Andhra Premier League
-
రేపటి నుంచి ఏపీఎల్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) మూడో సీజన్‌కు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్లో తలపడేందుకు ఆరు జట్లు శుక్రవారం వైఎస్సార్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ సీజన్ వేలంలో అత్యధిక ధర పలికిన నితీష్‌కుమార్ రెడ్డి జింబాబ్వే జట్టుతో తలపడే భారత్ టీ–20 జట్టుకు ఎంపిక కావడంతో అందుబాటులో లేడు. కె.ఎస్.భరత్, పి.గిరినాథ్‌రెడ్డి, సీఆర్ జ్ఞానేశ్వర్, ఎస్.కె రషీద్, జి.గుల్ఫామ్ తదితరులు వారి జట్లతో ప్రాక్టీస్ చేశారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో రాయలసీమ కింగ్స్(ఆర్కే), కోస్టల్ రైడర్స్(సీఆర్), బెజవాడ టైగర్స్(బీటీ), గోదావరి టైటాన్స్(జీటీ), ఉత్తరాంధ్ర లయన్స్(యూఎల్)తో పాటు వైజాగ్ వారియర్స్(వీడబ్ల్యూ) జట్లు పోటీపడుతున్నాయి. తొలి పోటీ రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ మధ్య జరగనుంది. జూలై 13న టైటిల్ పోరు ఉంటుంది. కాగా.. శుక్రవారం వైఎస్సార్ స్టేడియం బీ గ్రౌండ్లో మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి 2 గంటల పాటు రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ జట్లు ప్రాక్టీస్ చేశాయి. బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ జట్లు సాయంత్రం ఐదు గంటల నుంచి రెండు గంటల పాటు, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్ జట్లు రాత్రి ఏడున్నర నుంచి రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేశాయి.ఫ్యాన్‌కోడ్‌లో ప్రత్యక్ష ప్రసారంబీచ్రోడ్డు: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ఫ్యాన్‌కోడ్ సంస్థ ప్రతినిధి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ లీగ్‌కు తెలుగు వ్యాఖ్యాతలుగా టి.సుమన్, కల్యాణ్ కృష్ణ వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. -
APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం ఇందుకు ఓ కారణమైతే.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించడం మరో కారణం.జోనల్ స్థాయి క్రీడాకారులకి గుర్తింపు తెచ్చేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట గత రెండేళ్లుగా టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పేరెన్నికగన్న క్రికెటర్లతో పాటు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌లో భాగమవుతున్నారు.బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు ఏపీఎల్‌లో పాల్గొంటున్నాయి. ఇక ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏపీఎల్.. మూడో సీజన్ కోసం సిద్ధమైంది.ఈ నేపథ్యంలో ఆటగాళ్ల కొనుగోలుకై గురువారం వేలం నిర్వహించారు. ఇందులో భాగంగా 76 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇక ఇప్పటికే 44 మంది ప్లేయర్లను ఆయా జట్లు రిటైన్ చేసుకున్నాయి.ఇక ఏ,బీ,సీ,డీ పేరిట నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను విభజించారు. ‘ఏ’ కేటగిరీ కనీస ధర: లక్ష... బీ కేటగిరీ కనీస ధర: 50 వేలు.. సీ,డీ కేటగిరీ కనీస ధర: 25 వేలుగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో దుమ్ము లేపుతున్న పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఈ వేలంలో పాల్గొన్నాడు.ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 15.6 లక్షలకు నితీశ్ రెడ్డి అమ్ముడుపోయాడు. ఈ యంగ్ సెన్సేషన్ కోసం గోదావరి టైటాన్స్ యాజమాన్యం ఈ మేరకు భారీ మొత్తం వెచ్చించింది.ఈ విషయం తెలియగానే నితీశ్ కుమార్ రెడ్డి నమ్మలేకపోతున్నా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.కాగా ఐపీఎల్-2024 వేలంలో భాగంగా వైజాగ్ కుర్రాడు నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంచనాలకు మించి రాణించిన 20 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 7 ఇన్నింగ్స్ ఆడి 239 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3 వికెట్లు కూడా తీశాడు. NITISH KUMAR REDDY - Highest paid player in Andhra Premier League. 💥IPL salary - 20 Lakhs. APL salary - 15.6 Lakhs. His reaction is priceless. 🫡 The future star. pic.twitter.com/33i0hT3F3a— Johns. (@CricCrazyJohns) May 16, 2024 -
APL: సీజన్-3 కి సిద్ధం.. లీగ్ ముఖ్య ఉద్దేశం అదే: ఏసీఏ
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 నిర్వహణకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సిద్దమవుతోంది. గత రెండు ఎడిషన్లను విజయవంతంగా నిర్వహించిన ఏసీఏ ఈసారి కూడా ఆరు జట్లతో లీగ్‌ను కొనసాగించనుంది. ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగుతాయని తెలిపారు. ఈ జట్ల మధ్య కడప, విశాఖ ప్రాంతాలలో మొత్తం 19 మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘జోన్ లెవల్ క్రీడాకారులకి గుర్తింపు తీసుకొని రావడమే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ముఖ్య ఉద్దేశ్యం. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ జరగడం చాలా సంతోషకరం. మూలాల నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తేనే విజయవంతమవుతాం.మూడో సీజన్ తర్వాత నాలుగో సీజన్ కూడా సజావుగా నిర్వహించాలని భావిస్తున్నాం. మంగళగిరిలో కూడా మ్యాచ్‌లు జరపాలని ప్రణాళికలు రచిస్తున్నాం. నవనీత్ కృష్ణ ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆక్షన్ లో పాల్గొంటున్నారు.విశాఖ, కడప, మంగళగిరి లో వెయ్యి మందిని గుర్తించి స్క్రీనింగ్ చేశాం. ఇక సీజన్-1 స్టార్ స్పోర్ట్స్ తెలుగులో బ్రాడ్ కాస్టింగ్ చేశాం. కొన్ని అనివార్య కారణాల వలన సీజన్-2ను తెలుగులో ప్రసారం చేయలేకపోయాం. అయితే, ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. బీసీసీఐ గైడ్‌లైన్స్‌తో ముందుకు వెళ్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్‌లో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. స్పోర్ట్స్ మెకానిక్ అనే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకుని వస్తున్నాం’’ అని తెలిపారు. -
తనని చూసేందుకు గోడ దూకి వెళ్లేవాడిని! రెండేళ్లు ఓ మినీ యుద్ధమే.. ఇప్పుడిలా..
Hanuma Vihari About His Love Story: ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది.. ప్రొఫెషన్తోతో సంబంధం లేకుండా.. కోతి పనులైనా సరే చేయించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంది.. టీమిండియా క్రికెటర్ హనుమ విహారి విషయంలో ఇదే జరిగింది.. కులాంతర ప్రేమ వివాహం కోసం విహారి పడిన పాట్లు వింటే ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లకు గత జ్ఞాపకాలు గుర్తుకురావాల్సిందే. తన నెచ్చెలి ప్రీతి ప్రేమ కోసం ఎదురుచూపులు.. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులను ఒప్పించేక్రమంలో రెండేళ్ల ఎడబాటు.. ఆపై పెళ్లితో శుభం కార్డు.. విహారి వీర ప్రేమగాథను తెలుసుకోవాలంటే ఇటు వైపు ఓ లుక్ వెయ్యండి! ఘ ఐపీఎల్లో.. టీమిండియా టెస్టు క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యాటర్ హనుమ విహారి. ఐపీఎల్లో.. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడిన ఈ అతడు.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు మొత్తంగా 23 ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారి.. 14.2 సగటు, 88.47 స్ట్రైక్ రేట్‌తో 284 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో ఇక టీమిండియా తరఫున 16 టెస్టుల్లో 839 పరుగులు సాధించడంతో పాటు 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్. అత్యధిక స్కోరు 111. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో కీలక ఆటగాడైన విహారి అనేక మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలున్నాయి. జాతీయ జట్టుకు ఆడే అవకాశం వచ్చినపుడల్లా తనను తాను నిరూపించుకుంటున్న విహారి.. విమర్శకుల ప్రశంసలతో పాటు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ మెప్పు కూడా పొందాడు. ఇలా ఓవైపు క్రికెటర్‌గా కెరీర్ కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రేమాయణాన్ని కూడా సాగించాడీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. తల్లే మొదటి గురువు కాకినాడలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విహారి.. చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడు. తల్లి ఇచ్చిన మనోధైర్యంతో ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగాడు. ఇప్పటికీ తన మొదటి గురువు తన తల్లి అని గర్వంగా విహారి చెబుతున్నాడు. ప్రీతి అంటే మహాప్రీతి.. ఇక విహారి ప్రేమ విషయానికొస్తే.. తన స్నేహితురాలు ద్వారా ప్రీతి అతడికి పరిచయమైంది. స్నేహం పెరిగి కాస్త ప్రేమగా మారింది.. ఎలాంటి లవ్ స్టోరీలో అయినా కొన్ని కష్టాలు తప్పవు.. విహారికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రేమ కోసం మినీ యుద్ధమే విహారి, ప్రీతి సామాజిక వర్గాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో పెళ్ళికి నిరాకరించారు. దీంతో.. రెండేళ్ల పాటు కష్టపడి.. వారిని ఒప్పించి చివరికి 2019లో ఇద్దరూ ఒకటయ్యారు. అయితే.. ఈ రెండేళ్ల పాటు ఓ మినీ యుద్ధమే చేశానని ‘సాక్షి’తో చెప్పుకొచ్చాడు విహారి. ఎప్పుడైనా ప్రీతిని చూడాలనిపిస్తే గోడ దూకి మరి వెళ్లి చూసేవాడిని సిగ్గుపడుతూ అప్పటి జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకున్నాడు. కాగా హనుమ విహారి- ప్రీతి ప్రేమకు గుర్తుగా వారికి కొడుకు జన్మించాడు. కాగా విహారి భార్య ప్రీతికి క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేనప్పటికీ భర్త కోపసం మ్యాచ్‌లు చూస్తుందట. ఏపీ ప్రభుత్వం సూపర్ ఇదిలా ఉంటే.. ఇటీవల విహారి ఆంధ్రప్రీమియర్ లీగ్‌లో ఆడిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ సొంతరాష్ట్రంలో ఏపీఎల్ సీజన్-2లో ఆడటం ఎంతో ఆనందంగా ఉందని విహారి పేర్కొన్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడున్న కొత్త క్రీడాకారులకు ఎంతగానో సహాయపడుతోందని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయిలో పోటీ పడేవిధంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లను పూర్తి చేశారని ప్రశంసించాడు. మొదటి సీజన్లో తాను ఆడకపోయినా టీవీలో చూసి ఎంతో గర్వపడ్డానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో గానో ప్రోత్సహిస్తున్నది అని హనుమ విహారి హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఏపీఎల్ సీజన్-2లో రాయలసీమ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హనుమ విహారి జట్టుకు టైటిల్ అందించిన విషయం తెలిసిందే. నరేష్, కరస్పాండెంట్, సాక్షి టీవీ, విశాఖపట్నం View this post on Instagram A post shared by Hanuma vihari (@viharigh) -
ఆంధ్రలో వేగంగా క్రికెట్ అభివృద్ధి.. అద్భుతం: టీమిండియా మాజీ క్రికెటర్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికై రోడ్ మ్యాప్ తయారు చేశామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్‌రెడ్డి తెలిపారు. అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఏసీఏ 70 ఏళ్ల పండగను సోమవారం వైజాగ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆటగాళ్ల భవిష్యత్ గురించే తాము నిత్యం తపనపడుతుంటామని పేర్కొన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్ట మొదటి సారిగా వుమెన్ టీ20 మ్యాచ్ నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. ఆంధ్రలో వేగంగా క్రికెట్ అభివృద్ధి: టీమిండియా మాజీ క్రికెటర్ అనంతరం ఇండియా మాజీ క్రికెటర్, ఇండియన్ నేషనల్ క్రికెట్ మాజీ కోచ్ మదన్ లాల్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రలో ఎంతో మంది ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఉన్నారు., భవిష్యత్తులో వారు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించేలా ఎదగాలి’’ అని ఆకాంక్షించారు. ఇక్కడున్న యువ క్రికెటర్లను ఇక్కడ చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏసీఏ పనితీరు అద్భుతం అని మదన్ లాల్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఏపీఎల్ సూపర్ ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను వెలికి తీసేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆంధ్రలో క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందుతోందని మదన్ లాల్ ప్రశంసించారు. ఇక ఈ సమావేశంలో.. పలువురు మాజీ రంజీ ప్లేయర్లు, మాజీ ఉమెన్ సీనియర్ ప్లేయర్స్, రంజీ ట్రోఫీ కెప్టెన్లు, క్రికెట్ కమిటీ సభ్యులకు, ఏసీఏ ఉద్యోగులకు, లీగల్ కమిటీలకు గోపినాథ్ రెడ్డి, ఏసీఏ ఉపాధ్యక్షులు పి. రోహిత్ రెడ్డి, మదన్ లాల్ జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎల్ చైర్మన్ మాంచో ఫెర్రర్, ఏసీఏ సంయుక్త కార్యదర్శి ఎ. రాకేశ్, ట్రెజరర్ ఏ.వి. చలం, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కె.వి.పురుషోత్తం, జితేంద్ర నాథ్ శర్మ, సిఈఓ ఎం.వి. శివారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శులు ఎన్. వెంకట రావు, చాముండేశ్వరి నాథ్ , అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆదివారం జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ హాజరైన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరిగిన తుదిపోరులో డిపెండింగ్ చాంపియన్ కోస్టల్ రైడర్స్‌ను రాయలసీమ కింగ్స్ ఓడించింది. తద్వారా ఏపీఎల్-2 విజేతగా అవతరించింది. చదవండి: 13 ఏళ్ల వయస్సులోనే అవమానాలెన్నో.. అయినా వరల్డ్ ఛాంపియన్! -
ఏపీఎల్ నిర్వహణ భేష్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నిర్వహణ చాలా బాగుందని.. యువ క్రికెటర్లకు ఇదొక మంచి వేదిక అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఏపీఎల్ రెండో సీజన్ ఫైనల్ మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించడానికి ముందు ఆదివారం ఆయన విశాఖలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ‘విశాఖపట్నం చాలా అందమైన నగరం. నాకెంతో ఇష్టమైన ప్రదేశమిది. ఇక్కడి వాతావరణం బాగుంటుంది. విశాఖ వేదికగా అనేక టోర్నిల్లో ఆడాను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనితీరు అద్భుతం. ఏపీలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వారిని ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీఎల్ తరహా టోర్నిల ద్వారా క్రికెటర్లకు అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఏపీ నుంచి దేశానికి మరింత మంది ప్రాతినిధ్యం వహించేలా ఏసీఏ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి’ అని సూచించారు. ‘టెస్ట్, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలోనూ రాణించేవిధంగా యువ క్రికెటర్లు తమను తాము మలుచుకోవాలి. సచిన్ ప్యాషన్‌తో ఆడితే.. కోహ్లి ప్యాషన్‌తో పాటు అగ్రెసివ్‌గా ఆడుతాడు. అది వారి స్టయిల్. నేను కూడా అగ్రెసివ్‌గానే ఆడేవాడిని. జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఆటతీరుతో పాటు చిత్తశుద్ధి, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. నాకు మీడియాతో మంచి అనుబంధం ఉంది. మీడియా ఒక ఆటగాడిని ఎలివేట్ చేసేందుకు చాలా దోహదపడుతుంది. అది ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం’ అని శ్రీకాంత్ అన్నారు. ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఎల్ సీజన్–2కు మంచి ఆదరణ లభించిందని చెప్పారు. కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్, ఏసీఏ ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వెంకట్రావు పేరుతో ‘స్టాండ్’ గర్వకారణం అనంతరం విశాఖ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు ఏసీఏ మాజీ కార్యదర్శి ఎన్.వెంకట్రావు పేరు పెట్టగా.. దానిని కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసీఏ కార్యదర్శిగా వెంకట్రావు సేవలందిస్తున్న రోజుల్లోనే తాను క్రికెటర్‌గా ఎదిగానని చెప్పారు.ఆయన పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా వెంకటరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, అంపైర్ కమిటీ చైర్మన్‌గా, క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా, 2003 వరల్డ్‌కప్‌లో పాల్గొన్న టీమిండియా జట్టు మేనేజర్‌గా తాను అందించిన సేవలకు ఇదో జ్ఞాపికగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రమణమూర్తి ఏపీఎల్‌లో తలపడుతున్న బెజవాడ టైగర్స్ జట్టుకు యజమానిగా ఉన్నారు. కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
APL 2 Winner: టైటిల్ విజేత రాయలసీమ కింగ్స్
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేతగా రాయలసీమ కింగ్స్ అవతరించింది. ఆదివారం నాటి ఫైనల్లో కోస్టల్ రైడర్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో రాయలసీమ కింగ్స్ ఆదివారం కోస్టల్ రైడర్స్ తో తలపడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న రాయలసీమ కింగ్స్ కోస్టల్ రైడర్స్ ను 155 పరుగులకు కట్టడి చేసింది. రైడర్స్ బ్యాటర్లలో ఓపెనర్ ధరణి కుమార్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కింగ్స్ బౌలర్లలో షేక్ కలీముద్దీన్ మూడు వికెట్లతో చెలరేగాడు. హరీష్ శంకర్ రెడ్డి రెండు వికెట్లు తీయగా, జాగర్లపూడి రామ్, బోదాల వినయ్, కెప్టెన్ హనుమ విహారి తలా ఒక వికెట్ తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన రాయలసీమ కింగ్స్ కు ఓపెనర్ తోట శ్రావణ్ 24 పరుగులతో శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ కోగటం హనీష్ రెడ్డి డకౌట్ కాగా, వన్ డౌన్ బ్యాటర్ తన్నీరు వంశీకృష్ణ 3 పరుగులకే నిష్క్రమించాడు. ఇలా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో హనుమ విహారి 29 బంతుల్లోనే 46 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బోదాల కుమార్ 53 పరుగులతో అతడికి అండగా నిలిచాడు. ఆఖరిలో గిరినాథ్ రెడ్డి 17 బంతుల్లో 29 పరుగులతో రాణించి విహారితో కలిసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో విజేడి (వి.జయదేవన్ సిస్టం) పద్ధతి ద్వారా విజేతను నిర్ణయించారు. 16.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసిన రాయలసీమ కింగ్స్ ఛాంపియన్ గా అవతరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోస్టల్ రైడర్స్ ను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ స్కోర్లు కోస్టల్ రైడర్స్- 155/8 (18 ఓవర్లు) రాయలసీమ కింగ్స్- 160/5 (16.3 ఓవర్లు) 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
APL 2: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సూపర్: 1983 విన్నర్ ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 1 అభిమానులను ఆకట్టుకుంది. స్థానిక ఆటగాళ్లలోని ప్రతిభను నిరూపించుకునేందుకు వేదిక అయింది. ఈ క్రమంలో ఏపీఎల్ రెండో ఎడిషన్ పై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే ఆరు జట్లు పోటాపోటీగా తలపడి కావాల్సినంత వినోదం అందించాయి. ఇక ఇప్పుడు ఏపీఎల్-2 తుది అంకానికి చేరుకుంది. కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్ ఫైనల్ ఆడేందుకు అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో చాలా మంది సీజన్ 1 చాలా బాగా నిర్వహించారని ప్రశంసించినట్లు చెప్పారు. ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2 ఫైనల్స్ కి ముఖ్య అతిథిగా మాజీ ఇండియన్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ నాకు చాలా ఇష్టమైన రాష్ట్రం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నీ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి మరి కొంత మంది క్రికెటర్లు రావాలని కోరుకుంటున్న. ఇప్పటికే ఏపీ మంచి క్రికెటర్లను అందించింది. యువ క్రికెటర్లకు మంచి అవకాశం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కల్పిస్తుంది అని పేర్కొన్నాడు. -
కోగటం రెడ్డి మెరుపు ఇన్నింగ్స్.. ఫైనల్లో రాయలసీమ కింగ్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో రాయలసీమ కింగ్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కింగ్స్ 3 పరుగుల తేడాతో గోదావరి టైటాన్స్‌పై విజయం సాధించింది. ముందుగా రాయలసీమ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోగటం రెడ్డి (47 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, గిరినాథ్ రెడ్డి (20 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), వంశీ కృష్ణ (34 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. అనంతరం గోదావరి టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 215 పరుగులు చేసి పోరాడి ఓడింది. భూపతి రాజు వర్మ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటిచేత్తో జట్టును గెలిపించే ప్రయత్నం చేయగా, ఇతర ఆటగాళ్లనుంచి సహకారం లభించలేదు. నేడు జరిగే ఫైనల్లో కోస్టల్ రైడర్స్‌తో రాయలసీమ కింగ్స్ తలపడుతుంది. ముగింపు కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, మాజీ కెపె్టన్ కె.శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. చదవండి: మూడో వన్డేలోను పాకిస్తాన్‌దే విజయం -
APL 2023: మ్యాచ్ రద్దు.. ఫైనల్ చేరుకున్న కోస్టల్ రైడర్స్.. ఇక..
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్లో కోస్టల్ రైడర్స్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్–1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన కోస్టల్ రైడర్స్ జట్టు ఫైనల్ చేరింది. రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్ మధ్య నేడు జరిగే క్వాలిఫయర్–2లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో కోస్టల్ రైడర్స్ జట్టుతో ఆడుతుంది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్ ఏడు వికెట్లతో ఉత్తరాంధ్ర లయన్స్‌పై నెగ్గింది. లయన్స్‌ను వేటాడిన టైటాన్స్ APL 2023 Godavari Titans Beat Uttarandhra Lions By 7 Wickets: ఏపీఎల్ సీజన్–2 ఎలిమినేటర్ మ్యాచ్‌లో లయన్స్‌ను టైటాన్స్ వేటాడేసింది. లీగ్ పాయింట్ల పట్టికలో రన్రైట్లో వెనుకబడ్డా... హెడ్ఆన్స్లో విజయంతో ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధించిన గోదావరి టైటాన్స్ విజయమే లక్ష్యం అన్నంతగా రెచ్చిపోయింది. ఉత్తరాంధ్ర లయన్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి క్వాలిఫైయర్స్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. మిడిలార్డర్ తడబాటు టాస్ గెలిచిన గోదావరి టైటాన్స్.. ఉత్తరాంధ్ర లయన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ గుల్ఫమ్(49) విజయ్ బౌలింగ్‌లో సందీప్‌కు క్యాచ్ ఇచ్చి ఒక్క పరుగు తేడాతో అర్ధసెంచరీని కోల్పోయాడు. మరో ఓపెనర్ కెప్టెన్ భరత్(37) విజయ్ బౌలింగ్‌లోనే మాధవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. వీరి జోడి తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే శ్యామ్(2), రాహుల్ డకౌట్, తపస్వి(2) విజయ్(8)తో వెనువెంటనే ఔట్ అవ్వడంతో 11 ఓవర్లకు 108 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శ్రీనివాస్(12), తేజస్వి(12), రఫీ(17) ఇన్నింగ్స్ కాస్త సరిదిద్దే ప్రయత్నం చేసినా మరో బంతి మిగిలి ఉండగానే 153 పరుగులకు ఆలౌటైంది. శశికాంత్, సమన్విత్ మూడేసి వికెట్లు తీయగా విజయ్ రెండు, కమిల్ ఓ వికెట్ పడగొట్టాడు. జ్ఞానేశ్వర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ప్రతిగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ ఓపెనర్ మునీష్ డకౌట్ గానే అజయ్‌కుమార్ బౌలింగ్‌లో వాసుకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఓపెనర్ కెప్టెన్ జ్ఞానేశ్వర్‌కు హేమంత్ రెడ్డి తోడై స్కోర్‌ను పరుగులెత్తించారు. రెండో వికెట్‌కు వంద పరుగులను జోడించారు. 124 పరుగుల వద్ద హేమంత్ 71(ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) పరుగులతో తపస్వి బౌలింగ్‌లో విజయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతని స్థానంలో వచ్చిన ధీరజ్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదేసి 25 పరుగులకు సరిగ్గా 153 పరుగుల వద్ద ఔటయ్యాడు. తపస్వి ఓవర్లో చివరి బంతిని సందీప్ ఎదుర్కొని లాంగాన్ మీదుగా సిక్సర్‌గా తరలించాడు. దీంతో 18 ఓవర్లలో మూడు వికెట్లకు 159 పరుగులు చేసి టైటాన్స్ గెలిచింది. కెప్టెన్ జ్ఞానేశ్వర్ రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 53 సాధించి అజేయంగా నిలిచాడు. తపస్వి రెండు, అజయ్‌కుమార్ ఓ వికెట్ తీశారు. చదవండి: BCCI: ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు రూ.4.20 కోట్లు! -
APL 2023: తుది అంకానికి ఏపీఎల్ సమరం.. ప్లే ఆఫ్స్ చేరిన జట్లు ఇవే
Andhra Premier League 2023: లీగ్ చివరి మ్యాచ్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైన గోదావరి టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోయింది. 16 పాయింట్లతో కోస్టల్ రైడర్స్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్ జట్లు 12 పాయింట్లు సాధించగా.. మెరుగైన రన్ రేట్‌తో లయన్స్ రెండో స్థానంలో నిలిచింది. బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ ఎనిమిదేసి పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్‌రేట్‌తో టైగర్స్ ప్లేఆఫ్‌నకు అర్హత సాధించింది. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో కింగ్స్‌తో టైగర్స్ తలపడనుండగా క్వాలిఫైయిర్ వన్‌లో రైడర్స్‌తో లయన్స్ తలపడనుంది. వైజాగ్ వారియర్స్ నాలుగు పాయింట్లతో రెండో సీజన్ ముగించింది. విశాఖ స్పోర్ట్స్: కోస్టల్ రైడర్స్ మరోసారి ప్లేఆఫ్‌నకు చేరుకుంది. ఏపీఎల్ సీజన్–2 లీగ్ చివరి మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌పై విజయం సాధించి 16 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ లక్ష్య ఛేదనకే మొగ్గు చూపింది. బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ కింగ్స్ 18 ఓవర్లలో 131 పరుగులు చేసింది. వరుణుడి అంతరాయం వరుణుడు 13 ఓవర్ వద్ద అంతరాయం కలిగించగా.. అప్పటికి కింగ్స్ జట్టు ఏడు వికెట్లకు 98 పరుగులు చేసింది. కెప్టెన్ హనుమ విహారి డకౌట్‌గా వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ వీరారెడ్డి 45 బంతుల్లో 78 పరుగులు సాధించాడు. చివర్లో కమరుద్దీన్( 21 బంతుల్లో 23 పరుగులు)తో కలిసి స్కోర్‌ను ముందుకు నడిపాడు. తిరిగి ఆటను కొనసాగించగా కింగ్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేయగా.. మరోసారి వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు. అబ్దుల్లా 4 వికెట్లు తీయగా స్టీఫెన్, మనోహార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. చిరంజీవి అజేయ ఇన్నింగ్స్ దీంతో కోస్టల్ రైడర్స్‌కు డీఎల్ఎస్ పద్ధతిలో 17 ఓవర్లలో 124 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. 14 ఓవర్లలోనే రెండు వికెట్లకు 127 పరుగులతో రైడర్స్ విజయం సాధించారు. ఓపెనర్ ధరణీకుమార్(18), కెప్టెన్ రషీద్(4) వికెట్లను 65 పరుగులకే రైడర్స్ కోల్పోయింది. మరో ఓపెనర్ ప్రణీత్ 64, చిరంజీవి 32 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించారు. కమరుద్దీన్, హనుమ విహారి చెరో వికెట్ తీశారు. ప్లే ఆఫ్స్‌లో బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ అసలు పోరులో చేతులెత్తేసిన టైటాన్స్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్ చేతులెత్తేసింది. రెండో మ్యాచ్‌లో టైటాన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు కెప్టెన్ జ్ఞానేశ్వర్(2), హేమంత్(1) ఎనిమిది పరుగులకే పెవిలియన్‌కు చేరారు. శ్యామ్ 11, సమన్విత్ 14, సత్యనారాయణ 16 పరుగులు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. మరో బంతి ఉండగానే టైటాన్స్ 77 పరుగులకే ఆలౌటైంది. పృధ్వీ, తేజస్వి మూడేసి వికెట్లు తీయగా అయ్యప్ప రెండు, అజయ్, వాసు ఒక్కో వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఓపెనర్ కెప్టెన్ భరత్(4), అతని స్థానంలో వచ్చిన రోహిత్ డకౌట్‌గా అయ్యారు. ఓపెనర్ గుల్ఫమ్(29)కు రాహుల్ తోడై మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. రాహుల్(33), తపస్వి(10) అజేయంగా నిలిచి 13.4 ఓవర్లలోనే 79 పరుగుల చేసి జట్టుకు విజయాన్నందించారు. మల్లికార్జున రెండు వికెట్లు, కమిల్ ఓ వికెట్ తీశాడు. రాయలసీమ కింగ్స్ చదవండి: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! విరాట్ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ! -
అదరగొట్టిన ప్రణీత్.. 8 వికెట్ల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక కోస్టల్ రైడర్స్ జట్టు 16 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్ 12 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో... బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ 8 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఉత్తరాంధ్ర లయన్స్‌కు రెండో స్థానం, రాయలసీమ కింగ్స్‌కు మూడో స్థానం, బెజవాడ టైగర్స్‌కు నాలుగో స్థానం లభించాయి. కోస్టల్ రైడర్స్తోపాటు ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌తో బెజవాడ టైగర్స్ ... క్వాలిఫయర్–1లో ఉత్తరాంధ్ర లయన్స్‌తో కోస్టల్ రైడర్స్ ఆడతాయి. రాయలసీమ కింగ్స్‌తో చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ జట్టు వీజేడీ పద్ధతిలో 8 వికెట్లతో గెలిచింది. ముందుగా రాయలసీమ కింగ్స్ 18 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించింది. హనీష్ రెడ్డి (78; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరిశాడు. వర్షం తగ్గాక కోస్టల్ రైడర్స్ జట్టుకు 17 ఓవర్లలో 124 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. కోస్టల్ జట్టు 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. ప్రణీత్ (64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), చిరంజీవి (32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడగా ఆడారు. మరో మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్ ఏడు వికెట్లతో గోదావరి టైటాన్స్‌ను ఓడించింది. చదవండి: ప్రత్యర్థులుగా ఇంగ్లండ్, నెదర్లాండ్స్ -
APL 2023: ప్లే ఆఫ్స్‌లో ఆ రెండు జట్లు.. రేసులోకి బెజవాడ టైగర్స్ కూడా
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్–2 సీజన్లో లీగ్ చివరి మ్యాచ్ ఆడిన వైజాగ్ వారియర్స్, బెజవాడ టైగర్స్ జట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. ఓపెనర్లు మూడు పరుగులకే పెవిలియన్‌కు చేరినా బెజవాడ టైగర్స్ భారీ స్కోర్‌ను అధిగమించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వైఎస్సార్ స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ వారియర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు అర్జున్(47), ప్రశాంత్ కుమార్(53) తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం అందించారు. కెప్టెన్ కరణ్ షిండే (55) అర్ధ సెంచరీ నమోదు చేయగా.. యువన్(15) సహకారం అందించాడు. కెప్టెన్ కరణ్ అజేయంగా నిలిచాడు. సాయితేజ రెండు వికెట్లు తీయగా అఖిల్, లలిత్ మోహన్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రతిగా బెజవాడ టైగర్స్ ఓపెనర్ అభినవ్ డకౌట్ గానే వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ మహీప్ రెండు పరుగులకే చేతులెత్తేశాడు. మనీష్(15)ఫోర్, సిక్సర్ బాది పెవిలియన్‌కు చేరడంతో తొలి మూడు వికెట్లు 23 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో షోయబ్.. రికీబుయ్(33)తో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులను, అవినాష్‌తో కలిసి మరో 50 పరుగులను జోడించాడు. షోయబ్ (51) ఆరు ఫోర్లతో అర్ధసెంచరీ చేయగా సాయికుమార్, దుర్గాకుమార్ చెరో ఎనిమిదేసి పరుగులు చేశారు. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. అవినాష్(71) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించాడు. ఏడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసిన బెజవాడ టైగర్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఎనిమిది పాయింట్లతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బుధవారం జరిగే ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్ మ్యాచ్ అనంతరం ప్లే ఆఫ్‌కు మిగిలిన రెండు బెర్త్‌లు తేలిపోనున్నాయి. ఇప్పటికే 12 పాయింట్లతో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. -
APL 2023: ధరణీకుమార్ మెరుపులు.. గోదావరి టైటాన్స్‌కు తప్పని ఓటమి
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్–2 సీజన్లో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ 35 పరుగుల తేడాతో గోదావరి టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోస్టల్ రైడర్స్ ఓపెనర్ ప్రణీత్ 15 పరుగులు చేసి మాధవ్ బౌలింగ్‌లో ఇస్మాయిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రైడర్స్ కెప్టెన్ రషీద్ 7 పరుగులే చేసినా ఓపెనర్ ధరణీకుమార్(32 బంతుల్లో 59, 8x4, 3x6)తో కలిసి రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. హర్షవర్ధన్ (నాలుగు ఫోర్లు, సిక్సర్‌తో 22 బంతుల్లో 35)తో కలిసి లేఖజ్ రెడ్డి(12) ఇన్నింగ్స్ సరిదిద్దే ప్రయత్నం చేశాడు. 101 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన రైడర్స్.. మరో 63 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా తొమ్మిది వికెట్లకు 173 పరుగులు చేసింది. సత్యనారాయణ రాజు, సమన్విత్ మూడేసి వికెట్లు తీయగా మాధవ్ రెండు, విజయ్ ఒక వికెట్ తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన గోదావరి టైటాన్స్ ఓపెనర్లు వంశీకృష్ణ(4) 10 పరుగుల వద్ద, కెప్టెన్ జానేశ్వర్ (14) 28 పరుగుల వద్ద వెనుదిరిగారు. హేమంత్‌రెడ్డి ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 49 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ధీరజ్‌కుమార్(10), పాండురంగరాజు(14) వికెట్లను 94 పరుగుల స్కోర్ వద్ద కోల్పోయింది. ఇస్మాయిల్ ఎనిమిది బంతుల్లో 19 పరుగులతో చివర్లో కాస్త మెరుపులు మెరిపించినా 18.1 ఓవర్లలోనే 138 పరుగులకు గోదావరి టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. అబ్దుల్లా మూడు, సుదర్శన్, చిరంజీవి, స్టీఫెన్ రెండేసి వికెట్లు తీశారు. ఆశిష్ ఓ వికెట్ పడగొట్టాడు. చదవండి: అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్ -
CR vs GT Photos: కోస్టల్ రైడర్స్, గోదావరి టైటాన్స్ మ్యాచ్ (ఫొటోలు)
-
APL2023 VIW Vs RAK Photos: వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్ మ్యాచ్ (ఫొటోలు)
-
తొలి విజయం సాధించిన బెజవాడ టైగర్స్.. అదరగొట్టిన వారియర్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో బెజవాడ టైగర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైగర్స్ 7 వికెట్లతో ఉత్తరాంధ్ర లయన్స్‌ను ఓడించింది. లయన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మహీప్ కుమార్ (77 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికీ భుయ్ (41; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి జట్టును గెలిపించారు. వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ‘టై’గా ముగిసింది. అయితే సూపర్ ఓవర్ ద్వారా వారియర్స్ విజేతగా నిలిచింది. వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు సాధించింది. ప్రశాంత్ (73; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. విహారి (71; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిషేక్ రెడ్డి (58 రిటైర్డ్‌హర్ట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సూపర్ ఓవర్లో కింగ్స్ 2 వికెట్లు కోల్పోయి ఒకే ఒక పరుగు చేయగా, వారియర్స్ 2 పరుగులు చేసి గెలిచింది. -
APL 2023: ఉత్కంఠగా సాగుతున్న ఏపీఎల్.. ఫోటోలు
-
రాయలసీమ కింగ్స్ ‘హ్యాట్రిక్’ విజయం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టి20 టోర్నమెంట్ రెండో సీజన్లో రాయలసీమ కింగ్స్ జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఇక్కడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్ జట్టును ఓడించింది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో రాయలసీమ కింగ్స్ 12 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గోదావరి టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 150 పరుగులు చేసింది. త్రిపురాణ విజయ్ (25 బంతుల్లో 63 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయ అర్ధ సెంచరీ చేశాడు. రాయలసీమ కింగ్స్ బౌలర్లలో హరిశంకర్ రెడ్డి మూడు వికెట్లు, గిరినాథ్ రెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం రాయలసీమ కింగ్స్ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. కెపె్టన్ హనుమ విహారి (12 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ రెడ్డి (37 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తన్నీరు వంశీకృష్ణ (39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. గోదావరి టైటాన్స్ బౌలర్లు ఏకంగా 21 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం గమనార్హం. తపస్వి ఆల్‌రౌండ్ ప్రదర్శన మరో మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్ 93 పరుగుల తేడాతో వైజాగ్ వారియర్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా ఉత్తరాంధ్ర లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెపె్టన్ కోన శ్రీకర్ భరత్ (23 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెంకట్ రాహుల్ (36 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), పిన్నింటి తపస్వి (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సిర్లా శ్రీనివాస్ (13 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అనంతరం వైజాగ్ వారియర్స్ 14.4 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. తపస్వి, పృథీ్వరాజ్ మూడు వికెట్ల చొప్పున తీశారు. -
గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్ గెలుపు
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌ల్లో రాయలసీమ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఉత్తరాంధ్ర లయన్స్ జట్టును ఓడించగా... గోదావరి టైటాన్స్ 56 పరుగుల తేడాతో వైజాగ్ వారియర్స్ జట్టుపై గెలుపొందింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్ 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (53 బంతుల్లో 80; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), యారా సందీప్ (38 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం వైజాగ్ వారియర్స్ 17.4 ఓవర్లలోనే 135 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఇస్మాయిల్ మూడు వికెట్లు తీశాడు. రాయలసీమ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట ఉత్తరాంధ్ర లయన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. శ్రీరామ్ వెంకట రాహుల్ (31 బంతుల్లో 60; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాయలసీమ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసి గెలిచింది. తన్నీరు వంశీకృష్ణ (34 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), గిరినాథ్ రెడ్డి (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షేక్ కమరుద్దీన్ (18 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాయలసీమ కింగ్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. -
అట్టహాసంగా ఏపీఎల్ ఆరంభం.. సందడి చేసిన శ్రీలీల
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా క్రికెటర్లు ప్రతిభను ప్రదర్శించేందుకే ఏపీఎల్ ప్లాట్‌ఫాం కానుందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు శరత్‌చంద్రరెడ్డి పేర్కొన్నారు. బీసీసీఐ సహకారంతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) రెండో సీజన్‌ను బుధవారం వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర తరపున పలు కేటగిరిల్లో యువ క్రీడాకారులు ఆడుతున్నారని.. వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రోత్సహించడమే ఏపీఎల్ ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్ర ఐటీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి ఏపీలోని ప్రతీ గ్రామ, వార్డులో ఔత్సాహిక ఆటగాళ్లను ప్రోత్సహించే విధంగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారన్నారు. ఈ పోటీల్లో 15 వేలకు పైగా జట్లు ఎంపిక చేసిన క్రీడల్లో పోటీపడనున్నాయన్నారు. తొలుత అతిథిగా హాజరైన సినీ నటి శ్రీలీల ఆయా జట్ల ఫ్రాంచైజీ అధినేతలు, కెప్టెన్లతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో వీడీసీఏ అధ్యక్షుడు, కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ మేయర్ హరివెంకటకుమారి, ఏపీఎల్ గవరి్నంగ్ కౌన్సిల్ చైర్మన్ ఫెర్రర్, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథరెడ్డి, ఉపాధ్యక్షుడు రోహిత్‌రెడ్డి, ఏపీఎల్ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యులు, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కోస్టల్ రైడర్స్–బెజవాడ టైగర్స్ జట్ల మధ్య పోరుతో ఈ సీజన్ ఆరంభమైంది. శరత్ చంద్రరెడ్డి టాస్ వేశారు. బెజవాడ టైగర్స్ జట్టుపై కోస్టల్ రైడర్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. అభిమానుల సందడి ఏపీఎల్–2 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత విజేతలకు అందించే ట్రోఫీతో ఆరుజట్ల ఫ్రాంచైజీ యజమానులు, కెపె్టన్లు ఫొటో సెషన్ నిర్వహించారు. సినీ నటి శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐపీఎల్ తరహాలో చీర్ గాళ్స్ సైతం బౌండరీలు, వికెట్లు పడినప్పుడు అభిమానులను ఉత్సాహపరిచారు. స్టేడియంలో అభిమానుల సందడి నెలకొంది. -
కోస్టల్ రైడర్స్ శుభారంభం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ తొలి మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ జట్టు 12 పరుగుల తేడాతో బెజవాడ టైగర్స్ జట్టుపై గెలిచి శుభారంభం చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోస్టల్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మన్యాల ప్రణీత్ (31; 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ షేక్ రషీద్ (20; 4 ఫోర్లు), మద్దిల హర్షవర్ధన్ (32; 2 ఫోర్లు, 1 సిక్స్), మిట్టా లేఖజ్ రెడ్డి (26; 5 ఫోర్లు), పాథూరి మనోహర్ (24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బెజవాడ టైగర్స్ బౌలర్లలో లలిత్ మోహన్ మూడు వికెట్లు, సాయితేజ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెజవాడ టైగర్స్ 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్ మున్నంగి అభినవ్ (57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కోస్టల్ జట్టు బౌలర్లలో చీపురపల్లి స్టీఫెన్, సుదర్శన్, ఆశిష్, మనోహర్ రెండు వికెట్ల చొప్పున తీసి బెజవాడ జట్టును దెబ్బ తీశారు. -
Andhra Premier League 2023 - Sreeleela: విశాఖలో ఘనంగా ఏపీఎల్-2 ప్రారంభం.. శ్రీలీల సందడి (ఫొటోలు)
-
APL: తొలిరోజు మ్యాచ్‌కు శ్రీలీల.. జట్ల వ్యూహాలివే! లక్కీడిప్‌లో అదృష్టం మీదైతే!
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్‌కు వైఎస్సార్ స్టేడియం సర్వసన్నద్ధమైంది. ఈ క్రికెట్ ఈవెంట్‌కు బుధవారం తెరలేవనుంది. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పర్యవేక్షణలో రోజూ రెండు చొప్పున 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. టైటిల్ పోరు ఈ నెల 27న జరగనుంది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి. తొలిసీజన్ టైటిల్ పోరులో ఢీకొట్టిన బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్ ఈసారి లీగ్ ప్రారంభ మ్యాచ్‌లోనే తలపడనుండడంతో ఏపీఎల్ – 2 ఆది నుంచే హోరాహోరీగా సాగనుంది. మ్యాచ్‌లు వీక్షించే అభిమానులకు లక్కీడిప్ ద్వారా విశాఖ వేదికగా త్వరలో జరగనున్న భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్‌కు టికెట్లు అందించనున్నారు. సినీనటి శ్రీలీల తొలిరోజు మ్యాచ్ వీక్షించేందుకు రానున్నారు. బెజవాడ టైగర్స్: వికెట్ల వెనుక నుంచే... టైటిల్ పోరులో ఢీకొట్టి కేవలం ఏడు పరుగుల తేడాతో వెనుకబడిపోయిన బెజవాడ టైగర్స్ ఈసారి వికెట్ల వెనుక నుంచే మ్యాచ్‌ను ముందుకు నడిపించే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామంటూ ఫ్రాంచైజీ అధినేత రమణమూర్తి అంటున్నారు. అందులో భాగంగానే ఈ సీజన్లో అత్యధిక ధరతో రికీబుయ్‌ను నిలబెట్టుకుంది. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న రికీ మిడిలార్డర్లో ఇన్నింగ్స్ చక్కదిద్దడమే గాక జట్టును ముందుకు నడపనున్నాడు. మహీప్ వికెట్ల వెనుక సత్తా చాటనుండగా అవసరమైతే నేనున్నా అంటున్నాడు మహిమా. ఆల్‌రౌండర్లు షోయిబ్, సాయురాహుల్తోపాటు లలిత్, అవినాష్లుండగా సాయితేజ బంతితో చెలరేగనున్నాడు. రాయలసీమ కింగ్స్ : టాప్ ఆర్డర్ పటిష్టం సౌత్జోన్నే విజేతగా నిలిపిన హనుమ విహారి ఈసారి రాయలసీమ కింగ్స్‌ను టైటిల్ దిశగా నడిపించనున్నాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్లు గిరినాథ్, సాకేత్‌లను నిలబెట్టుకోగా మాధవ్, కలియప్పలను తీసుకుంది. అభిషేక్, వంశీకృష్ణ ఓపెనర్లుగా నిలదొక్కుకుంటే పొట్టి ఫార్మెట్లో పరుగుల వరదే. సుదర్శన్ కొత్త బంతితో ప్రత్యర్థికి చుక్కలు చూపించనున్నాడు. హరిశంకర్, పవన్ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉత్తరాంధ్ర లయన్స్ : ఫైనల్ పోరే లక్ష్యం తొలి సీజన్లో టాప్ 4లో నిలిచి ఎలిమినేటర్‌లోనే వెనుతిరిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఈ సారి ఫైనల్స్‌లో గర్జించేందుకు సిద్ధమైంది. స్థానికుడైన అంతర్జాతీయ టెస్ట్ క్రికెటర్ భరత్ మినహా మిగిలిన ఐదుగురిని తక్కువ ధరకే నిలబెట్టుకున్న ఫ్రాంచైజీ ఐదుగురు కీలక ఆటగాళ్లను దక్కించుకుంది. వీళ్లందరినీ ఫ్రాంచైజీ అధినేత వెంకటరెడ్డి వేలం చివరి వరకు ఉండి మరీ సొంతం చేసుకున్నారు. వీరిలో పృథ్వీ భౌలింగ్ ప్రారంభించనుండగా టాప్ ఆర్డర్లో తపస్వి, రాహుల్ బ్యాట్ ఝళిపించనుండగా వాసు, శ్రీనివాస్ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచనున్నారు. ఇక జట్టుకు ఓపెనర్‌గా గుల్ఫమ్, వికెట్ల వెనుక భరత్, టాప్‌లో శ్యామ్, బౌలర్‌గా అజయ్, బౌలింగ్ ఆల్‌రౌండర్ రఫీ, అండర్ 16లో రాణిస్తున్న రచిత్ ఉండనే ఉన్నారు. గోదావరి టైటాన్స్: మిడిలార్డర్‌తో బ్యాలెన్స్ గోదావరి టైటాన్స్ ఈ సారి ఓపెనర్లు, టాప్ ఆర్డర్‌ను పక్కా ప్రణాళికతో మ్యాచ్‌కు సిద్ధం చేసుకోగా మిడిలార్డర్లో ఇన్నింగ్స్ చక్కదిద్దే ధీరజ్‌కుమార్‌కు జట్టును ముందుకు నడిపించే బాధ్యత అప్పగించింది. ఓపెనర్ హిమకర్, ఆల్‌రౌండర్లు శశికాంత్, సత్యనారాయణను జట్టు సొంతం చేసుకుంది. ఓపెనర్ వంశీతోపాటు టాప్ ఆర్డర్లో సాత్విక్, పాండురంగ, హేమంత్‌ను నిలబెట్టుకోగా మాధవ్ బౌలింగ్ చేయనున్నాడు. ►తలపడనున్న జట్లు : 6 ►మొత్తం మ్యాచ్‌లు : 19 ►టైటిల్ పోరు : 27న ►అన్ని మ్యాచ్‌లు ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం. చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే! -
విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్