Bejawada
-
విజ్ఞాన యాత్రలో విషాదం
విజయవాడ స్పోర్ట్స్/సాక్షి, అమరావతి: బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు చేపట్టిన విజ్ఞాన యాత్రలో విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులు కావడంతో ఈ నెల 2న 80 మంది న్యాయవాదులు విజయవాడ నుంచి 2 బస్సుల్లో యాత్రకు బయలుదేరారు. ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు న్యాయస్థానాలు, విజ్ఞాన ప్రాంతాలను చూసుకుంటూ ఈ నెల 6న రాజస్థాన్ చేరుకున్నారు. 7న రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి జైపూర్ వస్తుండగా మార్గ మధ్యలోని జో«ధ్‌పూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఓ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతిచెందారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు బీబీఏ కార్యదర్శి అరిగల శివరామప్రసాద్ (రాజా), న్యాయవాదులు పద్మజ, అరుణదేవి, నాగరాజు, గంగాభవాని, జయలక్ష్మీ, సత్యవాణి, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్‌తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు జ్యోత్స్న విద్యార్ధి ఉద్యమ కార్యకర్తగా పనిచేశారు. నేటి తరుణీతరంగాలు, సేఫ్ లను స్థాపించడంతో కీలకభూమిక పోషించారు. జ్యోత్స్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని విమానంలో బుధవారం విజయవాడ తీసుకువచ్చేందుకు న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నారు. క్షతగాత్రులైన వారు సైతం విమానంలో విజయవాడ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, విమానం టికెట్లు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బీబీఏ కార్యదర్శి రాజా తెలిపారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు. రాజస్థాన్ సీఎం బజన్ లాల్ శర్మతో ఫోన్లో మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. -
బెజవాడను ముంచేసిన బుడమేరు! ముంపులోనే పలు కాలనీలు.. ఇంకా ఇతర అప్డేట్స్..
-
బెజవాడలో ఇదే అతి భారీ వర్షం
సాక్షి, అమరావతి: విజయవాడ పరిసరాల్లో రికార్డు స్థాయిలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. శనివారం అమరావతిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంతటి భారీ వర్షం ఇంతకుముందెన్నడూ ఈ ప్రాంతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ శాఖ రికార్డుల ప్రకారం 1989లో గన్నవరంలో 21.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 20 సెం.మీ. దాటితే అతి భారీ వర్షం కింద లెక్క. సమీప కాలంలో ఈ స్థాయి వర్షం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కురిసిన దాఖలాలు లేవు. శనివారం ఆ స్థాయిలో వర్షం కురిసింది. అమరావతి కంటే ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 32.3 సెం.మీ. వర్షం కురిసింది.తిరువూరులోనూ 26 సెం.మీ. వర్షం కురిసింది. 14 మండలాల్లో సగటున 24 గంటల వ్యవధిలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 62 ప్రాంతాల్లో 11.2 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 14 జిల్లాల పరిధిలోని 94 స్టేషన్లలో 7 నుంచి 12 సెం.మీ. వర్షం పడింది. మొత్తంగా రాష్ట్రమంతటా వర్షపాతాన్ని లెక్కించే యంత్రాలున్న ప్రాంతాల్లోని 75 శాతం ఏరియాల్లో వర్షపాతాలు నమోదయ్యాయి. ఒకేరోజు ఇంత ఏరియాలో వర్షం కురవడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల తీవ్రత ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉంది. 12 నుంచి 24 గంటల వ్యవధిలోనే క్లౌడ్ బరస్ట్ (మేఘాలు బద్ధలైనట్టు) అయినట్టు కుండపోత వర్షం పడింది.ఈ వాన నీరంతా సమీపంలోని వాగులు గుండా కృష్ణా నదిలోకి ప్రవహిస్తోంది. ఖమ్మం పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో మున్నేరు, కట్టలేరు, రామిలేరు వాగులన్నీ పొంగి బుడమేరులో కలిశాయి. బుడమేరు కృష్ణా నదిలో కలిసే పరిస్థితి లేకపోవడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి ఈ నీరంతా వచ్చి చేరుతోంది. సాధారణంగా ఈ వర్షమంతా 48 గంటల్లో కురిస్తే అది నెమ్మదిగా వచ్చి డ్రెయిన్ల ద్వారా కృష్ణా నదిలో కలవాలి. కానీ.. 12 నుంచి 24 గంటల్లోనే అతి భారీ వర్షాలు కురవడంతో బుడమేరు ఒక్కసారిగా పొంగింది.కొండవీడు ఘాట్ రోడ్డులో కూలిన కొండచరియలు సాక్షి, అమరావతి: కొండవీడు ఘాట్ రోడ్డులో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండవీడు నగరవనాన్ని సోమ, మంగళవారాలు మూసివేస్తున్నట్లు పల్నాడు జిల్లా అటవీ అధికారి ఎన్.రామచంద్రరావు తెలిపారు. ఘాట్ రోడ్డుపై పడిన బండరాళ్లను ఆర్అండ్బీ శాఖ సహకారంతో తొలగిస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని సందర్శకులు గమనించాలని కోరారు. -
బెజవాడలో టీడీపీ విధ్వంసకాండ
విజయవాడ: బెజవాడలో పట్టపగలే టీడీపీ కార్యకర్తలు విధ్వంసకాండకు దిగారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై దాడికి విఫలయత్నం చేశాయి. నగరంలోని లబ్బీపేట మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని వంశీ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రాత్రి వరకు ఈ విధ్వంసకాండ కొనసాగింది.అరుపులు, కేకలు, బూతులతో ఆ ప్రాంతాన్ని అట్టుడికించారు. పోలీసులనూ తరిమేశారు. చివరకు సీఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచి్చంది. ఇటీవలి ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అక్కడికి వచ్చి అల్లరి మూకలకు మరింతగా రెచ్చగొట్టడం గమనార్హం. ముందస్తు వ్యూహంతోనే దాడి టీడీపీ అధినాయకత్వం అండతో, ముందస్తు వ్యూహంతోనే విజయవాడ సెంట్రల్, తూర్పు, గన్నవరం నియోజకవర్గాల నుంచి గంజాయి, మద్యంతో పాటు ఇతర మత్తు పదార్థాలు సేవించిన టీడీపీకి చెందిన యువకులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. తొలుత మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాలుగు కార్లలో కత్తులు, ఇటుకలు, కంకర రాళ్లు, కర్రలతో కొందరు టీడీపీ కార్యకర్తలు వంశీ ఉంటున్న అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. వస్తూనే బూతులు తిడుతూ కార్లలో తెచ్చుకున్న రాళ్లను విసిరారు. రాళ్ల దాడిలో వంశీ కారుతో పాటు ఆ ప్రాంతంలోని కొన్ని కార్లు, ద్విచక్ర వాహనాలు, సమీపంలోని ఇళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.కొందరు సమీపంలోని ఇళ్లలోకి చొరబడి కర్రలతో కుండీలు, కిటికీలు పగలకొట్టి భీభత్సాన్ని సృష్టించారు. టీడీపీ జెండాలను పట్టుకుని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి కవి్వంపు చర్యలకు దిగారు. బూతులు, అరుపులతో అక్కడున్న అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. అపార్ట్మెంట్ గోడ దూకి సెల్లార్లో ఉన్న పలు కార్ల అద్దాలను పగులగొట్టారు. ప్రతి అర గంటకు మరికొందరు అక్కడకు చేరుకోవడంతో ఆ ప్రాంతం పూర్తిగా టీడీపీ వారితో నిండిపోయింది. 300 మందికి పైగా ఈ దాడిలో పాల్గొన్నారు. ఒక్కసారిగా భీభత్సం సృష్టించడంతో స్థానికులు భయకంపితులయ్యారు.పలువురు మహిళలు భయాందోళనకు గురయ్యారు. పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ ఆదేశాలతో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూడగానే అల్లరి మూకలు మరింతగా రెచి్చపోయాయి. విధ్వంసాన్ని అదుపు చేసేందుకు వచి్చన పోలీసులను వెంటబడి తరిమారు. పరిస్థితి అదుపు తప్పడంతో సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి.సీఆర్పీఎఫ్ పోలీసులు వచ్చీ రాగానే లాఠీచార్జీ ప్రారంభించడంతో టీడీపీ కార్యకర్తలు పరుగులు పెట్టారు. దాడులకు పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు సమీపంలోని ఇళ్లలోకి దూరి దాక్కున్నారు. పోలీసులు వారిని వెతికి పట్టుకుని మరీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విధ్వంసానికి ఆజ్యం పోసిన యార్లగడ్డ టీడీపీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అక్కడకు చేరుకుని విధ్వంసానికి ఆజ్యం పోసేందుకు ప్రయత్నించారు. అదుపులోకి తీసుకుంటున్న వారిని అక్కడే వదిలేయాలని పోలీసులకు హుకుం జారీ చేశారు. పోలీసులు ససేమిరా అనడంతో వారితో వాగ్వాదానికి దిగారు.టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతోనే ఈ దాడికి దిగినట్లు చెప్పడంతో అక్కడున్న పోలీసులు సైతం నివ్వెరపోయారు. స్వయంగా చంద్రబాబు వచ్చి విడిపిస్తారంటూ అరెస్ట్ అయిన వారిని మరింత రెచ్చగొట్టేందుకు వెంకట్రావు ప్రయత్నం చేశారు. పోలీసులు అక్కడివారిని తరిమేస్తున్నా అక్కడే తిరుగుతూ కవి్వంపు చర్యలు కొనసాగించారు. అర్ధరాత్రి వరకు పరిస్థితి ఇలానే కొనసాగింది. గవర్నర్ కార్యాలయ ఉద్యోగి వాహనం ధ్వంసం టీడీపీ కార్యకర్తలు మద్యం, గంజాయి మత్తులో విచక్షణరహితంగా చేసిన దాడిలో గవర్నర్ కార్యాలయ ఉద్యోగి కారు కూడా ధ్వంసమైంది. ఆ ఉద్యోగి అదే అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సెల్లార్లో పార్క్ చేసిన ఆయన కారుపై టీడీపీ వారు రాళ్లు రువ్వడంతో అద్దాలన్నీ పూర్తిగా పగిలిపోయాయి.దేవినేని అవినాశ్‌కు భద్రత పెంపు గుణదల (విజయవాడ తూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి దేవినేని అవినాశ్‌కు పోలీసులు భద్రత పెంచారు. విజయవాడ ఏలూరు రోడ్డులోని ఆయన ఇల్లు, కార్యాలయం వద్ద మాచవరం పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఆయన్ని కలిసేందుకు వచ్చే అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.సమీపంలో అనుమానంగా సంచరించే వారిని గమనిస్తున్నారు. యువకులు గుంపులుగా ఉండకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ అల్లరి మూకలు రాష్ట్రవ్యాప్తంగా విచక్షణరహితంగా విధ్వంసం సృష్టిస్తుండటంతో అవినాశ్‌కు భద్రత పెంచినట్లు మాచవరం పోలీసులు తెలిపారు. -
సామాజిక న్యాయానికి ‘నిలువెత్తు రూపం’
‘‘అంబేడ్కర్ స్మతివనం చరిత్రాత్మకమైనది. ఇది సామాజిక న్యాయ స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలుస్తుంది. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప నిర్మాణం ఇది’’ – విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు వారధిగా, ఆంధ్రప్రదేశ్ నడిరోడ్డున ఉన్న విజయవాడ నగరంలో సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపం ఆవిష్కృతమవుతోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహోన్నత రూపం ప్రజలకు దర్శనమివ్వబోతోంది. ► పెడస్టల్‌తో కలిపి 210 అడుగుల ఎత్తయిన నిర్మాణం ► 18.81 ఎకరాల్లో స్మృతివనం నిర్మాణం ► రూ.400 కోట్లతో చరిత్రలో నిలిచేలా... ► అంబేడ్కర్ ఫొటో గ్యాలరీ, జీవిత విశేషాల శిల్పాలు ► కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్టులు యిర్రింకి ఉమమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి: బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ లక్ష్యాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మదిలోంచి వ చ్చిన ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేడ్కర్ స్మృతివనం రూపుదిద్దుకుంది. బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడస్టల్ పైన 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఠీవిగా నిలబడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ‘స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ మహా శిల్పం)’గా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్ స్మృతివనం ప్రజల సందర్శనకు సిద్ధమైంది. స్మృతివనాన్ని, అంబేడ్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా రికార్డు సృష్టించనుంది. అంబేడ్కర్ ఆలోచనలకు అద్దం పట్టే అద్భుత కళాఖండంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అంబేడ్కర్ విగ్రహ పీఠం కింది భాగంలో నిర్మించే భవనంలో అంబేడ్కర్‌కు సంబంధించిన ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాల శిల్పాలు, ఆయన జీవితానికి సంబంధించిన పుస్తకాలతో కూడిన గ్రంధాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అవసరమైన జీవిత చిత్రాలను ఇతర రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నారు. అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, ధ్యాన కేంద్రం కూడా నిరి్మస్తున్నారు. చిన్నారులు ఆడుకోవడానికి ప్లే ఏరియా, పచ్చటి తివాచీ పరిచినట్టు అందమైన గార్డెన్లు. మ్యూజిక్ ఫౌంటెయిన్, వాటర్ ఫౌంటెయిన్లు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా కింది భాగంలో గడ్డితో తీర్చిదిద్దిన నెమళ్ల ఆకృతులను సందర్శకులను కట్టిపడేసేలా తీర్చిదిద్దారు. స్మృతివనం భవనంలో గోడలపై స్వాతంత్య్ర సమరం, స్వాతంత్య్రం వచ్చాక ఘట్టాలను అపురూప కళాఖండాలుగా ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నేతల ఫొటోలతో కూడిన కళాఖండాలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. స్మృతివనం చుట్టూ ప్రహరీ మొత్తం రాజస్థాన్ పింక్ కలర్ రాళ్లతో అద్భుతంగా నిర్మించారు. అక్కడక్కడా పాల రాతిని ఉపయోగించారు. ప్రహరీ చుట్టూ ఆకట్టుకునే ఆకృతుల్లో వాటర్ ఫౌంటేయిన్లు, ఎలివేషన్ డిజైన్లతో తీర్చిదిద్దారు. స్మృతివనం చుట్టూ దారి పొడవునా గ్రీనరీ ఉండేలా నిర్మాణాలు చేపట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం.. దేశంలోని అన్ని విగ్రహాల్లో మూడో స్థానం ► విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం. దేశంలో అన్ని పెద్ద విగ్రహాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ► దేశంలో అతి పెద్ద విగ్రహాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ–597 అడుగుల ఎత్తు)ది మొదటి స్థానం. దీన్ని గుజరాత్‌లోని నర్మదా డ్యామ్‌కు ఎదురుగా నిర్మించారు. 2018 అక్టోబర్ 31న జాతికి అంకితం చేశారు. ► రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ము చ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ–216 అడుగుల ఎత్తు) నిలుస్తుంది. శ్రీరామ నగరంలో పంచ లోహాలతో నిర్మించిన ఈ విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న ప్రారంభించారు. ► మూడో స్థానం విజయవాడ అంబేడ్కర్ కాంస్య విగ్రహం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ )ది. ఢిల్లీలో తయారైన విగ్రహం విడి భాగాలను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి తరలించి, విగ్రహంగా రూపుదిద్దారు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 210 అడుగులు. పెడస్టల్ భాగం 85 అడుగులు కాగా, కాంస్య విగ్రహం 125 అడుగులు. ఇది అంబేడ్కర్ విగ్రహాల్లో మొదటి స్థానంలోను, అన్ని విగ్రహాల్లో మూడో స్థానంలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ పక్కనే ఇటీవల ప్రారంభించిన అంబేడ్కర్ విగ్రహం మొత్తం 175 అడుగులు(ఫెడస్టల్ 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు) ఉంది. ‘సామాజిక సమతా సంకల్పం’ అంబేడ్కర్ స్మృతివనం, విగ్రహం ప్రారం¿ోత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహిస్తోంది. ‘సామాజిక సమతా సంకల్పం’ పేరుతో ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సభలు, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవాన్ని తెలియజేస్తూ గ్రామ, వార్డు సచివాయాల్లో ప్లెక్సీలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు, సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికార సిబ్బంది భాగస్వాములయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 19న విజయవాడలో ప్రారం¿ోత్సవానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి రానున్నారు. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా స్మృతివనం దేశంలోనే మరెక్కడా లేని విధంగా విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. విగ్రహ నిర్మాణం వేగంగానే పూర్తయింది. స్మృతివనం కూడా పూర్తయ్యాకే ప్రారం¿ోత్సవం చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అన్ని పనులను అంతే వేగంగా పూర్తి చేశాం. సందర్శకులు ఒక్కసారి స్మృతివనానికి వస్తే అంబేడ్కర్ చరిత్ర పూర్తిగా అవగతమయ్యేలా ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. గతంలో చంద్రబాబు అంబేడ్కర్ స్మృతివనాన్ని అమరావతి రాజధానిలో నిరి్మస్తానని ప్రకటించి దాన్ని గాలికి వదిలేసి దగా చేశాడు. – మేరుగు నాగార్జున, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రికార్డు సమయంలో స్మృతివనం పనులు పూర్తి అంబేడ్కర్ స్మృతివనం పనులు రికార్డు సమయంలో శరవేగంగా పూర్తయ్యాయి. సీఎం వైఎస్ జగన్ మహోన్నత సంకల్పంతో చేపట్టిన ఈ గొప్ప ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఎనలేని కృషి చేశారు. ఈ నెల 19న అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దేశంలోనే ఇది అద్బుత కళాఖండంగా నిలుస్తుంది. ఈ ప్రాంతం గొప్ప దర్శనీయ క్షేత్రంగా మారుతుంది. – శ్రీలక్ష్మి, పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇవీ ప్రత్యేకతలు ► బేస్ (పెడస్టల్) 85 అడుగులు (జి ప్లస్ టు అంతస్తులు) ► విగ్రహం తయారీకి ఉపయోగించిన స్టెయిన్లెస్ స్టీల్ 400 మెట్రిక్ టన్నులు ► 120 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని విగ్రహం కోసం ఉపయోగించారు ► 2,200 మెట్రిక్ టన్నుల రాజస్థాన్ పింక్ ఇసుక రాయి తాపడం ► కన్వెన్షన్ సెంటర్, యాంఫీ థియేటర్ ► మెడిటేషన్ సెంటర్ ► విశాలమైన కారిడార్లు (నడక దారులు) ► పచ్చని గార్డెన్, అందమైన మొక్కలు -
తొలి విజయం సాధించిన బెజవాడ టైగర్స్.. అదరగొట్టిన వారియర్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో బెజవాడ టైగర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైగర్స్ 7 వికెట్లతో ఉత్తరాంధ్ర లయన్స్‌ను ఓడించింది. లయన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మహీప్ కుమార్ (77 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికీ భుయ్ (41; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి జట్టును గెలిపించారు. వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ‘టై’గా ముగిసింది. అయితే సూపర్ ఓవర్ ద్వారా వారియర్స్ విజేతగా నిలిచింది. వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు సాధించింది. ప్రశాంత్ (73; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. విహారి (71; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిషేక్ రెడ్డి (58 రిటైర్డ్‌హర్ట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సూపర్ ఓవర్లో కింగ్స్ 2 వికెట్లు కోల్పోయి ఒకే ఒక పరుగు చేయగా, వారియర్స్ 2 పరుగులు చేసి గెలిచింది. -
కౌతవరం ముద్దుబిడ్డ కైకాల
సాక్షి, విజయవాడ పశ్చిమ(కృష్ణా జిల్లా): కౌతవరం ముద్దుబిడ్డ కైకాల సత్యనారాయణ మృతితో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. కృష్ణాతీరం నుంచి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తరహాలో కళారంగాన్ని సుసంపన్నం చేసిన మరో ఆణిముత్యం కైకాల సత్యనారాయణ. కళాకారులు ఎవరికీ దక్కని ‘నవరస నటనా సార్వభౌమ’ బిరుదు కైకాల సొంతం. బెజవాడలో ఆయన మిత్రులు చాలా మంది ఉండేవారు. వారందరితో చక్కని సంబంధాలను కొనసాగించేవారు. సిద్ధార్థ అకాడమీలో ఆయన సభ్యు నిగా ఉన్నారు. ప్రతి ఏటా ఆయన సిఫారసు మేరకు సీట్ల కేటాయింపు కూడా జరిగేది. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయంలో బెజవాడ నుంచే ఆయన చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 2017లో మహానటి సావిత్రి కళా పీఠం ఆయనకు విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆత్మీయ సత్కారం చేసి గౌరవించింది. కళాక్షేత్రంలోనే నటుడు ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహం ఆవిష్కరణకు మెగాస్టార్ చిరంజీవితో పాటుగా సత్యనారాయణ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సభలో చిరంజీవి సత్యనారాయణకు స్వర్ణ కంకణాన్ని తొడిగి ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. కనకదుర్గమ్మ చరిత్రపై సినిమాను చిత్రీకరించిన సమయంలోనూ విజయవాడలో ఆయన చాలా రోజులు ఇక్కడే ఉండి స్థానిక మిత్రులతో గడిపారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనప్పటికీ సరైన గుర్తింపు రాలేదనే బాధ ఆయనలో ఉండేది. టీడీపీ తనకు కేంద్ర స్థాయిలో అవార్డు రాకుండా అడ్డుకున్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా వ్యక్తం చేశారని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కైకాలకు నివాళులు కైకాల మరణ వార్త తెలియగానే నగరంలోని పలు సంస్థలు ఆయనకు నివాళులర్పించాయి. నగరంలోని కౌతా కళావేదిక ప్రాంగణంలో మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో కైకాల సత్యనారాయణను స్మరిస్తూ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మీ, సభ్యులు బాలాజీ కుమార్, దాసరి రమణ, పైడిపాటి వెంకన్న నివాళులర్పించారు. కైకాల మహానటుడు : జాతీయ కాపు సమాఖ్య కైకాల సత్యనారాయణ మహానటుడు అని జాతీయ కాపు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు నరహరశెట్టి శ్రీహరి అన్నారు. కైకాల అన్ని రకాల పాత్రల్లో గొప్ప నటనను కనబరచి యావత్ ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించారని కొనియాడారు. ఆయన మరణం కళారంగానికి తీరని లోటని అన్నారు. బందరు ఎంపీగా సేవలందించిన కైకాల మచిలీపట్నంటౌన్: సినీ నటుడు కైకాల సత్యనారాయణ బందరు ఎంపీగా రెండేళ్ల పాటు సేవలు అందించారు. 1996లో మధ్యంతర ఎన్నికలు రావటంతో టీడీపీ ఎంపీ అభ్యరి్థగా పోటీ చేసి దాదాపు 70 వేలకు పైగా ఓట్ల మెజారీ్టతో కైకాల గెలుపొందారు. దాదాపు రెండేళ్ల పాటు ఆయన ఎంపీగా పనిచేశారు. ఎంపీగా ఉన్న సమయంలో మచిలీపట్నం విచ్చేసి కార్యకర్తలతో సమాలోచనలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ఎంపీ నిధులతో పలు గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు, బస్షెల్టర్లు వంటివి నిర్మించేందుకు కృషి చేశారు. మచిలీపట్నం వచ్చిన సమయంలో ఆర్అండ్బీ అతిథి గృహంలో బస చేసి ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఆ తరువాత సమీపంలోని ఆయన స్వగ్రామం కవుతరం వెళ్లేవారు. కైకాల సత్యనారాయణ మృతితో టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, బీసీ సంఘ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య తదితరులు నివాళులరి్పంచారు. -
బెజవాడ పోస్ట్ ఆఫీస్ లో నిధులు గోల్మాల్
-
APL 2022: వైజాగ్ వారియర్స్ పరుగుల వరద.. రెండో విజయం!
Andhra Premier League- విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్‌లో ఉత్తరాంధ్ర ఫ్రాంచైజీ జట్లు వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయిన్స్ తలపడ్డాయి. వైఎస్సార్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ టోర్నీలో తొమ్మిదో మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు బౌండరీలతో సత్తా చాటుకున్నారు. టాస్ గెలిచిన వైజాగ్ వారియర్స్ కెప్టెన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఉత్తరాంధ్ర లయిన్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. లయిన్స్ ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేయగా వారియర్స్ మరో ఐదు బంతులుండగానే విజయం సాధించింది. నిలకడగా ఆడినా... బ్యాటింగ్ ప్రారంభింన లయన్స్ ఓపెనర్లు గుల్ఫమ్, భరత్ జోడి తొలి వికెట్‌కు 56 పరుగులు చేశారు. గుల్ఫమ్ రెండు ఫోర్లు ఒక సిక్సర్‌తో 22 పరుగులు చేసి వెనుతిరిగాడు. భరత్..6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు, వర్మ (మూడుఫోర్లు, ఒక సిక్సర్‌తో) 21 పరుగులతో స్కోర్ 88 పరుగులకు చేర్చారు. భరత్‌తో పాటు తర్వాత బంతికే వర్మ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ దశలో క్రాంతి (41,ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు)కి రోహిత్ (18, ఒకఫోర్,ఒక సిక్సర్)తోడై 141 పరుగులకు స్కోర్ బోర్డు పరుగులెత్తించారు. ఈ క్రమంలో 141 పరుగుల వద్ద రోహిత్, 159 పరుగుల వద్ద క్రాంతి ఔటయ్యారు. స్కోర్ 174 పరుగులకు చేరే క్రమంలో మరో రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో ఏడు వికెట్లకు 176 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగింంది. సిద్దార్థ రెండు వికెట్లు తీయగా కార్తీక్, వేణు, ఆంజనేయులు ఒకో వికెట్ తీశారు. మిడిలార్డర్లో నిలదొక్కుకుంటూ.... వారియర్స్ ఓపెనరు గిరినాథ్ (7) ప్రమోద్ వేసిన తొలి ఓవర్ (ఇన్నింగ్స్ రెండో ఓవర్)వరి బంతికి దొరికిపోయాడు. దీంతో మరో ఓపెనర్, కెప్టెన్ అశ్విన్‌తో కలిసిన సాయికృష్ణ 47(ఆరుఫోర్లు,ఒకసిక్సర్) 99 పరుగుల వద్ద వెనుతిరిగాడు. అశ్విన్ 47 (ఐదుఫోర్లు, ఒక సిక్సర్)116 పరుగుల వద్ద వెనుతిరిగ్గా....మరో రెండే పరుగులకే ధృవ్(1)వికెట్ కోల్పోయింది. నరేన్‌తో కలిసి వికెట్ చేజార్చుకోకుండా ఇన్నింగ్స్ సరిదిద్దేక్రమంలో కరణ్ (8) 16.2 ఓవర్‌వద్ద వెనుతిరిగాడు. అనంతరం నరేన్, మనోహార్ (ఏడుబంతుల్లో మూడు సిక్సర్లతో 21పరుగులు) జోడి చెలరేగిపోయింది. నరేన్ (20 బంతుల్లోనే రెండేసి ఫోర్లు, సిక్సర్లతో) 34పరుగులతో నిలి జట్టుకు విజయాన్నందించాడు. కార్తీక్ 3పరుగులతో నిలిచాడు. దీంతో మరో ఐదుబంతులుండగానే వారియర్స్ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రవెద్, షోయిబ్ రెండేసి వికెట్లు తీయగా వర్మ, సాయికౌషిక్ చెరో వికెట్ తీశారు. ఏడో ఓవర్లోనే పై చేయి సాధించిన వారియర్స్ 11వ ఓవర్‌కు పూర్తిగా పట్టుసాధిం మిడిలార్డలో నిలదొక్కుకుని విజయం దిశగా సాగింది. సిద్ధార్ధ బెస్ట్ బౌలర్, మ్యాచ్ బెస్ట్‌గా నిలవగా... సాయికృష్ణ బెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. ఆధిక్యంలో కొనసాగుతున్న టైగర్స్ ఏపీఎల్‌లో ఐదో రోజు మ్యాచ్‌లు ముగిసేప్పటికి బెజవాడ టైగర్స్ మూడు మ్యాచ్‌లాడి 10 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైజాగ్ వారియర్స్ మూడు మ్యాచ్‌లాడి 8 పాయింట్లతో ద్వితీయస్థానంలోకి చేరుకోగా నాలుగు మ్యాచ్‌లాడిన గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయిన్స్, మూడు మ్యాచ్‌లాడిన రాయలసీమ కింగ్స్ 6 పాయింట్లతో కొనసాగుతున్నాయి. కోస్టల్ రైడర్స్ 4 పాయింట్లు సాధించింది. చదవండి: IND Vs ENG 3rd T20: సూర్య 'ప్రతాపం' సరిపోలేదు.. సిరీస్ మాత్రం టీమిండియాదే -
Andhra Premier League: ఏపీఎల్‌లో ఆడే ఆరు జట్ల పేర్లు తెలుసా?
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ తరహాలో రాష్ట్రంలో నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ పోటీల ఫ్రాంచైజీ లోగోలను మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ పోటీలు జూలై 6 నుంచి 17వ తేదీ వరకు విశాఖలో జరుగుతాయి. పోటీలకు ఆరు ఫ్రాంచైజీలను ఎంపిక చేశారు. ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏపీఎల్‌కు శ్రీరాం గ్రూప్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగస్వామ్యం అవుతున్న ఆరు ఫ్రాంచైజీ జట్ల అధినేతలు లోగోలను ఆవిష్కరించారు. క్రికెటర్ల వేలం ఈనెల 24న వైఎస్సార్ స్టేడియంలో జరుగుతుందని ఏసీఏ సీఈవో శివారెడ్డి తెలిపారు. ఏసీఏ కోశాధికారి ఎస్ఆర్ గోపీనాధరెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సత్యప్రసాద్, సభ్యుడు ఆర్వీసీహెచ్ ప్రసాద్, ఆరు ఫ్రాంచైజీల అధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీఎల్‌లో ఆరు జట్లు ఇవే! ►ఉత్తరాంధ్ర లయన్స్ ►రాయలసీమ కింగ్స్ ►గోదావరి టైటాన్స్ ►కోస్టల్ రైడర్స్ ►బెజవాడ టైగర్స్ ►వైజాగ్ వారియర్స్ చదవండి: Rishabh Pant: నేనైతే పంత్ కెప్టెన్ కాకుండా కచ్చితంగా అడ్డుకునేవాడిని! ధోని ఏమో అలా.. కోహ్లి ఇలా! -
జాతీయ పతాక రూపకల్పనకు బెజవాడ వేదిక
విజయవాడ కల్చరల్: జాతీయ పతాకం రూపకల్పనకు బెజవాడ వేదిక కావడం గర్వకారణమని దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎక్స్‌రే సాహిత్యసేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జాతీయ పతాక రూపకల్పన శతజయంతి వేడుకలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు జాతీయ కీర్తిపతాక పురస్కారాల కార్యక్రమం జరిగింది. వెలంపల్లి మాట్లాడుతూ జాతీయ పతాకం రూపకల్పనకు తెలుగు జాతి రత్నం పింగళి వెంకయ్య పూనుకోవడం చరిత్ర చెప్పిన సాక్ష్యమన్నారు. శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య సేవలను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సంస్థ అధ్యక్షుడు కొల్లూరి అధ్యక్షతన నిర్వహించిన సభలో పింగళి వెంకయ్య మనుమరాలు పింగళి రమాదేవి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.విద్యాధరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులకు జాతీయ కీర్తి పతాక పురస్కారాలను అందజేశారు. -
బెజవాడలో హెలీ రైడ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దసరాను పురస్కరించుకుని భక్తులు హెలీకాఫ్టర్లో విహరిస్తూ బెజవాడ అందాలను ఆస్వాదించే అవకాశాన్ని కృష్ణా జిల్లా యంత్రాంగం కల్పించింది. పర్యాటకశాఖ, నగర మునిసిపల్ కార్పొరేషన్, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవకాశం కల్పించారు. శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ విహంగ సేవలు ప్రారంభించారు. తొలుత ఆలయ ఈవో భ్రమరాంబ ప్రయాణికులతో నగర అందాలను తిలకించారు. కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జేసీ (అభివృద్ధి) శివశంకర్ కూడా హెలీకాఫ్టర్లో విహరించారు. నగర సీపీ బత్తిన శ్రీనివాసులు, మేయర్ భాగ్యలక్ష్మి, ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ భరత్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి హెలీరైడ్.. : ఈ నెల 17 వరకు జరిగే హెలీ రైడ్ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 6 నిమిషాల విహంగ యాత్రకు రూ.3,500, 13 నిమిషాలకు రూ.6 వేలుగా ధరను నిర్ణయించారు. సన్ రైజ్ ఎయిర్ చార్టర్ సంస్థ, తుంబై ఏవియేషన్ ప్రైవేట్ సంస్థ సంయుక్తంగా హెలికాప్టర్ నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. -
పడమట గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురి అరెస్టు
సాక్షి, విజయవాడ: బెజవాడ పడమట గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు మరో నలుగురిని మంగళవారం అరెస్టు చేశారు. వారిలో పండు గ్రూప్‌కు చెందిన రౌడీ షీటర్ అనంత్ కుమార్, అజయ్, శంకర్, మస్తాన్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల వెల్లడించారు. అయితే ఇప్పటికే పండు గ్యాంగ్‌లోని 26 మందిని, సందీప్ గ్రూప్‌లోని 24 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే పండు గ్రూప్‌కు చెందిన రౌడీ షీటర్ అనంత్ కుమార్‌పై సీపీ బత్తిన శ్రీనివాసులు నగర బహిష్కరణ వేటు వేశారు. అదే గ్యాంగ్‌లోని మరో 18 మందిని సస్పెక్ట్ చేస్తూ.. మరో 8 మందిపై పడమటి పోలీసులు రౌడీ షీట్ కేసులు తెలిచారు. మరోసారి స్ట్రీట్ ఫైట్లకు దిగి బెజవాడ ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. చదవండి: విశాఖలో మరో గ్యాంగ్‌వార్ కలకలం -
బెజవాడలో బెట్టింగ్ ముఠా అరెస్టు
సాక్షి, అమరావతి బ్యూరో: పదుల సంఖ్యలో సబ్ బుకీలు, పంటర్లను పెట్టుకుని యథేచ్ఛగా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠా గుట్టును విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి బెట్టింగ్ నిర్వహణకు ఉపయోగించే సామగ్రితోపాటు రూ. 16.02 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీసు కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో నగర సీపీ ద్వారకా తిరుమలరావు విలేకరుల సమావేశంలో బెట్టింగ్ ముఠా వివరాలు వెల్లడించారు. విజయవాడ మాచవరం పరిధిలోని మారుతీనగర్ మసీదు వీధిలో నివాసం ఉండే పైలా ప్రసాద్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో 9 మంది పంటర్లతో క్రికెట్ బెట్టింగ్‌కు శ్రీకారం చుట్టాడు. పశ్చిమగోదావరి జిల్లా కైకారం గ్రామానికి చెందిన ప్రధాన బుకీ కళ్యాణ్ చక్రవర్తితో కలిసి బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఈ ముఠా సభ్యులు ఆంధ్రప్రదేశ్‌తోపాటు హైదరాబాద్‌లోని ఇతర బెట్టింగ్ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కళ్యాణ చక్రవర్తి గురించి చెప్పడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. వీరితోపాటు విజయవాడలోని మొగల్రాజపురానికి చెందిన మోహన్‌కృష్ణ, కృష్ణలంకకు చెందిన ఉండి శరత్‌చంద్రను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 16.02 లక్షల నగదుతోపాటు 19 సెల్ఫోన్లు, ఒక లైన్‌బాక్స్, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసును మాచవరం పోలీసులకు అప్పగించారు. -
న్యాయవాదిపై రౌడీషీట్.. లాయర్స్ ఫైర్..!
సాక్షి, విజయవాడ: బెజవాడ పోలీసులు ఓ న్యాయవాదిపై అక్రమంగా రౌడీషీట్ నమోదు చేశారు. దీనిపై ఆగ్రహించిన బెజవాడ బార్ అసోసియేషన్ నేటి నుంచి నాలుగు రోజుల పాటు కోర్టుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఈ రోజు నుంచి న్యాయవాదులు కోర్టు సెంటర్లో నిరసన దీక్షలు చేపట్టునున్నారు. బెజవాడ పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. భవానీపురం పోలీస్ స్టేషన్లో న్యాయవాదిపై నమోదు చేసిన రౌడీషీట్ ఉపసంహరించుకోవాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. న్యాయవాదులు పోలీసుల వేధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. దీంతో లాయర్స్ తీవ్ర ఆందోళనకు దిగారు. -
ఉలిక్కిపడ్డ బెజవాడ..!
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నాజర్‌పేటకు చెందిన రౌడీషీటర్ వేమూరి సుబ్రహ్మణ్యం (35), అలియాస్ సుబ్బు తన ప్రత్యర్థుల చేతిలో విజయవాడ నగరంలోని మాచవరం ఏరియాలో బుధవారం దారుణంగా హత్యకు గురయ్యాడు. సినీఫక్కీలో వచ్చిన దుండగులు నిమిషాల వ్యవధిలో హత్య చేసి పరారయ్యారు. ఆరుగురు వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో సుబ్బును నడిరోడ్డుపై కిరాతకంగా నరికి చంపారు. జన సంచారం రద్దీగా ఉండే ఏలూరు రోడ్డుకు సమీపంలో హత్య జరగడంతో ప్రజలు గజగజ వణికిపోయారు. టీడీపీ యూత్ విభాగం నగర అధ్యక్షుడు కాట్రగడ్డ శ్రీను తన భర్తను హత్య చేయించాడని మృతుడి భార్య దుర్గ, ఆమె తండ్రి వెంకటేశ్వర్లు ఆరోపించారు. సాక్షి, విజయవాడ/గుణదల: విజయవాడ నగరం మరోసారి ఉలిక్కిపడింది. సినీ ఫక్కీలో బైక్‌లపై వచ్చిన యువకులు పట్టపగలు అందరూ చూస్తుండగా రౌడీషీటర్‌ను కిరాతకంగా నరికిచంపారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మాచవరం ఏరియాలో జరిగిన ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలి నాజర్‌పేటకు చెందిన వేమూరి సుబ్రహ్మణ్యం(35)అలియాస్ సుబ్బు కొద్దికాలంగా విజయవాడ రాజరాజేశ్వరీపేటలో కుటుంబసభ్యులతో నివాసం ఉంటున్నాడు. అతను భార్య దుర్గ, కుమారుడు తేజ (17), మనోజ్ (14)తో కలిసి నివసిస్తున్నాడు. గతంలో సుబ్బు టీడీపీ యువజన నాయకుడు కాట్రగడ్డ శ్రీను వద్ద పనిచేసేవాడు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్, కాల్‌మనీ వ్యాపారాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. సుబ్బు ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయటకు వచ్చాడు. మాచవరం ఏరియాలోకి రాగానే మూడు బైక్‌లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు సుబ్బుపై దాడిచేశారు. వెంట తెచ్చుకున్న కత్తులు, గొడ్డళ్లతో విచ్చణారహితంగా నరికారు. ఎడమ భుజం పూర్తిగా ఛిద్రమై ఎముకలు బయటపడ్డాయి. అకస్మాతుగా చోటుచేసుకున్న సంఘటనతో ఉలిక్కిపడ్డ జనం తేరుకుని భయంతో పరుగులు తీశారు. నిందితులు బైక్‌లపై పరారయ్యారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం వివరాలు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు సుబ్బును హత్య చేసిన హంతకులలో ఇద్దరు పట్టుబడ్డారు. హత్య విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు తెనాలికి చెందిన వారు కావడంతో అక్కడి వారితో కూడా సుబ్బుకు విభేదాలు ఉండి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబసభ్యులను అడ్డుకున్న పోలీసులు సుబ్బు హత్య విషయం తెలియడంతో కుటుంబసభ్యులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో ఉన్న సుబ్బును చూసిన భార్య, కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహం వద్దకు వెళ్లకుండా కొద్దిసేపు నియంత్రించడంతో భార్య దుర్గ, తండ్రి వెంకటేశ్వర్లు బంధువులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై నరికి చంపిన వారని ఆపకుండా తమను ఆపుతున్నారేమని ప్రశ్నించారు. క్లూస్ టీం రానిదే ఎవరినీ అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో దూరంగా నిలబడిపోయారు. శ్రీనే హత్య చేయించాడు.. కాట్రగడ్డ శ్రీను నివాసం కూడా సంఘటనా స్థలానికి అతి సమీపంలో ఉండటంతో అతనే ఈ హత్య చేయించాడని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. గతంలో శ్రీను వద్ద సుబ్బు పనిచేశాడని, ప్రస్తుతం మానేయడంతో మరో వర్గంతో చేతులు కలిపి ఈ హత్య చేయించాడని ఆరోపిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నాం..డీసీపీ ఈ హత్యకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ గజరావుభూపాల్ సంఘటన స్థలం వద్ద విలేకరులకు చెప్పారు. రెండేళ్ల కిందట సుబ్బు అన్నయ్య సత్యనారాయణ కూడా హత్యకు గురయ్యాడని పేర్కొన్నారు. అప్పటి నుంచి సుబ్బుకు శత్రువులు ఉండి ఉంటారని తెలిపారు. సుబ్బుకు సంబంధించిన అన్ని వివరాలు తెనాలిలో ఉంటాయని అక్కడి పోలీసులతో సంప్రదించి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. మాచవరం పోలీసులను టీంలుగా విభజించి తెనాలి ప్రాంతానికి పంపించామని వివరించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లు సేకరించిన వివారాలు, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నా భర్తను పొట్టన పెట్టుకున్నారు.. నా భర్తను చంపేశారు. నా కుంటుంబం రోడ్డున పడింది. పగ తీరకపోతే మమ్మల్ని కూడా పొట్టన పెట్టుకోండి. పొట్ట తిప్పల కోసం విజయవాడ వస్తే నా భర్తను పొట్టన పెట్టుకున్నారు. నడిరోడ్డుపై నరికి చంపారు. ఇదెక్కడి ఘోరం. దుర్గ(సుబ్బు భార్య) నా బిడ్డను శ్రీనే చంపాడు.. నా బిడ్డను చంపింది కాట్రగడ్డ శ్రీనునే. లేకపోతే గవర్నర్ పేట వెళతానని చెప్పిన నా బిడ్డ మాచవరం డౌన్‌కు వెళ్లి హత్యకు గురికావడమేంటి. కాట్రగడ్డ శ్రీను ఇంటికి సమీపంలో ఈ హత్య పథకం ప్రకారమే జరిగింది. వెంకటేశ్వర్లు(సుబ్బు తండ్రి) -
బెజవాడలో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు
విజయవాడ: టీటీడీ ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో పి.భాస్కర్ వెల్లడించారు. నగరంలోని పీడబ్ల్యూడీ మైదానంలో శ్రీవారి నమూనా ఆలయం, ఇతర ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇక్కడి భక్తులు దర్శించేందుకు వీలుగా వైభవోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీవారి సేవల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇప్పటివరకు విశాఖపట్నం, గుంటూరు, ముంబయి, హైదరాబాద్ ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో నాడు-నేడు అనే అంశంతో ఆకట్టుకునేలా ఫొటో ఎగ్జిబిషన్, సర్వాంగసుందరంగా పుష్పాలంకరణ, ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా విద్యుద్దీపాలంకరణ, దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. భక్తులకు సేవలందించేందుకు స్థానిక శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామన్నారు. ఉత్సవాల కోసం శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6.30 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించి రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ వరకు కైంకర్యాలు నిర్వహిస్తామని జేఈవో తెలిపారు. ప్రత్యేక సేవల్లో భాగంగా జులై 4న అష్టదళ పాదపద్మారాధన, 5న సహస్రకలశాభిషేకం, 6న తిరుప్పావడ, 7న అభిషేకం, 8న వసంతోత్సవం, శ్రీనివాస కల్యాణం, 9న పుష్పయాగం నిర్వహిస్తామని వెల్లడించారు. అంతకు ముందు శ్రీవారి నమూనా ఆలయం, క్యూలైన్లు, పార్కింగ్ తదితర ఇంజినీరింగ్ పనులను పరిశీలించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. -
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కలకలం
-
ఇంద్రకీలాద్రిపై రగడ
-
సమస్యల వలయంగా ప్రభుత్వాసుపత్రి
-
గుక్కెడు నీళ్ల కోసం జనం అవస్థలు
-
వెలవెలబోతున్న థియేటర్స్
-
బెజవాడలో వేసవి దొంగలు
-
బెజవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్
-
నయా రాజధానిలో నయా రూల్స్
-
బెజవాడలో బాబుకు టికెట్ల సెగ
విజయవాడ : ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు టికెట్ల సెగ తగిలింది. ఆయన బస చేసిన హోటల్ వద్ద టికెట్లు రాని నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డికి టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు శనివారం చంద్రబాబు బస చేసిన హోటల్ వద్ద ఆందోళనకు చేపట్టారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం.రమేష్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. హోటల్ లోకి దూసుకెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
నన్ను హీరోను చేసింది బెజవాడే
నేను పుట్టింది బెజవాడలోనే ..నన్ను హీరోను చేసింది కూడా బెజవాడేనని ఆ ఐదుగురు సినీహీరో వెంకట్ అన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న ఎం అండ్ ఎం షోరూమ్ నిర్వాహకులు హీరో వెంకట్, హీరోయిన్ అస్మితలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. వెంకట్ మాట్లాడుతూ.. నేను బెజవాడలో పుట్టినప్పటికీ, చదువుకున్నదీ ముంబయిలో అని చెప్పారు. ప్రతి వేసవి సెలవులకు బెజవాడ వచ్చి, ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడినన్నారు. గాంధీనగర్‌లో సినిమా థియేటర్లు ఉన్న రోడ్డు అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడ సినిమాలు చూసే హీరో అయ్యానని చెప్పారు. నేను క్యూలో నిల్చుని, బెంచి టికెట్ కొనుక్కుని సినిమా చూసిన థియేటర్లలో నేను నటించిన సినిమాలు సీతారాముల కల్యాణం, శివరామరాజు వంటి సినిమాలు అత్యధిక రోజులు ప్రదర్శితమవడం ఆనందంగా ఉందన్నారు. ‘ఆ ఐదుగురు’ సినిమా స్టోరీ కూడా చాలా బాగుంటుందని, ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రి అయితే సమాజంలో ఎలా మార్పు తీసుకురాగలడన్నది ప్రధాన ఇతివృత్తమని వివరించారు. రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు తక్కువగా ఉంటాయన్నారు. సినిమా హీరోయిన్ అస్మిత మాట్లాడుతూ..ఈ సినిమా తన మూడో చిత్రమని చెప్పారు. తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందన్నారు. నిర్మాత ప్రేమ్ పట్రా మాట్లాడుతూ.. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్నారు. -
బెజవాడ శివార్లలో వేగంగా విస్తరిస్తున్న విష జ్వరాలు
-
అంధకారంలో బెజవాడ
-
బెజవాడలో సమైక్య సెగలు
-
విజయమ్మ దీక్షకు వేదిక ఖరారు