విశాఖ స్పోర్ట్స్: జింబాబ్వేతో తలపడే భారత్ టీ20 జట్టులోకి నితీష్‌కుమార్ రెడ్డి చేరాడు. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ నితీష్‌కుమార్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. విశాఖకు చెందిన కె.నితీష్‌కుమార్ రెడ్డి భారత్ టీ20 జట్టులో స్థానం సాధించడం పట్ల ఆంధ్ర క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు శరత్‌చంద్ర రెడ్డి అభినందనలు తెలిపారు. జింబాబ్వే టూర్‌లో రాణించాలని ఆకాంక్షించారు. సంఘం కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు నితీష్‌కుమార్‌ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment