Sikindar Raza
-
పాకిస్తాన్‌కు ఆడుతారా? దిమ్మతిరిగే సమాధనమిచ్చిన స్టార్ క్రికెటర్
జింబాబ్వే టీ20 కెప్టెన్ సికందర్ రజా ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. భవిష్యత్తులో పాకిస్తాన్‌కు ఆడే అవకాశం వస్తే మీరు ఆడుతారా అని సదరు అభిమాని ఎక్స్ వేదికగా ప్రశ్నించాడు. అందుకు సికందర్ రజా దిమ్మతిరిగే సమాధనమిచ్చాడు. జింబాబ్వే క్రికెట్‌కు తను విధేయుడనని, పాక్ తరపున ఆడే ఆలోచన తనకు ఎప్పటకీ కలగదని రజా బదులిచ్చాడు."నేను పాకిస్తాన్లో పుట్టినప్పటకి.. నన్ను ఈ స్ధాయికి తీసుకు వచ్చింది మాత్రం జింబాబ్వేనే. జింబాబ్వే క్రికెట్ నాపై చాలా సమయం, డబ్బు వెచ్చించింది. నేను ఎప్పటకి జింబాబ్వేకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాను. జింబాబ్వే క్రికెట్‌కు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంట్టేందుకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తునే ఉంటాను" అని రజా రిప్లే ఇచ్చాడు. కాగా 38 ఏళ్ల రజా పాకిస్తాన్‌లోని సియాల్ కోట్లో జన్మించాడు. తన పాఠశాల విధ్యను పాకిస్తాన్‌లోనే రజా అభ్యసించాడు. ఆ తర్వాత 2002లో తన ఫ్యామిలీతో కలిసి జింబాబ్వేకు రజా మకాం మార్చాడు. 2013 జింబాబ్వే క్రికెట్ తరపున రజా అరంగేట్రం చేశాడు. రజా ప్రస్తుతం జింబాబ్వేతో పాటు ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ కూడా ఆడుతున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు రజా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
టీమిండియాకు ఘోర పరాభవం .. జింబాబ్వే చేతిలో ఓటమి
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో13 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య చేధనలో భారత్.. జింబాబ్వే బౌలర్ల దాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(27) పోరాడనప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 115 పరుగులకే జింబాబ్వే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. బిష్ణోయ్‌తో పాటు మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్,ముఖేష్ కుమార్ చెరో వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో మదండే(29), మైర్స్(23), బెన్నట్(23), పరుగులు చేశారు. కాగా టీ20ల్లో జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి పాలవ్వడం 2016 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
పంజాబ్ కు షాక్ ఇచ్చిన విధ్వంసకర ఆల్ రౌండర్..
-
విరాట్ కోహ్లి తొలిసారిగా.. ప్రతిష్టాత్మక అవార్డు రేసులో.. పోటీగా రజా!
Virat Kohli: అక్టోబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి గురువారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజాకు చోటు దక్కింది. విరాట్ కోహ్లి కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్-2022లో అర్ధసెంచరీలతో చెలరేగుతున్నాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 82(నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడిన కింగ్.. అనంతరం నెదర్లాండ్స్, బంగ్లదేశ్‌పై కూడా అర్ధసెంచరీలతో అదరగొట్టాడు. ఇక ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 220 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అదే విధంగా ఆక్టోబర్‌లో కోహ్లి 150.73 స్ట్రైక్ రేటుతో 205 పరుగులు సాధించాడు. డేవిడ్ మిల్లర్ డేవిడ్ మిల్లర్ గత నెలలో భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 47 బంతుల్లోనే 106 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లోను 59 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. గత నెలలో ఓవరాల్‌గా ఏడు ఇన్నింగ్స్‌లలో మిల్లర్ 303 పరుగులు చేశాడు. సికిందర్ రజా ఈ జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తోను బాల్‌తోను అదరగొడుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో రజా తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా స్కాట్లాండ్పై కూడా 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక పాకిస్తాన్‌పై జింబాబ్వే చారిత్రాత్మక విజయం సాధించడంలో రజా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రజా మూడు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కూడా రజా మూడు వికెట్లు సాధించాడు. చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్ -
T20 WC ZIM Vs NED: జింబాబ్వే వర్సెస్ నెదర్లాండ్స్.. తుది జట్లు ఇవే
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో కీలక మ్యాచ్‌లో జింబాబ్వే తలపడతోంది. ఆడిలైడ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగగా.. జింబాబ్వే కూడా ఓ మార్పుతో ఆడనుంది. ఇక వరుస ఓటములతో నెదర్లాండ్స్ ఇప్పటికే ఇంటిముఖం పట్టగా.. జింబాబ్వే మాత్రం సెమీస్ రేసులో ఉంది. జింబాబ్వే.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి అనంతరం భారత్‌పై గెలిపొందితే నేరుగా సెమీస్‌లో అడుగు పెడుతోంది. తుది జట్లు: నెదర్లాండ్స్ : స్టీఫన్ మైబర్గ్, మాక్స్ ఓడౌడ్, టామ్ కూపర్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్ కీపర్), రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్, బ్రాండన్ గ్లోవర్ జింబాబ్వే: వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), రెగిస్ చకబ్వా (వికెట్ కీపర్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, మిల్టన్ శుంబా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, టెండై చటారా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ -
కోహ్లి రికార్డులు బద్దలు కొట్టిన రజా.. తొలి ఆటగాడిగా
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జిబాంబ్వే విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ సికిందర్ రజా కీలక పాత్ర పోషించాడు. ఓటమి ఖాయం అనుకున్న వేళ రజా తన స్పిన్‌తో మ్యాజిక్ చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో రజా తన నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఇక అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన రజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తద్వారా ఓ అరుదైన రికార్డును రజా సాధించాడు. కోహ్లి రికార్డులను బ్రేక్ చేసిన రజా అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. 2022 ఏడాదిలో రజాకు ఇప్పటి వరకు 7 మ్యాన్ ఆఫ్‌ది అవార్డులు లభించాయి. కాగా అంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2016లో టీ20ల్లో కోహ్లీ ఆరుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అదే విధంగా రజా మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్‌ది అవార్డును అందుకున్న ఆటగాడిగా రజా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో రజా ఇప్పటి వరకు మూడు సార్లు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. అంతకుముందు ఈ రికార్డు కూడా విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2016 టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి రెండుసార్లు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. చదవండి: T20 WC 2022: ప్రపంచకప్‌ను వెంటాడుతున్న వరుణుడు.. మరో మ్యాచ్ రద్దు -
పాకిస్తాన్‌పై సంచలన విజయం.. జింబాబ్వే డ్యాన్స్ అదిరిపోయిందిగా!
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అఖరి బంతికి జింబాబ్వే గెలుపొందింది. జింబాబ్వే విజయంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ సికిందర్ రజా మూడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. డ్యాన్స్‌తో అదరగొట్టిన జింబాబ్వే పాకిస్తాన్‌పై చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత జింబాబ్వే ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగి తేలిపోయారు. జింబాబ్వే ఆటగాళ్లు మైదానంలోనే పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్ ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియాలో జింబాబ్వే రిచర్డ్ నగరావా పాట పాడుతుండగా.. కెప్టెన్ ఎర్విన్ డ్యాన్స్ చేస్తే కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 30న బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. Celebrating yet another terrific performance! 🇿🇼#PAKvZIM | #T20WorldCup pic.twitter.com/0UUZTQ49eB — Zimbabwe Cricket (@ZimCricketv) October 27, 2022 చదవండి: T20 WC: 'బాబర్ ఒక పనికిరాని కెప్టెన్.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి' -
సికిందర్ రజా సరి కొత్త చరిత్ర.. తొలి జింబాబ్వే క్రికెటర్‌గా
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డును సికిందర్ రజా దక్కించుకున్నాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న తొలి జింబాబ్వే క్రికెటర్‌గా రజా నిలిచాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో రజాకు.. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మెక్‌గ్రాత్‌కు ఈ అవార్డు లభించింది. వరుసగా మూడు సెంచరీలు స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్‌తో వన్డే సిరీస్‌లో రజా సెంచరీలు మోత మెగించాడు. వరుసగా మూడు అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్‌పై రెండు సెంచరీలు చేయగా..భారత్‌పై ఒక సెంచరీని నమోదు చేశాడు. అదే విధంగా బంగ్లాతో వన్డే సిరీస్‌ను జింబాబ్వే క్లీన్ స్వీప్ చేయడంలో రజా కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా బౌలింగ్‌లో రజా సత్తా చాటాడు. గత నెలలో ఓవరాల్‌గా రజా ఏడు వికెట్లు పడగొట్టాడు. రజా ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్‌ను వెనుక్కి నెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. చదవండి: Veda Krishnamurthy: కర్ణాటక బ్యాటర్‌తో భారత మహిళా క్రికెటర్ 'ఎంగేజ్మెంట్'.. ఫొటోలు వైరల్ -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్లు వీరే!
ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. వారిలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ ఉన్నారు. కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగుతోన్న టెస్టు సిరీస్‌లో బెన్ స్టోక్స్ అద్భుతమైన ప్రధర్శన కనబరుస్తున్నాడు. ప్రోటీస్‌తో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లతో పాటు అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు. ఇక సికిందర్ రజా ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్, భారర్‌తో జరిగిన సిరీస్‌లలో రజా అదరగొట్టాడు. ఈ నెలలో అతడు మూడు అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను జింబాబ్వే కైవసం చేసుకోవడంలో రజా కీలక పాత్ర పోషించాడు. ఇక మిచిల్ సాంట్నర్ విషయానికి వస్తే.. సాంట్నర్ యూరప్ టూర్లో భాగంగా నెదర్లాండ్స్‌పై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేలో సాంట్నర్ 42 బంతుల్లో 77 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. ఇక మహిళల విభాగం నుంచి ఈ అవార్డుకు.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ, భారత మిడిలార్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మెక్‌గ్రాత్ నామినెట్ అయ్యారు. చదవండి: Ind Vs Pak: అర్ష్‌దీప్ బంగారం.. అతడిని ఏమీ అనకండి.. నిజంగా ఇది సిగ్గుచేటు: భారత మాజీ క్రికెటర్ -
ICC Rankings: అదరగొట్టిన శుబ్‌మన్ గిల్.. ఏకంగా 93 స్థానాలు ఎగబాకి..!
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో గిల్ ఏకంగా 93 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన గిల్ 245 పరగులు సాధించాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో గిల్(130) అద్భుతమైన సెంచరీ సాధించాడు. అదే విధంగా గత కొన్ని సిరీస్‌ల నుంచి భీకర ఫామ్‌లో ఉన్న జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా నాలుగు స్థానాలు ఎగబాకి 25వ స్థానానికి చేరుకున్నాడు. భారత్‌తో జరిగిన మూడో వన్డేలో రజా సెంచరీతో చేలరేగాడు. కాగా అతడు ఆడిన గత ఆరు ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు ఉండడం గమనార్హం. మరోవైపు నెదార్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విఫలమైన పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారాడు. ఇక ఓవరాల్‌గా వన్డే ర్యాంకిగ్స్‌లో 890 పాయింట్లతో బాబర్ ఆగ్రస్థానంలో కొనసాగుతండగా.. రెండు మూడు స్థానాల్లో వరుసగా ప్రోటీస్ ఆటగాళ్లు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (789), క్వింటన్ డి కాక్ (784) నిలిచారు. చదవండి: Asia Cup 2022: జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టాడు.. ప్రమోషన్ కొట్టేశాడు! -
Ind Vs Zim: అదేం బౌలింగ్ నాయనా.. మీవల్లే ఇక్కడి దాకా! రజా, ఎవాన్స్‌పై ప్రశంసలు!
India tour of Zimbabwe, 2022- 3rd ODI: జింబాబ్వే పర్యటనలో మొదటి వన్డేలో అలవోకగా విజయం సాధించింది టీమిండియా. ఓపెనర్లు శిఖర్ ధావన్(81 పరుగులు), శుబ్‌మన్ గిల్(82 పరుగులు) అద్భుత అర్ధ శతకాలతో మెరిసి అజేయంగా నిలవడంతో ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక రెండో వన్డేలో ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసినా లక్ష్య ఛేదనలో భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది. అద్భుత ఆట తీరు! ఆఖర్లో సంజూ శాంసన్ 43 పరుగులతో అజేయంగా నిలవడంతో 25.4 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది. అయితే, ఆఖరిదైన మూడో వన్డేలో మాత్రం జింబాబ్వే నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. ఎవాన్స్ అదరగొట్టాడు.. రజా చెలరేగాడు.. టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్(40), కేఎల్ రాహుల్(30)తో పాటు సెంచరీ హీరో శుబ్‌మన్ గిల్(130), దీపక్ హుడా(1), శార్దూల్ ఠాకూర్(9) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు జింబాబ్వే బౌలర్ బ్రాడ్ ఎవాన్స్. ఎవాన్స్ ఈ స్థాయిలో చెలరేగిన నేపథ్యంలో.. నిజానికి గిల్ గనుక విజృంభించి ఉండకపోతే భారత్ ఈ మేర భారీ స్కోరు చేసే అవకాశం ఉండేది కాదు. ఇక లక్ష్య ఛేదనలోనూ జింబాబ్వే ఆడిన తీరు అద్బుతమనే చెప్పాలి. ముఖ్యంగా ఓపెనర్లు కైటనో, ఇన్నోసెంట్ కైయా వికెట్లు త్వరగానే కోల్పోయినా.. ఏమాత్రం పట్టు సడలించలేదు. వన్‌డౌన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ 45 పరుగులతో రాణించగా.. సికిందర్ రజా 95 బంతుల్లో 115 పరుగులు సాధించి విజయంపై ఆశలు రేపాడు. కానీ మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో 49.3 ఓవర్లకు 276 పరుగులు చేసి ఆతిథ్య జట్టు ఆలౌట్ అయింది. దీంతో 13 పరుగుల తేడాతో రాహుల్ సేన విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అదేం బౌలింగ్ నాయనా! అయితే, ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల ఆట తీరు పట్ల అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు. కాస్త తేడా వచ్చినా జింబాబ్వే చేతిలో పరాజయం ఎదురయ్యేదని.. ఆతిథ్య జట్టు నిజంగా బెంబేలెత్తించిందని కామెంట్లు చేస్తున్నారు. 169 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయినా రజా అద్బుత పోరాటంతో మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకువచ్చాడని.. మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చినందుకు అతడి ధన్యవాదాలు చెబుతున్నారు. అయితే, అదే సమయంలో ఇంతవరకు రానిచ్చిన భారత బౌలర్ల తీరును కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. We are not making it past Group stage if Avesh starts for us in the asia cup pic.twitter.com/OUNK2kFhAJ — Vighnesh17 (@VighneshMenon) August 22, 2022 India make clean sweep in the series, but Zimbabwe win honours in today’s match with a spirited chase to overhaul 289.This performance highlights why major teams needs to engage more regularly with the minnows to help cricket grow — Cricketwallah (@cricketwallah) August 22, 2022 Thanks Raza boss pic.twitter.com/YkUElm3T9F — Shivani (@meme_ki_diwani) August 22, 2022 Ye India ke bowlers kya approach hai yaar... Kitna dar dar ke bowling kar rahe... Yorkers maarne ki koshish hi nhin ki ...slower ones, slower ones, slower bouncers... Jo pacer excessively slower ones pe depend karta hai..use pacer maanta hi nhin main... — Abhinandan (@Abhinandan673) August 22, 2022 ఎవాన్స్, రజాపై ప్రశంసల జల్లు ఇక మ్యాచ్ అనంతరం జింబాబ్వే తాత్కాలిక కెప్టెన్ రెగిస్ చకబ్వా మాట్లాడుతూ.. ‘‘భారత జట్టుకు శుభాకాంక్షలు. వాళ్లు నిజంగా చాలా బాగా ఆడారు. ముఖ్యంగా రజా.. బ్రాడ్ అద్భుత ఆట తీరు కనబరిచారు. మా జట్టు బౌలింగ్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఇది మాకు సానుకూల అంశం. కఠిన పరిస్థితుల్లోనూ మా వాళ్లు ఆడిన తీరు నిజంగా అద్భుతం. మ్యాచ్ ఓడినా పటిష్ట జట్టుపై ఇలాంటి ప్రదర్శన పట్ల ఆనందంగా ఉన్నాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ! ద్రవిడ్ దూరం?! IND vs ZIM: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. సచిన్ 24 ఏళ్ల రికార్డు బద్దలు! -
సికిందర్ రజా సెంచరీ వృథా.. పోరాడి ఓడిన జింబాబ్వే!
హరారే వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. జింబాబ్వే బ్యాటర్ సికిందర్ రజా సెంచరీ సాధించి ఆఖరి వరకు పోరాటం చేసినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. 9 బంతుల్లో 15 పరుగులు కావల్సిన నేపథ్యంలో రజా ఔట్ కావడంతో భారత విజయం లాంఛనమైంది. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది.. తద్వారా భారత్ చేతిలో జింబాబ్వే 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. జింబాబ్వే బ్యాటర్లలో సికిందర్ రజా(115) సెంచరీతో చెలరేగగా.. విలియమ్స్ 45 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో ఆవేష్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక సెంచరీతో అదరగొట్టిన గిల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. సెంచరీతో చేలరేగిన గిల్ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్ కిషన్(50), ధావన్(40) పరుగులతో రాణించారు. కాగా గిల్‌కు ఇది అంతర్జాతీయ క్రికెట్లో ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఇక జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు. A job well done. Congratulations team India on the clinical series win 👏🏽 🇮🇳 Also @SRazaB24 is a special player, gave the passionate Harare crowd lots to cheer @ZimCricketv 👌🏽🇿🇼 #ZIMvIND pic.twitter.com/3AXaxoLzc1 — Wasim Jaffer (@WasimJaffer14) August 22, 2022 చదవండి: IND vs ZIM: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. సచిన్ 24 ఏళ్ల రికార్డు బద్దలు! -
జింబాబ్వే కదా అని తీసిపారేయొద్దు.. ఆ ముగ్గురితో జాగ్రత్త
కేఎల్ రాహుల్ సారధ్యంలోని టీమిండియా యువ జట్టు ప్రస్తుతం జింబాబ్వే పర్యటనకు వచ్చింది. ఆగస్టు 18 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కాస్త జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. చిన్నజట్టే కదా అని తీసిపారేస్తే అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతమున్న జింబాబ్వే మునుపటి జట్టులా మాత్రం కాదు. ఆ విషయం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను వన్డే, టి20 సిరీస్‌ల్లో ఓడించడమే అందుకు నిదర్శనం. టి20 ప్రపంచకప్ అర్హత సాధించామన్న వారి ధైర్యం జింబాబ్వేను పూర్వవైభవం దిశగా అడుగులు వేయిస్తుంది. ఎంతకాదన్న సొంతగడ్డ అనేది ఆతిథ్య జట్టుకు బలం. సొంత ప్రేక్షకుల మధ్య మద్దతు విరివిగా లభించే చోట ఎలాంటి చిన్న జట్టైనా చెలరేగి ఆడుతుంది. ముఖ్యంగా జింబాబ్వే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సికందర్ రజా ఆ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో వరుస సెంచరీలతో హోరెత్తించాడు. 2021 ఏడాదిలో సికందర్ రజా వన్డే క్రికెట్లో అద్బుత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. పాకిస్తాన్ దేశంలో పుట్టి జింబాబ్వేలో స్థిరపడ్డ సికందర్ రజా ఇప్పటివరకు 13 మ్యాచ్‌లాడి 627 పరుగులు సాధించాడు. సికందర్ రజా ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సికందర్ రజా నాలుగో స్థానంలో ఉన్నాడు. రజా కంటే ముందు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, రాసి వాండర్ డుసెన్, క్వింటన్ డికాక్‌లు మాత్రమే ఉన్నారు. హరారే క్రికెట్ మైదానం సికందర్ రజాకు బాగా కలిసివచ్చింది. ఈ వేదికపై వన్డేల్లో జింబాబ్వే తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టేలర్, హామిల్టన్ మసకద్జ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇన్నోసెంట్ కియా అందుకే టీమిండియా బౌలర్లు సికిందర్ రజాతో జాగ్రత్తగా ఉండాలి. అతన్ని వీలైనంత త్వరగా ఔట్ చేయగిలిగితే మేలు.. లేదంటే కొరకరాని కొయ్యగా మారడం గ్యారంటీ. సికందర్ రజాతో పాటు బంగ్లాదేశ్ సిరీస్‌లో రాణించిన ఇన్నోసెంట్ కియా, కెప్టెన్ రెగిస్ చకబ్వాపై కూడా ఒక కన్నేసి ఉంచడం మేలు. ఇక భారత్, జింబాబ్వే మధ్య ఈ నెల 18, 20, 22 తేదీల్లో హరారేలో 3 వన్డేలు జరుగుతాయి. జింబాబ్వే కెప్టెన్ రెగిస్ చకబ్వా టీమిండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, షాబాద్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చహర్, మొహమ్మద్ సిరాజ్. జింబాబ్వే: రెగిస్ చకబ్వా (కెప్టెన్), సికిందర్ రజా, తనకా చివాంగా, బ్రాడ్లీ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ర్యాన్ బర్ల్, ఇన్నోసెంట్ కైయా, కైటానో టకుడ్జ్వానాషే, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, తాడివానాషే మారుమని, జాన్ మసారా, టోనీ మున్యోంగా, రిచర్డ్‌టర్ న్గార్వా, , మిల్టన్ షుంబా, డోనాల్డ్ తిరిపానో. చదవండి: ZIM vs IND: నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు నజీబుల్లా వీరవిహారం.. ఐర్లాండ్‌పై అఫ్ఘనిస్థాన్ సూపర్ విక్టరీ -
బంగ్లాదేశ్‌కు మరో షాకిచ్చిన జింబాబ్వే.. తొలి వన్డేలో ఘన విజయం!
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న జింబాబ్వే.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా విజయంతో ఆరంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌పై జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే విజయంలో ఆల్ రౌండర్ సికందర్ రజా(135), ఇనోసెంట్ కాయ(110) అద్భుతమైన సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తమీమ్ ఇక్భాల్, లిటన్ దాస్ తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 62 పరుగులు చేసిన తమీమ్, రజా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరగా.. అనంతరం 81 పరుగులు చేసిన లిటన్ దాస్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అనముల్ హాక్(73), ముష్ఫికర్ రహీం(52) పరుగులతో రాణించడంతో బంగ్లా స్కోర్ 300 పరుగులు దాటింది. జింబాబ్వే బౌలర్లలో రజా,విక్టర్ న్యాచ్ తలా వికెట్ సాధించారు. ఇక 304 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 61 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం సికందర్ రజా,ఇనోసెంట్ కాయ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 192 పరుగుల రికార్డు బాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి విరోచిత ఇన్నింగ్స్‌ల ఫలితంగా జింబాబ్వే 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఇక బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన రజాకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: IND vs WI: మియామి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న భారత ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్ -
కావాలనే బౌండరీ లైన్ తొక్కాడు..
అబుదాబి: అప్ఘనిస్తాన్, జింబాబ్వే మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్ఘన్ ఆటగాడు హస్మతుల్లా షాహిది చేసిన తప్పిదం జింబాబ్వే జట్టుకు ఒక అదనపు పరుగు వచ్చేలా చేసింది. విషయంలోకి వెళితే.. మూడో రోజు ఆటలో భాగంగా మూడో సెషన్లో జింబాబ్వే 8వికెట్ల నష్టానికి 281 పరుగులతో ఆడుతుంది. క్రీజులో సికందర్ రజా 79, ముజరబనీ 0 పరుగులతో ఉన్నారు. ఇన్నింగ్స్ 90వ ఓవర్ చివరి బంతిని షిర్జాద్ యార్కర్ వేయగా.. రజా దానిని కవర్స్ దిశగా ఆడాడు. కవర్స్‌లో ఉన్న హస్మతుల్లా బంతిని అందుకొని బౌండరీ లైన్ ఆవల తన పాదాన్ని ఉంచాడు. రూల్ ప్రకారం ఒక ఆటగాడు బంతి చేతిలో ఉండగా బౌండరీ లైన్ దాటితే.. దానిని ఫోర్‌గా భావిస్తారు. కానీ ఇక్కడ హస్మతుల్లా కావాలనే అలా చేశాడని వీడియోలో కనిపించింది. ఆఖరి బంతికి సింగిల్ లేదా మూడు రన్స్ వస్తే రజా స్ట్రైక్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఆలోచించిన హస్మతుల్లా రజాకు స్ట్రైక్ రాకూడదనే ఉద్దేశంతో.. తర్వతి ఓవర్లో స్ట్రైకింగ్‌కు వచ్చే ముజరబనీ ఔట్ చేసే అవకాశం ఉంటుందని భావించాడు. దీంతో అంపైర్లు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఐసీసీ నిబంధనల్లోని రూల్ 19.8 ప్రకారం.. స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ ఆడిన షాట్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే ప్రత్యర్థి జట్టుకు అదనంగా ఒక పరుగు ఇస్తారు. అలా జింబాబ్వే జట్టుకు అదనపు పరుగు రావడంతో పాటు.. తదుపరి ఓవర్లో రజా స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఆ తర్వాతి ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రజా ఔట్ కావడంతో జింబాబ్వే 287 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. ప్రస్తుతం నాలుగో రోజు లంచ్ విరామం ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ పరాజయం నుంచి తప్పించుకోవాలంటే ఆ జట్టు ఇంకా 157 పరుగులు చేయాల్సి ఉంది. అంతకముందు అఫ్ఘనిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 545 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. చదవండి: పట్టించుకోని ఆర్చర్.. షాక్ తిన్న మొయిన్ అలీ వారెవ్వా రాహుల్.. నీ విన్యాసం అదుర్స్ -
ఆధిక్యంలో జింబాబ్వే
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్టులో జింబాబ్వే పటిష్ట స్థితిలో నిలిచింది. 23 పరుగులకే నాలుగు వికెట్లు పడిన దశలో సికిందర్ రజా (158 బంతుల్లో 97 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) పోరాటంతో జింబాబ్వే నిలబడింది. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 68 ఓవర్లలో ఆరు వికెట్లకు 252 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం ఈ జట్టు 262 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో ఫలితం తేలే అవకాశాలున్నాయి. రజాతో పాటు క్రీజులో ఉన్న వాలర్ (76 బంతుల్లో 56 బ్యాటింగ్; 8 ఫోర్లు) అసమాన బ్యాటింగ్‌తో కీలకంగా నిలిచాడు. వీరిద్దరి మధ్య ఏడో వికెట్‌కు అజేయంగా 107 పరుగులు జత చేరాయి. హెరాత్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. అంతకుముందు శ్రీలంక 102.3 ఓవర్లలో 346 పరుగులకు ఆలౌటైంది.