ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు టికెట్ల సెగ తగిలింది.
విజయవాడ : ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు టికెట్ల సెగ తగిలింది. ఆయన బస చేసిన హోటల్ వద్ద టికెట్లు రాని నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డికి టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు శనివారం చంద్రబాబు బస చేసిన హోటల్ వద్ద ఆందోళనకు చేపట్టారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం.రమేష్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. హోటల్ లోకి దూసుకెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.