రేపటి నుంచి ఏపీఎల్
● నెట్స్‌లో శ్రమించిన ఆటగాళ్లు
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) మూడో సీజన్‌కు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్‌లో తలపడేందుకు ఆరు జట్లు శుక్రవారం వైఎస్సార్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ సీజన్ వేలంలో అత్యధిక ధర పలికిన నితీష్‌కుమార్ రెడ్డి జింబాబ్వే జట్టుతో తలపడే భారత్ టీ–20 జట్టుకు ఎంపిక కావడంతో అందుబాటులో లేడు. కె.ఎస్.భరత్, పి.గిరినాథ్‌రెడ్డి, సీఆర్ జ్ఞానేశ్వర్, ఎస్.కె రషీద్, జి.గుల్ఫామ్ తదితరులు వారి జట్లతో ప్రాక్టీస్ చేశారు.
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో రాయలసీమ కింగ్స్(ఆర్‌కే), కోస్టల్ రైడర్స్(సీఆర్), బెజవాడ టైగర్స్(బీటీ), గోదావరి టైటాన్స్(జీటీ), ఉత్తరాంధ్ర లయన్స్(యూఎల్)తో పాటు వైజాగ్ వారియర్స్(వీడబ్ల్యూ) జట్లు పోటీపడుతున్నాయి. తొలి పోటీ రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ మధ్య జరగనుంది. జూలై 13న టైటిల్ పోరు ఉంటుంది. కాగా.. శుక్రవారం వైఎస్సార్ స్టేడియం బీ గ్రౌండ్‌లో మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి 2 గంటల పాటు రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్ జట్లు ప్రాక్టీస్ చేశాయి. బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ జట్లు సాయంత్రం ఐదు గంటల నుంచి రెండు గంటల పాటు, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్ జట్లు రాత్రి ఏడున్నర నుంచి రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేశాయి.
ఫ్యాన్‌కోడ్‌లో ప్రత్యక్ష ప్రసారం
బీచ్‌రోడ్డు: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ఫ్యాన్‌కోడ్ సంస్థ ప్రతినిధి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ లీగ్‌కు తెలుగు వ్యాఖ్యాతలుగా టి.సుమన్, కల్యాణ్ కృష్ణ వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment