ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ రేసులో వరుణ్‌ చక్రవర్తి | VARUN CHAKRAVARTHY NOMINATED FOR ICC PLAYER OF THE MONTH AWARD | Sakshi
Sakshi News home page

ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ రేసులో వరుణ్‌ చక్రవర్తి

Published Thu, Feb 6 2025 4:39 PM | Last Updated on Thu, Feb 6 2025 4:50 PM

VARUN CHAKRAVARTHY NOMINATED FOR ICC PLAYER OF THE MONTH AWARD

జనవరి నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వివరాలను ఐసీసీ ఇవాళ (ఫిబ్రవరి 6) ప్రకటించింది. పురుషుల విభాగంలో ముగ్గురు స్పిన్నర్లు ఈ అవార్డు కోసం నామినేట్‌ అయ్యారు. పాక్‌ వెటరన్‌ స్పిన్నర్‌ నోమన్‌ అలీ, విండీస్‌ స్పిన్నర్‌ జోమెల్‌ వార్రికన్‌, టీమిండియా మిస్టర్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు రేసులో నిలిచారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా బ్యాటర్‌ బెత్‌ మూనీ, విండీస్‌ స్పిన్నర్‌ కరిష్మ రామ్హరాక్‌, భారత యువ సంచలనం గొంగడి త్రిష జనవరి నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.

నోమాన్‌ అలీ: ఈ పాకిస్తానీ వెటరన్‌ స్పిన్నర్‌ జనవరి నెలలో టెస్ట్‌ల్లో అత్యుత్తమంగా రాణించాడు. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో నోమాన్‌ 16 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ 10 వికెట్ల ఘనతతో పాటు హ్యాట్రిక్‌ ప్రదర్శన ఉంది. నోమాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ కావడం ఇది రెండోసారి. నోమాన్‌.. గతేడాది అక్టోబర్‌లో ఈ అవార్డు గెలుచుకున్నాడు.

వరుణ్‌ చక్రవర్తి: ఈ టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చాక చెలరేగిపోతున్నాడు. జనవరి నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ నెలలో జరిగిన 4 మ్యాచ్‌ల్లో వరుణ్‌ 12 వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శనల తర్వాత వరుణ్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబకాడు.

జోమెల్‌ వార్రికన్‌: 32 ఏళ్ల ఈ కరీబియన్‌ స్పిన్నర్‌ జనవరి నెలలో పాక్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సిరీస్‌లో అతను 19 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌టేకర్‌గా నిలిచాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో వార్రికన్‌ బ్యాటింగ్‌లోనూ పర్వాలేదనిపించాడు. రెండో టెస్ట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో విండీస్‌ పాక్‌ గడ్డపై 34 ఏళ్ల తర్వాత విజయం సాధించింది.

బెత్‌ మూనీ: ఈ ఆసీస్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఇంగ్లండ్‌తో జరిగిన మల్లీ ఫార్మాట్ యాషెస్‌ సిరీస్‌లో సత్తా చాటింది. ఈ సిరీస్‌లోని టీ20 మ్యాచ్‌ల్లో మూనీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లో మూనీ 75, 44, 94 నాటౌట్‌ స్కోర్ల సాయంతో 213 పరుగులు చేసింది. ఫలితంగా ఆసీస్‌ టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ ‍ప్రదర్శనల అనంతరం మూనీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్తానానికి ఎగబాకింది.

కరిష్మ రామ్హరాక్‌: ఈ విండీస్‌ స్పిన్‌ బౌలర్‌ బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సత్తా చాటడంతో ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో కరిష్మ రెండు నాలుగు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసింది. కరిష్మ సత్తా చాటడంతో ఈ సిరీస్‌లో విండీస్‌ బంగ్లాదేశ్‌పై 2-1 తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లో కరిష్మ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకుంది.

గొంగడి త్రిష: ఈ టీమిండియా యువ సంచలనం ఇటీవల ముగిసిన అండర్‌ 19 టీ20 వరల్డ్‌కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది.  ఈ టోర్నీలో త్రిష (జనవరిలో) 265 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసింది. ఈ టోర్నీలో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన త్రిష.. టోర్నీ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement