Zimbabwe Won By 5 Wickets Against Bangladesh In 1st ODI - Sakshi
Sakshi News home page

BAN vs ZIM: బంగ్లాదేశ్‌కు మరో షాకిచ్చిన జింబాబ్వే.. తొలి వన్డేలో ఘన విజయం!

Published Fri, Aug 5 2022 9:41 PM | Last Updated on Sat, Aug 6 2022 2:20 PM

Zimbabwe won by 5 wickets against Bangladesh in 1st ODI - Sakshi

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న జింబాబ్వే.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా విజయంతో ఆరంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌పై జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే విజయంలో ఆల్‌ రౌండర్‌ సికందర్‌ రజా(135), ఇనోసెంట్‌ కాయ(110) అద్భుతమైన సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తమీమ్‌ ఇక్భాల్‌, లిటన్‌ దాస్‌ తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 62 పరుగులు చేసిన తమీమ్‌, రజా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరగా.. అనంతరం 81 పరుగులు చేసిన లిటన్‌ దాస్‌ రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అనముల్ హాక్‌(73), ముష్ఫికర్ రహీం(52) పరుగులతో రాణించడంతో బంగ్లా స్కోర్‌ 300 పరుగులు దాటింది.

జింబాబ్వే బౌలర్లలో రజా,విక్టర్ న్యాచ్ తలా వికెట్‌ సాధించారు. ఇక 304 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 61 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం సికందర్‌ రజా,ఇనోసెంట్‌ కాయ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 192 పరుగుల రికార్డు బాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి విరోచిత ఇన్నింగ్స్‌ల ఫలితంగా జింబాబ్వే 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఇక బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టిన రజాకు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
చదవండిIND vs WI: మియామి బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న భారత ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement