జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డును సికిందర్ రజా దక్కించుకున్నాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న తొలి జింబాబ్వే క్రికెటర్‌గా రజా నిలిచాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో రజాకు.. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మెక్‌గ్రాత్‌కు ఈ అవార్డు లభించింది.
వరుసగా మూడు సెంచరీలు
స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్‌తో వన్డే సిరీస్‌లో రజా సెంచరీలు మోత మెగించాడు. వరుసగా మూడు అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్‌పై రెండు సెంచరీలు చేయగా..భారత్‌పై ఒక సెంచరీని నమోదు చేశాడు. అదే విధంగా బంగ్లాతో వన్డే సిరీస్‌ను జింబాబ్వే క్లీన్ స్వీప్ చేయడంలో రజా కీలక పాత్ర పోషించాడు.
అదే విధంగా బౌలింగ్‌లో రజా సత్తా చాటాడు. గత నెలలో ఓవరాల్‌గా రజా ఏడు వికెట్లు పడగొట్టాడు. రజా ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్‌ను వెనుక్కి నెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.
చదవండి: Veda Krishnamurthy: కర్ణాటక బ్యాటర్‌తో భారత మహిళా క్రికెటర్ 'ఎంగేజ్‌మెంట్'.. ఫొటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment