జింబాబ్వే టీ20 కెప్టెన్ సికందర్ రజా ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. భవిష్యత్తులో పాకిస్తాన్‌కు ఆడే అవకాశం వస్తే మీరు ఆడుతారా అని సదరు అభిమాని ఎక్స్ వేదికగా ప్రశ్నించాడు.
అందుకు సికందర్ రజా దిమ్మతిరిగే సమాధనమిచ్చాడు. జింబాబ్వే క్రికెట్‌కు తను విధేయుడనని, పాక్ తరపున ఆడే ఆలోచన తనకు ఎప్పటకీ కలగదని రజా బదులిచ్చాడు.
"నేను పాకిస్తాన్‌లో పుట్టినప్పటకి.. నన్ను ఈ స్ధాయికి తీసుకు వచ్చింది మాత్రం జింబాబ్వేనే. జింబాబ్వే క్రికెట్ నాపై చాలా సమయం, డబ్బు వెచ్చించింది. నేను ఎప్పటకి జింబాబ్వేకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాను. జింబాబ్వే క్రికెట్‌కు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.
వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంట్టేందుకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తునే ఉంటాను" అని రజా రిప్లే ఇచ్చాడు. కాగా 38 ఏళ్ల రజా పాకిస్తాన్‌లోని సియాల్ కోట్‌లో జన్మించాడు. తన పాఠశాల విధ్యను పాకిస్తాన్‌లోనే రజా అభ్యసించాడు.
ఆ తర్వాత 2002లో తన ఫ్యామిలీతో కలిసి జింబాబ్వేకు రజా మకాం మార్చాడు. 2013 జింబాబ్వే క్రికెట్ తరపున రజా అరంగేట్రం చేశాడు. రజా ప్రస్తుతం జింబాబ్వేతో పాటు ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ కూడా ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు రజా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment