Lingareddy
-
విందుకు వెళ్తూ.. అంతలోనే ఇలా..!
మెదక్: నార్సింగి మండలం జప్తి శివునూర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ అహ్మద్ మోహినుద్దీన్ తెలిపిన వివరాలు. నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పెంటపర్తి బాపురెడ్డి కుమారుని వివాహం ఇటీవలే జరిగింది. ఈమేరకు ఆదివారం రామాయంపేటలోని ఓ ఫంక్షన్ హాలులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. బాపురెడ్డి తన బావ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్‌పేటకు చెందిన సిరికొండ లింగారెడ్డి, తోడల్లుడు సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌కు చెందిన ముత్యాల వెంకట్రాంరెడ్డితో కలిసి కారులో జంగరాయి నుంచి రామాయంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో జప్తి శివునూర్‌వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట్రాంరెడ్డి (55) అక్కడిక్కడే మృతిచెందగా, లింగారెడ్డి (48) రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన బాపురెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ప్రమాదం కారణంగా హైవేపై రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ ప్రమాదాలకు గురైన వాహానాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియక్ చేయించారు. ప్రమాదం విషయం తెలుసుకొని మృతుల బంధువులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకొని విలపించారు. ప్రమాదంలో మృతిచెందిన లింగారెడ్డి బీఆర్ఎస్ అంబర్‌పేట గ్రామ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘టీఎస్పీఎస్సీ’ సభ్యుల నియామకంపై సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుల నియామకంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించారా? లేదా? అన్నది పునః పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మూడు నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆరుగురి నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రశ్న ప్రస్తుత దశలో అవసరం లేదని అభిప్రాయపడింది. అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 108ను రద్దు చేయలేమని తేల్చి చెప్పింది. ఆ ఆరుగురి నియామకం ప్రభుత్వ తాజా కసరత్తుకు లోబడి ఉంటుందని చెప్పింది. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం ఎలాంటి ఎంపిక ప్రక్రియ నిర్వహించకపోవడం మాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమిస్తూ 2021, మే 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో చేసింది. అయితే నియామకం అయిన వారిలో ఆరుగురు సభ్యులు ధన్సింగ్, బండి లింగారెడ్డి, సుమిత్రా ఆనంద్ తనోబా, కారం రవీందర్‌రెడ్డి, అరవిల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్ సత్యనారాయణ నిబంధనల మేరకు అర్హులు కాదని పేర్కొంటూ హైదరాబాద్ చెందిన ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి 2021లో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం 80పేజీల కీలక తీర్పు వెల్లడించింది. ఆరుగురి నియామక తీరును హైకోర్టు తప్పుబట్టింది. ’ఇష్టం వచ్చినవారికి ఎంపిక చేయడం కాదు’ రాజ్యాంగంలోని అధికరణ 316 ప్రకారం చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించి ఎలాంటి అర్హతలు, విధానాన్ని పేర్కొనకపోయినప్పటికీ కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చైర్మన్, సభ్యుల పదవులకు తగ్గట్టుగా అర్హత, సామర్థ్యం ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉన్నత రాజ్యాంగ పదవుల్లో నియామకాలు చేపట్టేముందు వారి పూర్వాపరాలను విచారించడంతోపాటు నిశితంగా పరిశీలన జరపాల్సి ఉందని తెలిపింది. రాజ్యాంగంలోని అధికరణ 316 ప్రకారం కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం చేసే అధికారం గవర్నర్‌కు ఉందని, నియామక విధానం లేనంత మాత్రాన ప్రభుత్వం తన విచక్షణాధికారంతో ఇష్టం వచ్చినవారికి ఎంపిక చేయడం కాదని వ్యాఖ్యానించింది. నిబంధనల మేరకే నియామకమన్న న్యాయవాది ‘సభ్యులపై వ్యక్తిగతంగా ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియామకాలు చట్ట విరుద్ధం. నియమితులైన వారిలో రమావత్ ధన్సింగ్ జీహెచ్ఎంసీలో ఈఎన్సీగా పదవీ విరమణ పొందారు. లింగారెడ్డి ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సుమిత్ర ఆనంద్ జెడ్పీ స్కూల్లో తెలుగు టీచరు. ఎ.చంద్రశేఖర్‌రావు ఆయుర్వేదిక్ డాక్టర్. రవీందర్‌రెడ్డి రిటైర్డు డిప్యూటీ తహసీల్దార్. ఆర్.సత్యనారాయణ ఎమ్మెల్సీగా సేవలందించారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర సివిల్ సర్వీసెస్‌లో ఫస్ట్ క్లాస్ గెజిటెడ్ పోస్టుల్లో పని చేసిన వారే అర్హులు’అని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. -
టీడీపీ నేతలపై ఎమ్మెల్యే రాచమల్లు ధ్వజం
ప్రొద్దుటూరు క్రైం: ‘మీరు అసమర్థులు కాబట్టే నేను జలదీక్ష చేయాల్సి వచ్చింది.. మీలో సమర్థత లోపించడంతోనే నేను పాదయాత్రకు పూనుకున్నాను’ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి టీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. స్థానిక మున్సిపల్ పార్కులో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మట్లాడారు. నీటి కష్టాలను తొలగించుటకు తాము చేస్తున్న ప్రయత్నాన్ని చూసి పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి మాట్లాడిన తీరు ‘అమ్మా పెట్టనూ పెట్టదు, అడుక్కొని తిననీయదు’ అనే సామెత చందంగా ఉందన్నారు. గండికోట జలాశయం నుంచి మైలవరానికి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసి, అక్కడి నుంచి పెన్నా నదికి పంపించాలనే డిమాండ్‌తో దీక్ష చేస్తే.. ప్రజలతో సంబంధం కలిగిన వ్యక్తిగా మల్లేల లింగారెడ్డి తమ దీక్షకు మద్దతు పలకాల్సింది పోయి అసూయతో ఛీప్ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టర్‌ను కలిసి నీరు విడుదల చేయించామని ఇక్కడి నాయకులు అంటున్నారని, ఆ నీటిని ప్రజలకు ఇవ్వకుండా ఏం చేశారని ప్రశ్నించారు. సమావేశంలో మున్సిపల్ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మండల కన్వీనర్ దేవిప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో వేధింపులు: హైదరాబాద్‌లో అరెస్ట్
హైదరాబాద్: అమెరికాలో భార్యను వేధించిన కేసులో మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ప్రబుద్ధుణ్ని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్‌కు చెందిన లింగారెడ్డిని హయత్‌నగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అమెరికాలో భార్యను వేధించడమే కాక, ఇండియాకు తిరిగొచ్చి మరో అమ్మాయిని పెళ్లాడిన లింగారెడ్డిపై హత్యాయత్నం, చీటింగ్, సెక్షన్ 498 చట్టాల ప్రకారం కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కూకట్‌పల్లికి చెందిన లింగారెడ్డికి హైదరాబాద్‌కే చెందిన స్వప్నారెడ్డితో నాలుగేళ్ల కిందట పెళ్లైంది. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్యను అమెరికా తీసుకెళ్లిన లింగారెడ్డి.. అక్కడ ఆమెను తీవ్రంగా వేధించేవాడు. పెళ్లిలో ఇచ్చినదానికి అదనంగా కట్నం తేవాలని హింసించేవాడు. భర్త వేధింపులు భరించలేని స్థితిలో స్వప్న.. అమెరికన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసుల భయంతో లింగారెడ్డి మూడేళ్ల కిందట అమెరికానుంచి పారిపోయి ఇండియా వచ్చేశాడు. చాలారోజుల పాటు ఎవ్వరికీ కనిపించకుండా తిరిగిన లింగారెడ్డి, తర్వాత దివ్య అనే మరో మహిళను రెండోపెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వాళ్లిద్దరూ కూకట్‌పల్లిలో ఉంటున్నారు. హైదరాబాద్‌లోనే ఉండే స్వప్నరెడ్డి కుటుంబీకులకు ఇటీవలే లింగారెడ్డి జాడ తెలిసింది. దీంతోవారు జనవరి 5న హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు పక్కాగా వలపన్ని శనివారం మధ్యాహ్నం లింగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు స్వప్న ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నారు. లింగారెడ్డి మోసాల గురించి రెండో భార్య అయిన దివ్యకు తెలుసో లేదో తేలాల్సి ఉంది. లింగారెడ్డి అరెస్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని అమెరికన్ పోలీసులకు చేరవేశారా లేదా తెలియాల్సి ఉంది. -
అమెరికాలో వేధింపులు: హైదరాబాద్‌లో అరెస్ట్
-
ప్రేమించాలంటూ మరదలిపై వేధింపులు
హయత్‌నగర్: తనను ప్రేమించాలని మేన మరదలిని వేధిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన శుక్రవారం హయత్‌నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్ డివిజన్ లెక్చరర్స్‌కాలనీలో నివసించే కేతుల జంగారెడ్డి అశ్విని(18)ను వరుసకు మేనబావ అయిన రాఘవేంద్రకాలనీలో నివసించే లింగారెడ్డి గత కొంత కాలం నుంచి తనను ప్రేమించమని, పెళ్లి చేసుకుంటానని వేధించడం మొదలు పెట్టాడు. దీంతో విసుగు చెందిన అశ్విని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా అశ్విని తండ్రి, ఆమె బంధువులు లింగారెడ్డిపై దాడి చేయడంతో అతని తలకు గాయమైంది. దీంతో అశ్విని తండ్రి, అతని బంధువులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రొద్దుటూరులో.. ఫ్యాన్ హోరు
మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వరద ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రజా సేవలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తొలిమారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీ చేస్తున్న రాచమల్లు ప్రసాదరెడ్డికే స్థానిక పరిస్థితుల దృష్ట్యా విజయావకాశాలు మెండుగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 16 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఈయన కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, ఇన్చార్జి చైర్మన్‌గా పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యావంతుడు కావడం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం రాచమల్లుకు లాభించే అంశాలు. సమీప ప్రత్యర్థిగా ఉన్న నంద్యాల వరదరాజులరెడ్డి పాతికేళ్లు ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి నిరోధకుడుగా ప్రజల మనసుల్లో ముద్రవేసుకున్నారనే భావన ప్రజల్లో ఉంది. ఈ కారణంగానే 2009 ఎన్నికల్లో లింగారెడ్డి చేతిలో 16,156 ఓట్లతో వరద ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవగుడి నారాయణరెడ్డి చేతిలో ఓటమి పాలైన వరద ప్రస్తుతం మరో మారు ఎమ్మెల్యే ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ చేస్తున్నారు. వరదకు ఎదురుగాలి... 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వరద ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ పొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన ఎన్నికల్లో జి ల్లాలోని 10 అసెం బ్లీ నియోజకవర్గాలకు గాను ప్రొద్దుటూరులో మాత్రమే వరదరాజులరెడ్డి కాంగ్రెస్‌పార్టీ తరపున ఓటమి చెందారు. ఇది లావుండగా 1981లో రాజకీయ రంగ ప్రవే శం చేసి సమితి ఎన్నికల్లో పోటీ చేయగా శెట్టిపల్లె రఘురామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీ రమణారెడ్డి చేతిలో వరదరాజులరెడ్డి ఓటమి పాలయ్యారు. 1985, 1989, 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అలాగే 1981లో తొలిమారు సమితి ప్రెసిడెంట్, 1983లో, 2009లో ఎమ్మెల్యేగా, 2011లో ఎమ్మెల్సీకి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ ప్రకారం వరద జీవితంలో మొత్తం 5 మార్లు గెలుపొందగా, మరో నాలుగు మార్లు ఓటమిపాలయ్యారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు వరదకు ప్రతికూలంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు వీరే... సంవత్సవం పార్టీ గెలుపొందిన అభ్యర్థి 1952 కాంగ్రెస్ కె. బాలనారాయణరెడ్డి 1955 కాంగ్రెస్ కె. బాలనారాయణరెడ్డి 1957 ఇండిపెండెంట్ ఆర్సీ ఓబులరెడ్డి 1962 కాంగ్రెస్ ఆర్. రామసుబ్బారెడ్డి 1972 కాంగ్రెస్ కొప్పరపు సుబ్బారావు 1978 కాంగ్రెస్. ఐ చంద్ర ఓబులరె డ్డి రామిరెడ్డి 1983 టీడీపీ ఎం.వీ రమణారెడ్డి 1985 టీడీపీ ఎన్. వరదరాజులరెడ్డి 1989 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి 1994 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి 1999 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి 2004 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి 2009 టీడీపీ మల్లెల లింగారెడ్డి పట్టణ ఓటర్లే కీలకం.. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2,20,000 వరకు ఓటర్లు ఉండగా ఇందులో పట్టణంలోనే 1,23,000 మంది ఓటర్లు ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటములు ప్రధానంగా ప్రొద్దుటూరు పట్టణంపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ప్రొద్దుటూరు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పాతికేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వరద ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని, పెపైచ్చు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తాగునీటి కోసం మంజూరు చేసిన కుందూ-పెన్నా నీటి పథకాన్ని పూర్తి చేయలేకపోయారనే అపవాదు ప్రజల్లో ఉంది. అలాగే ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. వీటికి తోడు పట్టణంతోపాటు నియోజకవర్గంలో ప్రజలకు కనీసం మౌలిక వసతులు సమకూర్చడంలో విఫలమయ్యారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి అంశాలు ఎక్కువగా వరద ఓటమికి ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ కారణంగా తొలిమారు బలమైన పార్టీ తరపున పోటీ చేస్తున్న రాచమల్లు ప్రసాదరెడ్డినే విజయం వరిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఇదిలావుండగా ప్రొద్దుటూరులో అప్పుడే రాచమల్లు ప్రసాదరెడ్డి మెజారిటీపై బెట్టింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆయన ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. -
తమ్ముళ్లకూ వెన్నుపోటా?
బాబు వైఖరిపై మండిపడుతున్న పార్టీ నేతలు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారంటూ ఆగ్రహం పార్టీని నమ్ముకున్న వారిని కాదని వేరే వారికి టికెట్లివ్వడంపై మండిపాటు సీమాంధ్రలో భగ్గమన్న నిరసనలు.. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో ఎన్నికల చిచ్చు రగిలింది. సీమాంధ్రలో నామినేషన్ల చివరి రోజున పార్టీలో అసమ్మతి భగ్గుమంది.నమ్ముకున్న వారిని పార్టీ నట్టేట ముంచిందని, చంద్రబాబు ద్రోహానికి పాల్పడ్డారంటూ అనేక చోట్ల నేతలు తిరుగుబాట్లు ప్రకటించారు. తమ్ముళ్లకూ వెన్నుపోట్లు పొడిచారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడలో చంద్రబాబు బసచేసిన హోటల్ వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారంటూ నేతలు ఆగ్రహోదగ్రులయ్యారు. చంద్రబాబు చుట్టూ చేరిన కోటరీ నేతలు కార్పొరేట్లకు టికెట్లను అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డికి అన్యాయం జరిగిందంటూ ఆయన భార్య విజయవాడలో కన్నీటిపర్యంతమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి టికెట్టు ఆశించి భంగపడ్డ పోతినేని శ్రీనివాసరావు పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవిని గదిలో నిర్బంధించారు. పలు జిల్లాల్లోనూ టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలును కార్యకర్తలు అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి వచ్చి, విజయవాడలో బస చేసిన పార్టీ అధినేత చంద్రబాబుకు శనివారం నిరసనల సెగ తగిలింది. ఆయన బస చేసిన స్టార్ హోటల్ నిరసనలతో హోరెత్తింది. త మ నేతలకు అన్యాయం జరిగిందంటూ పలువురు నాయకుల అనుచరులు ఆందోళనలకు దిగారు. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి అనుచరులు చంద్రబాబు బస చేసిన హోటల్లో ముందు ధర్నా చేయటంతో పాటు భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోపలికి చొచ్చుకెళ్లారు. ప్రొద్దుటూరు టికెట్టును లింగారెడ్డికి ఇవ్వకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన వరదరాజులురెడ్డికి రూ.25 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీ ఉపాధ్యక్షుడు సీఎం రమేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదరాజులురెడ్డిని ఓడిస్తామని హెచ్చరించారు. ఆ సమయంలో చంద్రబాబు లింగారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పిలిపించుకుని రెండు నిమిషాలు మాట్లాడి పంపించారు. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో లింగారెడ్డి అనుచరులు ఆందోళన ఉద్ధృతం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారమంతటినీ చూసిన లింగారెడ్డి సతీమణి లక్ష్మీప్రసన్న తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ తనను కాదని, కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారో అర్థం కాలేదన్నారు.కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని గద్దె రామ్మోహన్‌కు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎంవీఆర్ చౌదరి వర్గీయులు కూడా ఇదే హోటల్ వద్ద ఆందోళనకు దిగారు. విశాఖ, తూర్పు గోదావరిలో స్థానికేతర చిచ్చు తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో స్థానిక, స్థానికేతర చిచ్చు రగిలింది. పెద్దాపురం సీటును స్థానికేతరుడైన పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పకు కేటాయించడంతో స్థానిక నేత గోలి రామారావు అనుచరులు భగ్గుమన్నారు. నామినేషన్ వేయడానికి వచ్చిన రాజప్ప కారును అడ్డుకుని, అద్దాలు పగులగొట్టారు. పార్టీ జెండాలు తగలబెట్టి, ‘రాజప్ప గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు.. పిఠాపురం సీటు ఆశించిన స్థానిక టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మకు కాకుండా పోతుల విశ్వానికి కేటాయించడంపై ఆగ్రహించిన కార్యకర్తలు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వస్తున్న విశ్వాన్ని చిత్రాడ, పాదగయ క్షేత్రం వద్ద అడ్డుకోబోయారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య విశ్వం నామినేషన్ వేశారు. వర్మ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో స్థానికేతరుడైన పంచకర్ల రమేష్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. గంటాను తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి సుందరపు విజయ్‌కుమార్‌కు టికెట్ రాకుండా అడ్డుకున్నారంటూ నిరసన వ్యక్తంచేశారు. పోలీసు బందోబస్తు మధ్య గంటా అక్కడ నుంచి వెళ్లారు. పంచకర్ల స్థానికేతరులను వెంట పెట్టుకుని వచ్చి నామినేషన్ దాఖలుచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సీటును మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు రామాంజనేయులుకు ఇవ్వటాన్ని నిరసిస్తూ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు మెంటే పార్ధసారథి అనుచరులు నిరసన తెలిపారు. మంగళగిరిలో ముష్టియుద్ధం గుంటూరు జిల్లా మంగళగిరిలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. మంగళగిరి టికెట్‌ను గంజి చిరంజీవికి ఇవ్వడంతో టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు, ఆయన వర్గీయులు భగ్గుమన్నారు. వారు చిరంజీవిని కొద్దిసేపు గదిలో బంధించారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని చిరంజీవిని విడిపించి తమ వాహనంలో తీసుకెళ్లి నామినేషన్ వేయించారు. ఈ సందర్భంగా ఇద్దరి అనుచరులు పరస్పరం దాడులు చేసుకోవటంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. గుంటూరు తూర్పు, గుంటూరు లోక్‌సభ, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, సింహాద్రియాదవ్లు వారి సామాజికవర్గానికి జరిగిన ఆన్యాయానికి ప్రతీకారంగా సత్తా చాటుతామని హెచ్చరించారు. ‘నా టికెట్ దొంగిలించారు’ విజయనగరం జిల్లా కురుపాం టికెట్టు కోల్పోయిన నిమ్మక జయరాజ్ ‘‘నేను టీడీపీ బాధితుడిని’’ అని రాసి ఉన్న ప్లకార్డును మెడలో వేసుకుని నిరసన తెలిపారు. కురుపాం మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయానికి ఉన్న పచ్చ రంగు స్థానంలో తెల్ల రంగు వేయించారు. టీడీపీలో దొంగలు పడ్డారని, తన టిక్కెట్‌ను వారే దొంగిలించారని జయరాజ్ అన్నారు. పార్టీ తనకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. శత్రుచర్ల, థాట్రాజ్ డబ్బులు చెల్లించి టికెట్లు కొనుక్కున్నారని ఆరోపించారు. ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. -
బెజవాడలో బాబుకు టికెట్ల సెగ
విజయవాడ : ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు టికెట్ల సెగ తగిలింది. ఆయన బస చేసిన హోటల్ వద్ద టికెట్లు రాని నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డికి టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు శనివారం చంద్రబాబు బస చేసిన హోటల్ వద్ద ఆందోళనకు చేపట్టారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం.రమేష్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. హోటల్ లోకి దూసుకెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
'టీడీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది'
-
వరదరాజుల రెడ్డికి టికెట్ ఇవ్వడంపై రగడ
కడప : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు శాసనసభ స్థానంపై టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డిని కాదని ఇటీవలే పార్టీలో చేరిన వరదరాజుల రెడ్డికి టికెట్ ఇవ్వడంపై రగడ మొదలైంది. ఇన్ని రోజులూ నాన్చుతూ, హఠాత్తుగా అర్థరాత్రి వరదరాజుల రెడ్డికి టికెట్ ఇవ్వడంతో లింగారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిడిపి జెండాలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ సింబర్ సైకిల్‌ను సైతం మంటల్లో వేశారు. సీఎం రమేష్ ఈ కుట్రకు సూత్రధారి అని... వరదరాజుల రెడ్డి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని ఆయనకు టికెట్ కేటాయించారని లింగారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేష్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.