T20 World Cup 2022: Zimbabwe Players Unique Dance Moves After Win Against Pakistan, Video Viral - Sakshi
Sakshi News home page

T20 WC 2022: పాకిస్తాన్‌పై సంచలన విజయం.. జింబాబ్వే డ్యాన్స్‌ అదిరిపోయిందిగా!

Published Fri, Oct 28 2022 10:59 AM | Last Updated on Fri, Oct 28 2022 11:50 AM

Zimbabwe players bring out dance after stunning win over Pakistan in T20 WC - Sakshi

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అఖరి బంతికి జింబాబ్వే గెలుపొందింది. జింబాబ్వే విజయంలో ఆ జట్టు ఆల్‌రౌండర్‌ సికిందర్‌ రజా మూడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. ఇక​ ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే.

డ్యాన్స్‌తో అదరగొట్టిన జింబాబ్వే
పాకిస్తాన్‌పై చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత జింబాబ్వే ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగి తేలిపోయారు. జింబాబ్వే ఆటగాళ్లు మైదానంలోనే పాటలు పాడుతూ, డ్యాన్స్‌ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఈ వీడియాలో జింబాబ్వే రిచర్డ్ నగరావా పాట పాడుతుండగా.. కెప్టెన్‌ ఎర్విన్ డ్యాన్స్‌ చేస్తే కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 30న బంగ్లాదేశ్‌తో తలపడుతోంది.


చదవండిT20 WC: 'బాబర్‌ ఒక పనికిరాని కెప్టెన్‌.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement