Zimbabwe cricket board
-
మూడో వన్డేలో ఘన విజయం.. అఫ్గాన్‌దే వన్డే సిరీస్
జింబాబ్వే పర్యటనలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న అఫ్గానిస్తాన్ జట్టు... వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. టి20 సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన అఫ్గాన్... తాజాగా వన్డే సిరీస్‌ను 2–0తో చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్ 8 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 30.1 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (61 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీతో రాణించగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. కెపె్టన్ ఇరి్వన్ (5), ఆల్‌రౌండర్ సికందర్ రజా (13), బెనెట్ (9) ఒకరివెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు.అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 5 వికెట్లతో విజృంభించగా... రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 26.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. సెదిఖుల్లా అతల్ (50 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఘజన్ఫర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సెదిఖుల్లా అతల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి తొలి టెస్టు జరగనుంది.చదవండి: IND vs AUS: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం -
యూఏఈ వేదికగా మహిళల టీ20 వరల్డ్‌కప్..!?
బంగ్లాదేశ్‌లో వచ్చే అక్టోబరులో నిర్వహించాల్సిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బంగ్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితుల దృష్ట్యా పొట్టి ప్రపంచకప్ వేదిక మారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఇప్పటికే ఈ టోర్నీ నిర్వహణ కోసం ప్రత్నామ్నాయ అవకాశాలను ఐసీసీ పరిశీలిస్తోంది. అందులో భాగంగా భారత్‌లో నిర్వహించాల్సిందిగా బీసీసీఐని ఐసీసీ అభ్యర్ధించింది. కానీ అందుకు బీసీసీఐ నో చెప్పింది. ఈ టోర్నీలో జరిగే ఆక్టోబర్‌లో భారత్‌లో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ ఆఫర్‌ను బీసీసీఐ తిరస్కరించింది.అయితే ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు యూఏఈ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తమ నిర్ణయాన్ని ఇప్పటికే ఐసీసీకి యూఏఈ క్రికెట్ బోర్డు తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు జింబాబ్వే క్రికెట్ కూడా ఈ టోర్నీని నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో రెండు వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లను జింబాబ్వే విజయవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వాలని జింబాబ్వే యోచిస్తోంది.కాగా ఆగస్టు 20 జరగనున్న బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం కావాలని ఐసీసీని అడిగినట్లు వినికిడి. ఇక షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. -
జింబాబ్వే టూర్‌కు నితీష్‌కుమార్
విశాఖ స్పోర్ట్స్: జింబాబ్వేతో తలపడే భారత్ టీ20 జట్టులోకి నితీష్‌కుమార్ రెడ్డి చేరాడు. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ నితీష్‌కుమార్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. విశాఖకు చెందిన కె.నితీష్‌కుమార్ రెడ్డి భారత్ టీ20 జట్టులో స్థానం సాధించడం పట్ల ఆంధ్ర క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు శరత్చంద్ర రెడ్డి అభినందనలు తెలిపారు. జింబాబ్వే టూర్లో రాణించాలని ఆకాంక్షించారు. సంఘం కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు నితీష్‌కుమార్‌ను అభినందించారు. -
డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్ల సస్పెన్షన్
డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించారని రుజువు కావడంతో జింబాబ్వే క్రికెట్ బోర్డు (ZC) ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లను సస్పెండ్ చేసింది. వెస్లీ మధేవెరె, బ్రాండన్ మవుటా బ్లడ్ శాంపిల్స్‌లో మాదకద్రవ్యాలు వినియోగించినట్లు తేలడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మధేవెరె, మవుటాలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ZC ప్రకటించింది. విచారణ పూర్తయ్యే వరకు వీరిద్దరూ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనరని పేర్కొంది. 26 ఏళ్ల మవుటా ఇటీవలే ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించగా.. మధేవెరె గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. లెగ్ బ్రేక్ బౌలర్ అయిన మవుటా జింబాబ్వే తరఫున 4 టెస్ట్‌లు, 12 వన్డేలు, 10 టీ20లు ఆడి ఓవరాల్‌గా 26 వికెట్లు పడగొట్టాడు. మవుటా టెస్ట్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. మధేవెరె విషయానికొస్తే.. 23 ఏళ్ల ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జింబాబ్వే తరఫున 2 టెస్ట్‌లు, 36 వన్డేలు, 60 టీ20లు ఆడి 26 వికెట్లు, 1100 పైగా పరుగులు సాధించాడు. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న జింబాబ్వేకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించాలి. ఇటీవలే ఆ జట్టు హెడ్ కోచ్ డేవ్ హటన్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. తాత్కాలిక హెడ్ కోచ్‌గా వాల్టర్ చాగుటా నియమితుడయ్యాడు. -
క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్ దత్..
ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20, టీ10 లీగ్‌లు పట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. తాజాగా జింబాబ్వే కూడా ఓ టీ10 లీగ్‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ లీగ్‌కు జింబాబ్వే క్రికెట్ 'జిమ్ ఆఫ్రో టీ10' అని నామకారణం చేసింది. జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జూలై 20న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు భాగం కానున్నాయి. డర్బన్ క్వాలండర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్, హరారే హరికేన్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. సంజయ్ దత్ న్యూ జర్నీ.. ఇక ఇందులో హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సర్ సోహన్ రాయ్‌తో కలిసి హరారే ఫ్రాంచైజీని సంజయ్ దత్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని సంజయ్ దత్ కూడా దృవీకరించాడు. "భారత్‌లో క్రికెట్ ఒక మతం వంటింది. అదే విధంగా ప్రపంచక్రికెట్లో భారత్ ఒక ప్రత్యేక గుర్తుంపు ఉంది. ప్రపంచంలో ప్రతీ చోట క్రికెట్‌కు మరింత ఆదరణ పెరగాలని నేను ఎప్పుడూ ఆశిస్తాను. జింబాబ్వే కూడా గొప్ప క్రీడా చరిత్రను కలిగిఉంది. అటువంటి జింబాబ్వే క్రికెట్లో నేను భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. జిమ్ ఆఫ్రో టీ10లో హరారే హరికేన్స్ బాగా రాణిస్తుందని నేను అనుకుంటున్నాను" అని సంజయ్ దత్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs WI 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు! -
పాకిస్తాన్‌పై సంచలన విజయం.. జింబాబ్వే డ్యాన్స్ అదిరిపోయిందిగా!
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అఖరి బంతికి జింబాబ్వే గెలుపొందింది. జింబాబ్వే విజయంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ సికిందర్ రజా మూడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. డ్యాన్స్‌తో అదరగొట్టిన జింబాబ్వే పాకిస్తాన్‌పై చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత జింబాబ్వే ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగి తేలిపోయారు. జింబాబ్వే ఆటగాళ్లు మైదానంలోనే పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్ ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియాలో జింబాబ్వే రిచర్డ్ నగరావా పాట పాడుతుండగా.. కెప్టెన్ ఎర్విన్ డ్యాన్స్ చేస్తే కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 30న బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. Celebrating yet another terrific performance! 🇿🇼#PAKvZIM | #T20WorldCup pic.twitter.com/0UUZTQ49eB — Zimbabwe Cricket (@ZimCricketv) October 27, 2022 చదవండి: T20 WC: 'బాబర్ ఒక పనికిరాని కెప్టెన్.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి' -
వరల్డ్ కప్‌కు ముందు జింబాబ్వేకు భారీ షాక్
ఈనెల (అక్టోబర్ 16) నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌కు ముందు క్వాలిఫయర్ జట్టు జింబాబ్వేకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ మెగా టోర్నీకి ముందు జట్టుతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు శుక్రవారం (అక్టోబర్ 7) ప్రకటించాడు. ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు సైతం దృవీకరించింది. క్లూసెనర్ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని క్రికెట్ జింబాబ్వే పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో క్లూసెనర్‌కు పలు దేశాల క్రికెట్ బోర్డులతో ఒప్పందాలు ఉన్న నేపథ్యంలో జింబాబ్వేకు పూర్తి స్థాయి సేవలు అందించేందుకు అందుబాటులో ఉండలేకపోతున్నాడని, అందుకే ఈ మేరకు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని క్లూసెనర్ ప్రతినిధి తెలిపాడు. కాగా, క్లూసెనర్ ఈ ఏడాది మార్చిలో జింబాబ్వే బ్యాటింగ్ కోచ్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టాడు. అంతకుముందు అతను 2016-2018 మధ్యకాలంలో కూడా జింబాబ్వే బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. క్లూసెనర్ హయాంలో జింబాబ్వే పూర్వపు స్థాయిలో విజయాలు సాధించి ఆకట్టుకుంది. జింబాబ్వే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో క్లూసెనర్ కీలకపాత్ర పోషించాడు. ఫ్లవర్ సోదరులు, అలిస్టర్ క్యాంప్‌బెల్ లాంటి స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్ తర్వాత చతికిలబడిన జింబాబ్వేకు క్లూసెనర్ తన బ్యాటింగ్ మెళకువలతో పునరుజ్జీవం పోశాడు. ఇటీవలి కాలంలో సికిందర్ రాజా, క్రెయిగ్ ఐర్విన్, సీన్ విలియమ్స్ లాంటి ప్లేయర్లు రాటుదేలడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే, జింబాబ్వే జట్టు క్వాలిఫయర్స్‌లో మరో ఏడు జట్లతో కలిసి పోటీపడనుంది. క్వాలిఫయర్స్ గ్రూప్-ఏలో శ్రీలంక, నెదర్లాండ్స్, నమీబియా, యూఏఈ జట్లు పోటీపడనుండగా.. గ్రూప్-బిలో వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లతో జింబాబ్వే అమీతుమీ తేల్చుకోనుంది. క్వాలిఫయర్ దశ మ్యాచ్‌లు అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 21 వరకు జరుగనుండగా.. సూపర్-12 మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతాయి.అక్టోబర్ 23న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య హైఓల్టేజీ మ్యాచ్ జరుగనుంది. -
ఫిక్సింగ్ చేయమని అడిగినందుకు...
హరారే: మ్యాచ్ ఫిక్సింగ్‌లో క్రికెటర్‌ను భాగం చేసేందుకు ప్రయత్నించిన జింబాబ్వే క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర చర్య తీసుకుంది. జింబాబ్వేలోని హరారే మెట్రోపాలిటన్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి, మార్కెటింగ్ డైరెక్టర్ రాజన్ నాయర్‌పై 20 ఏళ్ల నిషేధం విధించింది. గత అక్టోబర్‌లో జింబాబ్వే కెప్టెన్ గ్రేమ్ క్రెమర్‌ను కలిసిన నాయర్... ఫిక్సింగ్ చేస్తే 30 వేల డాలర్లు (దాదాపు రూ. 20 లక్షలు) ఇస్తానని ఆఫర్ చేశాడు. అయితే దీనికి స్పందించని క్రెమర్ వెంటనే ఐసీసీకి సమాచారం అందజేశాడు. 16 జనవరి, 2018 నుంచి 15 జనవరి, 2038 వరకు రాజన్‌పై నిషేధం అమల్లో ఉంటుంది. రాజన్ చేసిన పని తీవ్రతను బట్టే అతనికి పెద్ద శిక్ష వేసినట్లు ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ తెలిపారు. -
సందిగ్ధంలో భారత్-జింబాబ్వే సిరీస్!
ప్రసారకర్తలతో వివాదమే కారణం హరారే: వచ్చే నెలలో జింబాబ్వేలో జరగాల్సిన భారత క్రికెట్ జట్టు పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టూర్లో భాగంగా భారత్ 3 వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ నిర్వహణపై సందేహం నెలకొందని, ఇప్పుడు కాకపోతే ఏడాది తర్వాతే ఇది సాధ్యమవుతుందని జింబాబ్వే క్రికెట్ బోర్డు (జెడ్సీ) ప్రకటించింది. జింబాబ్వేలోని మ్యాచ్‌లకు అధికారిక ప్రసారకర్త అయిన టెన్ స్పోర్ట్స్, బీసీసీఐ మధ్య ఉన్న వివాదమే దీనికి కారణమని తెలుస్తోంది. గతంలో కొన్ని సమస్యల కారణంగా టెన్ స్పోర్ట్స్ ఈ సిరీస్‌ను ప్రసారం చేయకూడదని భావిస్తోంది. దాంతో జెడ్సీ అటు టెన్‌స్పోర్ట్స్, ఇటు బీసీసీఐతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే పనిలో పడింది. సోమవారం నుంచి బార్బడోస్‌లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశం సందర్భంగా బీసీసీఐ పెద్దలతో మాట్లాడాలని జెడ్సీ చైర్మన్ విల్సన్ మనసే నిర్ణయించారు. ‘సాధ్యమైనంత త్వరగా దీనికి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. అది జరగకపోతే ఇదే టూర్‌ను వచ్చే ఏడాది నిర్వహించే విధంగా బీసీసీఐతో చర్చిస్తాం’ అని మనసే వెల్లడించారు. బంగ్లాదేశ్ పర్యటన తర్వాత జూలైలో జింబాబ్వేలో భారత్ పర్యటించాల్సి ఉంది. -
వచ్చే నెలలో జింబాబ్వేకు భారత్
హరారే : భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటన ఖరారయింది. మూడు వన్డేలు, రెండు టి20లు ఆడేందుకు భారత జట్టు జులై 7న హరారే చేరుతుందని జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. మ్యాచ్‌లకు సంబంధించిన తేదీలను ఈ వారంలో ప్రకటిస్తారు. చివరిసారిగా భారత జట్టు 2013లో జింబాబ్వేలో పర్యటించి ఐదు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.