ICC Announces Player of The Month Nominations For August 2022 - Sakshi
Sakshi News home page

ICC Player Of Month Nominations: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌ అవార్డు రేసులో ఉ‍న్న ఆటగాళ్లు వీరే

Published Mon, Sep 5 2022 4:57 PM | Last Updated on Mon, Sep 5 2022 5:17 PM

ICC announces  Player of the Month nominations for August 2022 - Sakshi

ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్‌ చేసింది. వారిలో ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, జింబాబ్వే స్టార్‌ ఆల్‌రౌండర్‌ సికిందర్‌ రజా, న్యూజిలాండ్‌ ఆల్‌ రౌండర్‌ మిచెల్‌ సాంట్నర్‌ ఉన్నారు.

కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగుతోన్న టెస్టు సిరీస్‌లో బెన్‌ స్టోక్స్ అద్భుతమైన ప్రధర్శన కనబరుస్తున్నాడు. ప్రోటీస్‌తో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లతో పాటు అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు. ఇక సికిందర్‌ రజా ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌, భారర్‌తో జరిగిన సిరీస్‌లలో రజా అదరగొట్టాడు.

ఈ నెలలో అతడు మూడు అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను జింబాబ్వే కైవసం చేసుకోవడంలో రజా కీలక పాత్ర పోషించాడు. ఇక మిచిల్‌ సాంట్నర్‌ విషయానికి వస్తే.. సాంట్నర్‌ యూరప్‌ టూర్‌లో భాగంగా  నెదర్లాండ్స్‌పై అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేలో సాంట్నర్‌ 42 బంతుల్లో 77 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. ఇక మహిళల విభాగం నుంచి ఈ అవార్డుకు.. ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ బెత్‌ మూనీ, భారత మిడిలార్డర్‌ బ్యాటర్‌ జెమిమా రోడ్రిగ్స్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మెక్‌గ్రాత్‌ నామినెట్‌ అయ్యారు.
చదవండి: Ind Vs Pak: అర్ష్‌దీప్‌ బంగారం.. అతడిని ఏమీ అనకండి.. నిజంగా ఇది సిగ్గుచేటు: భారత మాజీ క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement