలు చేయడంతోపాటు వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. ఇలాంటి నాయకులకు అంబేడ్కర్ లాంటి గొప్ప నేతల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా అర్హులకు దక్కాల్సి ఉందన్నారు. ఇది రాజ్యాంగ హక్కు అని తెలిపారు. అయితే చంద్రబాబు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి అర్హులను పక్కనపెట్టి అనర్హులకు లబ్ధి చేకూర్చుతున్నారని విమర్శించారు. దీనికి ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం రూ.కోట్లు ఖర్చు చేసి ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో వరుసగా అనేక చోట్ల దళితులపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని జానకి పేట గ్రామంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలిచారని టీడీపీ నేతలు దళితులను చెట్టుకు కట్టేసి కొట్టారన్నారు. తాజాగా కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నెలో పారిశుద్ధ్య పనులు చేయలేదని గ్రామ బహిష్కరణ చేశారన్నారు. ఇంతటి నీచమైన చర్యలకు పాల్పడినా ప్రభుత్వం మాత్రం కేసులు నమోదు చేయలేదన్నారు. -
ఆకట్టుకున్న జబర్దస్త్ టీం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక రాయల్ కౌంటీ రిసార్ట్స్‌లో ఆదివారం రాత్రి రాయల్బాష్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ప్రతి ఏడాదిలాగే ఇప్పుడు కూడా అట్టహాసంగా ఏ ర్పాటు చేశారు. సినీ హాస్యనటుడు తాగుబోతు రమేష్, జబర్దస్త్ టీం వేణు, ధన్‌రాజ్, రేడియో జాకీలు కాజల్, చైతు తమ హాస్యంతో ప్రేక్షకులను అలరించారు. కిరాక్ కబడ్డీ మహిళా ఆర్టిస్ట్‌లు, సినీ సింగర్లు, డీ డాన్స్ ప్రోగ్రాం కొరియోగ్రాఫర్ శ్రీను టీం చేసిన నృత్యాలు యువతను ఉర్రూత లూగించాయి. నేపాల్‌కు చెందిన కళాకారులు అబ్బురపరిచే విన్యాసాలు చేశారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి అందరికి పంచారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో రాయల్ కౌంటీ రిసార్ట్స్ ఎండీ జంపాల మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్లు పగిడి రఘునాథరెడ్డి, రాకేష్‌రెడ్డి, ఆపరేషన్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మోహన్ మలావత్, మార్కెటింగ్ చీఫ్ పాతకోట రాఘవరెడ్డి, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఫారెస్ట్ ఆఫీసులో డిష్యుం.. డిష్యుం
ప్రొద్దుటూరు క్రైం : డివిజనల్ ఫారెస్ట్ అధికారి సమక్షంలోనే ఓ ఉద్యోగి మరో ఉద్యోగిపై దాడికి యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉమామహేశ్వరరావు వనిపెంట అటవీ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే ప్రొద్దుటూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉండటంతో ఏడాది నుంచి ఇక్కడే పని చేస్తున్నాడు. మరో సీనియర్ అసిస్టెంట్ షేక్ మహబూబ్‌బాషా 2015 నుంచి డివిజన్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఒక ఫైల్ కనిపించలేదనే విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ రోజు నుంచి ఇద్దరికి ఒకరంటే మరొకరికి పడ దు. అప్పటి డీఎఫ్ఓ బదిలీ కావడంతో ఈ ఏడాది ఆగస్టులో గురుప్రభాకర్ డీఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టారు. డీఎఫ్ఓ బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత ఉమామహేశ్వరరావు సెలవులో వెళ్లాడు. ఈ క్రమంలో సెలవు ముగించుకొని అతను సోమవారం విధుల్లో చేరడానికి వచ్చాడు. వనిపెంటలో రిపోర్టు చేసుకోవాలని డీఎఫ్ఓ చెప్పారు. డీఎఫ్ఓ సమక్షంలోనే... మహబూబ్‌బాషా చెప్పడం వల్లనే డీఎఫ్ఓ తనను వనిపెంటకు వెళ్లమన్నాడని ఉమామహేశ్వరరావు భావించాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం సమయంలో డీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లాడు. బయటి నుంచే దూషిస్తూ కార్యాలయంలోకి వెళ్లడంతో మహబూబ్‌బాషా, రఫితో పాటు తోటి ఉద్యోగులు అతన్ని నచ్చచెప్పి ఇంటికి పంపించారు. ఈ వ్యవహారం అంతటితో సద్దుమణిగిందని ఉద్యోగులందరూ భావించారు. అయితే అదే రోజు రాత్రి 7.30 సమయంలో ఉమామహేశ్వరరావు పెన్నానగర్లో ఉన్న మునెయ్య, నరేష్, నాజీర్, సుబ్బరాయుడు అనే నలుగురు వ్యక్తులను తీసుకొని డీఎఫ్ఓ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడున్న మహబూబ్బాషాపైకి దాడికి యత్నిం చాడు. అతను తప్పించుకొని డీఎఫ్ఓ కార్యాలయంలోకి పరుగెత్తాడు. ఉమామహేశ్వరరావును వారించడానికి డీఎఫ్ఓ ప్రయత్నించగా అతను వినిపించుకోలేదు. కొంత సేపు కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్‌బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుమల్లేశ్వరరెడ్డి తెలిపారు. -
ఏమే..నేను పిలిస్తే బయటికి రావా..
ప్రొద్దుటూరు క్రైం : ‘ఏమే..నేను పిలిస్తే బయటికి రావా.. ఎంత అహంకారం నీకు’ అంటూ అతను నోటికి వచ్చినట్లు ఆమెను దూషించాడు. అంతటితో ఆగక పక్కనే ఉన్న వాకిలి గడప చెక్కతో కొట్టి గాయ పరిచాడు. ఈ సంఘటన ప్రొద్దుటూరు మండలంలోని మీనాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని బుగ్గపట్నం సుబ్బరాయుడుకు భార్య పద్మావతితోపాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సుబ్బరాయుడు బేల్దారి పనికి వెళ్తుండగా పద్మావతి గ్రామంలో కొందరి బట్టలు ఉతుకుతుంటుంది. రజకులు కావడంతో వారు కుల వృత్తిని వదులుకోలేదు. ఈ క్రమంలో గ్రామంలోని ఫైనాన్సియర్ శివకృష్ణ శుక్రవారం సాయంత్రం ఇస్త్రీ బట్టలు తీసుకొని రమ్మని చెప్పడంతో.. ఇంట్లో ఉన్న ఒక జత బట్టలను పద్మావతి తన కుమార్తె నందిని చేత పంపించింది. ‘నేను బట్టలు తీసుకొని రమ్మని చెప్పింది మీ అమ్మను కదా .. నువ్వెందుకు వచ్చావు’ అని అతను నందినితో అన్నాడు. ‘వెంటనే మీ అమ్మను రమ్మని చెప్పు’ అని బాలికతో చెప్పి పంపించాడు. విచక్షణా రహితంగా చితక బాదాడు కొద్ది సేపటి తర్వాత శివకృష్ణ ఆమె ఇంటి వద్దకు వచ్చి బయటికి రా అంటూ అరిచాడు. పద్మావతి బయటికి రాగా పక్కనే ఉన్న వాకిలి గడప చెక్క తీసుకొని ఆమె చెయ్యిపై కొట్టడంతో రక్త గాయాలు అయ్యాయి. నడి వీధిలో తనకు అవమానం జరిగిందని భావించిన పద్మావతి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఉన్న మాత్రలను పొడి చేసుకొని మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పద్మావతి ఫిర్యాదు మేరకు శివకృష్ణపై శనివారం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. -
ఆశలన్నీ జగన్‌పైనే..
ప్రజలందరూ వైఎస్ జగన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు.. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేసిన ఆయనను వివిధ వర్గాల నాయకులు, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, కర్షక సంఘాల నేతలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, రైతులు, వృద్ధులు, కార్మికులు కలసి పలు సమస్యలు విన్నవించారు. బాధలు చెప్పుకున్నారు.. అగచాట్లు వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలవారికీ మేలు చేస్తానని హామీ ఇచ్చారు.. సుభిక్ష పాలన అందిస్తానని భరోసా ఇచ్చారు.. నవరత్నాలతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందని ధైర్యాన్ని ఇచ్చారు. దీంతో ప్రజలంతా ఆయన హామీలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సువర్ణపాలన కోసం ఎదురుచూస్తున్నారు. ఎర్రగుంట్ల/ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే ఉపాధ్యాయులకు మేలు .. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే మా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రధాన సీపీఎస్ పద్ధతి రద్దు చేసి పాత పింఛన్ పద్ధతిని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాదయాత్రలో వైఎస్ జగన్‌కు వినతులు అందించారు. వైఎస్ఆర్ హయాంలోనే వృత్తి విద్య ఉపాధ్యాయులు రెగ్యులర్ అయ్యారు. – తుపాకుల చంద్ర ఓబుళరెడ్డి ( వృతి విద్య ఉపాధ్యాయుడు, ఎర్రగుంట్ల) ఆయనొస్తే సమస్యలు పరిష్కరిస్తారు.. జగన్ అధికారంలోకి రాగానే 108, 104, వైద్య సిబ్బంది సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని మాకు విశ్వాసం ఉంది. పాదయాత్రలో జిల్లా వ్యాప్తంగా 108, 104 వైద్య సిబ్బంది వచ్చి జగన్‌కు విన్నవించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. – వీరమోహన్‌రెడ్డి ( 108 వాహన పైలెట్, ఎర్రగుంట్ల) జగన్‌తోనే కాంట్రాక్టు కార్మికులకు వెలుగులు.. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని జగన్‌కు విన్నవించాం. ప్రభుత్వంలోకి రాగానే కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో మా కార్మికులకు ఎంతో సంతోషం కల్గింది. 15 ఏళ్ల నుంచి విద్యుత్ రంగంలో చాలీచాలని జీతాలతో కార్మికులు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తే కార్మికుల కుటుంబాలలో వెలుగులు వస్తాయి. – నారాయణరెడ్డి ( వైఎస్ విద్యుత్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ, ఆర్టీపీపీ) రూ.2 వేలు పింఛన్ ఇస్తానన్నారు.. మా ఊరు జమ్మలమడుగు నియోజకవర్గం నక్కోనిపల్లి. ప్రొద్దుటూరులోని అమృతానగర్‌లో నా కుమార్తె బాలలక్షుమ్మ వద్ద ఉంటున్నా. రెండు రోజుల క్రితం జగన్‌బాబు ఇక్కడికి వచ్చాడు. పింఛన్ రూ.2వేలు చేస్తానవ్వా అని చెప్పాడు. ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి అయితే కచ్చితంగా రూ.2వేలు చేస్తాడనే నమ్మకం ఉంది. నక్కో గోపెమ్మ, వృద్ధురాలు సీపీఎస్ రద్దు చేస్తారన్న నమ్మకం ఉంది.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే సీపీఎస్ రద్దు చేస్తారన్న నమ్మకం ఉంది. ఎంతో మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు సీపీఎస్ విధానంతో తీవ్రంగా నష్టపోతున్నారు. జగన్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. చాలా సంతోషం. అందుకే ఆయనను కలిసి కృతజ్ఞతలు చెప్పాం. – ఉపేంద్ర, యూటీఎఫ్ జిల్లా కౌన్సిలర్ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తారన్న భరోసా ఉంది.. అ«ధికార పార్టీ సీమకు చేస్తున్న ద్రోహాన్ని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు వివరించాను. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని కోరాను. వైఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని కోరాను. ఈ విషయాలను ప్రస్తావించి వినతి పత్రం ఇచ్చాను. అధికారంలోకి వచ్చాక ఉక్కు ఫ్యాక్టరీని 6 నెలల్లో ప్రారంభిస్తానని జగన్ చెప్పారు. ఆయనపై నమ్మకం ఉంది. – హరిత, రాయలసీమ విద్యార్థి శక్తి రాష్ట్ర కార్యదర్శి -
ఐదు రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, ప్రొద్దుటూరు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదో రోజు(శనివారం) ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు వద్ద ముగిసింది. పాదయాత్రలో భాగంగా పొట్లదుర్తి, ప్రొద్దుటూరు ప్రజలతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. పరిసర గ్రామాలలో అభిమానులు, కార్యకర్తలు నీరాజనలు పలికారు. మహిళలు వైఎస్ జగన్‌కు రోడ్లపై పూలు చల్లి, హారతులు పడుతూ, కుంకుమలు పెట్టి తమ సోదరుడిల భావించి రక్షబంధనం కట్టి తాము వేసిన ముగ్గులతో స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొట్లదుర్తి శివారు నుంచి ఐదో రోజు యాత్రను మొదలు పెట్టారు. ఆయన వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడి నుంచి ప్రొద్దుటూరు అయ్యప్ప గుడి మీదుగా పుట్టపర్తి సర్కిల్‌కు చేరుకున్నారు. ఐదో రోజు పాదయాత్ర అనంతరం సాయి శ్రీ వెంచర్(హౌసింగ్ బోర్డు) సమీపంలో రాత్రి బస చేస్తారు. ఇవాళ ఆయన 13 కిలోమీటర్ల మీద పాదయాత్ర చేశారు. ఇక ఆరోరోజు పాదయాత్రను వైఎస్ జగన్ సాయిశ్రీ నగర్ నుంచి ఆరంభించనున్నారు. -
ప్రజాసంకల్పయాత్ర ఆరోరోజు షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆరో రోజు షెడ్యూల్ విడుదల అయింది. ఆదివారం ఉదయం ఆయన ప్రొద్దుటూరు నియోజకవర్గం సాయిశ్రీ నగర్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. ఆరోరోజు యాత్ర అమృతనగర్,చెన్నమ్మపేట, కమననూరు, రాధా నగర్ మీదగా నేలటూరు క్రాస్‌రోడ్డులో భోజన విరామం, ఎర్రబల్లి క్రాస్ రోడ్డు, దువ్వూరు మీదగా సాగుతుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దువ్వూరు జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో వైఎస్ జగన్ బస చేస్తారు. కాగా అయిదోరోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన ఇవాళ (శనివారం) 13 కిలోమీటర్లు యాత్ర చేశారు. -
బాధలు వింటూ, సమస్యలు తెలుసుకుంటూ..
సాక్షి, ప్రొద్దుటూరు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన మహిళలను, అభిమానులను పలకరిస్తూ ముందుకు కదిలారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. ఎర్రగుంట్ల - ప్రొద్దుటూరు రోడ్డు నుంచి ఆయన ఈరోజు ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడ నుంచి పొట్లదుర్తికి చేరుకునే సరికి వేలాది మంది పాదయాత్రలో జగన్ అడుగులో అడుగయ్యారు. పొట్లదుర్తిలో జగన్ ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరేశారు. వాల్మీకి - బోయ సంఘాలు పాదయాత్రలో ఆయనను కలిసి తమను ఎస్టీల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులు, ఆర్బీఎస్కే ఉద్యోగులు, 108 ఉద్యోగులు, వీఆర్ఏల ప్రతినిధులు, ఏపీ ట్రాన్స్‌కో, జెన్ కో ఉద్యోగులు కలుసుకున్నారు. వారి బాధలు వింటూ, సమస్యలు తెలుసుకున్నారు. జగన్ వారికి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే వికలాంగులు, వృద్థులు రాజన్నబిడ్డను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆయన అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి స్వాగతం పలికారు. -
పేలుతున్న ఐపీ బాంబులు
ప్రొద్దుటూరు క్రైం : పసిడిపురిగా పేరు పొందిన ప్రొద్దుటూరులో నమ్మకం పైనే రోజూ రూ.కోట్లలో వ్యాపారం జరుగుతోంది. నమ్మకమే పెట్టుబడిగా పెట్టి రూ. కోట్లు ఆర్జించిన వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కేవలం నమ్మకం మీదనే ఇక్కడ నిత్యం రూ. లక్షలు విలువ చేసే బంగారు చేతులు మారుతుంది. ఇందుకు చిన్న చిత్తు కాగితం మినహా వారి మధ్య ఎలాంటి ప్రామిసరి నోట్లు ఉండవు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఐపీ పెట్టే వారి సంఖ్య ఎక్కువ కావడంతో నమ్మకానికి తూట్లు పడుతున్నాయి. ప్రొద్దుటూరులో సుమారు 2500కి పైగా బంగారు దుకాణాలు, వర్క్ షాపులు ఉన్నాయి. వ్యాపారులు 1200 మంది, స్వర్ణకారులు 5700 మంది ఉన్నారు. రోజూ ఇక్కడ సుమారు రూ. 5–6 కోట్ల పైబడి వ్యాపారం జరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్లో అయితే రెట్టింపు వ్యాపారం ఉంటుంది. బంగారు ఆభరణాలు తయారు చేయడానికి కొందరు ముందుగానే డబ్బు ఇవ్వగా, ఇంకొందరు వస్తువులు తయారు చేసిన తర్వాత ఇస్తారు. ఇక్కడి చిన్న చిన్న వ్యాపారులు రూ. లక్షలు విలువ చేసే బంగారు నగలను హోల్‌సేల్ వ్యాపారుల నుంచి తీసుకొని 15–20 రోజుల తర్వాత నగదు ఇస్తుంటారు. పైసా పెట్టుబడి పెట్టకుండానే కొందరు వ్యాపారులు రూ. లక్షలు వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల ఐపీ పెట్టేవారి సంఖ్య ఎక్కువ కావడంతో వ్యాపారుల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది. వీరిలో బంగారు వ్యాపారులు ఎక్కువగా ఉండటంతో తమ వ్యాపారాలపై ప్రభావం పడే అవకాశముందని పలువురు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. హోల్‌సేల్ వ్యాపారుల వద్దనే కాకుండా ప్రజలు ఆర్డర్ ఇచ్చిన బంగారుతో కొందరు వ్యాపారులు ఉడాయించిన సంఘటనలు ఇటీవల అనేకం చోటు చేసుకున్నాయి. పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నా ఐపీ పెట్టే సమయంలో కొందరు వారి కుటుంబ సభ్యుల పేరుతో బదలాయిస్తున్నారు. మొయిన్బజార్ కూడలిలో చాలా కాలం నుంచి ఉన్న ఒక బంగారు వ్యాపారి సుమారు రూ. 15 కోట్లతో ఇటీవల ఐపీ పెట్టాడు. సుమారు 25 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నందున చాలా మంది అతనికీ బాకీ ఇచ్చారు. రామేశ్వరానికి చెందిన మరో బంగారు వ్యాపారి కూడా కొన్ని నెలల క్రితం సుమారు 17 కోట్లతో ఉడాయించాడు. ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో పట్టణంలోని పలువురు పోలీసు అధికారులు ఇతనికి రూ. లక్షల్లో నగదు ఇచ్చారు. ∙పాత మార్కెట్ వెనుక వైపు ఉన్న ఒక బంగారు వ్యాపారి ఇటీవల బాకీలు చేసి పరారయ్యాడు. సుమారు రూ. 2.5 కోట్ల దాకా పలువురికి బాకీ ఉన్నట్లు తెలుస్తోంది. ∙బంగారు వ్యాపారంతోపాటు చిటీల వ్యాపారం చేస్తున్న ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని నలుగురు అన్నదమ్ములు 50 మంది వద్ద చిటీల పేరుతో సుమారు రూ.3 కోట్లు మేర బాకీ చేసి పరారయ్యారు. వన్‌టౌన్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ∙మోక్షగుండం వీధిలోని స్వర్ణకారుడు ఇటీవల మూడు నెలల క్రితం రూ. 3 కోట్లకు ఐపీ పెట్టాడు. ∙మెయిన్‌బజార్‌లో బంగారు వ్యాపారం చేస్తున్న ముగ్గురు అన్నదమ్ములు రూ. 6 కోట్లకు ఐపీ దాఖలు చేశారు. ∙సుందరాచార్యుల వీధిలో డార్నింగ్ సెంటర్ నిర్వహిస్తున్న టైలర్ ఇటీవల రూ. 1.30 కోట్లకు ఐపీ పెట్టి పారిపోయాడు. ∙హోమస్‌పేటలో సీట్ కార్నర్ నిర్వాహకుడు, సుందరాచార్యుల వీధిలో తండ్రీ కొడుకులు, మైదుకూరు రోడ్డులోని మిల్లు యజమాని, గాంధీరోడ్డులోని ఫ్యాన్సీ సెంటర్ నిర్వాహకుడు రూ. కోట్లలో బాకీలు చేసి ఐపీ దాఖలు చేశారు. పట్టణంలో చిట్టీల నిర్వహణ పేరుతో చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు. పోలీస్స్టేషన్లకు రాని మోసం, ఐపీ కేసులు ప్రొద్దుటూరులో వందల్లో ఉన్నాయి. 119 మంది దాకా ఏడాదిలో సుమారు రూ.112 కోట్లు ఐపీ పెట్టినట్లు పోలీసు వర్గాల సమాచారం. -
కదిలిస్తే.. కన్నీళ్లే..
ప్రొద్దుటూరు క్రైం : అగ్రిగోల్డ్.. ఒకప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట.. తక్కువ కాలంలో రెట్టింపు మొత్తం వస్తుందనే ఆశతో జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది రూ.లక్షల్లో ఈ సంస్థలో డిపాజిట్ చేశారు. ఇప్పుడు ఆ సంస్థ చేతులెత్తేయడంతో అటు డిపాజిట్ దారులు.. ఇటు ఏజెంట్లు నిలువునా మోసపోయి లబోదిబో మంటున్నారు. న్యాయం చేయండంటూ అధికారులు, పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. జిల్లాలో 2.5 లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు ఉన్నట్లు తెలుస్తోంది. 1995లో కడప, ప్రొద్దుటూరులలో అగ్రిగోల్డ్ బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. తర్వాత కొంత కాలానికి మరో ఐదు ప్రాంతాల్లో బ్రాంచీలు వెలిశాయి. తక్కువ కాలంలో రెట్టింపు మొత్తం వస్తుందనే ఆశతో జిల్లా వ్యాప్తంగా రూ. లక్షల్లో డిజిపాట్లు చేశారు. ఇందులో రోజు వారి కలెక్షన్, నెలకు ఒక సారి చెల్లించే డిపాజిట్లు ఉన్నాయి. ఇవే గాక ఎస్ఎస్పీ–1, ఎస్ఎస్పీ–2 ఒకే సారి చెల్లించే డిపాజిట్లు, రెండు రూపాయల వడ్డీతో చెల్లించే పీఎస్పీ స్కీంతో పాటు ఆర్ఎఫ్పీ, ఎఫ్‌సీ 36, జీఎఫ్‌పీ లాంటి స్కీములు ఉన్నాయి. సీఐడీ లెక్కల ప్రకారం జిల్లాలో లక్షా 18 వేల మంది డిపాజిట్ దారులు ఉన్నారు. వీరికి రూ. 125 కోట్లు రావాల్సి ఉంది. అయితే సీఐడీ అధికారుల లెక్కలు తప్పుల తడక అని పలువురు అగ్రిగోల్డ్ ఏజెంట్లు, అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 2.5 లక్షల మంది డిపాజిట్‌దారులు ఉన్నారని, సుమారు రూ.500 కోట్లకు పైగా వారికి డబ్బు రావాల్సి ఉందని అంటున్నారు. మా డబ్బు ఎవరు ఇస్తారు.. అగ్రిగోల్డ్ సంస్థ మూత పడినప్పుడు ఒత్తిళ్లు అధికం కావడంతో చాలా మంది ఏజెంట్లు సొంతంగా డబ్బు చెల్లించారు. వడ్డీకి తెచ్చి కొందరు, ఆస్తులు విక్రయించి ఇంకొందరు ఏజెంట్లు డిపాజిట్ దార్లకు డబ్బు కట్టారు. అయితే డబ్బు చెల్లించిన ఖాతాదారులు బాండ్ల పరిశీలనకు రావడం లేదని ఏజెంట్లు వాపోతున్నారు. కొందరైతే బాండ్లు, రశీదులు, బ్యాంకు పాస్‌బుక్కులు ఇస్తున్నారని, అయితే డబ్బులు వారి అకౌంట్లో పడితే తమకు ఎలా వస్తాయని ఏజెంట్లు ఆవేదన చెందుతున్నారు. ఇలా జిల్లాలో చాలా మంది ఏజెంట్లు చేతి నుంచి డబ్బు చెల్లించారని, వారికి న్యాయం చేయాలని పలువురు ఏజెంట్లు కోరుతున్నారు. రశీదులు లేవు.. బాండ్లు కనిపించలేదు.. అగ్రిగోల్డ్ మూత పడి దాదాపు మూడేళ్లు దాటింది. డబ్బు వస్తుందో రాదో అనే అనుమానంతో చాలా మంది రశీదులను పక్కన పడేశారు. కొందరైతే బాండ్లను కూడా చిత్తు కాగితాల్లో కలిపేశారు. అయితే ఇప్పుడు సీఐడీ బాండ్ల పరిశీలన చేస్తుండటంతో అవి కనిపించక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. రశీదులు ఉన్న మేరకే మొత్తాన్ని పోలీసులు నమోదు చేసుకుంటున్నారు. దీంతో డబ్బులు వస్తాయో రావోనని కొందరు మహిళలు రోదిస్తున్నారు. తక్కువ రోజుల్లో రెండింతలు ఇస్తామనడంతో కూడబెట్టిన డబ్బును కట్టగా నిలువునా ముంచేశారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు చేసినా నేటికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని ఆందోళన చెందుతున్నారు. అప్లోడ్ చేయడంలో ఎన్నెన్నో కష్టాలు డిపాజిట్‌దారులు వెబ్సైట్లో 10 శాతం మంది మాత్రమే అప్లోడ్ చేసుకున్నారు. కేవలం 12 వేల మంది మాత్రమే ఏడాది క్రితం తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు పోలీసు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గతంలో చాలా మందికి తెలియకపోవడంతో వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోలేదు. బాండ్ల పరిశీలన చేస్తూనే మిగిలిన డిపాజిట్‌దారుల పేర్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్లో పేర్ల నమోదు చేపట్టలేదు. దీంతో ఖాతాదారులు నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నెట్ సెంటర్లలో అప్లోడ్ చేసినందుకు గాను రూ.50 వసూలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో పేర్ల నమోదుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఉండదని అగ్రిగోల్డ్ ఖాతాదారులు కోరుతున్నారు. పోలీస్స్టేషన్లలోనే అప్లోడ్ చేయాలి అన్ని జిల్లాల్లో పోలీస్స్టేషన్లలోనే అగ్రిగోల్డ్ డిపాజిటర్ల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. నెట్ సెంటర్లకు వెళ్లాలంటే మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా స్టేషన్లలోనే పేర్లను నమోదు చేయాలి. కంప్యూటర్లను, సిబ్బందిని పెంచితే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. – మాకం నాగేశ్వరావు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి. అగ్రిగోల్డ్ కస్టమర్ ఐడీని పరిగణనలోకి తీసుకోవాలి చాలా మంది వద్ద రశీదులు, బాండ్లు లేవు. రశీదులు ఉన్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటామంటే ఎలా. అగ్రిగోల్డ్ కస్టమర్ ఐడీలో చూస్తే ఎంత మొత్తం చెల్లించారో çస్పష్టంగా తెలుస్తుంది. బాధితులకు న్యాయం చేయాలంటే అగ్రిగోల్డ్ కంపెనీ డేటా ఆధారంగా వివరాలు సేకరించాలి. – జహీర్, డిపాజిటర్, ప్రొద్దుటూరు. మేం కట్టిన డబ్బు ఎవరు ఇస్తారు..? ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో చేతి నుంచి రూ.5 లక్షలు దాకా డిపాజిటర్లకు చెల్లించాను. బాండ్ల పరిశీలనకు రమ్మని చెబితే చాలా మంది రాలేమని చెబుతున్నారు. కొందరైతే బాండ్లు, బ్యాంకు అకౌంట్ బుక్కులు ఇస్తున్నారు. డబ్బు వారి బ్యాంకు ఖాతాలో జమ అయితే మాకు ఎలా వస్తుంది. అధికారులు మాకు న్యాయం జరిగేలా చూడాలి. – వీరవనజ, ఏజెంటు, వీరపునాయునిపల్లి. ఆన్లైన్లో 12 వేల మందికి పైగా నమోదు సాక్షి, కడప: జిల్లాలోని అన్ని మండలాల నుంచి అగ్రిగోల్డ్‌లో పెట్టుబడి పెట్టిన బాధితులు ఆన్లైన్లో నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు మైదుకూరు, పులివెందుల, ప్రొద్దుటూరు, కడప, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల నుంచి సుమారు 12 వేల మందికి పైగా ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. జిల్లాలోని మీ–సేవ సెంటర్లతోపాటు ఆన్లైన్ కేంద్రాల్లో అగ్రిగోల్డ్ బాధితుల నమోదు ప్రక్రియ సాగుతోంది. అయితే చాలాచోట్ల ఆన్లైన్ ప్రక్రియకు సంబంధించి సర్వర్లు పనిచేయక, సంబంధిత వెబ్సైట్ ఓపెన్ కాక బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సబ్ డివిజన్లలో పరిశీలన జిల్లాలోని ఆరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో పరిశీలన ప్రక్రియ సజావుగా సాగుతోంది. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ ఇప్పటికే అగ్రిగోల్డ్ బా«ధితులు తమ వద్ద ఉన్న రశీదులు, బాండ్లను తీసుకొచ్చి ఆధారాలు చూపించాని కోరిన నేపథ్యంలో అన్నిచోట్ల బారులు తీరుతున్నారు. కొన్నిచోట్ల రోజుకు కొన్ని మండలాలకు సంబంధించిన బాధితులు రావాల్సిందిగా ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసులు చార్టులు వేయడంతో....అందరూ ఒకేసారి వచ్చి తోసుకోకుండా క్రమ పద్ధతి ›ప్రకారం పరిశీలన చేస్తున్నారు. శనివారం నాటికి 1600 మందికి పైగా పరిశీలన పూర్తయింది. -
సా...గుతోంది..!
►ఏడాది దాటినా.. పూర్తికాని పల్స్ సర్వే ►కడప, ప్రొద్దుటూరులలో సర్వేకు దూరంగా 24 వేల కుటుంబాలు సాక్షి కడప: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ సర్వే జిల్లాలో కొనసాగుతోంది. ఏడాది దాటినా పూర్తికాలేదు. ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కూడా పల్స్ ఆధారంగానే సంక్షేమాన్ని అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో సర్వే కీలకమనే చెప్పాలి.2016 జులై 7వ తేదీ ప్రారంభమైన పల్స్ సర్వే కార్యక్రమాన్ని అప్పట్లో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని నడిపించినా తర్వాత ఆలస్యం అవుతూ వస్తోంది. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ పనిచేయక.. ట్యాబ్‌లు గంటల తరబడి ఒపెన్ కాకపోవడం లాంటి సమస్యలతో సర్వే అనుకున్న స్థాయిలో సాగలేదు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరులో ప్రస్తుతం పల్స్ సర్వే కొనసాగుతోంది. కడపలో సుమారు14 వేలు..ప్రొద్దుటూరులో 10 వేల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ప్రస్తుతం అడ్రసులు డోర్‌లాక్.. వలస వెళ్లినవారితో పాటు మరికొన్ని కుటుంబాలు అందుబాటులోకి వస్తే సర్వే పూర్తి కానుంది.çసుమారు 2088 మంది ఎన్యూమరేటర్లు, 200 మంది సూపర్వైజర్లు ఉన్నారు. సిబ్బంది, ట్యాబ్‌లు ఉన్నా సర్వే మాత్రం ముందుకు సాగడం లేదు. -
ఏడాది నుంచి మూతే..
ప్రొద్దుటూరు క్రైం : ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు.. కానీ ఒక్క రోజు కూడా పని చేయలేదు. కార్యాలయం ఎప్పుడూ మూతపడి ఉండటాన్ని చూసిన ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. గత ఏడాది జూలై 28న ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో జాతీయ పొగాకు నియంత్రణ ఆధ్వర్యంలో ‘పొగాకు ఉత్పత్తుల వాడకం, అలవాట్లు మాన్పించు కేంద్రాన్ని’ ప్రారంభించారు. దేశంలో ఈ కార్యక్రమం 100 జిల్లాల్లో ప్రారంభం కాగా అందులో కడప జిల్లాకు సంబంధించి ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. బీడీ, గుట్కా, సిగరేట్లకు బానిసైన వారిని ఈ కేంద్రానికి తీసుకొని వస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మాన్పించడానికి వైద్యాధికారులు కృషి చేస్తారు. ఇందుకోసం ఒక నోడల్ అధికారి, ఇద్దరు కౌన్సెలర్లు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఆ రోజు నుంచి ఒక్క రోజు కూడా కౌన్సెలింగ్ కేంద్రాన్ని అధికారులు తెరవలేదు. ప్రత్యేకంగా సిబ్బందిని కూడా కేటాయించలేదు. కౌన్సెలింగ్ కోసం తమ వారిని పిలుచుకొని వస్తున్న ప్రజలు అక్కడికి వచ్చి నిరాశతో వెనుతిరిగి వెళ్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పోలీసు పరువు తీశారు
►అధికార పార్టీ నేతల ఆశ్రయం పొందాల్సిందే.. ►లేకుంటే వారానికే బదిలీ! ►ప్రొద్దుటూరులో విచ్చలవిడి పెత్తనం ప్రొద్దుటూరు : కేవలం తనను ప్రసన్నం చేసుకోలేదనే కోపంతో విధుల్లో చేరిన వారానికే ఏకంగా డీఎస్పీని బదిలీ చేయించారంటే టీడీపీ ప్రభుత్వ పరిపాలన ఏవిధంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని బట్టి ప్రొద్దుటూరులో శాంతిభద్రతల పరిస్థితి ఏవిధంగా ఉందో కళ్లకు కట్టినట్లు అర్ధమవుతోంది. సాధారణంగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు అధికారుల బదిలీలు చేయించడం సహజం. అయితే పోలీసు శాఖకు ఇందులో మినహాయింపు ఉంటుంది. ఏకంగా ప్రస్తుతం డివిజనల్ స్థాయి అధికారినే తనను కలవలేదనే సాకుతో వచ్చిన వెంటనే వెనక్కి పంపడం టీడీపీ పాలనకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. భయపడుతున్న అధికారులు జిల్లాలో కడప తర్వాత ప్రొద్దుటూరు ప్రధాన కేంద్రం. వ్యాపారవర్గాల ప్రభావం ఎంత ఉందో అంతేస్థాయిలో అసాంఘిక కార్యకలాపాలు కూడా నడుస్తున్నాయి. ప్రొద్దుటూరు ప్రాంతాన్ని చూసి గతంలో చాలామంది అధికారులు ఇక్కడికి బదిలీపై రావాలని కోరుకునే పరిస్థితి ఉండగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అయితే బాబోయ్ మాకొద్దు అనే పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే ఇటీవలి కాలంలో ఖాళీల భర్తీలో జాప్యం జరుగుతూ వచ్చింది. గత డీఎస్పీ నీలం పూజిత వరకు ఎప్పటికప్పుడు డీఎస్పీలు బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రభావం వారిపై పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ వరకు డీఎస్పీగా నీలం పూజిత బాధ్యతలు నిర్వహించారు. పలు సందర్భాల్లో తమ మాట వినలేదని ఆ అధికారిపై కూడా అధికారపార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో సీఎం తనయుడు లోకేష్‌బాబుపై స్థానిక నేతలు డీఎస్పీని బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఆ అధికారి బదిలీ అయి ఆరు నెలలు దాటినా మరో అధికారిని ఇక్కడ ప్రభుత్వం నియమించలేకపోయింది. స్థానిక అధికారపార్టీ నేతల పెత్తనం పెరగడంతోపాటు వారి వర్గ విభేదాలు ఇందుకు ముఖ్యకారణమయ్యాయి. ఇటీవలి కాలంలో ప్రొద్దుటూరు పరిధిలో చోటుచేసుకున్న వరుస హత్యలు, దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు ఎట్టకేలకు డీఎస్పీగా ఆర్ల శ్రీనివాసులును ఈ నెల 14న నియమించారు. మంచి ప్రాంతమని ఆయన ఎంతో ఆసక్తితో ఇక్కడ విధుల్లో చేరారు. వారంరోజుల్లోనే తిరుగుముఖం విధుల్లో చేరి వారంరోజులు కాకమునుపే స్థానిక అధికార పార్టీ నేతలు తమను డీఎస్పీ కలవలేదని స్వయంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాత్రికి రాత్రే ఆదివారం ఆ అధికారికి బదిలీని బహుమానంగా ఇచ్చారు. ఇంతటి కీలకస్థాయి అధికారి పరిస్థితే ఇలావుంటే ఎస్ఐ, సీఐ స్థాయి అధికారుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అన్ని స్టేషన్లలో అధికారపార్టీ నేతలు విచ్చలవిడిగా పెత్తనం చేస్తున్నారు. పోలీస్స్టేషన్లలో అధికారపార్టీ అయితే ఓ న్యాయం, ఇతర పార్టీలైతే మరో న్యాయం జరుగుతోంది. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించిన సమావేశంలో ఆర్డీఓ వినాయకంపై దౌర్జన్యం చేసినా, ఫర్నీచర్ ధ్వంసం చేసినా, రాళ్లు రువ్వినా ఎలాం టి చర్యలు లేవు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారే కానీ, కౌన్సిలర్లు కళ్ల ముందు తిరుగుతున్నా, పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాలు చేసినా అరెస్టు చేయలేకపోయారు. మూడు నెలల తర్వాత వారు తీరిగ్గా అరెస్టు కాకుండా బెయిల్ తెచ్చుకోవడం గమనార్హం. ప్రొద్దుటూరుకు బదిలీపై వస్తున్న అధికారుల వివరాల సమాచారం తెలుసుకునే ముందు వారికి అధికారపార్టీ నాయకుల ఆశీర్వాదం ఉందా లేదా అని ప్రజలు చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. వారి ఆశీర్వాదం ఉంటేనే ఇక్కడికి వచ్చి విధులు నిర్వహించే పరిస్థితి ఉంటుందని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రొద్దుటూరుకు మరో డీఎస్పీని ఎప్పుడు నియమిస్తారో వేచిచూడాల్సి ఉంది. టీడీపీ నేతలనే డీఎస్పీ సీట్లో కూర్చోబెట్టండి సీఎం ద్వారా జీఓ విడుదల చేయించి ఏకంగా టీడీపీ నేతలనే డీఎస్పీ సీట్లో కూర్చోబెడితే సరిపోతుందని వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి తెలిపారు. డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు బదిలీ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే టీడీపీ నేతలకు నచ్చడం లేదన్నారు. తమకు సెల్యూట్ చేయాలని, అనుగ్రహం పొందాలని టీడీపీ నేతలు కోరుకోవడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని విమర్శించారు. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రొద్దుటూరు చరిత్రలో ఎన్నడూ ఈ విచిత్రమైన పరిస్థితి నెలకొనలేదన్నారు. ఆ ఘనత అధికార పార్టీ నేతలకే దక్కుతుందని విమర్శించారు. -
ప్రొద్దుటూరుపై సీఎం రమేష్ కన్ను
- వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగేందుకు అడుగులు - లింగారెడ్డి స్నేహంతో వరదకు చెక్ పెట్టే వ్యూహం - రమేష్ జోక్యంపై మండిపడుతున్న వరద - ప్రొద్దుటూరు టీడీపీలో తీవ్రం కానున్న వర్గపోరు సాక్షి ప్రతినిధి, కడప: రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు సీఎం రమేష్ ప్రొద్దుటూరు శాసనసభ స్థానం మీద కన్నేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు మెల్లగా అడుగులు వేస్తున్నారు. పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మల్లెల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి తెలివిగా పావులు కదుపుతున్నారు. సీఎం రమేష్ కుటుంబం చిత్తూరు జిల్లాలో సారా వేలం పాటల వ్యాపారం చేస్తున్న సమయంలో చంద్రబాబుతో ఏర్పడిన పరిచయం వీరి మధ్య స్నేహంగా మారింది. అప్పటి నుంచి వ్యాపారాలు, ఇతర వ్యవహారాల్లో బాబుకు చేదోడుగా ఉంటూ వచ్చిన సీఎం రమేష్ 1995లో చంద్రబాబు సీఎం అయ్యాక కొన్నేళ్ల పాటు చక్రం తిప్పారు. ఆ తర్వాత తెర మీద కనిపించకుండా చంద్రబాబుతో స్నేహం నడిపిన సీఎం రమేష్ 2012లో హఠాత్తుగా రాజ్యసభ సభ్యుడి పదవి సంపాదించారు. టీడీపీకి చావోరేవో అనేలా జరిగిన 2014 ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన పార్టీ అధికారంలోకి రావడంతో చంద్రబాబుతో ఉన్న చనువును అనుకూలంగా మలచుకుని జిల్లా పార్టీ మీద, అధికార యంత్రాంగం మీద తన ఆధిపత్యం చూపేందుకు పావులు కదుపుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి వచ్చే ఏడాది మార్చితో సీఎం రమేష్‌కు రాజ్యసభ సభ్యుడి పదవి గడువు ముగుస్తోంది. ఆ ఏడాది చివరలోగానీ, 2019లో గానీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకుంటున్న సీఎం రమేష్ ప్రొద్దుటూరు స్థానం మీద కన్ను వేశారు. ఇక్కడ లింగారెడ్డి, వరదరాజులరెడ్డి మధ్య ఉన్న విభేదాలను తన రాజకీయ వ్యూహానికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. లింగారెడ్డితో సన్నిహితంగా మెలుగుతూ ముందుగా వరదరాజులురెడ్డిని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అభ్యర్థుల జాబితాలోనే లేకుండా చేయడానికి ఎత్తులు వేస్తున్నారు. ఇందులోభాగంగానే నియోజక వర్గంలో సొంతంగా కార్యక్రమాలు చేస్తూ మద్దతుదారులను తయారు చేసుకునే పనిలో పడ్డారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వరదరాజులరెడ్డి మద్దతుదారుడు ఆసం రఘురామిరెడ్డికి చెక్ పెట్టడానికి సీఎం రమేష్ తెరచాటు ప్రయత్నాలు చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో నేరుగా సీఎం జోక్యం చేసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరద మద్దతుదారుడు ఆసం రఘురామిరెడ్డిని చైర్మన్‌ను చేయక తప్పలేదు. రంజాన్ సందర్భంగా సీఎం రమేష్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజును రప్పించారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డికి ఆహ్వానం పంపకుండా తన కనుసన్నల్లో ఈ కార్యక్రమం నడిపించారు. ఇఫ్తార్‌కు వరద, ఆయన మద్దతుదారులు డుమ్మా కొట్టి తమకు ఆహ్వానం లేనందువల్లే హాజరుకాలేదనీ, సీఎం రమేష్ వర్గ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని నేరుగానే విమర్శలు చేశారు. ఈ పరిణామాలన్నింటి కారణంగా సీఎం రమేష్‌కు వరద రాజులురెడ్డికి మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. పోట్లదుర్తిని కలిపేస్తే ? ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా స్థాయి పెంచి తన స్వగ్రామం పోట్లదుర్తిని ఇందులో కలిసేలా చేయాలని సీఎం రమేష్ ఆలోచన చేస్తున్నారు. ఈ పని చేయించగలిగితే ప్రొద్దుటూరు నియోజకవర్గం మీద తన జోక్యాన్ని ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి వస్తుందనేది ఆయన ఆలోచన. మున్సిపాలిటీ పరిధిలోని పేదలందరికీ ఇళ్లు (హౌస్ ఫర్ ఆల్) పథకం కింద రెండు వేల ఇళ్లు మంజూరయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిల్లో తనకున్న పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి 7వేల ఇళ్లు మంజూరు చేయించేందుకు సీఎం రమేష్ ప్రయత్నిస్తున్నారు. వీటిలో 5వేల ఇళ్లు తన సొంత గ్రామం పోట్లదుర్తికి సమీపంలో నిర్మించి తన వారి నందరినీ పట్టణ పరిధిలో ఓటర్లుగా చేర్పించేందుకు వ్యూహం రచిస్తున్నారు. మంజూరైంది 2 వేల ఇళ్లే అయినా 7 వేల ఇళ్ల కోసం అధికారుల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు çపంపించేలా చేశారు. ఇటీవల మున్సిపల్ పరిపాలన విభాగం డైరెక్టర్ (డీఎంఈ) కన్నబాబు ప్రతిపాదిత భూమిని పరిశీలించి వెళ్లారు. ముందుగా వరదరాజులరెడ్డిని జీరో చేయడం, నియోజక వర్గంలో తన పట్టు పెంచుకుంటే, ఎన్నికల నాటికి లింగారెడ్డిని కూడా పోటీ జాబితా నుంచి తప్పించి శాసనసభ టిక్కెట్ సంపాదించుకోవచ్చనే దిశగా సీఎం రమేష్ పావులు కదుపుతున్నారని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరదరాజులు, లింగారెడ్డి మధ్య రాజకీయ పోరు నడుస్తున్న ప్రొద్దుటూరు టీడీపీలో భవిష్యత్‌లో ముక్కోణపు రాజకీయ పోరాటం తప్పని పరిస్థితి కనిపిస్తోంది. బాబుకు చేదోడుగా ఉంటూ వచ్చిన సీఎం రమేష్ 1995లో చంద్రబాబు సీఎం అయ్యాక కొన్నేళ్ల పాటు చక్రం తిప్పారు. ఆ తర్వాత తెర మీద కనిపించకుండా చంద్రబాబుతో స్నేహం నడిపిన సీఎం రమేష్ 2012లో హఠాత్తుగా రాజ్యసభ సభ్యుడి పదవి సంపాదించారు. టీడీపీకి చావోరేవో అనేలా జరిగిన 2014 ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన పార్టీ అధికారంలోకి రావడంతో చంద్రబాబుతో ఉన్న చనువును అనుకూలంగా మలచుకుని జిల్లా పార్టీ మీద, అధికార యంత్రాంగం మీద తన ఆధిపత్యం చూపేందుకు పావులు కదుపుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి వచ్చే ఏడాది మార్చితో సీఎం రమేష్‌కు రాజ్యసభ సభ్యుడి పదవి గడువు ముగుస్తోంది. ఆ ఏడాది చివరలోగానీ, 2019లో గానీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకుంటున్న సీఎం రమేష్ ప్రొద్దుటూరు స్థానం మీద కన్ను వేశారు. ఇక్కడ లింగారెడ్డి, వరదరాజులరెడ్డి మధ్య ఉన్న విభేదాలను తన రాజకీయ వ్యూహానికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. లింగారెడ్డితో సన్నిహితంగా మెలుగుతూ ముందుగా వరదరాజులురెడ్డిని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అభ్యర్థుల జాబితాలోనే లేకుండా చేయడానికి ఎత్తులు వేస్తున్నారు. ఇందులోభాగంగానే నియోజక వర్గంలో సొంతంగా కార్యక్రమాలు చేస్తూ మద్దతుదారులను తయారు చేసుకునే పనిలో పడ్డారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వరదరాజులరెడ్డి మద్దతుదారుడు ఆసం రఘురామిరెడ్డికి చెక్ పెట్టడానికి సీఎం రమేష్ తెరచాటు ప్రయత్నాలు చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో నేరుగా సీఎం జోక్యం చేసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరద మద్దతుదారుడు ఆసం రఘురామిరెడ్డిని చైర్మన్‌ను చేయక తప్పలేదు. రంజాన్ సందర్భంగా సీఎం రమేష్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజును రప్పించారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డికి ఆహ్వానం పంపకుండా తన కనుసన్నల్లో ఈ కార్యక్రమం నడిపించారు. ఇఫ్తార్‌కు వరద, ఆయన మద్దతుదారులు డుమ్మా కొట్టి తమకు ఆహ్వానం లేనందువల్లే హాజరుకాలేదనీ, సీఎం రమేష్ వర్గ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని నేరుగానే విమర్శలు చేశారు. ఈ పరిణామాలన్నింటి కారణంగా సీఎం రమేష్‌కు వరద రాజులురెడ్డికి మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. పోట్లదుర్తిని కలిపేస్తే ? ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా స్థాయి పెంచి తన స్వగ్రామం పోట్లదుర్తిని ఇందులో కలిసేలా చేయాలని సీఎం రమేష్ ఆలోచన చేస్తున్నారు. ఈ పని చేయించగలిగితే ప్రొద్దుటూరు నియోజకవర్గం మీద తన జోక్యాన్ని ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి వస్తుందనేది ఆయన ఆలోచన. మున్సిపాలిటీ పరిధిలోని పేదలందరికీ ఇళ్లు (హౌస్ ఫర్ ఆల్) పథకం కింద రెండు వేల ఇళ్లు మంజూరయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిల్లో తనకున్న పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి 7వేల ఇళ్లు మంజూరు చేయించేందుకు సీఎం రమేష్ ప్రయత్నిస్తున్నారు. వీటిలో 5వేల ఇళ్లు తన సొంత గ్రామం పోట్లదుర్తికి సమీపంలో నిర్మించి తన వారి నందరినీ పట్టణ పరిధిలో ఓటర్లుగా చేర్పించేందుకు వ్యూహం రచిస్తున్నారు. మంజూరైంది 2 వేల ఇళ్లే అయినా 7 వేల ఇళ్ల కోసం అధికారుల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు çపంపించేలా చేశారు. ఇటీవల మున్సిపల్ పరిపాలన విభాగం డైరెక్టర్ (డీఎంఈ) కన్నబాబు ప్రతిపాదిత భూమిని పరిశీలించి వెళ్లారు. ముందుగా వరదరాజులరెడ్డిని జీరో చేయడం, నియోజక వర్గంలో తన పట్టు పెంచుకుంటే, ఎన్నికల నాటికి లింగారెడ్డిని కూడా పోటీ జాబితా నుంచి తప్పించి శాసనసభ టిక్కెట్ సంపాదించుకోవచ్చనే దిశగా సీఎం రమేష్ పావులు కదుపుతున్నారని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరదరాజులు, లింగారెడ్డి మధ్య రాజకీయ పోరు నడుస్తున్న ప్రొద్దుటూరు టీడీపీలో భవిష్యత్‌లో ముక్కోణపు రాజకీయ పోరాటం తప్పని పరిస్థితి కనిపిస్తోంది. -
సోదరి వివాహేతర సంబంధమే కారణం
-
సోదరి వివాహేతర సంబంధమే కారణం
- ప్రొద్దుటూరులో ప్రసాద్‌రెడ్డి హత్య కేసు ప్రొద్దుటూరు క్రైం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘లైవ్ మర్డర్’ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మారుతిప్రసాద్‌రెడ్డి హత్యకు.. అతని సోదరి వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని డీఎస్పీ భక్తవత్సలం చెప్పారు. ప్రొద్దుటూరులో కోర్టు వాయిదాకు వచ్చిన మారుతి ప్రసాద్‌రెడ్డిని ప్రత్యర్థులు పట్టపగలు నడిరోడ్డుపై వేట కొడవళ్లతో వెంటాడి నరికి చంపిన సంఘటన తెలిసిందే. ఈ కేసులో నిందితులైన రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలను పోలీసులు శుక్రవారం సాయంత్రం శ్రీదేవి ఫంక్షన్ హాల్లో మీడియా ముందు హాజరుపరిచారు. డీఎస్పీ భక్తవత్సలం యువకుడి హత్యకు దారితీసిన కారణాలను వివరించారు. ‘‘దేవగుడికి చెందిన బోరెడ్డి మారుతీ ప్రసాద్‌రెడ్డి(34) సోదరి అనూరాధ ప్రొద్దుటూరులో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. శాస్త్రినగర్‌లో ఉంటున్న ఆమెతో అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై ఆమె, చంద్రశేఖర్‌రెడ్డి భార్య నిర్మల తరచూ గొడవ పడేవారు. ఈ విషయంలో అనూరాధ సోదరుడు మారుతి ప్రసాద్‌రెడ్డి తలదూర్చి నిర్మలను బెదిరించడంతో 2014లో కేసు నమోదైంది. ఏడాది క్రితం నిర్మల కుమారుడు వెంకటతనూజ్ కుమార్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే మారుతి ప్రసాద్‌రెడ్డే అతన్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడన్న అనుమానం నిర్మల కుటుంబసభ్యుల్లో నెలకొంది. అప్పటినుంచి మారుతిప్రసాద్‌రెడ్డిని చంపాలని వారు పథకం పన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లో ఉన్న సొమ్మంతా మారుతిప్రసాద్‌రెడ్డి ద్వారా అనూరాధకిస్తూ తమ సోదరి నిర్మల కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆయన బావలైన రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డి అనుకున్నారు. ఇలాగే వదిలేస్తే ఉన్న ఆస్తిని మారుతిప్రసాద్‌రెడ్డి కాజేస్తాడనే ఉద్దేశంతో రెండు నెలలక్రితం అతన్ని చంపాలని పథకం పన్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి.. ఏప్రిల్ 18న రఘునాథరెడ్డి, పట్నం ధరణి, వెంకటరమణలను అరెస్ట్ చేసి రిమాండుకు పంపించారు. వీరు ఈనెల 19న బెయిల్‌పై విడుదల య్యారు. వీరు జైల్లో ఉండగా మారుతిప్రసాద్‌రెడ్డి తన ఇంటికొచ్చి తలుపు తట్టాడని, తనతోపాటు కుటుంబసభ్యులందర్నీ చంపడానికి అతను పథకం పన్నాడని నిర్మల తన సోదరులకు చెప్పడమేగాక మారుతిప్రసాద్‌రెడ్డిని చంపితే మనం ఈ గండం నుంచి గట్టెక్కవచ్చంది. ఈ నేపథ్యంలో 2014లో నమోదైన కేసుకు సంబంధించి కోర్టులో హాజరవడానికి మారుతిప్రసాద్‌రెడ్డి వస్తాడని పసిగట్టిన ప్రత్యర్థులు ముందస్తు పథకం ప్రకారం అతన్ని దారుణంగా నరికిచంపారు’’ అని డీఎస్పీ వివరించారు. మరో నలుగురి ప్రమేయంపైనా విచారిస్తున్నాం.. హత్య చేశాక నిందితులు పోలీసులకు లొంగిపోయారని డీఎస్పీ తెలిపారు. వారి నుంచి రెండు వేటకొడవళ్లు, మోటర్‌బైకు, రక్తపు గుడ్డలు స్వాధీనం చేసుకున్నా మని వివరించారు. ఇందులో మరో నలుగురి పాత్ర ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. సీఐ ఓబులేసు, ఎస్ఐలు కృష్ణంరాజునాయక్, శివశంకర్, చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు. (నడిరోడ్డుపై దారుణహత్య) -
‘చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగింది’
-
‘చంద్రబాబు కనుసన్నల్లోనే ప్రజాస్వామ్యం ఖూనీ’
వైఎస్ఆర్ జిల్లా: ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని పోలీసులు చూస్తు ఉండిపోయారని ఎమ్మెల్యే రాచమల్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కౌన్సిలర్‌ను రూ.50 లక్షలకు కొనేందుకు జిల్లా మంత్రి సిద్ధపడ్డారని ఆరోపించారు. అయితే ఆ ప్రలోభాలకు కౌన్సిలర్లు లొంగకపోవడంతో ఎన్నికను వాయిదా వేయించారన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో టీడీపీ నేతలు రౌడీయిజం చేశారని, తమపై దాడికి యత్నించారన్నారు. ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండా పోయిందని రాచమల్ల అన్నారు. టీడీపీ నేతల పన్నాగాలు తీవ్రంగా బాధించాయని, ప్రజాస్వామ్యం ఏమవుతుందో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు. కాగా అధికార టీడీపీ నేతలు తీవ్ర దౌర్జన్యపూరితంగా వ్యవహరించడంతో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వరుసగా రెండోరోజూ (ఆదివారం) కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. మున్సిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు కావాల్సిన బలం తమకు లేకపోవడంతో అధికార టీడీపీ మరోసారి హైడ్రామాకు తెరతీసింది. చైర్మన్ పదవిని సొంతం చేసుకునేందుకు కావాల్సినంత కౌన్సిలర్ల బలమున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి రౌడీయిజానికి, దౌర్జన్యానికి దిగింది. ఎన్నికను అడ్డుకోవడమే లక్ష్యంగా వరుసగా నిన్న కూడా టీడీపీ కౌన్సిలర్లు విధ్వంసాలకు దిగారు. -
చెప్పుతో కొట్టుకొని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నిరసన!
టీడీపీ దౌర్జన్యంపై తీవ్ర ఆగ్రహం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆయన ఓ ప్రజాప్రతినిధి.. ఎమ్మెల్యే. పట్టపగలు ప్రజాస్యామ్యాన్ని ఖూనీ చేస్తుంటే తట్టుకోలేకపోయారు. అధికార పార్టీ నేతలు, అధికారులు అంతా కలిసి వ్యవస్థను నాశనం చేస్తుంటే.. తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురయ్యారు. ఈ దుర్మార్గాన్ని ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ తనను తాను చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. ఆయనే ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడానికి మరోసారి టీడీపీ డ్రామా ఆడటం, అధికారులు అందుకు వత్తాసు పలుకడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యానికి అధికారులు లొంగిపోవడాన్ని తప్పుబట్టారు. పోలీసులు, అధికారుల తీరును తప్పుబడుతూ.. తనను తాను చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను తీవ్రంగా ఎండగట్టిన ఆయన.. ఈ ఎన్నిక నిర్వహించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆయన మండిపడ్డారు. చైర్మన్ పదవికి కావాల్సిన మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఉన్నా కావాలనే ఎన్నికను టీడీపీ వాయిదా వేయించిందని ఆరోపించారు. టీడీపీ నేతల కుట్రలకు అధికారులు మద్దతు పలుకడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచే దమ్ములేకే టీడీపీ రౌడీయిజానికి దిగిందని మండిపడ్డారు. తమకు 26మంది కౌన్సిలర్ల బలముందని తెలిపారు. ‘అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారు.. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేశారు’ అని ఆయన మండిపడ్డారు. -
ప్రొద్దుటురులో పేట్రేగిన ‘పచ్చ’ రౌడీయిజం!
-
ప్రొద్దుటురులో పేట్రేగిన ‘పచ్చ’ రౌడీయిజం!
మరోసారి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా తీవ్ర నిరసన తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు వైఎస్ఆర్ జిల్లా: అధికార టీడీపీ నేతలు తీవ్ర దౌర్జన్యపూరితంగా వ్యవహరించడంతో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వరుసగా రెండోరోజూ వాయిదా పడింది. మున్సిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు కావాల్సిన బలం తమకు లేకపోవడంతో అధికార టీడీపీ మరోసారి హైడ్రామాకు తెరతీసింది. చైర్మన్ పదవిని సొంతం చేసుకునేందుకు కావాల్సినంత కౌన్సిలర్ల బలమున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి రౌడీయిజానికి, దౌర్జన్యానికి దిగింది. ఎన్నికను అడ్డుకోవడమే లక్ష్యంగా వరుసగా రెండోరోజు ఆదివారం కూడా టీడీపీ కౌన్సిలర్లు విధ్వంసాలకు దిగారు. కౌన్సిలర్లకు మద్దతుగా ఏకంగా మంత్రులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులతో టీడీపీ నేతలు విస్తృత మంతనాలు జరిపారు. వారి ఒత్తిళ్లకు, రౌడీయిజానికి తలొగ్గిన అధికారులు మరోసారి ఎన్నికను వాయిదా వేశారు. పట్టపగలు పచ్చనేతల రౌడీయిజానికి తలొగ్గి అధికారులు ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ దారుణంపై ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఎన్నిక జరపాల్సిందేనంటూ కౌన్సిల్ హాల్లో అధికారులకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. ప్రసాద్‌రెడ్డిని పక్కకు తోసేసి మరీ అధికారులను పోలీసులు బయటకు తీసుకెళ్లారు. అధికారులు, పోలీసులు, టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే ప్రసాద్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. -
మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్‌కుమార్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ వైస్ చైర్మన్, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపల్ చైర్మన్, గుంటూరు జిల్లా మాచెర్ల మున్సిపల్ చైర్మన్, తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్‌తో పాటు ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏపీ మున్సిపల్ యాక్టు 1965 రూల్ 3 ప్రకారం ఎన్నిక ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఈ నెల 11న ఎన్నికకు నోటీసులు ఇవ్వనున్నారు. 15న ఉదయం 11 గంటలకు ఎన్నిక ఉంటుందని వివరించారు. కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లిన కమిషనర్... ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి సోమవారం కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లారు. ఎన్నిక నిర్వహణకు సంబంధించి ప్రొసిడింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్‌ను నియమించే అవకాశం ఉంది. జాయింట్ కలెక్టర్ 11న నోటిఫికేషన్ విడుదల చేసి, 15న మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. మార్చి 7న మున్సిపల్ చైర్మన్‌గా ఉండేల గురివిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను మార్చి 27న కౌన్సిల్ ఆమోదించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అధికారులు చైర్మన్ రాజీనామాను పంపడంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఊహించిన దాని కంటే ముందుగా... చైర్మన్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలకు కనీసం నెల రోజులు అయినా పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే కేవలం 18 రోజుల గడువులోనే విడుదల కావడంతో అందరూ ఉహించిన దాని కంటే ముందుగానే ఎన్నిక జరగనుంది. -
మైలవరానికి ఆగిన గండికోట నీరు
మైలవరం: గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి నీటి విడుదలను నిలిపివేశారు. ఈ నెల 5 నుంచి 18 వరకు దాదాపు 0.728 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 0.935 టీఎంసీలు నిల్వ ఉంది. దక్షిణ కాలువకు జనవరి 27 నుంచి 80 క్యూసెక్కుల మేర నీరు విడుదల అవుతోంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, పరిసర ప్రాంతాల దాహార్తిని తీర్చుటకు నీటిని విడుదల చేస్తున్నారు. మైలవరం, వేపరాల, దొమ్మరనంద్యాల, మోరగుడి గ్రామాలకు ఉత్తర కాలువ ద్వారా పెన్నానది లోకి 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. -
శతావధాని సీవీ సుబ్బన్నకు ఘన నివాళి
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన శతావధాని కడప వెంకటసుబ్బన్నకు సోమవారం సాహితీవేత్తలు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం వేకువజామున హైదరాబాద్‌లోని తన కుమార్తె ఇంటిలో మృతిచెందిన సీవీ సుబ్బన్న భౌతికాయాన్ని సాయంత్రం 6.30 ప్రాంతంలో ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు రామేశ్వరం బైపాస్‌రోడ్డులోని హిందూ స్మృతివనంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనేకమంది ఆయన భౌతికాయాన్ని సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు నరాల బాలిరెడ్డి, చెన్నా వెంకటసుబ్బన్న తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు. -
ట్రాక్టర్ ఢీకొని స్కూటరిస్టు దుర్మరణం
ముద్దనూరు(యరగుంట్ల): యర్రగుంట్ల–ప్రొద్దుటూరు రహదారిలో గురువారం ట్రాక్టర్ ఢీకొని స్కూటర్లో ప్రయాణిస్తున్న గడ్డంవారి బాషా (50) దుర్మరణం చెందాడు. యర్రగుంట్ల ఎస్ఐ వెంకటనాయుడు సమాచారం మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన గడ్డంవారి బాషా, షబ్బీర్‌లు యర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరుకు మోటర్‌సైకిల్‌లో ప్రయాణిస్తున్నారు. వెనుకవైపు నుంచి మోటర్‌సైకిల్‌ను అధిగమించడానికి ప్రయత్నిస్తూ ట్రాక్టర్ మోటర్‌సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బాషా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. షబ్బీరు స్వల్పగాయాలపాలయ్యాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
తాగునీటికీ అధికార రంగు
⇒ ప్రొద్దుటూరులో తీవ్ర నీటి ఎద్దడి ⇒ ప్రజల తరఫున ఎమ్మెల్యే పోరుబాట ⇒ సమస్య పరిష్కారానికి అధికారుల చర్యలు ⇒ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునే పన్నాగంలో టీడీపీ నేతలు తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కూడా టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమారు... ప్రొద్దుటూరులో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది... ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రజల తరఫున పోరుబాట పట్టారు... ఇక్కడి పరిస్థితిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు... ఇందుకు స్పందించిన కలెక్టర్ శుక్రవారం ప్రొద్దుటూరు వచ్చి పరిశీస్తానని చెప్పారు... సమస్య పరిష్కారమైతే ఎమ్మెల్యేకు పేరు వస్తుందని టీడీపీ నేతలు భావించారు... ఇందులో భాగంగానే కలెక్టర్ ప్రొద్దుటూరు రాకుండా వారు కుయుక్తులు పన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు... అంతేకాకుండా సమస్య పరిష్కారమైతే పేరు, ప్రతిష్టను అధికార పార్టీ ఖాతాలో వేసే దిశగా అడుగులు వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వందేళ్ల చరిత్ర ఉంది. అయితేనేం ఇప్పుడు ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులు ఉండగా సుమారు 2 లక్షలకు పైగా జనాభా నివాసం ఉంటున్నారు. వేసవి వచ్చిందంటే పట్టణ వాసులకు నీటి తిప్పలు తప్పడం లేదు. ఏటా పరిస్థితి ఇలాగే ఉండగా.. ఈ ఏడాది చలికాలంలోనే నీటి సమస్య తలెత్తింది. ఏటా వేసవిలో కలెక్టర్ అనుమతితో మైలవరం జలాశయం నుంచి నీరు కొద్దో గొప్పో తెచ్చుకొని సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం కల్పిస్తున్నారు. శాశ్వతంగా నీరు విడుదల చేసేందుకు జీఓ లేకపోవడంతో కలెక్టర్ దయాదాక్షిణ్యాలపై ఆధార పడాల్సి వస్తోంది. ఈ ఏడాది సమస్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో మైలవరం నుంచి నీరు విడుదల చేసినా ఫలితం లేకుండా పోయింది. కారణం అధికారులు కొత్త మార్గం నుంచి నీరు తీసుకురావడమే. ఎక్కువ దూరం పెన్నానదిలో తీసుకురావడంతో మధ్యలోనే అధిక భాగం నీరు ఇంకిపోయాయి. మున్సిపాలిటీలో అవసరమైన నిధులు ఉన్నా సమస్య పరిష్కారంలో పాలక వర్గంతోపాటు అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యపై దృష్టి సారించిన ఎమ్మెల్యే పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో నేతలపై ఒత్తిడి పెరిగింది. వార్డు కౌన్సిలర్ల నుంచి ఎమ్మెల్యే వరకూ అందరికీ సమస్యను ప్రజలు విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ముందుగా అధికారులు, పాలక వర్గం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈనెల 13న మున్సిపల్ కార్యాలయం వద్ద 24 గంటలపాటు జల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు అధికార యంత్రాంగం ద్వారా ఒత్తిడి తెచ్చారు. కేసులకు బెదరకుండా ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు తమ నిరసన తెలిపారు. చివరికి పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించారు. ఈ కేసులకు తాము భయపడబోమని, సమస్యను పరిష్కరించని పక్షంలో ప్రొద్దుటూరు నుంచి కలెక్టరేట్‌కు పాదయాత్ర చేసి ముట్టడిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. పాదయాత్ర ఈ నెల 27న ప్రారంభిస్తానని ప్రకటించారు. నీటి సమస్యను పాలకపక్షంతోపాటు అధికారుల కళ్లకు కట్టినట్లు చెప్పాలనే ఆలోచనతో.. గత సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నీటి ఎద్దడి తీవ్రతను వారికి వివరించా,రు. వాస్తవానికి ఎమ్మెల్యే చాలా కాలం తర్వాత కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. తర్వాత జిల్లాలోని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, నలుగురు ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన గురువారం కలెక్టర్ కె.వి.సత్యనారాయణను కలిసి సమస్య తీవ్రతను వివరించారు. సమస్యను పరిశీలించి, పరిష్కరించేందుకు ప్రొద్దుటూరు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ శుక్రవారం ప్రొద్దుటూరు వస్తున్నట్లు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కలెక్టర్ పర్యటన వాయిదా వెనుక కారణాలేంటో... కలెక్టర్ శుక్రవారం ప్రొద్దుటూరు వస్తారని, ఆయన రాకతోనైనా నీటి సమస్య పరిష్కారమవుతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రాదరెడ్డితోపాటు పట్టణ ప్రజలు ఎంతగానో ఆశించారు. అయితే 24 గంటలు కాకముందే కలెక్టర్ పర్యటన వాయిదా పడింది. అదే సమయంలో మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డితోపాటు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి తదితరులు శుక్రవారం కడపలో కలెక్టర్‌ను కలిసి నీటి సమస్యపై విన్నవించారు. అలాగే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి త్వరలో ప్రొద్దుటూరుకు నీరు వస్తుందని తెలిపారు. అధికార పార్టీ నేతల ప్రభావంతోనే కలెక్టర్ పర్యటన వాయిదా పడిందని వైఎస్సార్సీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కలెక్టర్ శుక్రవారం ప్రొద్దుటూరు వస్తే ఎమ్మెల్యే రాచమల్లుకు పేరు వస్తుందని టీడీపీ నేతలు భావించి, ఇలా చేశారని వారు ఆరోపిస్తున్నారు. వీరి వైఖరి వల్ల సమస్య పరిష్కారంలో మరింత జాప్యం జరుగుతోందని విమర్శిస్తున్నారు. ఇంత కాలం నీటి సమస్య గురించి పట్టించుకోకుండా.. తీరా కలెక్టర్ వస్తున్న నేపథ్యంలో ఇలా చేయడం ఏమిటిని ప్రశ్నిస్తున్నారు. -
తెలంగాణ మద్యం స్వాధీనం
ప్రొద్దుటూరు క్రైం: తెలంగాణా రాష్ట్రానికి చెందిన 22 బీర్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ ఫణీంద్ర తెలిపారు. శివాలయం వీధి సమీపంలో టంగుటూరి సత్యనారాయణ, పసుపల రమేష్‌కుమార్ అనధికారికంగా మద్యం విక్రయాలు చేస్తున్నారని సమాచారం రావడంతో గురువారం ఈఎస్టీఎఫ్ సీఐ రామ్మోహన్, ఎస్ఐ మహేంద్ర దాడి చేశారు. దాడిలో 22 బీర్ సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండుకు తరలించామని చెప్పారు. -
కళ్లలో కారం చల్లి నగలు అపహరణ
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక బొల్లవరంలోని పద్మావతి కంట్లో కారం పొడి చల్లి ఓ వ్యక్తి 7 తులాల మేర ఉన్న బంగారు నగలను దోచుకొని వెళ్లాడు. పద్మావతి దివ్యాంగురాలు. ఆమె నడవ లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రాత్రి ఓ వ్యక్తి ప్రవేశించి కళ్లలో కారం పొడి చల్లాడు. వెంటనే పెట్టెలో ఉన్న బంగారు నగలను తీసుకొని పారిపోయాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గుమి కూడారు. అప్పటికే నిందితుడు పారిపోయాడు. కాగా రెండు రోజుల నుంచి వారికి బాగా పరిచయమున్న ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చి పోయేవాడని, అతనే బంగారాన్ని తీసుకొని వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. విషయం తెలియడంతో త్రీ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. పద్మావతి చెప్పిన వివరాల మేరకు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు అరెస్టు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణ దాహార్తి తీర్చాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం 10 గంటలకు జలదీక్ష ప్రారంభించిన ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డిని పోలీసులు మళ్ళీ అరెస్టు చేశారు. ఆదివారం అర్థరాత్రి పోలీసు బలగంతో దీక్షా శిబిరాన్ని బలవంతంగా తొలగించిన విషయం విదితమే. అయితే ఆయన సోమవారం ఉదయం తన అనుచరులతో వచ్చి మున్సిపల్ కార్యాలయం ఎదుట జలదీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్ష మంగళవారం ఉదయం 10 గంటలకు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే దీక్ష ప్రారంభించిన కాసేపటికే పెద్దఎత్తున పోలీసులు వచ్చి ఆయనను బలవంతంగా అరెస్టు చేశారు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే రాచమల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద జల దీక్ష చేపట్టారు. మంగళవారం ఉదయం 10 గంటల వరకు వేలాది మంది మద్దతుతో దీక్ష చేయనున్నారు. ప్రధానంగా ప్రతి ఏటా మైలవరం డ్యాం నుంచి టీఎంసీ నీటిని పెన్నానదిలోకి విడుదల చేసేందుకు శాశ్వత జీఓను విడుదల చేయాలని, కుందూ పెన్నా వరద కాలువ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని, చెన్నమరాజుపల్లె సమీపం నుంచి రామేశ్వరం హెడ్ వాటర్ వర్క్స్ వరకు పైపులైన్ ద్వారా వరద నీటిని తరలించాలని, తాత్కాలికంగా సమస్య పరిష్కారం కోసం పట్టణంలోని 40 వార్డులకు రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన దీక్షకు మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి మద్దతు పలికారు. అర్థరాత్రి పోలీసులు, అధికారుల హడావుడి ప్రొద్దుటూరు నీటి సమస్యలపై ఆదివారం అర్థరాత్రి నుంచి జలదీక్ష చేయాలని ఎమ్మెల్యే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అర్ధరాత్రి మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి, పోలీసులు జలదీక్షా శిబిరాన్ని బలవంతంగా తొలగించేందుకు వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చేపట్టనున్న 24 గంటల జలదీక్షా శిబిరాన్ని తొలగించే యత్నం చేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పెద్ద ఎత్తున వచ్చారు. నీళ్లు ఇవ్వలేని అధికారులు సిగ్గు లేకుండా శిబిరాన్ని ఎలా తొలగిస్తారంటూ కమిషనర్‌ను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్‌రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఒక్క సారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మా ఇళ్ల వద్దకు వచ్చి ప్రజలు బూతులు తిడుతున్నారని, మీ ఇళ్లల్లో మినరల్ వాటర్‌తో నీళ్లు పోసుకుంటూ ప్రజల గురించి ఆలోచించరా అని నాయకుడు బంగారురెడ్డి అన్నారు. వంద కోట్లు మున్సిపాలిటీలో పెట్టుకొని ప్రజలకు పది రోజులకు ఒక సారి కూడా నీళ్లు ఇవ్వలేరా అని శాసనసభ్యుడు రాచమల్లు అన్నారు. వన్‌టౌన్ సీఐ బాలస్వామిరెడ్డి, ఎస్ఐ సంజీవరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఎమ్మెల్యే వద్దకు వచ్చి బోర్లు వేస్తున్నామని నీళ్లు రెండు రోజుల్లో ఇస్తామని తెలిపారు. ఎక్కడ బోర్లు వేశారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన డిమాండ్లు మైలవరం జలాశయం నుంచి 1 టీఎమ్సీ నీటిని పెన్నాకు వదలించడం, కుందూపెన్నా కాలువను పూర్తి చేయడం, కుందూ నుంచి పైప్‌లైన్ పనులు ప్రారంభించడం అని తెలిపారు. తనకు మీరు చెప్పే విషయాలపై నమ్మకం లేదని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వచ్చి హామీ ఇస్తే 24 గంటల దీక్ష కూడా విరమిస్తానని చెప్పారు. -
రూ.500 జిరాక్సు నోటు ఇచ్చి మోసం
ప్రొద్దుటూరు టౌన్: ఈమె పేరు రామాంజనమ్మ. పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో నివాసం ఉంటోంది. భర్తకు అనారోగ్యం కారణంగా పండ్ల వ్యాపారం చేసి కుటుంబాన్ని ఆమె పోషిస్తోంది. వన్ టౌన్‌సర్కిల్ వద్ద ఆమె వ్యాపారం చేస్తుండగా ఇద్దరు ద్విచక్రవాహనంలో వచ్చి రూ.500 నోటు ఇచ్చి అరటి పండ్లు తీసుకున్నారు. ఆమె వారికి రూ.470 చిల్లర ఇచ్చింది. మరో వ్యక్తి రూ.500 నోటు ఇచ్చి ద్రాక్ష పండ్లు కావాలని అడిగాడు. ఆమె చిల్లర లేదని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె రూ.500 నోటు పరిశీలించగా అది జిరాక్స్ పేపర్ అని గుర్తించి లబోదిబోమంది. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపారం చేస్తే రూ.100–150 మిగులుతుందని, జిరాక్స్ పేపర్ ఇచ్చి ఇలా మోసం చేయడం ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
13న రాచమల్లు జలదీక్ష
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణ ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఈనెల 13న మున్సిపల్ కార్యాలయం వద్ద జలదీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. 13న ఉదయం 10 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 10 గంట వరకు 24 గంటలు ఆహారం తీసుకోకుండా జల దీక్షను చేపడుతున్నట్లు వివరించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూర్వం జిల్లా అంతటికీ కరువు వచ్చినా ప్రొద్దుటూరుకు రాదనే నానుడి ప్రజల్లో ఉండేదన్నారు. అయితే ఇప్పుడు వారానికోమారు కూడా తాగునీరు అందడం లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. సమస్యను గుర్తించిన నాయకుడు వైఎస్ పదేళ్ల కిందటే ప్రొద్దుటూరు పట్టణ ప్రజల తాగునీటి సమస్యను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో రూ.72.53 కోట్లతో కుందూ–పెన్నా కాలువ అనుసంధానం చేయడం కోసం పథకాన్ని మంజూరు చేశారన్నారు. దీనిద్వారా పట్టణ ప్రజల దాహార్తిని తీర్చవచ్చని వైఎస్ నిధులు మంజూరు చేస్తే ఆ నాడు ఎమ్మెల్యేగా ఉన్న వరదరాజులరెడ్డి తన స్వార్థంతో సొంత ప్రయోజనాల కోసం టీడీపీ నేతల భూములను తక్కువ ధరకు సేకరించే ప్రయత్నం చేశాడని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం రోజూ 150 క్యూసెక్కుల నీరు తెచ్చుకునే వీలు ఉండగా మున్సిపల్ అధికారులు అంతనీటిని వద్దంటున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కావాలంటే 5వేల నుంచి 10వేల క్యూసెక్కుల నీరు అవసరమని అన్నారు. -
11, 12 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
ప్రొద్దుటూరు కల్చరల్: ప్రొద్దుటూరులోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 11, 12 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ తెలిపారు. శనివారం ప్రొద్దుటూరులో దీనికి సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రగతిశీల రచయితలందరూ ఈ పాఠశాలలో పాల్గొననున్నట్లు చెప్పారు. రాయలసీమ ప్రాంతీయ ఆకాంక్షలు, నోట్ల రద్దు – రాజకీయ ఆర్థిక మూలాలు, ముíస్లింలు, దళితులపై పెరుగుతున్న దాడులు, సామాజిక రంగాల్లో కృషి చేస్తున్న ఆలోచనపరుల ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. సాహిత్యంలో వ్యక్తమవుతున్న వివిధ ధోరణులను వస్తుగతంగా, శిల్పపరంగా సమీక్షించనున్నట్లు చెప్పారు. రెండు రోజుల కార్యక్రమంలో కథలు, కవిత్వం, అనువాద సాహిత్యం, చరిత్ర, వర్తమాన సామాజిక వ్యాసాలు వంటి 20 పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు వివరించారు. సాహితీ ప్రియులు, విద్యార్థులు, రచయితలు, ప్రజలు, ప్రజా సంఘాల వారు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో రచయితలు కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, జింకా సుబ్రమణ్యం, కాశీవరపు వెంకటసుబ్బయ్య, మహమూద్, కొండ్రాయుడు పాల్గొన్నారు. -
6 నుంచి జాతీయ సీనియర్ టెన్నిస్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక సుందరాచార్యుల ఆఫీసర్స్ రిక్రియేషన్ అసోసియేషన్‌లో ఈనెల 6 నుంచి 12 వరకు అఖిల భారత టెన్నిస్ సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ భారత సీనియర్ టెన్నిస్ పోటీలను నిర్వహించనున్నట్లు కో-ఆర్డినేటర్ సి.రామగోవిందరెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ 55 ఏళ్లు పైబడ్డ విభాగంలో క్రీడాకారులకు టెన్నిస్ పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతలకు రూ.2.50లక్షలు విలువ చేసే బహుమతులు ఇస్తామని చెప్పారు. సమావేశంలో వ్యాయామ అధ్యాపకుడు మహబూబ్‌బాషా పాల్గొన్నారు. -
గాయని జానకికి ‘భారత రత్న’ ఇవ్వాలి
ప్రొద్దుటూరు కల్చరల్: దక్షిణ భారత దేశంలో తిరుగులేని గాయని అయిన ఎస్.జానకికి భారతరత్న అవార్డు ఇవ్వాలని జానకి అభిమాన బృందం అధ్యక్షుడు గోపాల కృష్ణ కోరారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్నో భాషల్లో పాటలు పాడి ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. మధుర గీతాలు ఆలపించి ప్రజల మనసులను గెలుచుకున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జేవీవీ నాయకుడు చంద్రశేఖర్‌రావు, గాయకులు మునెయ్య, గిరి, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
కువైట్‌లో ప్రొద్దుటూరు స్వర్ణకారుడు దుర్మరణం
ప్రొద్దుటూరు క్రైం: ఇక్కడ పనులు లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం గురుశేఖర్ (37) అనే స్వర్ణకారుడు నాలుగు నెలల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అయితే విధి చిన్న చూపు చూడటంతో అతను అక్కడ విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. మృతుని కుటుంబీకుల కథనం మేరకు.. పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో నివాసం ఉంటున్న సి.గురుశేఖర్ బంగారు పని చేసుకొని జీవనం సాగించేవాడు. అతనికి భార్య లక్షి్మ, కుమారుడు సంతోష్, కుమార్తె జయశ్రీలు ఉన్నారు. అతను పట్టణంలోని మెయిన్‌బజార్‌లో గత కొంత కాలం నుంచి స్వర్ణకారుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల పనులు బాగా తగ్గడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో సన్నిహితులు, బంధువుల సలహా మేరకు నాలుగు నెలల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అతను స్వర్ణకారుడు అయినప్పటికీ డ్రైవింగ్ వీసాపై అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో అతను కువైట్‌లోని జహ్రాలో ఉన్న అయూన్ ప్రాంతంలో ఈ నెల 18న తనకు కేటాయించిన రేకుల షెడ్డులో పడుకున్నాడు. విద్యుత్ షార్టు సర్క్యూట్‌తో ప్రమాదం అతను పడుకొని ఉన్న రేకుల షెడ్డులో వేకువ జామున 4.20 గంటల సమయంలో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. షెడ్డంతా మంటల్లో తగలబడి పోయింది. గురుశేఖర్ మంటల్లో చిక్కుకొని బయటికి రాని పరిస్థితి ఉందని సమీపంలో ఉన్న వ్యక్తులు అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. రేకుల షెడ్డులో గ్యాస్ సిలిండర్లు కూడా ఉండటంతో అవి పేలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. తర్వాత వెళ్లి చూడగా గురుశేఖర్ మృతదేహం పూర్తిగా కాలిపోయింది. షెడ్డులోని నాలుగు కార్లు కూడా ప్రమాదంలో కాలిపోయాయి. అతను మృతి చెందిన విషయాన్ని కువైట్ నుంచి బంధువులు లక్ష్మీకి చెప్పారు. విషయం తెలిసినప్పటి నుంచి భార్యా పిల్లలు, బంధువులు రోదించసాగారు. ఇండియన్ ఎంబసీ జోక్యంతో కేసు కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు జోక్యం చేసుకొని జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంబసీ అధికారులు గురుశేఖర్ తరపున న్యాయవాదిని ఏర్పాటు చేశారు. అక్కడి కఫిల్ అజాగ్రత్త వల్లనే షెడ్డులో అగ్నిప్రమాదం జరిగిందని న్యాయవాది కువైట్ ప్రభుత్వంతో మాట్లాడారు. పోస్టుమార్టం అనంతరం గురువారం ఉదయం 11 గంటలకు అతని మృతదేహాన్ని చెన్నైకి తీసుకొని రాగా అక్కడి నుంచి సాయంత్రం ప్రత్యేక అంబులెన్స్‌లో ప్రొద్దుటూరుకు తరలించారు. విషయం తెలియడంతో స్వర్ణకారులతో పాటు బంధువులు సన్నిహితులు పెద్ద ఎత్తున ఇంటి వద్ద గుమిగూడారు. భర్త మృతదేహాన్ని చూసిన భార్య లక్ష్మి సొమ్మసిల్లి పడిపోయింది. పిల్లలిద్దరూ గుండె పగిలేలా రోదించసాగారు. స్వర్ణకారుల సంఘం నాయకులు గురుప్రసాద్, ఇలియాస్, ఖలందర్, స్వర్ణకారులు సుబ్బరాయుడు, హరి, బాషా తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
కువైట్‌లో ప్రొద్దుటూరు స్వర్ణకారుడు దుర్మరణం
ప్రొద్దుటూరు క్రైం: ఇక్కడ పనులు లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం గురుశేఖర్ (37) అనే స్వర్ణకారుడు నాలుగు నెలల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అయితే విధి చిన్న చూపు చూడటంతో అతను అక్కడ విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. మృతుని కుటుంబీకుల కథనం మేరకు.. పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో నివాసం ఉంటున్న సి.గురుశేఖర్ బంగారు పని చేసుకొని జీవనం సాగించేవాడు. అతనికి భార్య లక్షి్మ, కుమారుడు సంతోష్, కుమార్తె జయశ్రీలు ఉన్నారు. అతను పట్టణంలోని మెయిన్‌బజార్‌లో గత కొంత కాలం నుంచి స్వర్ణకారుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల పనులు బాగా తగ్గడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో సన్నిహితులు, బంధువుల సలహా మేరకు నాలుగు నెలల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అతను స్వర్ణకారుడు అయినప్పటికీ డ్రైవింగ్ వీసాపై అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో అతను కువైట్‌లోని జహ్రాలో ఉన్న అయూన్ ప్రాంతంలో ఈ నెల 18న తనకు కేటాయించిన రేకుల షెడ్డులో పడుకున్నాడు. విద్యుత్ షార్టు సర్క్యూట్‌తో ప్రమాదం అతను పడుకొని ఉన్న రేకుల షెడ్డులో వేకువ జామున 4.20 గంటల సమయంలో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. షెడ్డంతా మంటల్లో తగలబడి పోయింది. గురుశేఖర్ మంటల్లో చిక్కుకొని బయటికి రాని పరిస్థితి ఉందని సమీపంలో ఉన్న వ్యక్తులు అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. రేకుల షెడ్డులో గ్యాస్ సిలిండర్లు కూడా ఉండటంతో అవి పేలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. తర్వాత వెళ్లి చూడగా గురుశేఖర్ మృతదేహం పూర్తిగా కాలిపోయింది. షెడ్డులోని నాలుగు కార్లు కూడా ప్రమాదంలో కాలిపోయాయి. అతను మృతి చెందిన విషయాన్ని కువైట్ నుంచి బంధువులు లక్ష్మీకి చెప్పారు. విషయం తెలిసినప్పటి నుంచి భార్యా పిల్లలు, బంధువులు రోదించసాగారు. ఇండియన్ ఎంబసీ జోక్యంతో కేసు కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు జోక్యం చేసుకొని జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంబసీ అధికారులు గురుశేఖర్ తరపున న్యాయవాదిని ఏర్పాటు చేశారు. అక్కడి కఫిల్ అజాగ్రత్త వల్లనే షెడ్డులో అగ్నిప్రమాదం జరిగిందని న్యాయవాది కువైట్ ప్రభుత్వంతో మాట్లాడారు. పోస్టుమార్టం అనంతరం గురువారం ఉదయం 11 గంటలకు అతని మృతదేహాన్ని చెన్నైకి తీసుకొని రాగా అక్కడి నుంచి సాయంత్రం ప్రత్యేక అంబులెన్స్‌లో ప్రొద్దుటూరుకు తరలించారు. విషయం తెలియడంతో స్వర్ణకారులతో పాటు బంధువులు సన్నిహితులు పెద్ద ఎత్తున ఇంటి వద్ద గుమిగూడారు. భర్త మృతదేహాన్ని చూసిన భార్య లక్ష్మి సొమ్మసిల్లి పడిపోయింది. పిల్లలిద్దరూ గుండె పగిలేలా రోదించసాగారు. స్వర్ణకారుల సంఘం నాయకులు గురుప్రసాద్, ఇలియాస్, ఖలందర్, స్వర్ణకారులు సుబ్బరాయుడు, హరి, బాషా తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
గృహ నిర్బంధంలో జయశ్రీ
ప్రొద్దుటూరు క్రైం: ఏ సంఘటన జరిగినా ఆమెను గృహ నిర్బంధం చేయండం పోలీసులకు పరిపాటిగా మారింది. మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీని గండికోట ముంపు గ్రామాల విషయమై పలు మార్లు గృహ నిర్బంధం చేశారు. ఆమె ముంపు వాసుల తరపున జలదీక్షతోపాటు అనేక పోరాటాలు చేశారు. పోలీసులు గృహ నిర్బంధం చేసినా వారి కళ్లు కప్పి అర్ధరాత్రి సమయంలో చౌటపల్లెకు వెళ్లారు. ఆయా గ్రామ ప్రజల ఆందోళనలతోపాటు జయశ్రీలాంటి ఉద్యమ నాయకుల ఫలితంగా ముంపు గ్రామాలకు న్యాయం జరిగిందని చెప్పవచ్చు. ఈక్రమంలోనే బుధవారం ముగ్గురు పోలీసులు జయశ్రీ ఇంటి వద్దకు వచ్చి గృహ నిర్బంధం చేస్తున్నట్లు తెలిపారు. ఎందుకు చేస్తారని ఆమె ప్రశ్నించగా పోలీసులు సమాధానం చెప్పలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని వారు చెప్పారు. రెండు రోజుల క్రితం ఆమె చౌటపల్లెతోపాటు పలు ముంపు గ్రామాలకు వెళ్లి పరిహారం అందని వారితో మాట్లాడారు. వారికి ఎందుకు చెక్కులు ఇవ్వలేదన్న విషయంపై అధికారులతో చర్చించారు. చౌటపల్లె గ్రామంలో ఎంతో పవిత్రంగా, వైభవంగా లింగమయ్య తిరుణాలను జరుపుకొంటారు. ముంపు నీరు రావడంతో ఇప్పటికే గ్రామస్తులు ఇళ్లు వదలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బుధ, గురువారాల్లో పండుగను వైభవంగా నిర్వహించడానికి గ్రామస్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసు అధికారులు పండుగ నిర్వహించకుండా ఆటంకం కలిగించేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గ్రామస్తులతో సమాచారం మేరకు జయశ్రీ విద్యుత్ అధికారులతో మాట్లాడి తిరిగి గ్రామానికి విద్యుత్ సరఫరా చేయించారు. ముంపు గ్రామాల్లో ఎలాంటి సమస్య లేదని అయినప్పటికీ తనను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని జయశ్రీ తెలిపారు. అసలు కారణం ఇదే... జయశ్రీని పోలీసులు గృహ నిర్బంధం ఎందుకు చేశారో బుధవారం సాయంత్రానికి తెలిసింది. పైడిపాలెం ప్రాజెక్టు కింద ఉన్న తొండూరు రైతులు ఆమెకు ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు పైడిపాలెం ప్రాజెక్టు కింద మొదటగా వచ్చే ఊరు తొండూరు. అయితే ఆ గ్రామానికి నీరు ఇవ్వకుండా దిగువ ప్రాంతంలో ఉన్న ఇతర గ్రామాలకు అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు జిల్లా అధికారులతో మాట్లాడినప్పటికీ ఫలితం లేదు. ఈ క్రమంలోనే పైడిపాలెం ప్రాజెక్టు వద్ద తొండూరు, దిగువ ప్రాంత రైతులు ఘర్షణ పడ్డారు. బుధవారం ప్రాజెక్టు వద్ద రైతులు ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి జయశ్రీ వెళతారేమోనని భావించిన పోలీసులు ముందస్తుగా ఆమెను గృహ నిర్బంధం చేశారు. -
రోజూ సూర్య భగవానుడిని పూజించాలి
ప్రొద్దుటూరు కల్చరల్: రోజూ సూర్య భగవానుడిని దర్శించి పూజించడం ద్వారా విటమిన్ డీ లభిస్తుందని, ఆరోగ్యంగా జీవించవచ్చని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పేర్కొన్నారు. స్థానిక వైఎంఆర్ కాలనీలోని సత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం రాత్రి శ్రీచక్రపూజ నిర్వహించిన అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అహం దరిచేరనీయకూడదని, ఇతరులను గౌరవించాలన్నారు. పరీక్షిత్ మహారాజు కథను వివరించారు. ఆలయంలోని సుదర్శన యోగ నరసింహస్వామి ఎంతో మహిమగలవారని, భక్తులు పూజలు నిర్వహిస్తే వారి సమస్యలు తొలగిపోయి కోరికలను నెరవేరుతాయని చెప్పారు. టీవీ, సీరియల్స్ చూడటం వలన మనిషికి జడత్వం లభిస్తుందన్నారు. తాను ప్రొద్దుటూరు పట్టణంలో భిక్ష స్వీకరించానని, ఆనాటి చదువుకున్న జ్ఞాపకాలను భక్తులకు తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో మెలగి, అందరూ సన్మార్గంలో నడవాలన్నారు. ఆంజనేయస్వామి, యోగిరాజ వల్లభ దత్తాత్రేయస్వామి, చాముండేశ్వరిదేవి, కాశీవిశ్వేశ్వరుడు, యోగ నరసింహస్వామిలను సచ్చిదానంద స్వామి దర్శించుకున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సచ్చిదానంద స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. -
హోదా కోసం పార్టీలకు అతీతంగా పోరాడాలి
-
రాజకీయం.. వ్యాపారం కాదు
ప్రొద్దుటూరు: రాజకీయం వ్యాపారం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, సినీనటి ఆర్.కె.రోజా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం దొరసానిపల్లె జెడ్పీ హైస్కూల్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేదవారి కోసం చేపట్టిన చేయూత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపడుతున్నానన్నారు. అయితే నేడు చాలా మంది దోచుకునేందుకు, దోచుకున్నది దాచుకునేందుకు సేవ పేరుతో రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. ప్రజలను అభిమానించే, ప్రజా సమస్యలపై స్పందించే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి లాంటి నాయకుడు ఉండటం ప్రొద్దుటూరు ప్రజల అదృష్టమని తెలిపారు. డబ్బు సంపాదించుకునేందుకు ఇతర మార్గాలు ఉన్నాయని, ఇందు కోసం రాజకీయాల్లోకి వస్తుండటం దురదృష్టకరమన్నారు. ‘ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న సూక్తిని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. శ్రీకృష్ణ భగవానుడు, అల్లా, ఏసు అందరూ తోటి వారికి సాయం అందించాలని చెప్పారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి షేర్ ఆటోలు, బస్సుల్లో వస్తున్న బాలికల ఇబ్బందులను గుర్తించి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వారికి 47 సైకిళ్లు కొని ఇవ్వడం చాలా మంచి నిర్ణయమని తెలిపారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు కూడా రక్షణ కరువయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. బయటికి వెళ్లిన మహిళలు ఇంటికి వస్తారో లేదోనని ఆందోళన చెందే పరిస్థితి ఉందన్నారు. బాబు వస్తే జాబు వస్తాదని ఇలా ఎన్నో హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రజలను వంచించాడన్నారు. పేదల సమస్యలపై నా హృదయం చలించింది – ఎమ్మెల్యే రాచమల్లు గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించినప్పుడు పేదల సమస్యలు అనేకం తన దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. వారి సమస్యలను చూసి తన హృదయం స్పందించిందని తెలిపారు. భర్త మరణించడంతో దిక్కులేని కుటుంబం, గూడు మిద్దెలో 23 మంది కుటుంబ సభ్యులు కలిసి ఉంటున్న సమస్య, విద్యుత్ షాక్‌తో మృతి చెందిన వ్యక్తి కుటుంబం రోడ్డున పడటం, తండ్రి మృతితో అనాథ అయిన కుటుంబం, బోన్ క్యాన్సర్‌తో బాధపడుతూ వైద్యం కోసం ఎదురుచూస్తుండటం ఇలా అనేక సమస్యలను చూసి తాను ఎంతగానో చలించిపోయానన్నారు. ప్రభుత్వం సాయం చేయకపోవడంతో వీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఈ సమస్యలను కూడా ఏరోజుకారోజు ఇంటికి వెళ్లిన తర్వాత తన సతీమణితో కలిసి చర్చించేవాడినని పేర్కొన్నారు. సమస్యలను చూసి స్పందించే హృదయం ఉండాలేకానీ వీరిని ఆదుకోవడానికి డబ్బే ప్రధానం కాదన్నారు. గత 25 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఖర్చు పెట్టింది లేదన్నారు. రాజుపాళెం మండలం కుమ్మరపల్లె గ్రామానికి చెందిన నాయీ బ్రాహ్మణ దంపతులకు పుట్టిన ఇద్దరు సంతానం గత ఏడాది కేసీ కెనాల్లో పడి చనిపోయారన్నారు. తిరిగి ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో ఆ కుటుంబం భవిష్యత్తు దృష్ట్యా టెస్ట్‌ట్యూబ్ బేబి పద్ధతిలో సంతానం పొందేందుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దొరసానిపల్లె జెడ్పీహైస్కూల్లో చదువుతున్న బాలికలకు 47 సైకిళ్లను కొనివ్వడంతోపాటు మొత్తం రూ.25లక్షల వ్యయంతో 11 రకాల సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా చేపట్టారు. -
బస్సును కారు ఢీ కొని ముగ్గురికి గాయాలు
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక మోడంపల్లె బైపాస్ రోడ్డులో ముందు వెళ్తున్న బస్సును కారు ఢీ కొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఎర్రగుంట్లకు చెందిన రిటైర్డు ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ రామసుబ్బారెడ్డి, ఎల్ఐసీ ఏజెంట్లు సుదర్శన్, అబ్దుల్‌షరీఫ్‌లు కారులో గురువారం సాయంత్రం ఎర్రగుంట్ల నుంచి జమ్మలమడుగుకు బయలుదేరారు. ప్రొద్దుటూరులో కొంచెం పని ఉందని, చూసుకొని వెళ్దామని రామసుబ్బారెడ్డి బైపాస్‌రోడ్డు గుండా మైదుకూరు రోడ్డు వైపు కారు తిప్పాడు. అయితే బైపాస్‌రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్ సమీపంలోకి వెళ్లగానే ముందు వైపు పులివెందుల నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఏపీ04 టిటి 9988 నెంబర్ గల ఆర్టీసీ బస్సును వారి కారు ఢీ కొంది. బస్సును ఢీ కొనడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న రామసుబ్బారెడ్డి తీవ్రంగా గాయ పడ్డారు. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు కండక్టర్ బియ్యంశెట్టి వీరవెంకటప్రతాప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చలపతి తెలిపారు. -
అదుపు తప్పిన లారీ.. రోడ్డు పాలైన సిమెంట్..!
చాపాడు: ప్రొద్దుటూరు–మైదుకూరు రహదారిలో మండలంలోని నాగులపల్లె సమీపంలో శనివారం ఉదయం ఓ లారీ అదుపు తప్పిన కారణంగా రూ. లక్షలు విలువ చేసే సిమెంటు రోడ్డు పాలయింది. ప్రొద్దుటూరు నుంచి ఏపీ29ఏయూ9909 నెంబరు గల సిమెంటు లారీ మైదుకూరు వస్తుండగా, నాగులపల్లె సమీపంలో అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. దీంతో లారీ బోల్తా పడింది. దీని కారణంగా లారీలోని సిమెంటు బస్తాలన్నీ రోడ్డుపై పడ్డాయి. అనంతరం క్రేను సాయంతో బోల్తాపడిన లారీని తొలగించగా, వేరే లారీలోకి సిమెంటును ఎత్తుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ ప్రమాదం కారణంగా ఒన్ వే రాకపోకలు జరపాల్సి రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
ప్రొద్దుటూరు క్రైం: రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటుచేయాలని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు న్యాయవాదుల సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాయలసీమలోని నాలుగు జిల్లాల న్యాయవాదులను కలుపుకొని త్వరలో ఇక్కడ భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసే విషయమై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విమోచన సమితి వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డిలతో పాటు పెద్దఎత్తున న్యాయవాదులు పొల్గొన్నారు. డాక్టర్ ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తెలంగాణలో ఉన్న మన న్యాయవాదుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. తిరిగి అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటైతే ఎల్ఎల్బీ పట్టా తీసుకొని కొత్తగా వచ్చే రెండు మూడు బ్యాచ్‌లకైనా అక్కడ పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కోస్తా వాళ్లను తట్టుకొని మన న్యాయవాదులు నిలబడాలంటే రాయలసీమలో ఏదో ఒకచోట హైకోర్టు ఉండాలన్నారు. హైకోర్టు మన హక్కు అని తెలిపారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు, రాజధానిలు ఒక ప్రాంతంలో ఒకటి ఉంటే రెండో ప్రాంతంలో ఇంకోటి ఉండాలన్నారు. ఈ రోజు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్నందున న్యాయంగా హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తే ప్రాంతీయ అసమానతలు తొలగిపోతాయన్నారు. కోస్తాలో రాజధాని ఏర్పాటైనందున హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయడం సముచితమని పేర్కొన్నారు. అవసరరీత్యా కోర్టులు ఎక్కడున్నా వెళ్లాల్సిందేనని చెప్పారు. మనకు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ హైకోర్టును మాత్రం ముందుగా సాధించుకొని తీరాల్సిందేనని ఆయన తెలిపారు. త్వరలో నాలుగు జిల్లాల బార్ అసోసియేషన్ సభ్యులతో చర్చించిన తర్వాత ప్రొద్దుటూరులో భారీ సమావేశం ఏర్పాటు చేయాలని, పార్టీలకతీతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సభ్యులు నిర్ణయించారు. బార్ అసోసియేషన్ అ«ధ్యక్షుడు ఆర్వి భాస్కర్‌రావు, సీనియర్ న్యాయవాదులు ముడిమేల కొండారెడ్డి, ఇవి సుధాకర్‌రెడ్డి, పుత్తాలక్ష్మిరెడ్డి, గొర్రెశ్రీనివాసులు, జిలానిబాషా,సుదర్శన్‌రెడ్డి, దాదాపీర్ మాట్లాడారు. బార్అసోసియేషన్ కార్యదర్శి ఓబులేసు, ఏపీపీ మార్తల సుధాకర్‌రెడ్డి, మల్లేల లక్ష్మీప్రసన్న, జింకా విజయలక్ష్మి, నిర్మలాదేవి పాల్గొన్నారు. -
శాంతించిన పాతాళగంగ
కృష్ణాజిల్లా కొణతనపాడులో బోరు నుంచి ఎగిసిపడుతున్న గంగమ్మ ఎట్టకేలకు శాంతించింది.గ్యాస్ నిక్షేపాల వల్లే జలం ఎగిసిపడిందంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. ప్రొద్దుటూరుకు చెందిన రైతు బీహెచ్.గిరిరెడ్డి పంట పొలంలో బోరులోంచి శనివారం జలధార ఎగిసిన విషయం విదితమే. పొలంలో ఉన్న 40 అడుగుల లోతు బోరుకు నీరు అందక లోతు తీయించడంతో సుమారు 150 అడుగుల వద్ద జల వచ్చింది. ఇది 70 అడుగుల ఎత్తున ఎగిసిపడింది. ఈ జలధార ఆదివారం తెల్లవారుజాము రెండుగంటల వరకు కొనసాగింది. నీటితోపాటు బలమైన గాలి శబ్దం వస్తుండడంతో గ్యాస్ నిక్షేపం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.వాటికి తెరదించుతూ తెల్లవారుజాము నుంచి నీటి ఉధృతి తగ్గుతూ వచ్చింది. నమూనాల సేకరణ: జలధార ఎగిసిపడుతున్న విషయం తెలుసుకున్న ఓఎన్జీసీ బృందం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొణతనపాడు చేరింది. బోరు గొట్టం నుంచి వస్తున్న నీటి శ్యాంపిళ్లను సేకరించారు. ఆ సంస్థ రాజమండ్రి డీజీఎం గాజుల శ్రీహరి, జిల్లా నోడల్ అధికారి మురుగేశన్, ఎస్ఈ చంద్రశేఖర్‌రావు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి పొరల్లో ఉన్న గాలి.. ఒత్తిడితో నీటిని తోసుకుంటూ వస్తోందన్నారు. -కంకిపాడు