వరదరాజుల రెడ్డికి టికెట్‌ ఇవ్వడంపై రగడ | TDP Mla Linga Reddy fires on chandrababu naidu | Sakshi

వరదరాజుల రెడ్డికి టికెట్‌ ఇవ్వడంపై రగడ

Published Fri, Apr 18 2014 10:11 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

వరదరాజుల రెడ్డికి టికెట్‌ ఇవ్వడంపై రగడ - Sakshi

వరదరాజుల రెడ్డికి టికెట్‌ ఇవ్వడంపై రగడ

వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు శాసనసభ స్థానంపై టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.

కడప : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు శాసనసభ స్థానంపై టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డిని కాదని ఇటీవలే పార్టీలో చేరిన వరదరాజుల రెడ్డికి టికెట్‌ ఇవ్వడంపై రగడ మొదలైంది. ఇన్ని రోజులూ నాన్చుతూ, హఠాత్తుగా అర్థరాత్రి వరదరాజుల రెడ్డికి టికెట్‌ ఇవ్వడంతో  లింగారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిడిపి జెండాలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు.

 

పార్టీ సింబర్‌ సైకిల్‌ను సైతం మంటల్లో వేశారు. సీఎం రమేష్ ఈ కుట్రకు సూత్రధారి అని... వరదరాజుల రెడ్డి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని ఆయనకు టికెట్ కేటాయించారని లింగారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేష్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement