APL 2022: వైజాగ్‌ వారియర్స్‌ పరుగుల వరద.. రెండో విజయం! | APL 2022: Vizag Warriors Beat Uttarandhra Lions By 4 Wickets | Sakshi
Sakshi News home page

APL 2022: వైజాగ్‌ వారియర్స్‌ పరుగుల వరద.. రెండో విజయం! టేబుల్‌ టాపర్‌ ఎవరంటే!

Published Mon, Jul 11 2022 9:38 AM | Last Updated on Mon, Jul 11 2022 10:16 AM

APL 2022: Vizag Warriors Beat Uttarandhra Lions By 4 Wickets - Sakshi

బెస్ట్‌ బౌలర్‌గా నిలిచిన సిద్ధార్థకు అవార్డు అందజేస్తున్న ముఖ్య అతిథులు

Andhra Premier League- విశాఖ స్పోర్ట్స్‌: ఏపీఎల్‌లో ఉత్తరాంధ్ర ఫ్రాంచైజీ జట్లు వైజాగ్‌ వారియర్స్, ఉత్తరాంధ్ర లయిన్స్‌ తలపడ్డాయి. వైఎస్సార్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ టోర్నీలో తొమ్మిదో మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు బౌండరీలతో సత్తా చాటుకున్నారు.

టాస్‌ గెలిచిన వైజాగ్‌ వారియర్స్‌ కెప్టెన్‌ అశ్విన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఉత్తరాంధ్ర లయిన్స్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. లయిన్స్‌ ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేయగా వారియర్స్‌ మరో ఐదు బంతులుండగానే విజయం సాధించింది. 

నిలకడగా ఆడినా... 
బ్యాటింగ్‌ ప్రారంభింన లయన్స్‌ ఓపెనర్లు గుల్ఫమ్, భరత్‌ జోడి తొలి వికెట్‌కు 56 పరుగులు చేశారు. గుల్ఫమ్‌ రెండు ఫోర్లు ఒక సిక్సర్‌తో 22 పరుగులు చేసి వెనుతిరిగాడు.

భరత్‌..6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు, వర్మ (మూడుఫోర్లు, ఒక సిక్సర్‌తో) 21 పరుగులతో స్కోర్‌ 88 పరుగులకు చేర్చారు. భరత్‌తో పాటు తర్వాత బంతికే వర్మ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు.

ఈ దశలో క్రాంతి (41,ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు)కి రోహిత్‌ (18, ఒకఫోర్,ఒక సిక్సర్‌)తోడై 141 పరుగులకు స్కోర్‌ బోర్డు పరుగులెత్తించారు. ఈ క్రమంలో 141 పరుగుల వద్ద రోహిత్, 159 పరుగుల వద్ద క్రాంతి ఔటయ్యారు. స్కోర్‌ 174 పరుగులకు చేరే క్రమంలో మరో రెండు వికెట్లు కోల్పోయింది.

దీంతో ఏడు వికెట్లకు 176 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగింంది. సిద్దార్థ రెండు వికెట్లు తీయగా కార్తీక్, వేణు, ఆంజనేయులు ఒకో వికెట్‌ తీశారు. 

మిడిలార్డర్‌లో నిలదొక్కుకుంటూ.... 
వారియర్స్‌ ఓపెనరు గిరినాథ్‌ (7) ప్రమోద్‌ వేసిన తొలి ఓవర్‌ (ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌)వరి బంతికి దొరికిపోయాడు. దీంతో మరో ఓపెనర్, కెప్టెన్‌ అశ్విన్‌తో కలిసిన సాయికృష్ణ 47(ఆరుఫోర్లు,ఒకసిక్సర్‌) 99 పరుగుల వద్ద వెనుతిరిగాడు.

అశ్విన్‌ 47 (ఐదుఫోర్లు, ఒక సిక్సర్‌)116 పరుగుల వద్ద వెనుతిరిగ్గా....మరో రెండే పరుగులకే ధృవ్‌(1)వికెట్‌ కోల్పోయింది. నరేన్‌తో కలిసి వికెట్‌ చేజార్చుకోకుండా ఇన్నింగ్స్‌ సరిదిద్దేక్రమంలో కరణ్‌ (8) 16.2 ఓవర్‌వద్ద వెనుతిరిగాడు.

అనంతరం నరేన్, మనోహార్‌ (ఏడుబంతుల్లో మూడు సిక్సర్లతో 21పరుగులు) జోడి చెలరేగిపోయింది. నరేన్‌ (20 బంతుల్లోనే రెండేసి ఫోర్లు, సిక్సర్లతో) 34పరుగులతో నిలి జట్టుకు విజయాన్నందించాడు. కార్తీక్‌ 3పరుగులతో నిలిచాడు. దీంతో మరో ఐదుబంతులుండగానే వారియర్స్‌ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ప్రవెద్, షోయిబ్‌ రెండేసి వికెట్లు తీయగా వర్మ, సాయికౌషిక్‌ చెరో వికెట్‌ తీశారు. ఏడో ఓవర్‌లోనే పై చేయి సాధించిన వారియర్స్‌ 11వ ఓవర్‌కు పూర్తిగా పట్టుసాధిం మిడిలార్డలో నిలదొక్కుకుని విజయం దిశగా సాగింది. సిద్ధార్ధ బెస్ట్‌ బౌలర్, మ్యాచ్‌ బెస్ట్‌గా నిలవగా... సాయికృష్ణ బెస్ట్‌ బ్యాటర్‌గా నిలిచాడు.

ఆధిక్యంలో కొనసాగుతున్న టైగర్స్‌ 
ఏపీఎల్‌లో ఐదో రోజు మ్యాచ్‌లు ముగిసేప్పటికి బెజవాడ టైగర్స్‌ మూడు మ్యాచ్‌లాడి 10 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైజాగ్‌ వారియర్స్‌ మూడు మ్యాచ్‌లాడి 8 పాయింట్లతో ద్వితీయస్థానంలోకి చేరుకోగా నాలుగు మ్యాచ్‌లాడిన గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయిన్స్, మూడు మ్యాచ్‌లాడిన రాయలసీమ కింగ్స్‌ 6  పాయింట్లతో కొనసాగుతున్నాయి. కోస్టల్‌ రైడర్స్‌ 4 పాయింట్లు సాధించింది.

చదవండి: IND Vs ENG 3rd T20: సూర్య 'ప్రతాపం' సరిపోలేదు.. సిరీస్‌ మాత్రం టీమిండియాదే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement